మోహన్‌లాల్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన చిత్రం ‘మిస్టర్ ఫ్రాడ్’. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘గన్‌షాట్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సాయి ఆరాధ్య ప్రొడక్షన్స్ పతాకంపై వెనిజండ్ల శ్రీరామమూర్తి, కల్లూరు శేఖర్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది.
ధనికుల వద్ద డబ్బు కొల్లగొట్టి పేదవాళ్లకు పంచి పెడుతుంటాడు హీరో. ఈ క్రమంలో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. నిధి, నిక్షేపాల కోసం హీరోతో పాటు ఇంకొందరు అన్వేషిస్తారు. అప్పుడు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఆసక్తిగా ఉంటాయి. మలయాళంలో ఈ చిత్రం 70కోట్లు వసూలు చేసింది. డబ్బింగ్ పనులు పూర్తయిన మా చిత్రాన్ని తర్వలోనే విడుదల చేయడానికి సన్నా హాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, నిర్వహణ: కె.కృష్ణ, విజయన్స్.
Comments
Please login to add a commentAdd a comment