బుల్లితెర నటిని దర్శకుడు లైంగికంగా వేధించిన ఘటన మళయాళ ఇండస్ట్రీని ఉలికిపడేలా చేసింది. ఉప్పం ములకుం సీరియల్ అక్కడ మోస్ట్ వ్యూయింగ్ సీరియల్. అందులో లీడ్ రోల్ పోషిస్తున్న నటి నిషా సారంగ్.. సీరియల్ దర్శకుడు ఆర్ ఉన్నికృష్ణన్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు.డైరెక్టర్ ఉన్నికృష్ణన్ గత కొంత కాలంగా తనను వేధిస్తున్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆరోపించారు.
‘బూతు మెసేజ్‌లు పంపిన భరించా. సెట్స్‌లో అందరి ముందే నన్ను వేధించేవాడు. ఈ విషయం యూనిట్‌లో ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఆ తర్వాత అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడు. దీంతో గట్టిగా హెచ్చరించా. నా కూతురి వివాహం ఉండటంతో వ్యవహారం పెద్దది చేసుకోవటం నచ్చక గమ్మున ఉండిపోయా. అయినా అతని తీరు మారలేదు. చివరకు ఫిర్యాదు చేయటంతో నాపై కక్ష గట్టాడు. అవార్డు పంక్షన్ కోసం విదేశాలకు వెళ్లొచ్చేసరికి సీరియల్ నుంచి నన్ను తొలగించి.. ఆ ప్లేస్‌లో వేరే వారిని తీసుకున్నాడు. ఈ విషయంపై అసోషియేషన్‌లో ఫిర్యాదు చేశా. తిరిగి నన్ను తీసుకున్నా అతని వేధింపులు మాత్రం ఆగవు. ఆ విషయం ఖచ్ఛితంగా చెప్పగలను. అతనిపై చర్యలు తీసుకునేదాకా నా పోరాటం ఆగదు’ అని నిషా చెబుతున్నారు.
ఇప్పటికే నటి భావన వేధింపుల వ్యవహారం , దీలీప్ సస్పెన్షన్ ఎత్తివేత వ్యవహారాలు ‘అసోషియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్’(అమ్మ-AMMA)ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషా వేధింపుల వ్యవహారం వెలుగులోకి రావటంతో పలువురు ఆమెకు అండగా నిలుస్తున్నారు. మెగాస్టార్ మమ్ముటీతోపాటు వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సభ్యులు నిషాకు మద్ధతు ప్రకటించారు.
ఉన్నికృష్ణన్ సీరియస్.. అయితే దర్శకుడు ఉన్నికృష్ణన్ బదులు.. మీడియా హౌజ్‌లో పని చేసే ఉన్నికృష్ణన్ చెన్నంపిల్లి అనే టెక్నీషియన్ పేరును కొన్ని వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రకటించాయి. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. నిషా చెబుతున్న వ్యక్తి తాను కాదని, తప్పుడు కథనాలు ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment