Sandeep Unnikrishnan Parents Get Emotional After Watching The MAJOR Movie - Sakshi
Sakshi News home page

K Unni Krishnan: సందీప్‌ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంది: మేజర్‌ సందీప్‌ తండ్రి

Published Fri, Jun 3 2022 11:43 AM | Last Updated on Fri, Jun 3 2022 12:55 PM

K Unni Krishnan About Major Movie And Sandeep Mother Get Emotional - Sakshi

K Unni Krishnan About Major Movie And Sandeep Mother Get Emotional: 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్క దర‍్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో యంగ్‌ హీరో అడవి శేష్‌ నటించిన విషయం తెలిసిందే. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మేజర్. ఈ సినిమా చూసి రియల్‌ హీరో సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ తండ్రి కె. ఉన్ని కృష్ణన్‌ తన అభిప్రాయం తెలిపారు. 

'సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాన్ని ప్రతిబింబించేలా చాలా బాగా చూపించారు.  చాలా మంచి సినిమా తెరకెక్కించారు. చిత్రబృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్‌ ఎంతో బాగుంది. మా దుఃఖాన్ని మరిచేలా చేసింది. ఒక మాట చెబుతాను. సందీప్‌ చనిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ కాదు. అతని తుదిశ్వాస వరకు ప్రజల ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. అది ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. నా కెరీర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాను. నేను సందీప్‌తో కలిసి హైదరాబాద్‌లో జీవించాను, అతనితో మంచి సమయం గడిపాను. ఇప్పుడు మై బాయ్స్‌తో ( సినిమా టీమ్‌) మంచి సమయం గడుపుతున్నాను. నేను హైదరాబాద్‌లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. హైదరాబాద్‌కు మళ్లీ మళ్లీ వస్తాను.' అని సందీప్‌ తండ్రి కె. ఉన్ని కృష్ణన్‌ పేర్కొన్నారు. 
 


మేజర్‌ సినిమా గురించి కే. ఉన్ని కృష్ణన్‌ తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఆ మాటలు విని సందీప్‌ తల్లి ధనలక్ష్మీ ఉన్ని కృష్ణన్‌ కన్నిటీపర్యంతమయ్యారు. కాగా సినిమా విడుదలకు ముందు రోజు సందీప్‌ తల్లిని అడవి శేష్‌ ఆత్మీయంగా ఆలీంగనం చేసుకున్నాడు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 'అంకుల్‌, అమ్మ మీ ఇద్దరి కోసం రేపు మేజర్‌ సినిమా విడుదల కాబోతుంది' అని రాసుకొచ్చాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement