
యంగ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా హీరో అడివి శేస్ దేశమంతా పర్యటిస్తున్నాడు. తాజాగా తెలుగు మీడియాకు ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మేజర్ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మేజర్ సందీప్ గురించి ఎవరికీ తెలియని ఓ సంఘటనని షేర్ చేసుకున్నాడు.
చదవండి: మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్
‘మేజర్ మూవీ కోసం ఆయన గురించి చాలా లోతుగా తెలుసుకుంటుండగా సందీప్‌కు సంబంధించి ఎన్నో ఓ షాకింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కార్గిల్ వార్‌లో ఆయన భజానికి దెబ్బ తగిలింది.. అంత బాధలో కూడా ఆయన ఓ వ్యక్తిని గాయపడిన భుజంపైనే ఎత్తుకుని మంచులో 10 కిలోమిటర్లు నడిచారు. ఇది మాత్రమే కాదు ఓసారి ఇండియన్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుని తిరిగి ట్రైన్‌లో ఇంటికి వెళుతుండగా సందీప్ ఫ్రెండ్ కూడా అతనితో ఉన్నారు. తను అస్సాం వెళుతున్నాడు. సందీప్ బెంగుళూరు వెళ్లాలి. ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు లేవు అని అడగడంతో తన జేబులో ఉన్న మొత్తం డబ్బులు ఇచ్చేశారు సందీప్’ అని చెప్పాడు.
చదవండి: తల్లి ఓ స్టార్ నటి, తండ్రి ఓ స్టార్ ఆటగాడు.. కూతురు ఏమో ఇలా..
‘ఆ తర్వాత సందీప్ బెంగుళూరు వచ్చేవరకు ప్రయాణంలో ఏమీ తినలేదు. తాగలేదు. మిలటరీకి చెందిన వ్యక్తి కాబట్టి ఎవరినీ ఏమీ అడగకూడదు అనే రూల్ ఉంటుంది. ఆయనకు సంబంధి ఇలా ఎన్నో కదిలిచించే సంఘటనలు ఉన్నాయి. కానీ అందరు ఇవి నమ్ముతారో లేదో, భజన అనుకుంటారని ఇలాంటి ఇన్సిడెంట్స్‌ను సినిమాల్లో పెట్టలేదు’ అని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment