Major Sandeep Unnikrishnan
-
‘మేజర్’ నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్, ఆకట్టుకుంటున్న అమ్మ పాట
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. చదవండి: పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట! మేజర్‌కు వస్తున్న విశేష స్పందనకు కానుకగా తాజాగా చిత్రం బృందం ఈ మూవీ నుంచి ఓ ఎమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘కన్నా కన్నా’ అంటూ సాగే ఈ పాటలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం నుంచి సైన్యంలో చేరేందుకు బయలుదేరే పలు సన్నివేశాలను చూపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటకు శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకుర్చగా.. ప్రముఖ గాయనీ చిత్ర ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటోంది. -
'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి
K Unni Krishnan About Major Movie And Sandeep Mother Get Emotional: 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో యంగ్ హీరో అడవి శేష్ నటించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మేజర్. ఈ సినిమా చూసి రియల్ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ తన అభిప్రాయం తెలిపారు. 'సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ప్రతిబింబించేలా చాలా బాగా చూపించారు. చాలా మంచి సినిమా తెరకెక్కించారు. చిత్రబృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ ఎంతో బాగుంది. మా దుఃఖాన్ని మరిచేలా చేసింది. ఒక మాట చెబుతాను. సందీప్ చనిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ కాదు. అతని తుదిశ్వాస వరకు ప్రజల ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. అది ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. నా కెరీర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాను. నేను సందీప్‌తో కలిసి హైదరాబాద్‌లో జీవించాను, అతనితో మంచి సమయం గడిపాను. ఇప్పుడు మై బాయ్స్‌తో ( సినిమా టీమ్) మంచి సమయం గడుపుతున్నాను. నేను హైదరాబాద్‌లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. హైదరాబాద్‌కు మళ్లీ మళ్లీ వస్తాను.' అని సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ పేర్కొన్నారు. 'Sandeep has fought till his last breath & beyond. He continues to motivate all of us' Mr. Unnikrishnan at the special premieres in Hyderabad.#MajorTheFilm 🇮🇳@AdiviSesh @saieemmanjrekar #SobhitaD @SashiTikka @urstrulyMahesh @SonyPicsIndia @GMBents @AplusSMovies pic.twitter.com/GIuN5w4uFO — Major (@MajorTheFilm) June 3, 2022 మేజర్ సినిమా గురించి కే. ఉన్ని కృష్ణన్ తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఆ మాటలు విని సందీప్ తల్లి ధనలక్ష్మీ ఉన్ని కృష్ణన్ కన్నిటీపర్యంతమయ్యారు. కాగా సినిమా విడుదలకు ముందు రోజు సందీప్ తల్లిని అడవి శేష్ ఆత్మీయంగా ఆలీంగనం చేసుకున్నాడు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'అంకుల్, అమ్మ మీ ఇద్దరి కోసం రేపు మేజర్ సినిమా విడుదల కాబోతుంది' అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
‘మేజర్’ చూసి వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు :శశికిరణ్ తిక్క
‘‘ఏ దర్శకుడైనా తన సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులు చూడాలనే ఆశపడతాడు. భాషాపరమైన హద్దులను బ్రేక్ చేసే కథను మన దేశంలో ఎవరూ తీసినా అది ఇండియన్ సినిమాయే. అయితే కొన్నిసార్లు ఇది ఆ సినిమాను నిర్మించే నిర్మాతపై కూడా ఆధారపడి ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ చేశారు. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శశికిరణ్ తిక్క చెప్పిన విశేషాలు. ► ‘మేజర్’ కంటెంట్‌కు దర్శకుడిగా నేనైతే న్యాయం చేయగలనని శేష్ అడిగారు. దీంతో సందీప్‌గారి గురించి పరిశోధన చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు సందీప్‌గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఆయన మంచి మానవతావాది అని కూడా తెలుసుకున్నాను. సందీప్‌లాంటి వ్యక్తి గురించి అందరికీ తెలియాలని ‘మేజర్’ చేయడానికి అంగీకరించాను. ► అడివి శేష్ మంచి యాక్టర్ మాత్రమే కాదు. రైటర్, దర్శకుడు కూడా. అయితే ‘మేజర్’ సినిమా విషయంలో ఎవరి క్రాఫ్ట్స్ వాళ్లం చూసుకున్నాం. ‘మేజర్’ బడ్జెట్ పెరిగింది. చాలెంజ్ అంతకంటే పెరిగింది.‘మేజర్’లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. ముఖ్యంగా మేం యాక్షన్‌లో కాస్త లిబర్టీ తీసుకున్నాం. ►‘మా దగ్గర్నుంచి ‘మేజర్’ టీమ్ చాలా సమాచారాన్ని తీసుకున్నారు. వీరు ఏం చేస్తున్నారు’ అనే సందేహం సందీప్‌గారి తల్లిదండ్రులకు వచ్చి ఉండొచ్చు. సో.. వారిని మెప్పించడం అనేది మాకు ఓ అగ్నిపరీక్ష. బెంగళూరులో సందీప్‌గారి అమ్మ నాన్నలకు సినిమా చూపించాం. వారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ► నా దగ్గర రెండు కథలు ఉన్నాయి. నా నెక్ట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఉంటుంది. పూర్తి వివరాలను త్వరలోనే చెబుతాను. -
‘ఆ సంఘటనలు గురించి చెబితే నమ్మరేమోనని సినిమాలో పెట్టలేదు’
యంగ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా హీరో అడివి శేస్ దేశమంతా పర్యటిస్తున్నాడు. తాజాగా తెలుగు మీడియాకు ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మేజర్ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మేజర్ సందీప్ గురించి ఎవరికీ తెలియని ఓ సంఘటనని షేర్ చేసుకున్నాడు. చదవండి: మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్ ‘మేజర్ మూవీ కోసం ఆయన గురించి చాలా లోతుగా తెలుసుకుంటుండగా సందీప్‌కు సంబంధించి ఎన్నో ఓ షాకింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కార్గిల్ వార్‌లో ఆయన భజానికి దెబ్బ తగిలింది.. అంత బాధలో కూడా ఆయన ఓ వ్యక్తిని గాయపడిన భుజంపైనే ఎత్తుకుని మంచులో 10 కిలోమిటర్లు నడిచారు. ఇది మాత్రమే కాదు ఓసారి ఇండియన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని తిరిగి ట్రైన్లో ఇంటికి వెళుతుండగా సందీప్ ఫ్రెండ్ కూడా అతనితో ఉన్నారు. తను అస్సాం వెళుతున్నాడు. సందీప్ బెంగుళూరు వెళ్లాలి. ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు లేవు అని అడగడంతో తన జేబులో ఉన్న మొత్తం డబ్బులు ఇచ్చేశారు సందీప్’ అని చెప్పాడు. చదవండి: తల్లి ఓ స్టార్ నటి, తండ్రి ఓ స్టార్ ఆటగాడు.. కూతురు ఏమో ఇలా.. ‘ఆ తర్వాత సందీప్ బెంగుళూరు వచ్చేవరకు ప్రయాణంలో ఏమీ తినలేదు. తాగలేదు. మిలటరీకి చెందిన వ్యక్తి కాబట్టి ఎవరినీ ఏమీ అడగకూడదు అనే రూల్ ఉంటుంది. ఆయనకు సంబంధి ఇలా ఎన్నో కదిలిచించే సంఘటనలు ఉన్నాయి. కానీ అందరు ఇవి నమ్ముతారో లేదో, భజన అనుకుంటారని ఇలాంటి ఇన్సిడెంట్స్ను సినిమాల్లో పెట్టలేదు’ అని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. -
మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్, వీడియో వైరల్
యంగ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజులో సెంటర్లో మేజర్ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. చదవండి: ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్? ఈ క్రమంలో శనివారం జైపూర్‌లో మేజర్ మూవీ ప్రివ్యూ చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. అలాగే సినిమాలో మేజర్ సందీప్‌ను చూసి ప్రేక్షకుల్లో కొందరు చప్పట్లు కోడుతూ ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో అడివి శేష్ తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘జైపూర్.. థియేటర్లో సినిమా చూస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం తొలిసారి చూస్తున్నాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహై! నా కెరీర్లో ఇదో గొప్ప క్షణం’ అంటూ అడివి శేష్ రాసుకొచ్చాడు. కాగా జైపూర్‌లో జరిగిన మేజర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కు చూసేందుకు 100 మందికి పైగా జవాన్లు థియేటర్‌కు వచ్చారు. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ ఈ సందర్భంగా అక్కడి వచ్చిన మేజర్ మూవీ టీం జవాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం నటి శోభితా ధూళిపాళ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కి మా బృందం పెద్ద ఫ్యాన్. అతని కథ ప్రజలకు చేరువ కావాలని మేం కోరుకుంటున్నాము. ఆయన అద్భుతమైన వ్యక్తి’ అంటూ కన్నీటి పర్యంతరం అయ్యింది. కాగా ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. #Jaipur First time we saw people in the theater scream along with the film. #MajorSandeepUnnukrishnan AMAR RAHE! Massive moment in my career. Watch this! #MajorOnJune3rd pic.twitter.com/5W81GHm6jX — Adivi Sesh (@AdiviSesh) May 28, 2022 -
రియల్.. రీల్: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు నివాళిగా..
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మేజర్’. టైటిల్ రోల్లో అడివి శేష్ నటించారు. శశికిరణ్ తిక్క దర్శకుడు. మహేశ్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ సినిమా మే 27న విడుదలవుతోంది. మార్చి 15న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి. ఆయనకు నివాళిగా ‘మేజర్’ చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది. A great man. A great life. A humble Reflection on the life of #MajorSandeepUnnikrishnan Telugu ▶️ https://t.co/S5n1kTGDiy#MajorTheFilm #MajorOnMAY27 @AdiviSesh @saieemmanjrekar @SashiTikka @sonypicsindia @urstrulyMahesh @GMBents @AplusSMovies @ZeeMusicsouth pic.twitter.com/zyHbwyU2t4 — Adivi Sesh (@AdiviSesh) March 15, 2022 సందీప్ రియల్ లైఫ్‌లోని వివిధ దశలను చూపడమే కాకుండా, రీల్ కోసం ఆ పాత్రను అడివి శేష్‌తో చిత్రీకరించిన దృశ్యాలను చూపించారు. ‘‘తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన చిత్రం ‘మేజర్’. ఈ చిత్రంలో మేజర్ సందీప్ బాల్యం, యుక్త వయస్సు, సైన్యంలో చేరినప్పటి నుంచి ముంబై దాడి వంటివి ఉంటాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రీల్ మీదకు రానున్న ‘రియల్ హీరో’ల బయోపిక్స్
కంటి నిండా నిదుర ఉండదు.. సేద తీరే తీరిక ఉండదు. కుటుంబంతో గడిపే సమయం ఉండదు... ఒక్కటే ఉంటుంది.. ‘దేశం మీద ప్రేమ’ ఉంటుంది. అందుకే నిదుర లేకుండా కాపలా కాస్తారు. చల్లగాలికీ సేద తీరరు. దేశమే కుటుంబం అనుకుంటారు. దేశం కోసం ప్రాణాలు వదులుతారు. అందుకే ‘సెల్యూట్ సైనికా’. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, పోరాడిన వీర జవాన్లను ‘గణతంత్ర దినోత్సవం’ సందర్భంగా స్మరించుకుందాం. రీల్ మీదకు రానున్న ఈ ‘రియల్ హీరో’ల బయోపిక్స్ గురించి తెలుసుకుందాం. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులోనూ దేశం కోసం పోరాడిన సైనికుల జీవిత చిత్రాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. చరిత్ర చెప్పే ఈ చిత్రాలు చలన చిత్ర చరిత్రలోనూ ఓ చరిత్రగా మిగిలిపోతాయి. దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను అడివి శేష్ చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 11న విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. సందీప్ పోరాటం ఈ తరానికి తెలుసు. ఇక ముందు తరానికి చెందినవారిలో 1971 భారత్–పాక్ యుద్ధం గురించి తెలియనివారు ఉండరు. ఈ యుద్ధంలో పోరాడిన వీరుల నేపథ్యంలో మూడు నాలుగు చిత్రాలు నిర్మాణంలో ఉండటం విశేషం. భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన సాహసోపేత సైనికుడు ‘సామ్ మానెక్ షా’ (పూర్తి పేరు సామ్ హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా) ఒకరు. ఈ యుద్ధంలో ఆర్మీ చీఫ్‌గా భారత్‌కు పెద్ద విజయాన్ని సాధించిపెట్టిన ఘనత మానెక్ షాది. మొత్తం ఐదు యుద్ధాల్లో పాల్గొన్న వీరుడు మానెక్ షా. ఆయన జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సామ్ బహదూర్’. అలాగే 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన ఓ వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా. ఈ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి తూర్పు వైపున పోరాడారు మెహతా. ఆయన జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చౌఫిస్’ (2016) పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి బల్రామ్ సింగ్ మోహతాను కూడా చిత్రబృందం ఆహ్వానించింది. 1971 యుద్ధంలోనే పోరాడిన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. యుద్ధంలో వీరమరణం పొందారు ఖేతర్పాల్. పరమవీర చక్ర సాధించిన యువసైనికుడు ఆయన. ఈ సైన్యాధికారి పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. ఇక కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ కూడా యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమే. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్‌గా చేస్తున్నారు. దేశభక్తి సినిమా కాదు కానీ... ‘‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. స్నేహం మీద ఆధారపడిన సినిమా. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేహం గురించి చెప్పిన కథే ఈ సినిమా’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో ఈ సినిమా తీశారు. అయితే అంతర్లీనంగా దేశభక్తి కనిపించే సినిమా కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై అందరి దృష్టి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ‘‘దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ ఉన్నట్లయితే మా సినిమాను ఈ ఏడాది మార్చి 18న విడుదల చేస్తాం. లేకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 28న చిత్రం విడుదలవుతుంది’’ అని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. మొత్తం 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు వెండితెరకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా చిత్రాలు ఎన్ని వస్తే అంత మంచిది. ఎందుకంటే సినిమా శక్తిమంతమైన మాధ్యమం కాబట్టి చరిత్ర సులువుగా యువతరానికి చేరుతుంది. -
అడివి శేష్.. మేజర్ వాయిదా
అడివి శేష్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘‘దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ‘మేజర్’ విడుదల వాయిదా వేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.