
అడివి శేష్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది.
మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘‘దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ‘మేజర్’ విడుదల వాయిదా వేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment