Tollywood Young Heroes Sundeep Kishan, Nani Focus on Pan-India Movie - Sakshi
Sakshi News home page

వెనక్కి తగ్గిన స్టార్స్‌.. దూసుకెళ్తున్న యంగ్‌ హీరోలు

Published Thu, Feb 2 2023 12:53 PM | Last Updated on Thu, Feb 2 2023 4:28 PM

Sundeep Kishan, Nani Tollywood Young Heroes Focus On Pan India Movie - Sakshi

స్టార్ హీరోలే పాన్ ఇండియా సినిమాలు చేయటానికి వెనకడుగు వేస్తుంటే.. కుర్ర హీరోలు మాత్రం టాలీవుడ్ హద్దులు దాటుతున్నారు. పాన్ ఇండియా హీరోలం అనిపించుకోటానికి తహ తహ లాడిపోతున్నారు. ప్రయత్నిస్తే పోయేది ఏముంది చెప్పు..మహా అయితే మరో సారి ట్రై చేస్తాం అనుకుంటు..పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి తెలుగుతో పాటు..ఇతర భాషల్లో విజయం సాధించాలి అనుకుంటున్న ఈ హీరోలపై ఓ లుక్కేయండి

మేజర్ మూవీతో పాన్ ఇండియా సినిమా చేసాడు అడివి శేష్. ఇక కార్తికేయా 2 తో నిఖిల్ కూడా పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. ఇప్పుడు మరికొందరు యువ హీరోలు కూడా ..పాన్ ఇండియా సినిమాలతో లక్ పరిక్షించుకోబోతున్నారు. సందీప్ కిషన్ మైఖేల్ సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీ తెలుగు,తమిళ్,హిందీ,కన్నడ,మలయాళ భాషలలో రిలీజ్ కాబోతుంది.

నాని శ్యామ్ సింగరాయ్ సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఈ సారి ‘దసరా’తో మాత్రం పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా డెవిల్ సినిమా రాబోతుంది.

విశ్వక్ సేన్ రెండో సారి మెగాఫోన్ పట్టుకొని దాస్ క ధమ్కీ మూవీ రూపొందించాడు. ఈ సారి తనను తాను దర్శకుడిగా,హీరోగా పాన్ ఇండియా రేంజ్లో ప్రమోట్ చేసుకుంటున్నాడు. కుర్ర హీరో తేజా సజ్జా,దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న హనుమాన్ కూడా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.

మరోవైపు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మాత్రం ఇక్కడ సత్తా చాటుతున్నా.. పాన్‌ ఇండియాపై మాత్రం ఫోకస్‌ పెట్టడం లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు..ఇప్పటి వరకు పాన్ ఇండియా హిట్ కోసం ట్రై చేయలేదు. త్రివిక్రమ్ కాంబో సినిమా కూడా..తెలుగులో మాత్రమే రిలీజ్ కాబోతుందట. అలాగే పలువురు సీనియర్ హీరోల సినిమాలు కూడా స్వచ్చంగా తెలుగులోనే విడుదల అవుతున్నాయి. అయితే యువ హీరోలు మాత్రం పాన్ ఇండియా రిలీజులపై జోరు చూపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement