Sundeep Kishan And Vijay Sethupathi Michael Movie First Look Out Now - Sakshi
Sakshi News home page

సేతుపతితో సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా సినిమా

Published Fri, Aug 27 2021 12:44 PM | Last Updated on Fri, Aug 27 2021 2:52 PM

Sundeep Kishan And Vijay Sethupathis Michael Film First Look Out - Sakshi

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌  యమ జోరుమీదున్నాడు. ఇప్పటికే గల్లీ రౌడీతో రెడీగా ఉన్న ఆయన మరో ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. సందీప్‌ కెరీర్‌లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పాన్‌ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు 'మైఖేల్' అనే టైటిల్‌ను ప్రకటించి పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రక్తంతో తడిసిన చేతులకు బేడీలు వేసినట్లున్న పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

చదవండి : తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసిన బుల్లితెర నటి
అమితాబ్‌ బాడీగార్డు జీతం ఎంతో తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement