Sundeep Kishan's 'Michael' is now streaming on OTT - Sakshi
Sakshi News home page

Sundeep Kishan : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్‌ కిషన్‌ 'మైఖేల్‌' చిత్రం​

Published Fri, Feb 24 2023 3:38 PM | Last Updated on Fri, Feb 24 2023 4:16 PM

Sundeep Kishan Michael Is Now Streaming On This Ott - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించిన తాజా చిత్రం మైఖేల్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ నటించింది. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు.రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల3న విడుదలైంది.

చాన్నాళ్లుగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సందీప్‌కు మైఖేల్‌ కూడా నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ‍ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో నెల కూడా గడవక ముందే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో నేడు(శుక్రవారం)నుంచే స్ట్రీమింగ్‌ అవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసేయండి మరి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement