ఓటీటీలోకి సందీప్‌ కిషన్‌ మైఖేల్‌..స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే | Sundeep Kishan Pan India Film Michael Ott Release Date Is Here | Sakshi
Sakshi News home page

Sundeep Kishan : ఓటీటీలోకి సందీప్‌ కిషన్‌ మైఖేల్‌..స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే

Published Sat, Feb 18 2023 12:23 PM | Last Updated on Sat, Feb 18 2023 12:25 PM

Sundeep Kishan Pan India Film Michael Ott Release Date Is Here - Sakshi

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం మైఖేల్‌. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.  

భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టుకోలేకపోయింది.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా సక్సెస్ అయితే కాలేదు. థియేటర్లలో ఓ మోస్తారుగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

'మైఖేల్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను 'ఆహా' ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. ఈ నెల 24న ఈ సినిమా ఆహాలోకి రానుంది.దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement