Tollywood And Other Cinema Celebrities Congratulates Megastar Chiranjeevi For Awarded With Padma Vibhushan Award, Tweets Goes Viral - Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi Padma Vibhushan: మెగాస్టార్‌కు పద్మ విభూషణ్.. వెల్లువెత్తిన అభినందనలు!

Published Fri, Jan 26 2024 8:16 AM | Last Updated on Fri, Jan 26 2024 10:48 AM

Tollywood and Cinema Stars Congratulates Megastar Chiranjeevi - Sakshi

టాలీవుడ్‌ మెగాస్టార్‌ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్‌కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

ట్విటర్‌ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్‌ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్‌ చెప్పారు. పద్మవిభూషణ్‌కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్ ట్విటర్ ‍ద్వారా మెగాస్టార్‌కు కంగ్రాట్స్ తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement