Padma Vibhushan
-
ఇదే కదా నిజమైన ఆనందం: మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకి జోడీగా లియో భామ త్రిష కనిపించనుంది. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఇటీవలే మెగాస్టార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యున్నత పురస్కారం చిరంజీవిని వరించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్‌కు అభినందనలు తెలిపారు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్‌కు ఘనమైన స్వాగతం లభించింది. అక్కడి తెలుగువారు చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించారు. లాస్ఎంజిల్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన చిరుపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. చిరంజీవి మాట్లాడుతూ..'పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చినప్పుడు ఆనందం, సంతోషం కలిగింది. అవార్డ్ వచ్చినందుకు నాకంటే మీరు బాగా ఆనందపడుతున్నారు. నా పట్ల మీరు చూపిస్తున్న అభిమానం వెల కట్టలేనిది. ఇంతమంది ఆనందంగా ఉన్నారంటే.. ఇదే కదా అసలు సిసలైన ఆనందం. ఇంతకంటే అవార్డ్ ఇంకా ఏముంటుంది' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
‘పద్మశ్రీ’లకు రూ.25వేల పింఛన్
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదు బహుమతి, ఖర్చుల నిమిత్తం నెలకు రూ.25 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తొవ్వ ఖర్చులకు కూడా కష్టంగా ఉన్నా, కనుమరుగవుతున్న కళలు, తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు కష్టపడుతున్న కళాకారులకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవితోపాటు పద్మశ్రీకి ఎంపికైన ఆనందాచార్య, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోంలాల్, కూరెళ్ల విఠలాచార్యలను ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని..లేదంటే తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో తెలుగు సంప్రదాయ కళలను కాపాడుతున్న కళాకారులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించడం సముచితమని, ఈ పరిస్థితుల్లో పురస్కారాలకు ఎంపికైన వారిని సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావించినట్టు తెలిపారు. రాజ కీయాలకతీతంగా రాష్ట్రంలో కొత్త సంప్రదాయం నెలకొల్పేందుకు అవార్డుకు ఎంపికైన వారిని సన్మానించే కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థి దశ నుంచి తనకు వెంకయ్యనాయుడు ప్రసంగాలు అంటే తనకు ఇష్టమని రేవంత్‌రెడ్డి చెప్పారు. 1978లో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా జైపాల్‌రెడ్డితో కలిసి ప్రజాసమస్యలపై పోరాడిన నేత వెంకయ్యనాయుడని కొనియాడారు. రాజకీయాల్లో భాష ప్రాధాన్యతపై వెంకయ్య చేసిన సూచనలను తాను పాటిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాల్సిన నాయకుడన్నారు. కళాకారుడిగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చిరంజీవి అని..పున్నమినాగు సినిమా నుంచి సైరా నరసింహారెడ్డి వరకు ఒకే కమిట్మెంట్తో ఆయన ఉన్నారని కొనియాడారు. కొత్త సంప్రదాయానికి నాంది పలికిన రేవంత్‌రెడ్డి : వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి నాంది పలికారన్నారు. రాజకీయాల్లో ప్రమా ణాలు తగ్గిపోతున్నాయని, బూతులు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బూతులు మాట్లాడేవారికి పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలన్నారు. తెలుగు కళామతల్లికి రెండు కళ్లు ఎనీ్టఆర్, అక్కినేని అయితే, మూడోకన్ను చిరంజీవి అని కొనియాడారు. కళాకారులు ఎక్కడ గౌరవం పొందుతారో ఆ రాజ్యం సుభిక్షం : చిరంజీవి ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడ కళాకా రులు గౌరవం పొందుతారో.. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ముదావహమని పేర్కొన్నారు. ప్రజాగాయకు డు గద్దర్ పేరున అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామమని చెప్పారు. రాజకీయాల్లో దుర్భాషలు ఎక్కువయ్యాయని, వ్యక్తిగతంగా దుర్భాష లాడటం మంచిది కాదని, అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెంకయ్య, చిరంజీవిల ఔన్నత్యాన్ని కొనియాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీరే నాకు ఎప్పటికీ ఆదర్శం: మెగాస్టార్ కూతురు ప్రశంసలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించింది. 75వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత అందుకున్న నటుడిగా మెగాస్టార్ నిలిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. మెగా కోడలు ఉపాసన సైతం మామయ్యకు కంగ్రాంట్స్ చెబుతూ ట్వీట్ చేసింది. తాజాగా మెగాస్టార్ పెద్దకూతురు సుస్మిత శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. నాన్న మీరు ఒక స్ఫూర్తి, గౌరవం, ఆశీర్వాదం కూడా. పద్మవిభూషణ్ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. అలాదే ఈ ఏడాదిలో పద్మ అవార్డులు దక్కించుకున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేసింది. Dad, you are an Inspiration, an honour and a blessing. #PadmaVibhushan Heartiest congratulations to all the Padma awards this year. @KChiruTweets pic.twitter.com/jT17b8hdZd — Sushmita Konidela (@sushkonidela) January 28, 2024 -
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన FNCC సభ్యులు
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ (FNCC) ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు వెంకయ్య నాయుడు గారిని కలిసి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ.. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీగా ఉండటమే కాకుండా వివిధ శాఖల మంత్రిగా అలాగే మాజీ ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణం రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారని ఆయన తెలియ చేశారు. FNCC సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ.. ఈ రోజున వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషన్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. తెలుగువారిగా ఉపరాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి వ్యక్తికి భారతరత్న రావాలని నా అభిప్రాయం అని తెలియజేశారు. మాకు సమయాన్ని కేటాయించినందుకు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు అన్నారు -
చిరంజీవికి 'పద్మ విభూషణ్'.. ఈ అవార్డుతో పాటు ఏమేం ఇస్తారు?
మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనలో భాగంగా చిరుని ఈ పురస్కారం వరించింది. దీంతో తెలుగోళ్లు చాలా గర్వపడుతున్నారు. ప్రతి ఒక్కరూ మన చిరంజీవికి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ అవార్డుతో ఏమేం ఇస్తారు? ఎలాంటి సదుపాయాలు ఉంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది? పద్మ విభూషణ్ అవార్డు అనేది ఏదైనా రంగంలో అసాధారణమైన విశిష్ట సేవ చేసినవారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలా ఈ ఏడాదికిగానూ తెలుగు నుంచి చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఈ పురస్కారం వరించింది. అయితే పద్మ అవార్డు పొందిన వారికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? నగదు ప్రోత్సాహకాలు ఇస్తారా? అనేది చాలామందికి ఉన్న సందేహం. కానీ పద్మ అవార్డు అనేది ఓ గౌరవం మాత్రమే. (ఇదీ చదవండి: మెగా కాంపౌడ్లో అవార్డుల పంట.. చిరు నుంచి బన్నీ వరకు..) కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇచ్చిన వ్యక్తులకు.. ఎలాంటి నగదు, రాయితీ ఇవ్వరు. అలానే రైలు/విమాన ప్రయాణాల్లోనూ ఎలాంటి రాయితీలు ఉండవు. ఇకపోతే పద్మ పురస్కార గ్రహీతలు.. రాష్ట్రపతి భవన్‌లోకి వెళ్లి రాష్ట్రపతిని కలిసే అవకాశముంటుంది. పద్మ అవార్డులో భాగంగా రాష్ట్రపతి సంతకం ఉన్న ధ్రువీకరణ పత్రం, పతకం మాత్రం బహుకరిస్తారు. ఈ అవార్డు వల్ల ఆ వ్యక్తుల గురించి దేశమంతా తెలుస్తుందంతే! సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకుగాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇదే కాకుండా పలు సినిమాలకుగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లోనే సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి ప్రత్యేక అవార్డుని ఫిలింఫేర్ అవార్డుల్లో అందుకున్నారు. 2010లో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం, 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు చిరంజీవికి లభించాయి. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
నేను ఊహించని అవార్డ్ రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌లోని తన బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను ఊహించని.. నేను ఎదురు చూడని పద్మవిభూషణ్ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నా సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా పద్మశ్రీ, పద్మభూషణ్ పొందిన తెలుగు రాష్ట్రాలవారికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'వెంకయ్యనాయుడు గారి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్' రావడం ఆనందంగా ఉంది. మీ సుదీర్ఘమైన ప్రజాసేవ, మీ జ్ఞానం, రాజకీయాల్లో గౌరవప్రదమైన మీ ప్రసంగం..మీ స్థాయిని పెంచుతుంది. మీతో పాటు అవార్డ్ దక్కడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రతిభావంతులైన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రమణ్యం, అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నా సోదర వర్గానికి, తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రియమైన మిథున్ దా (చక్రవర్తి), ఉషా ఉతుప్ జీ, దాసరి కొండప్ప, ఉమా మహేశ్వరి , గడ్డం సమ్మయ్య , కూరెళ్ల విట్టలాచార్య,ఎ వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్, విజయకాంత్ (మరణానంతరం)గారితో పాటు ప్రతి ఒక్కరికీ అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. Heartiest congratulations to Shri @MVenkaiahNaidu garu on the coveted ‘Padma Vibhushan’! Your long, relentless public service, your wisdom and dignified presence in politics enhances the stature and quality of political discourse. It is an even greater honour for me to be in… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2024 -
పద్మ విభూషణ్.. ఆ దిగ్గజ నటుడి తర్వాత మెగాస్టార్‌కే!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్ఠాత్మక అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించింది. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. అయితే తెలుగు సినీరంగంలో ఈ అవార్డ్ ఇప్పటివరకు ఒక్కరికే మాత్రమే వచ్చింది. ఆయనెవరో కాదు నట దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు. తాజాగా ఇప్పుడు మన మెగాస్టార్‌ను వరించింది. దీంతో అయితే దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు కేవలం ఇద్దరికీ మాత్రమే దక్కింది. అక్కినేనికి పద్మ విభూషణ్ మొదట 2011లో నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఈ లెజెండరీ నటుడు 67 ఏళ్ల సినీ కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు సినీ చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్న మహోన్నత వ్యక్తి అక్కినేని. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, కలిమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (7 సార్లు), జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు లాంటి ఎన్నో విలువైన అవార్డులను అందుకున్నారు. అవార్డుల రారాజు మెగాస్టార్ తాజాగా ఆ ఘనత కేవలం మెగాస్టార్‌కు మాత్రమే దక్కింది. తెలుగు సినీ రంగంలో ఏఎన్ఆర్ తర్వాత అరుదైన ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు. అంతకుముందే మెగాస్టార్‌కు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు: మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్‌ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్‌కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్‌ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్‌కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్ ట్విటర్ ద్వారా మెగాస్టార్‌కు కంగ్రాట్స్ తెలియజేశారు. Congratulations to #Megastar @KChiruTweets on being honoured with the #PadmaVibhushan , a great honour bringing great pride to #TeluguCinema and to his people who love him. Hard work never fails🙏 pic.twitter.com/2l4SEPFIII — Radikaa Sarathkumar (@realradikaa) January 25, 2024 Hearty congratulations, Dear Chiru Bhai, for being conferred with the Padma Vibhushan.@KChiruTweets — Mammootty (@mammukka) January 25, 2024 Congratulations sir ❤️❤️ You are always an Inspiration 😊#PadmaVibhushanChiranjeevi #Megastar https://t.co/41qCnAkw2K — Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2024 Many congratulations to you, Sir @KChiruTweets Gaaru, on the honor bestowed upon you. You rightly deserve it. Your contribution to cinema, the world of art, your philanthropic lifestyle, your good work for the public and the blessings of your elders brings you this. As a friend,… https://t.co/DXKj4RgZw7 — KhushbuSundar (@khushsundar) January 26, 2024 Good morning Padma Vibhushan Chiranjeevi gaaru :) ♥️@KChiruTweets 🙏🏼 — Hi Nani (@NameisNani) January 26, 2024 Telugu vadi Garva Karanam Mega 🌟 Padma Vibhushan@KChiruTweets garu #MegastarChiranjeevi Garu — Teja Sajja (@tejasajja123) January 25, 2024 Congratulations Annaya @KChiruTweets on being recipient to the second highest civilian award #PadmaVibhushan Much Deserving Honour for your inspiring legacy & contribution. Thank you for holding cinema high at every instance. ❤️ pic.twitter.com/SvqDpnCBfI — Satya Dev (@ActorSatyaDev) January 25, 2024 My favorite picture I have of us sir @KChiruTweets ❤️ Thank you for always being kind and warm to me. Thank you for the amazing films. Thank you for the brilliant performances. Thank you for being our MEGASTAR. You are now a #PadmaVibhushan Sir. A proud moment for us, for TFI… pic.twitter.com/Wa7Q9x6V4P — Adivi Sesh (@AdiviSesh) January 26, 2024 Congratulations to our BOSS @KChiruTweets Garu on being felicitated with the honorary award #PadmaVibhushan ❤️ Thank you for making us all proud yet again and again. pic.twitter.com/pW5LEbVtuo — Vassishta (@DirVassishta) January 25, 2024 -
ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు: మెగాస్టార్ ఎమోషనల్
టాలీవుడ్ మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్‌కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటిచండంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మెగాస్టార్ మాట్లాడుతూ..'కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా.' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. 'నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల కు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. మీరు నా పై చూపిస్తున్నకొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు మెగాస్టార్‌కు అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. -
Chiranjeevi: మెగాస్టార్‌కు పద్మ విభూషణ్.. ఉపాసన ట్వీట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు కరోనా, లాక్డౌన్లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. (ఇది చదవండి: మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి) తాజాగా మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ మామయ్య అంటూ పద్మ విభూషణ్‌కు అవార్డులు పొందిన వారి లిస్ట్‌ను పోస్ట్ చేసింది.ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అది నిజమేనంటూ పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి 2006లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. Congratulations dearest Mamaya ❤️❤️❤️❤️ @KChiruTweets pic.twitter.com/4AtL1e7mJf — Upasana Konidela (@upasanakonidela) January 25, 2024 -
Father of Green Revolution: ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత
సాక్షి, చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్(98) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దేశంలో ఆకలితో అలమటించే అభాగ్యులు ఉండకూడదన్న లక్ష్యంతో జీవితాంతం పోరాటం సాగించిన మహా మనిషి తమిళనాడు రాజధాని చెన్నైలోని తన స్వగృహంలో గురువారం ఉదయం 11.15 గంటలకు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రాయ్ ఉన్నారు. భార్య మీనా స్వామినాథన్ గతంలోనే మృతిచెందారు. భారత్‌లో 1960వ దశకం నుంచి హరిత విప్లవానికి బాటలు వేసి, ఆహారం, పౌష్టికాహార భద్రత కోసం అలుపెరుగని కృషి చేసిన స్వామినాథన్‌ను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. స్వామినాథన్ పారీ్థవదేహాన్ని చెన్నై తేనాంపేట రత్నానగర్‌లో ఉన్న నివాసం నుంచి గురువారం రాత్రి తరమణిలోని ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్‌కు తరలించారు. శుక్రవారం అప్తులు, ప్రముఖుల సందర్శనార్థం పారీ్థవ దేహాన్ని ఇక్కడే ఉంచుతారు. విదేశాల్లో ఉన్న కుమార్తె చెన్నైకి రావాల్సి ఉండడంతో శనివారం స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఎం.ఎస్.స్వామినాథన్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. మానవాళి కోసం భద్రమైన, ఆకలికి తావులేని భవిష్యత్తును అందించే దిశగా ప్రపంచాన్ని నడిపించడానికి మార్గదర్శిగా పనిచేశారని స్వామినాథన్‌పై రాష్ట్రపతి ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు. ఘనమైన వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారని చెప్పారు. స్వామినాథన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన హరిత విప్లవానికి నాంది పలికారని, కోట్లాది మంది ఆకలి తీర్చారని, దేశంలో ఆహార భద్రతకు పునాది వేశారని కొనియాడారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కృషితో కోట్లాది మంది జీవితాలు మారాయని మోదీ గుర్తుచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం స్వామినాథన్ పారీ్థవదేహానికి అంజలి ఘటించారు. ఆయన మరణం దేశానికి, రైతు ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. స్వామినాథన్ మరణం పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
Padma Awards 2022: బిపిన్‌కు విభూషణ్..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డులు వరించిన వాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణకు ఒక పద్మ భూషణ్‌తో పాటు 3 పద్మశ్రీ, ఏపీకి 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. పూనావాలా, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లకు పద్మ భూషణ్ దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్ సింగ్ (మరణానంతరం), ప్రభా ఆత్రే ఎంపికయ్యారు. పద్మ భూషణ్‌కు మాజీ కాంగ్రెస్ లీడర్ గులాం నబీ ఆజాద్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఐ (ఎం) నేత బుద్ధదేవ్ భట్టాచార్య, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా, కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, పంజాబీ ఫోక్ సింగర్ గుర్మీత్ బవ, నటుడు విక్టర్ బెనర్జీ, కేంద్ర మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మెహ్రిశ్రీలను కేంద్రం ఎంపిక చేసింది. తమిళనాడు రాష్ట్రం నుంచి నటి షావుకారు జానకి, అలాగే ఒలింపిక్స్‌లో బంగారు పథకం సాధించిన నీరజ్ చోప్రా, సింగర్ సోనూ నిగమ్‌లు పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఈసారి 34 మంది మహిళలు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వాళ్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తుంటారు. ఈసారి మొత్తం 128 అవార్డులను ప్రకటించారు. అవార్డులు పొందిన వాళ్లలో 34 మంది మహిళలున్నారు. 10 మందిని విదేశీ, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ విభాగంలో ఎంపిక చేసింది. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి రెండు సందర్భాల్లో ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు. పద్మ భూషణ్‌కు తెలంగాణ నుంచి భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు).. ఏపీ నుంచి గోసవీడు షేక్ హాసన్ (కళలు) (మరణానంతరం), డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించింది. -
ప్రముఖ చరిత్రకారుడు పురందరే కన్నుమూత
పుణె: ప్రముఖ చరిత్రకారుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే సోమవారం అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన సోమవారం పుణెలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాబాసాహెబ్ పురందరేగా చిరపరిచితుడైన ఆయన వయసు 99 సంవత్సరాలు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై విశేషమైన పరిశోధనలతో పురందరే దేశంలోనే ఖ్యాతికెక్కారు. 1950లలో రాజా శివచక్రవర్తి పేరిట రాసిన పుస్తకంతో ఆయన మహారాష్ట్ర వాసుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. జానతా రాజా పేరుతో ఆయన రూపొందించిన నాటకం సైతం ఎంతో పేరొందింది. 2015లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఆయనను వరించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. పురందరే మృతిపై ప్రధాని మోదీ తదితరులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పురందరే అంత్యక్రియలను పుణెలో సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేశారు. -
ఎస్పీ బాలుకు పద్మాంజలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత గాయకుడు, గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యంను ప్రతిష్టాత్మక ‘పద్మ విభూషణ్’ వరించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబె సహా మరో ఆరుగురు కూడా భారత ప్రభుత్వం ప్రకటించే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ ‘పద్మ విభూషణ్’కు ఎంపికయ్యారు. ఎస్పీ బాలుకు తమిళనాడు తరఫున ఈ పురస్కారం లభించడం గమనార్హం. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన 119 మందికి కేంద్ర ప్రభుత్వం సోమవారం 2021 సంవత్సరానికి గానూ ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 10 మందిని పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. సైకత శిల్పి సుదర్శన్ సాహూ, ప్రధాని మాజీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రులు తరుణ్ గొగోయి(అస్సాం), కేశూభాయి పటేల్(గుజరాత్), లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్, ప్రముఖ గాయని కేఎస్ చిత్రలకు పద్మ భూషణ్ వరించింది. ఈ సంవత్సరం పద్మ అవార్డులు పొందిన వారిలో 29 మంది మహిళలున్నారు. విదేశీ/ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మందిని భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. ఒక ట్రాన్స్‌జెండర్ కూడా ఈ ఏడాది పద్మ పురస్కారం పొందారు. ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది. మాజీ గవర్నర్, దివంగత మృదుల సిన్హా, మాజీ కేంద్రమంత్రి బిజోయ చక్రవర్తిలకు పద్మ శ్రీ పురస్కారం ప్రకటించారు. పద్మ పురస్కారాలు పొందిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి.. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామికి కళలు విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాశరావుకు సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిడుమోలు సుమతికి కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. తెలంగాణ నుంచి కళల విభాగంలో కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక భారతరత్న రావాలి ‘పాడనా తీయగా కమ్మని ఒక పాట. పాటగా బ్రతకనా మీ అందరి నోటా...’అంటూ ‘వాసు’సినిమాలో పాడారు యస్పీ బాల సుబ్రహ్మణ్యం. గత ఏడాది చివర్లో కోవిడ్ వల్ల అనారోగ్యం పాలై ఆయన మరణించిన విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటగా మనతోనే ఎప్పుడూ ఉంటారు. సంగీత కళాకారుడిగా ఆయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం యస్పీబీకి మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. గాయకుడిగా సుమారు 40 వేల పాటలు పాడారాయన. సుమారు 50 ఏళ్ల కాలాన్ని సినిమాలకు పాడటానికే అంకితం చేయడం విశేషం. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా, నటుడిగా యస్పీబీ ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అందుకున్నారాయన. యస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని, ఆయన మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి. తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు కూడా ఆ వాదనను సమర్థించాయి. సౌతిండియా నైటింగేల్ ‘బొంబాయి’సినిమాలో ‘కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే...’అంటూ పాడారు చిత్ర. చనిపోయే ముందు అందరూ తప్పక వినాల్సిన 100 పాటలు అంటూ బ్రిటీష్ మేగజీన్ ‘ది గార్డియన్’చేసిన 100 పాటల జాబితాలో ఈ పాట ఉంది. ఇలా గాయని చిత్ర పాడిన పాటలు భాషలకు అతీతంగా శ్రోతల్ని చేరుతూనే ఉన్నాయి. అందుకే ఆమెను సౌతిండియా నైటింగేల్ అన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చిత్రకు పద్మ భూషణ్ ప్రకటించింది. గాయనిగా సుమారు 25 వేల పాటలు ఆలపించారు చిత్ర. 1979లో మలయాళ ప్రైవేట్ ఆల్బమ్‌తో గాయనిగా మారారు చిత్ర. 2005లో పద్మశ్రీ అందుకున్నారు. ‘సింధు భైరవి’అనే తమిళ అనువాద చిత్రంలో ‘పాడలేను పల్లవైనా..’పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నో పల్లవులు. చరణాలు పాడుతూనే ఉన్నారామె. -
పద్మవిభూషణ్ వాపస్
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై 8 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ రైతులే ప్రముఖంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఒత్తిడి కారణంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీతో పొత్తును తెంచుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రైతులు అకాలీదళ్ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న రైతుల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ గురువారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ఈరాజకీయ కురు వృద్ధుడు ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. రైతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి బలమైన సందేశం పంపేందుకే ప్రకాశ్ సింగ్ తన అవార్డును తిరిగి ఇచ్చినట్లు ఆయన కుమారుడు, అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. కాగా, శిరోమణి అకాలీ దళ్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ విశ్వసనీయతను కాపాడేందుకు... మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. పడిపోతున్న పార్టీ విశ్వసనీయతను నిలబెట్టడంతోపాటు, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పటికీ బాదల్‌పైనే ఉంది. అందుకే 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ప్రముఖ చిత్రకారుడు సతీశ్ గుజ్రాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు, శిల్పి సతీశ్ గుజ్రాల్ (94) కన్నుమూశారు. మాజీ ప్రధాన మంత్రి ఐకే గుజ్రాల్‌కు ఈయన సోదరుడు. వయోభారం రీత్యా గురువారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యుడు, రాజ్యసభ ఎంపీ నరేశ్ గుజ్రాల్ తెలిపారు. సతీశ్ నైపుణ్యం కలిగిన చిత్రకారుడు, శిల్పి, గ్రాఫిక్ ఆర్టిస్ట్ అంతేగాక దేశంలో రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషన్‌ను పొందిన వ్యక్తి. ఆయన మృతిపై దేశ ప్రధాని సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సతీశ్ గుజ్రాల్‌కు ఉన్న అపారమైన జ్ఞానమే ఆయన్ను అంత ఎత్తుకు తీసుకెళ్లిందని, అయినప్పటికీ ఆయన ఎప్పుడూ తగ్గి ఉండేవారని మోదీ కొనియాడారు. కళలు, సాంస్కృతిక విభాగంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. -
ప్రముఖ కళాకారుడు కన్నుమూత..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కళాకారుడు, ఆర్కిటెక్ట్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత సతీష్ గుజ్రాల్ మరణించారు. సతీష్ గుజ్రాల్ మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు సోదరుడు. దేశ విభజనకు ముందు 1925, డిసెంబర్ 25న జన్మించిన సతీష్ గుజ్రాల్ లాహోర్, ముంబైల్లో విద్యాభ్యాసం సాగించారు. నటనతో పాటు ఆర్కిటెక్చర్‌లోనూ విశేష ప్రాచుర్యం పొందిన గుజ్రాల్ ఢిల్లీలో బెల్జియం రాయబార కార్యాలయ భవనం డిజైన్‌ను రూపొందించారు. గుజ్రాల్ విశేష ప్రతిభా పాటవాలు కలిగిన వారని, ఆయనలోని సృజనాత్మకత తనను ఆకట్టుకునేదని, గుజ్రాల్ మరణం విచారకరమని ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. నటుడు, ఆర్కిటెక్ట్ గుజ్రాల్ మరణం దేశానికి తీరని లోటని, ఆయన సేవలను దేశం ఎన్నడూ గుర్తుంచుకుంటుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ‘పద్మ’కు తాకిన కరోనా భయాలు! -
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
-
వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌కు చేదు అనుభవం
-
లైవ్ అప్డేట్స్ : ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించారు. దత్త పుత్రిక నమితా భట్టాచార్య చేతుల మీదుగా బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందు స్మృతిస్థల్‌లో త్రివిద దళాధిపతులు మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్‌పేయికి తుది వీడ్కోలు పలికారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వాజ్‌పేయికి కడసారి నివాళులర్పించారు. మరోవైపు అంతియయాత్రలో దారి పొడవునా అటల్ జీ అమర్ రహే నినాదాలతో మార్మోగిపోయింది. తొలుత వాజ్‌పేయి కన్నుమూసిన అనంతరం ఆయన పార్థివదేహాన్ని తొలుత ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్‌కు తరలించారు. అనంతరం వాజ్‌పేయి పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్ యోగిలు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివచ్చి వాజ్‌పేయికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. దత్త పుత్రిక నమితా భట్టాచార్య తన చేతుల మీదుగా చితికి నిప్పంటించి మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమ సంస్కారాలను శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితుల సాయంతో వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహిస్తోన్న దత్త పుత్రిక నమితా భట్టాచార్య, ఇతర కుటుంబసభ్యులు తాత అటల్జీ నుంచి తరచుగా బహుమతులు అందుకునే నిహారిక చివరిసారి కానుకగా ఆయన పార్థీవదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని అందుకున్నారు. ఉద్వేగానికి లోనవుతూ త్రివర్ణ పతాకాన్ని వెంట తీసుకెళ్లారు. త్రివిధ దళాధిపతులు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ ప్రధానికి తుది వీడ్కోలు. మహానేత వాజ్‌పేయికి నివాళుతర్పించిన పలువురు కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమయాత్ర అశేష జనవాహిని మధ్య స్మృతి స్థల్‌కు చేరుకుంది. వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం స్మృతి స్థల్‌కు బయలుదేరిన బూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్, లక్ష్మణ్ కిరిల్లా, అబ్దుల్ హసన్ మహ్మద్ అలీ, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు. వాజ్‌పేయి అంతియయాత్రలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, పార్టీ నేతలు విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్‌పేయి మెమోరియల్‌కు ఏర్పాట్లు పూర్తి ఢిల్లీకి చేరుకున్న అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్. వాజ్‌పేయి అంతియాత్ర స్థలానికి బయలుదేరిన ఖర్జాయ్ రాష్ట్రీయ స్మృతి స్థల్లో రాజనీతిజ్ఞుడు, ప్రజల నేత వాజ్‌పేయి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు అంతిమయాత్ర కొనసాగుతున్న దీన్ దయాల్ మార్గ్ రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కాలి నడకన వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు కృష్ణ మీనన్ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయి పార్థివదేహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్ పురోహిత్‌లు నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్‌లు వాజ్‌పేయి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అక్తర్, షబానా అజ్మీలు వాజ్‌పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. -
వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌పై దాడి
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. కడసారి వాజ్‌పేయిని దర్శించుకునేందుకు వచ్చిన అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తలు సామూహికంగా దాడి చేశారు. ఈ విషయం గురించి అగ్నివేష్ మాట్లాడుతూ ‘వాజ్‌పేయి గారికి నివాళులర్పించేందుకు నేను ఇక్కడకు వచ్చాను. కానీ పోలీసు బందోబస్తు ఉండటం వల్ల నడుచుకుంటూ వస్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి కొందరు యువకులు వచ్చి నా మీద దాడి చేయడం ప్రారంభించారు. మేము ఇద్దరం, ముగ్గరమే ఉన్నాం.. కానీ వాళ్లు గుంపుగా వచ్చారు. వాళ్లు నా తలపాగాను పడేసి, మమ్మల్ని తిడుతూ, మా పై దాడి చేశార’ని తెలిపారు. అంతేకాక ‘వారిలో కొందరు నన్ను ఉద్దేశిస్తూ అతను దేశద్రోహి.. కొట్టండి, కొట్టండి అంటూ నా మీద దాడికి పురిగొల్పార’ని అగ్నివేష్ తెలిపారు. అయితే అగ్నివేష్‌పై దాడి జరగడం ఇది రెండో సారి. గతంలో ఒకసారి జార్ఖండ్‌లో బీజేపీ కార్యకర్తలు అగ్నివేష్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. -
భారత్‌కు విదేశీ నేతలు
న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు పలువురు పొరుగు దేశాల నేతలు భారత్‌కు రానున్నారు. ముందుగా బూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్..భారత్‌కు చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కాగా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్, లక్ష్మణ్ కిరిల్లా, అబ్దుల్ హసన్ మహ్మద్ అలీ, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. సాయంత్రం స్మృతి స్థల్లో అధికారిక లాంఛనాల మధ్య వాజ్‌పేయీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్ ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక తదితర దేశాల అధ్యక్షులు భారత రాష్ట్రపతికి సంతాప సందేశాలు పంపారు. ‘భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి విచారకరం. ఆయన గొప్ప నాయకుడే కాదు.. సాహిత్యం, కళల్లో మంచి స్కాలర్ కూడా. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మాల్దీవుల్లో పర్యటించారు. ఓ గొప్ప నేతను కోల్పోయిన భారత్‌కు మాల్దీవులు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూమ్ తన సంతాపం తెలియజేశారు. ‘భారత గొప్ప నేతల్లో వాజ్‌పేయి ఒకరు. ఆయన మృతి విచారకరం. యూకే ప్రభుత్వానికి ఆయన మంచి సన్నిహితుడు’ అని యూకే మంత్రి మార్క్ ఫీల్డ్ సానుభూతి తెలిపారు. ‘వాజ్‌పేయి ప్రపంచం గర్వించదగ్గ నేత. గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన మృతిపట్ల సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తన సంతాప సందేశాన్ని పంపారు. ‘ఈ రోజు ఓ గొప్ప మానవతావాదిని, నిజమైన స్నేహితుడిని మనం కోల్పోయాం. ఆయన అద్భుతమైన నాయకుడు, ప్రజాస్వామ్య రక్షకుడు’ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంతాపం తెలియజేశారు. -
వాజ్‌పేయికి ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో కన్నుమూసిన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మూత్రపిండ నాళాల ఇన్ఫెక్షన్, మూత్రనాళాల ఇన్ఫెక్షన్, ఛాతీ సంబంధిత సమస్యతో గత కొన్ని రోజులు ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన గురువారం కన్నుమూశారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్‌కు తరలించారు. కృష్ణ మీనన్ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయిని కడసారి చూసేందుకు హాజరైన పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణ మీనన్ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయి పార్థివదేహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్ పురోహిత్‌లు నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్‌లు వాజ్‌పేయి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అక్తర్, షబానా అజ్మీలు వాజ్‌పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం వాజ్‌పేయి పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్ యోగిలు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివస్తున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాజ్‌పేయి మృతి నేపథ్యంలో కేంద్రం ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా ప్రకటించింది. -
వాజ్‌పేయి కేవలం ముసుగు మాత్రమే!
న్యూఢిల్లీ : భారత్‌లోని వైవిధ్య సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు ఓ సరికొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు.. పార్టీల సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనావళి అభిమానం చూరగొన్న నేత మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి (93) కన్నుమూశారు. ‘ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ (సరిపోని శిబిరంలో సరైన వ్యక్తి)గా ప్రజల చేత పిలువబడిన వ్యక్తి వాజ్‌పేయి. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా ఆయన అవలంభించిన ఆదర్శాలే ఇందుకు కారణం. వాజ్‌పేయి తన జీవితంలో పాటించిన ఆదర్శాల గురించి ఆయనతో సుదీర్ఘంగా కలిసి ప్రయాణించిన సంఘ్ ప్రచారకర్త, తెలుగువారైన కేఎన్ గోవిందాచార్య ఏమన్నారంటే.. ‘రాజకీయాల్లో వాజ్‌పేయి పాటించిన కొన్ని ఆదర్శాలే నేడు ఆయనను అజాతశత్రువుగా నిలిపాయి. ఆయన ‘అధికారం కావాలి కానీ దానికోసం ఎవరి ముందు చేయి చాచను.. దేనికి తలవంచను’ అనే వారు. ‘ఉత్తమమైన రాజకీయాలంటే ప్రజలతో కూడినవే కానీ అధికారంతో కూడినవి కాదు అనే వారు. రాజకీయాలు ఎప్పుడైనా ప్రజలకు మేలు చేసేవిలానే ఉండాలి కానీ అధికారం కోసం అర్రులు చాచేవిగా ఉండకూడదు అనేవారని’ గోవిందాచార్య తెలిపారు. వాజ్‌పేయ్ నమ్మిన అతి ముఖ్యమైన మరో విషయం ఏంటంటే వ్యక్తిగత, రాజకీయ ఆశయాలు పార్టీకి లోబడి ఉండాలి.. పార్టీ ఆశయాలు దేశ, సామాజిక ప్రయోజనాలకు లోబడి ఉండాలనేవారు. ఆయన కూడా అలానే నడుచుకునే వారన్నారు గోవిందాచార్య. వాజ్‌పేయి నమ్మిన మరో రెండు సిద్ధాంతాలు ‘ఎవరూ కూడా వివాదాస్పద రాజకీయాల్లో మునిగిపోకూడదు. మన చేతలు, మాటల ద్వారా ప్రజలకు సన్నిహితంగా ఉండాలి అనే వారు. అంతేకాక పార్టీలో ఉన్న వారు వారి వారి ఆశయాల సాధన కోసం వివాదరహితంగా ఉంటూ పనిచేయాలి’ అనే కోరుకునే వారని గోవిందాచార్య తెలిపారు. అయితే వాజ్‌పేయి, గోవిందాచార్యలకు 1997లో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి రిపోర్టుల ప్రకారం జనరల్ సెక్రటరీగా పని చేస్తోన్న గోవిందాచార్య ‘ఎల్కే అడ్వాణీయే అసలైన నాయకుడు .. వాజ్‌పేయి కేవలం ముసుగు మాత్రమే’ అనే ఆరోపణలు చేశారనే వార్తలు వచ్చాయి. ఈ మాటలు తన ప్రధాని హోదాకు భంగం కల్గించేవిగా ఉన్నాయంటూ వాజ్‌పేయి అడ్వాణీకి లేఖ రాశారు. ఈ విషయం గురించి గోవిందాచార్య ‘ఆ వివాదం 1997, అక్టోబర్ 3 న మొదలై.. అక్టోబర్ 30 1997 ముగిసింది. నేను వాజ్‌పేయిని బీజేపీ ముసుగు అన్నాను. కానీ మీడియా నా మాటలను వక్రీకరించింది. అందులో నా తప్పేం లేదు అని ఆయనకు తెలియజేయడం కోసం 17 పేజీల లేఖ రాశాను. ఆయన అప్పుడు దాని గురించి స్పందించలేదు. కానీ 1998లో నన్ను మరోసారి జనరల్ సెక్రటరీగా నియమించారు. అంటే ఆ వివాదం అప్పటికే ముగిసినట్లే కదా’ అన్నారు. అంతే కాక కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి (బీజేపీ), ఆర్ఎస్ఎస్కి బేధాభిప్రాయాలు వచ్చేవి. ఆ సమయంలో వారు ఒకరికొకరు ఎదురు పడేవారు కాదు అని తెలిపారు. ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డీఐలను అనుమతించడం, ప్రపంచ వాణిజ్య సంస్థ, పెటేంట్ చట్టాలు, తెహ్రీ డ్యాం, రామజన్మభూమి వంటి అంశాల్లో బీజేపీకి, సంఘ్‌కి మధ్య విబేధాలు తలెత్తాయి అని తెలిపారు. -
భరతమాత ముద్దుబిడ్డ
రాజకీయవేత్తగా.. ఒప్పుకోను పరాజయం కొత్తదారి నా ధ్యేయం కాలం తలరాతను చెరిపేస్తా సరికొత్త గీతాన్ని ఆలపిస్తా తెగి పడగలం... కానీ తల వంచం పాలకులతో పేచీ నిరంకుశంపై తిరుగుబాటు అంధకారంతో లడాయి వెలుతురు కోసం పెనుగులాట తెగి పడగలం గాని తల వంచం.... కవిగా, రాజకీయవేత్తగా వాజ్‌పేయి ధోరణి ఇదే కవిగా... బాధలు చుట్టుముట్టనీ ప్రళయం కరాళనృత్యం చేయనీ కాళ్ల కింద భూమి కదలనీ శిరస్సు మీద అగ్నివాన కురవనీ ఆగొద్దు... కలసి నడవడం ఆపొద్దు దేశ రాజకీయ చరిత్రలో, బీజేపీ ప్రస్థానంలో వాజ్‌పేయిది ఓ చెరగని ముద్ర! అబ్బురపరిచే వాగ్ధాటి.. అచంచల ఆత్మవిశ్వాసం.. రాజకీయ చతురత.. రాజనీతిజ్ఞతకు చిరునామాగా నిలిచిన ఆయన ప్రతి అడుగూ ఓ మైలురాయే!! పోఖ్రాన్ అణు పరీక్షలైనా దాయాది దేశం పాకిస్తాన్‌తో శాంతిచర్చలైనా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగారు. మూడుసార్లు ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆయన.. గొప్ప కవి కూడా. నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టగానే ఆయనకు భారతరత్న ప్రకటించారు. వాజ్‌పేయి జన్మదినాన్ని(డిసెంబర్ 25) కేంద్రం ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం నుంచి.. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాజ్‌పేయి అంచెలంచెలుగా ఎదిగారు. కృష్ణాదేవి, కృష్ణా బిహారీ వాజ్‌పేయి దంపతులకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న ఆయన జన్మించారు. వాజ్‌పేయి తండ్రి కృష్ణ స్కూల్ టీచర్. కవి కూడా. గ్వాలియర్‌లోని సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో వాజ్‌పేయి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత గ్వాలియర్లోనే విక్టోరియా కాలేజీ గ్రాడ్యుయేషన్, కాన్పూర్‌లోని దయానంద్ ఆంగ్లో–వేదిక్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1939లో ఆరెస్సెస్‌లో చేరారు. 1947లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా చురుగ్గా పాల్గొన్నారు. హిందీ మాసపత్రిక రాష్ట్రధర్మ, వారపత్రిక పాంచజన్య, దినపత్రికలు స్వదేశ్, వీర్ అర్జున్‌లలో పని చేశారు. రాజకీయ ప్రస్థానం ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న వాజ్‌పేయి రాజకీయ రంగంలో ఒక్కో మెట్టు అధిష్టించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆయన అప్పటి హిందూత్వ పునాదులపై డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్(బీజేఎస్)లో చేరారు. అనతికాలంలోనే పార్టీ ఉత్తరాది జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 1957లో బలరాంపూర్ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1968లో జనసంఘ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అప్పట్నుంచి తన సహచరులు నానాజీ దేశ్‌ముఖ్, బల్రాజ్ మధోక్, ఎల్కే అద్వానీలతో కలసి పార్టీని కొత్త తీరాలకు తీసుకువెళ్లారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నేతృత్వంలో ఉధృతంగా సాగిన సంపూర్ణ విప్లవోద్యమంలో వాజ్‌పేయి చురుగ్గా పాల్గొన్నారు. 1977లో జనసంఘ్ మద్దతుతో కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కారు కొలువుదీరింది. అందులో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు. 1979లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేయడంతో వాజ్‌పేయి కేంద్రమంత్రిగా కొద్దికాలం పాటే పనిచేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే గొప్పనేతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 3 సార్లు ప్రధాని పీఠం.. 1984 ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ వాజ్‌పేయి నేతృత్వంలో 1996 సార్వత్రిక ఎన్నికల నాటికి తన సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ పదో ప్రధానిగా వాజ్‌పేయి ప్రమాణం చేశారు. అయితే మిత్రపక్షాలు సహకరించకపోవడంతో బలపరీక్షలో ఓడిపోయి 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత 1998లో మిత్రపక్షాలను కూడగట్టిన బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఈ సమయం(1998 మే)లోనే ఆయన రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించారు. మరోవైపు పాక్‌తో శాంతిచర్చలకు శ్రీకారం చుట్టారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సర్వీసును ప్రారంభించారు. కానీ పాక్ కయ్యానికి కాలుదువ్వి కార్గిల్ వార్‌కు కారణమైంది. ఆ యుద్ధంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో పాక్ సైనికులను సరిహద్దుల నుంచి తరిమేసి జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా వాజ్‌పేయి ప్రభుత్వం పూర్తికాలంపాటు ప్రభుత్వాన్ని నడపలేదు. మిత్రపక్షం అన్నా డీఎంకే తన మద్దతు ఉపసంహరించుకోవడంతో 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించింది. 1999 అక్టోబర్ 13న వాజ్‌పేయి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలంపాటు(1999–2004) అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి కావడం విశేషం. సంస్కరణల బాటలో.. మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన వాజ్‌పేయి కీలక ఆర్థిక సంస్కరణలకు బాటలు వేశారు. విదేశీ పెట్టుబడులు, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. స్వేచ్ఛా వాణిజ్యం, సరళీకృత విధానాలతో ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ రహదారుల అభివృద్ధి పథకం, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన పథకాన్ని చేపట్టారు. అమెరికా–భారత్ మధ్య స్నేహబంధం బలోపేతమైంది. 2000 మార్చిలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనే ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి బీజాలు వేస్తూ అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాకు దగ్గరవుతూనే పాక్‌కు స్నేహహస్తం చాచారు వాజ్‌పేయి. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌తో ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కశ్మీర్ అంశంపై ముషార్రఫ్ పట్టుపట్టడంతో ఇరుదేశాల మధ్య చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. మరోవైపు ఉగ్రవాదం కూడా వాజ్‌పేయి సర్కారుకు సవాలుగా నిలిచింది. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మూడునెలలకే.. అంటే 1999 డిసెంబర్లో కాందహార్‌లో భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ప్రయాణికులను ముష్కర చెర నుంచి విడిపించేందుకు జైల్లో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అలాగే 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. 2002లో గుజరాత్లో గోధ్రా ఘటనతో అల్లర్లు చెలరేగాయి. బీజేపీకి బీజాలు 1980లో అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్ తదితరులతో కలసి వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని స్థాపించారు. జనతా సర్కారు తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్(ఐ) ప్రభుత్వంపై వాజ్‌పేయి సునిశిత విమర్శలతో విరుచుకుపడేవారు. 1984లో ఇందిర హత్య అనంతరం సిక్కుల ఊచకోత సమయంలో ప్రభుత్వ తీరును, అది చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌ను తీవ్రంగా ఖండించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండే రెండు స్థానాలను గెల్చుకుంది. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని నడుపుతూనే లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వాజ్‌పేయి తన వాణిని బలంగా వినిపించారు. ఉదారవాదిగా గుర్తింపు పొందిన ఆయన 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ‘అనాలోచిత చర్య’గా అభివర్ణించారు. అవార్డులు 1992: పద్మవిభూషణ్ 1994:లోకమాన్య తిలక్ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు 2015: భారతరత్న రాజకీయాల నుంచి నిష్క్రమణ 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమిపాలైంది. యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టేందుకు వాజ్‌పేయి నిరాకరించారు. పార్టీ బాధ్యతలను అద్వానీకి అప్పగించారు. 2005 డిసెంబర్లో ముంబైలో జరిగిన బీజేపీ సిల్వర్‌జూబ్లీ ర్యాలీలో క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్నుంచి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. సాక్షి, తెలంగాణ డెస్క్