మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనలో భాగంగా చిరుని ఈ పురస్కారం వరించింది. దీంతో తెలుగోళ్లు చాలా గర్వపడుతున్నారు. ప్రతి ఒక్కరూ మన చిరంజీవికి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ అవార్డుతో ఏమేం ఇస్తారు? ఎలాంటి సదుపాయాలు ఉంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది?
పద్మ విభూషణ్ అవార్డు అనేది ఏదైనా రంగంలో అసాధారణమైన విశిష్ట సేవ చేసినవారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలా ఈ ఏడాదికిగానూ తెలుగు నుంచి చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఈ పురస్కారం వరించింది. అయితే పద్మ అవార్డు పొందిన వారికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? నగదు ప్రోత్సాహకాలు ఇస్తారా? అనేది చాలామందికి ఉన్న సందేహం. కానీ పద్మ అవార్డు అనేది ఓ గౌరవం మాత్రమే.
(ఇదీ చదవండి: మెగా కాంపౌడ్‌లో అవార్డుల పంట.. చిరు నుంచి బన్నీ వరకు..)
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇచ్చిన వ్యక్తులకు.. ఎలాంటి నగదు, రాయితీ ఇవ్వరు. అలానే రైలు/విమాన ప్రయాణాల్లోనూ ఎలాంటి రాయితీలు ఉండవు. ఇకపోతే పద్మ పురస్కార గ్రహీతలు.. రాష్ట్రపతి భవన్‌లోకి వెళ్లి రాష్ట్రపతిని కలిసే అవకాశముంటుంది. పద్మ అవార్డులో భాగంగా రాష్ట్రపతి సంతకం ఉన్న ధ్రువీకరణ పత్రం, పతకం మాత్రం బహుకరిస్తారు. ఈ అవార్డు వల్ల ఆ వ్యక్తుల గురించి దేశమంతా తెలుస్తుందంతే!
సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకుగాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇదే కాకుండా పలు సినిమాలకుగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లోనే సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి ప్రత్యేక అవార్డుని ఫిలింఫేర్ అవార్డుల్లో అందుకున్నారు. 2010లో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారం, 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు చిరంజీవికి లభించాయి.
(ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment