75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌లోని తన బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను ఊహించని.. నేను ఎదురు చూడని పద్మవిభూషణ్ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నా సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా పద్మశ్రీ, పద్మభూషణ్ పొందిన తెలుగు రాష్ట్రాలవారికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'వెంకయ్యనాయుడు గారి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్' రావడం ఆనందంగా ఉంది. మీ సుదీర్ఘమైన ప్రజాసేవ, మీ జ్ఞానం, రాజకీయాల్లో గౌరవప్రదమైన మీ ప్రసంగం..మీ స్థాయిని పెంచుతుంది. మీతో పాటు అవార్డ్ దక్కడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రతిభావంతులైన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రమణ్యం, అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నా సోదర వర్గానికి, తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రియమైన మిథున్ దా (చక్రవర్తి), ఉషా ఉతుప్ జీ, దాసరి కొండప్ప, ఉమా మహేశ్వరి , గడ్డం సమ్మయ్య , కూరెళ్ల విట్టలాచార్య,ఎ వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్‌లాల్, విజయకాంత్ (మరణానంతరం)గారితో పాటు ప్రతి ఒక్కరికీ అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Heartiest congratulations to Shri @MVenkaiahNaidu garu on the coveted ‘Padma Vibhushan’! Your long, relentless public service, your wisdom and dignified presence in politics enhances the stature and quality of political discourse.
It is an even greater honour for me to be in…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2024
Comments
Please login to add a commentAdd a comment