padma awardees in telugu
-
నేను ఊహించని అవార్డ్ రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌లోని తన బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను ఊహించని.. నేను ఎదురు చూడని పద్మవిభూషణ్ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నా సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా పద్మశ్రీ, పద్మభూషణ్ పొందిన తెలుగు రాష్ట్రాలవారికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'వెంకయ్యనాయుడు గారి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్' రావడం ఆనందంగా ఉంది. మీ సుదీర్ఘమైన ప్రజాసేవ, మీ జ్ఞానం, రాజకీయాల్లో గౌరవప్రదమైన మీ ప్రసంగం..మీ స్థాయిని పెంచుతుంది. మీతో పాటు అవార్డ్ దక్కడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రతిభావంతులైన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రమణ్యం, అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నా సోదర వర్గానికి, తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రియమైన మిథున్ దా (చక్రవర్తి), ఉషా ఉతుప్ జీ, దాసరి కొండప్ప, ఉమా మహేశ్వరి , గడ్డం సమ్మయ్య , కూరెళ్ల విట్టలాచార్య,ఎ వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్, విజయకాంత్ (మరణానంతరం)గారితో పాటు ప్రతి ఒక్కరికీ అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. Heartiest congratulations to Shri @MVenkaiahNaidu garu on the coveted ‘Padma Vibhushan’! Your long, relentless public service, your wisdom and dignified presence in politics enhances the stature and quality of political discourse. It is an even greater honour for me to be in… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2024 -
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీకి చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరికి పద్మ శ్రీ పురస్కారం వరించింది. తెలంగాణకు చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య కు పద్మశ్రీ అవార్డు లభించింది. #PadmaAwards2024 | Somanna, a Tribal Welfare Worker from Mysuru, tirelessly working for the upliftment of Jenu Kuruba tribe for over 4 decades, to receive Padma Shri in the field of Social Work (Tribal PVTG) pic.twitter.com/zZl6Sge1tE — ANI (@ANI) January 25, 2024 తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇదీ చదవండి: రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య, కర్పూరి ఠాకూర్ ప్రస్తావన -
Padma Awards: అట్టహాసంగా 2023 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
సాక్షి, ఢిల్లీ: 2023 ఏడాదికిగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఇవాళ(బుధవారం మార్చి 22) సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కర్తో పాటు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ అందుకోగా.. ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, సింగర్ సుమన్ కళ్యాణ్పూర్లు పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. పాండ్వానీ సింగర్ ఉషా బర్లే, చునారా కమ్యూనిటీకి చెందిన కళంకారీ కళాకారుడు భానుభాయ్ చితారా, త్రిపుర గిరిజన నేత నరేంద్ర చంద్ర దెబ్బార్మా(దివంగత.. బదులుగా ఆయన తనయుడు సుబ్రతా దెబ్బర్మా), కాంతా ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ ప్రీతికాకా గోస్వామి, ప్రముఖ బయాలజిస్ట్ మోడడుగు విజయ్ గుప్తా, ఇత్తడి పాత్రల రూపకర్త.. ప్రముఖ కళాకారుడు దిల్షద్ హుస్సేన్, పంజాబీ స్కాలర్ డాక్టర్ రతన్ సింగ్ జగ్గీ, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(దివంగత.. బదులుగా ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా అవార్డును అందుకున్నారు), మ్యూజిక్ ఆర్టిస్ట్ మంగళ కాంతా రాయ్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీ నుంచి చింతల పాటి వెంకట పతి రాజు( కళారంగం), కోటా సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం), తెలంగాణకి చెందిన పసుపులేటి హనుమంతరావు (మెడిసిన్ ), బి.రామకృష్ణరెడ్డి (సాహిత్యం) పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. #WATCH | Former Union Minister SM Krishna receives the Padma Vibhushan from President Droupadi Murmu. pic.twitter.com/WqA5b0YH1i — ANI (@ANI) March 22, 2023 LIVE: President Droupadi Murmu presents Padma Awards 2023 at Civil Investiture Ceremony-I at Rashtrapati Bhavan https://t.co/jtEQQtx1DP — President of India (@rashtrapatibhvn) March 22, 2023 -
తెలుగు పద్మాలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: ఈ ఏడాది పద్మ పురస్కారలకు ఎంపికైన తెలుగు ప్రముఖులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో వారు చేసిన అద్భుతకృషికి లభించిన గొప్ప గుర్తింపు అని అన్నారు. భవిష్యత్తులో కూడా వారు ఇలాంటివి మరిన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో విశేషంగా పనిచేసే ప్రముఖులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేరుతో అవార్డులు ఇచ్చే విషయం తెలిసిందే. ఈసారి తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఎనిమిది పద్మ అవార్డులు దక్కాయి.