ఈ ఏడాది పద్మ పురస్కారలకు ఎంపికైన తెలుగు ప్రముఖులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్: ఈ ఏడాది పద్మ పురస్కారలకు ఎంపికైన తెలుగు ప్రముఖులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో వారు చేసిన అద్భుతకృషికి లభించిన గొప్ప గుర్తింపు అని అన్నారు.
భవిష్యత్తులో కూడా వారు ఇలాంటివి మరిన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో విశేషంగా పనిచేసే ప్రముఖులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేరుతో అవార్డులు ఇచ్చే విషయం తెలిసిందే. ఈసారి తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఎనిమిది పద్మ అవార్డులు దక్కాయి.