నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలియచేసింది.
సాక్షి, న్యూఢిల్లీ : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలియచేసింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఢిల్లీలో వారిని కలుసుకొని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర మంత్రులు రాజ్ కుమార్ సింగ్, అల్ఫాన్స్, వీరేంద్ర కుమార్, అనంతకుమార్ హెగ్డే, గజేంద్రసింగ్ షేఖావత్, సత్యపాల్ సింగ్,శివ ప్రతాప్ శుక్,అశ్వినికుమార్ చౌబే తదితరులను విజయసాయి రెడ్డి కలిశారు. దేశ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలకు వైఎస్‌ఆర్ సీపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.