central ministers
-
నేడు ఖమ్మం జిల్లాకు కేంద్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏరియల్ సర్వేకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.శివరాజ్‌సింగ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి నేరుగా ఖమ్మం చేరుకోనుండగా బండి సంజయ్ ఆయనతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. అనంతరం పంట నష్టంతోపాటు ఆస్తి నష్టంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో వారు సమీక్షించనున్నారు. -
నేడు, రేపు పలువురు కేంద్రమంత్రుల పర్యటనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులు తెలంగాణబాట పట్టారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆదివారం ముషీరా బాద్ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మత్స్యకారులతో సమావేశం కాను న్నారు. అనంతరం అంబర్‌పేట జరిగే మత్స్య కారు ల సమావేశంలోనూ పాల్గొననున్నారు. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగే జమ్మికుంట బహిరంగసభలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తారని, అదేరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ సభ లోనూ పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండల బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్థక శాఖల మంత్రి పురు షోత్తం రూపాలా ప్రారంభించనున్నారు. అనంతరం కల్వకుర్తిలో జరగనున్న బహిరంగ సభలో రూపాలా పాల్గొంటారని తెలియజేశారు. -
రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు..
ఢిల్లీ: రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. పాంగాంగ్ సరస్సు వరకు బైక్ రైడ్‌ను చేపట్టారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. కశ్మీర్లో ప్రస్తుతం రహదారులు ఎలా ఉన్నాయో..? బైక్ రైడ్ ద్వారా తెలుపుతూ ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్యు అంటూ కామెంట్ పెట్టారు. 2012కి పూర్వం అక్కడ ఉన్న రోడ్ల దుస్థితిని ప్రస్తుతం ఉన్న రహదారులను పోల్చుతూ ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రధాని మోదీ హయాంలో హిమాలయాల్లో ఎలాంటి రోడ్లను నిర్మించారో జాతి మొత్తం చూస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా అన్నారు. రాహుల్ యాత్ర చేపడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కశ్మీర్లో లాల్ చౌక్ వద్ద జాతీయ జెండా నేడు స్వేచ్ఛగా రెపరెపలాడుతోందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే కశ్మీర్లో సరైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. Thanks to Rahul Gandhi for promoting excellent roads of Ladakh built by the @narendramodi govt. Earlier, he also showcased how Tourism is booming in Kashmir Valley & reminded all that our "National Flag" can be peacefully hoisted at Lal Chowk in Srinagar now! pic.twitter.com/vta6HEUnXM — Kiren Rijiju (@KirenRijiju) August 19, 2023 లద్ధాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్.. తాను ఇటీవల కొనుగోలు చేసిన కేటీఎమ్ బైక్‌పై పాంగాంగ్ లేక్ వరకు రైడ్ చేపట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.' ప్రపంచంలో అత్యంత సుందరమైన ప్రదేశం హిమాలయాల్లో ఉన్నాయని మా నాన్న తెలిపారు' అని రాహుల్ పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం రాహుల్ యాత్రకు కేంద్ర మంత్రులు స్పందించారు. To witness and spread the word about post-Article 370 developments in Leh and Ladakh, Shri Rahul Gandhi himself has taken a trip to the valley. We are elated and delighted to watch glimpses of his road trip. pic.twitter.com/X0mC18C40j — Pralhad Joshi (@JoshiPralhad) August 19, 2023 ఇదీ చదవండి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి -
కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మరునాడే అవార్డులు వస్తున్నాయి: సీఎం కేసీఆర్
సాక్షి, వరంగల్: అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైద్య విద్య కోసం రష్యా చైనా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలోనే వైద్య విద్య చదివేందుకు సరిపడా సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో అయిదు కాలేజీలు ఉండగా.. కొత్తగా 12 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని తెలిపారు. హరీశ్‌రావు సారథ్యంలో ఇది సాధ్యమైందన్న కేసీఆర్.. త్వరలోనే జిల్లాకొక మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. కేంద్ర మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను, మంత్రులను తిట్టిపోతారని, కేంద్ర మంత్రులు వచ్చి తిట్టిపోయిన మరునాడే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని తెలిపారు. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల అండతో ఉద్యమం సాగించి, రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్డీపీ ఎక్కువగా ఉంది. పరిశుభ్రత, పచ్చదనంతో పాటు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాము. తెలంగాణ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం ఉంది. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు పని చేస్తున్నాం. ఆరోగ్యం రంగంలో కూడా అద్భుతాలు సాధించాం. మరిన్ని విజయాలు సాధించాలి. తెచ్చుకున్న తెలంగాణ దేశానికే ఒక మార్గదర్శకంగా మారింది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు -
కేంద్రమంత్రులకు సీఎం జగన్ లేఖలు
సాక్షి, అమరావతి: వంట నూనెలకు కొరత నెలకొన్న నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు లేఖలు రాశారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు కొరత ఏర్పడినందున ఆవ నూనె దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సన్‌ఫ్లవర్ మాదిరిగా ఉండే ఆవాల నూనె కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ప్రస్తుతం ముడి ఆవ నూనెపై 38.5 శాతం, శుద్ధి చేసిన ఆవనూనెపై 45 శాతం దిగుమతి సుంకం ఉందన్నారు. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా మారినందున వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాది పాటు ఆవనూనెపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని లేఖలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 60 శాతం విదేశాల నుంచే.. 2021–22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి జరిగిందని, 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 95 శాతం పామాయిల్ ఇండోనేషియా, మలేషియాల నుంచి దిగుమతి అవుతుండగా ఉక్రెయిన్, రష్యా నుంచి 92 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి జరుగుతోందని తెలిపారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడి ఆ ప్రభావం వినియోగదారులపై పడిందన్నారు. ఫలితంగా సన్‌ఫ్లవర్‌తో పాటు ఇతర వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయన్నారు. విస్తృత తనిఖీలు.. టాస్క్‌ఫోర్స్ రాష్ట్రంలో మూడింట రెండొంతుల మంది సన్‌ఫ్లవర్‌నే వినియోగిస్తుండగా పామాయిల్‌ను 28% మంది, వేరుశనగ నూనెను 4.3% మంది వాడుతున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఇబ్బంది లేకుండా, కృత్రిమ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందన్నారు. విజిలెన్స్, పౌరసరఫరా, తూనికలు కొలతల శాఖలు విస్తృతంగా తనిఖీలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. కొరత లేకుండా వంటనూనెల సరఫరా, రోజువారీ ధరలు సమీక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ ఆయిల్‌ఫెడ్ ద్వారా రైతు బజార్లలో సరసమైన ధరలకే నూనెలను విక్రయిస్తున్నామన్నారు. చదవండి: మడకశిరకు వైఎస్ జగన్ మరో వరం -
‘పెండింగ్’పై పట్టు.. పలువురి కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధికి కీలకమైన పలు పెండింగ్ ప్రాజెక్టులపై ఢిల్లీ పర్యటనలో తొలిరోజు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని ఆంధ్రప్రదేశ్ పురోగతికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, యువత నైపుణ్యాలకు పదునుపెట్టి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించే స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, సమాచార, ప్రసారశాఖతో కలసి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు వ్యవసాయ రంగంలో విజ్ఞానాన్ని పంచడం, మహా నగరాలుగా విస్తరిస్తున్న విజయవాడ, విశాఖలో రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. రాష్ట్రంలో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను పెంపొందించే నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థల పనులను వేగవంతం చేయాలని, ఇప్పటికీ చాలా చోట్ల తాత్కాలిక ఏర్పాట్లతోనే కొనసాగుతున్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయం పనులను వెంటనే ప్రారంభించి నిధులివ్వాలన్నారు. గడ్కరీకి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ రెండో రోజు పర్యటనలో భాగంగా జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర మంత్రులకు తిరుమల శ్రీవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. విశాఖ పోర్టు – భోగాపురం జాతీయ రహదారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కలుసుకుని సుమారు గంట సేపు సమావేశమయ్యారు. రాష్ట్రానికి పలు జాతీయ రహదారులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ నగరంలో వాహనాల రద్దీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారి నిర్మించాలని కోరారు. విశాఖ పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి నిర్మాణానికి డీపీఆర్ తయారీపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి ఎంతో ప్రయోజనమని, విశాఖ పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే సరకు రవాణా వాహనాలకు దూరాభారం తగ్గుతుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలోని బీచ్ కారిడార్ ప్రాజెక్టుల సమీపం నుంచి ఈ రహదారి వెళ్తుందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకోవడానికి, పర్యాటక రంగం అభివృద్ధికి ఈ రహదారి ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనల పట్ల గడ్కారీ సానుకూలంగా స్పందించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి గడ్కారీ విజయవాడలో బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉందని గడ్కారీకి సీఎం జగన్ తెలియచేశారు. జనవరి మూడో వారంలో నితిన్ గడ్కారీ రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉందని, విజయవాడ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. భోగాపురం జాతీయ రహదారిపై డీపీఆర్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను గడ్కారీ çఆదేశించినట్లు తెలిసింది. బెజవాడ బైపాస్కు మినహాయింపులు విజయవాడ తూర్పు బైపాస్కు సంబంధించి సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, ప్రాజెక్టు ఖర్చు తగ్గించడంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బాపట్ల రహదారిని విస్తరించాలి కత్తిపూడి – ఒంగోలు కారిడార్‌లో భాగంగా ఎన్‌హెచ్–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో రహదారిని విస్తరించాలని సీఎం జగన్ కోరారు. విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్‌బేస్ కారణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రస్తుతం బాపట్ల ద్వారా వెళ్తున్న రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని నితిన్ గడ్కారీకి విజ్ఞప్తి చేశారు. అనురాగ్ ఠాకూర్‌కు శ్రీవారి ప్రసాదం అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్ క్రీడా మైదానాలపై ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌కు ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. సుమారు అరగంట సేపు కేంద్రమంత్రితో పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. అన్నదాతలకు గ్రామాల్లోనే అన్ని సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని పంచే విషయంలో సమాచార, ప్రసార శాఖ సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు. నైపుణ్యాభివృద్ధికి సహకరించండి.,. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలుసుకుని విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలపై సీఎం జగన్ చర్చించారు. గిరిజన విశ్వవిద్యాలయం స్థలం మార్పిడికి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. సాలూరు సమీపంలో నిర్మించనున్న గిరిజన విశ్వవిద్యాలయం పనులను వెంటనే ప్రారంభించి నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరాలను ఈ సందర్భంగా తెలియచేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టోపీని అనురాగ్ ఠాకూర్ సీఎం జగన్‌కు బహూకరించారు. తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్ ఢిల్లీలో రెండు రోజుల పాటు సాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ముగిసింది. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం సీఎం జగన్ మంగళవారం సాయంత్రం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. -
1,950కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి లేఖ రాశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో రూ.9,749 కోట్లతో పట్టణాభివృద్ధి చేపట్టనున్నామని, ఇందులో 20% కేంద్రం వాటాగా బడ్జెట్లో రూ.1,950 కోట్లు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాలు, హౌసింగ్ మంత్రి హర్దీప్సింగ్ పూరి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ ఏరియా పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని, నగర భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు మురుగునీటి ప్రవాహ వ్యవస్థను అభివృద్ధి చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సీవరేజి మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రణాళిక, సర్వే, డిజైన్, అంచనాల తయారీని పూర్తి చేసిందని, మూడు ప్యాకేజీల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చదవండి: (అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు) డీపీఆర్‌లు సిద్ధం సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు, మురుగునీటి ట్రంక్ లైన్ల ఏర్పాటు పనులకు డీపీఆర్‌లు సిద్ధం చేశామని కేటీఆర్ తెలిపారు. సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు(ఎస్టీపీ), సీవరేజ్ కలెక్షన్ నెట్వర్క్ ట్రంక్, సివర్ లైన్ల నెట్వర్క్ మొత్తం 2,232 కిలోమీటర్ల మేర ఉంటుందని, రూ. 3722 కోట్లతో 36 నెలల్లో ఈ పనులు పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్లో కనీసం 20 శాతం వాటాగా రూ.750 కోట్లను ఈ పనులకు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌లో వరదలు ముంచెత్తడానికి ప్రధాన కారణమైన నాలాల అభివృద్ధికి రూ.1,200 కోట్ల అంచనాలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, దీనికి రూ.240 కోట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ నియో మెట్రో రైలుకు రూ.210 కోట్లు వరంగల్ నగరంలో నియో మెట్రో రైల్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. 15 లక్షలున్న వరంగల్ జనాభా 2051 నాటికి 35 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు. వరంగల్ నియో మెట్రో డీపీఆర్ సిద్ధం అయిందని, సుమారు 15.5 కిలోమీటర్ల ఉండే వరంగల్ మెట్రో కారిడార్‌కి రూ.1,050 కోట్ల ఖర్చు అవుతుందని, కేంద్రం వాటాగా రూ.210 కోట్లను ఈక్విటీ లేదా గ్రాంట్ రూపంలో కేటాయించాలని కోరారు. చదవండి: (నేర, మావో రహిత తెలంగాణే లక్ష్యం) డ్రైనేజి పనులకు రూ.750 కోట్లు కేటాయించండి ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని 57 పురపాలికల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు చేపట్టేందుకు రూ.13,228 కోట్లు అవసరమవుతాయని, తొలి దశలో 30 పట్టణాల్లో రూ.2,828 కోట్లతో పనులు చేపట్టనున్నామని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. పురపాలికల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనుల కోసం రూ.258 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. వివిధ పురపాలికల్లో పేరుకుపోయిన 70 లక్షల మెట్రిక్ టన్నుల లెగసి డంప్‌ను రూ.520 కోట్లతో బయో మైనింగ్, రెమేడియేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లకు సంబంధించి రూ.250 కోట్లతో ఇప్పటికే 76 పురపాలికల్లో పనులు పూర్తయ్యాయన్నారు. వచ్చే ఏడాది రూ.3,777 కోట్లతో పురపాలికల్లో వివిధ పనులు చేపట్టనున్నామని, కనీసం 20 శాతం వాటాగా రూ.750 కోట్లను కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని పేర్కొన్నారు. -
ప్రభుత్వం దిగిరాకపోతే భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. కొత్త వ్యయసాయ చట్టాలపై ఐదో సారి జరుగుతున్న చర్చలివి. కొత్త వ్యయసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం సమ్మతం కాదంటున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈనెల 8వ తేదీన భారత్ బంద్ చేపట్టాలని నిర్ణయించారు. ( వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారిన పడ్డ మంత్రి! ) కాగా, రైతులతో ప్రభుత్వం చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్‌తో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రైతుల డిమాండ్ల గురించి కేంద్ర మంత్రులు మోదీతో చర్చించారు. నూతన వ్యవసాయ చట్టాల పట్ల అన్నదాతల అభ్యంతరాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇచ్చే అవకాశం ఉంది. విద్యుత్ బిల్లులపై రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే యోచన చేస్తోంది. -
వారిని స్వదేశానికి తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ గురువారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోందని, ఇందులో భాగంగా అనేక మంది తెలంగాణవాసులను స్వదేశానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయితే గల్ఫ్ దేశాల్లో సుమారు 10 లక్షల మంది తెలంగాణవాసులు పని చేస్తున్నారని, వారిలో బతుకుదెరువు కోసం వలస వెళ్లినవారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారంతా స్వదేశానికి రాలేక గల్ఫ్‌లోనే చిక్కుకుపోయి దీనావస్థలో ఉన్నారని తెలిపారు. దీంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా తక్షణమే మస్కట్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని కోరారు. లేఖలను ఈమెయిల్ ద్వారా కేంద్ర మంత్రులకు పంపించారు. -
సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన క్రిసిల్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్క్లేవ్–2019 సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పౌరులకు మౌలికసదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఆయన వివరించారు. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు ఇన్నొవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూషన్ (3–ఐ) విధానం అవలంబిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1.05 లక్షల కి.మీ పైప్‌లైన్ నిర్మాణంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటి సరఫరాకు రూ.45 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 68 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 26 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని, అందులో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరం అని వివరించారు. గత ఐదేళ్లలో 7 వేల కి.మీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచామని, 2.83 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, ఇందులో 1.67 లక్షలు పట్టణ ప్రాంతాల్లో నిర్మించామని తెలిపారు. 10 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టామని వివరించారు. మెగా టెక్స్టైల్ పార్కుకు సాయం చేయండి.. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు గ్రాంట్ సహకారం అందించాల్సిందిగా కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని మంత్రి కేటీఆర్ కోరారు. మంగళవారం ఆమె కార్యాలయంలో కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే 14 పెద్ద సంస్థలతో రూ.3,020 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. కామన్ ఎఫ్లుయెంట్ ప్లాంట్(సీఈటీపీ) ఏర్పాటు ప్రతిపాదనలకు సంబంధించి రూ.897 కోట్ల నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. అలాగే సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేసి దానికి అవసరమైన రూ. 49.84 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఫార్మాసిటీకి సహకరించండి హైదరాబాద్ ఫార్మా సిటీకి అవసరమైన సహకారం అందించాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. కేంద్ర మంత్రిని కలసిన కేటీఆర్.. ఫార్మా సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి రావాల్సిన అనుమతిలిచ్చి సహకరించాలని కోరారు. కాగా, టీఆర్ఎస్ ఎంపీలను పార్లమెంట్‌లోని పార్టీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద రాష్ట్రానికి నిధులు సాధించడంపై చర్చించారు. -
సంపన్న మంత్రి ఆమే; ఆస్తి ఎంతంటే!?
న్యూఢిల్లీ : కేంద్రంలో వరుసగా రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా మరో 57 మంది కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మోదీ 2.0 కేబినెట్‌గా పిలుచుకుంటున్న ఈ మంత్రివర్గంలో దాదాపు 39 శాతం నేర చరిత్ర గలవారేనని.. ఎన్నికల సమయంలో వారు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతోంది. వీటి ఆధారంగా మోదీ ప్రభుత్వంలోని 22 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా వెల్లడించారు. వీరిలో 16 మందిపై ఉగ్రవాదం, హత్య, అత్యాచారం, దొంగతనం, మత ఘర్షణలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కిడ్నాపింగ్, దేశద్రోహం తదితర తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఆ ఆరుగురు..వివాదాలకు కేరాఫ్! ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రులుగా చోటు దక్కించుకున్న ఆరుగురు నేతలపై మత విద్వేషాలను రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అమిత్ షా, ప్రతాప్ చంద్ర సారంగి, బాబుల్ సుప్రియో, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, ప్రహ్లాద్ జోషి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా.. భాష, జాతి, స్థానికత ఆధారంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యారనే కేసులు నమోదయ్యాయి. అదే విధంగా ఒక మతం గురించి అవమానకరంగా మాట్లాడరనే ఆరోపణల కింద ఐపీసీ సెక్షన్-295ఏ ప్రకారం వీరిపై కేసులు నమోదు చేశారు. చదవండి : కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు..ఎవరెవరికి ఏయే శాఖ అక్రమ చెల్లింపుల ఆరోపణలు.. ఇక కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖా సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే, పశుసంవర్థకం, పాడి, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌పై అక్రమ చెల్లింపులు, లంచం ఇవ్వజూపడం, ఎన్నికలను ప్రభావితం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీసీ సెక్షన్ 171హెచ్, 171ఈ, 171ఎఫ్ కింద కేసులు నమోదయ్యాయి. 51 మంది కోటీశ్వరులే... అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక ప్రకారం.. మోదీ జెంబో కేబినెట్లోని 91 శాతం అంటే 57 మందిలో 51 మంది మంత్రులు కోటీశ్వరులే. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ నిర్వహిస్తున్న హర్ సిమ్రత్ కౌర్ బాదల్ మంత్రులందరిలోనూ సంపన్నురాలిగా నిలిచారు. ఆమె మొత్తం ఆస్తి విలువ 217 కోట్ల రూపాయలు. కాగా రూ. 95 కోట్ల ఆస్తితో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సంపన్న మంత్రుల జాబితాలో రెండోస్థానంలో నిలిచారు. ఇక మోదీ కేబినెట్లోని మంత్రులందరి సగటు ఆస్తి విలువ రూ. 14.72 కోట్లుగా ఉంది. కాగా ఒడిశా మోదీగా గుర్తింపు పొందిన ప్రతాప్‌చంద్ర సారంగి అందరి కంటే తక్కువగా అంటే కేవలం రూ. 13 లక్షల ఆస్తి మాత్రమే కలిగి ఉన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం రెండోసారి ప్రధానిగా పదవి చేపట్టిన నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించారనే చెప్పవచ్చు. మోదీ కేబినెట్లో మొత్తంగా ఆరుగురు మహిళా మంత్రులు ఉన్నారు. మొత్తం 58 మందిలో 20 శాతం మంది అంటే 11 మంది మంత్రుల సగటు వయస్సు 41-50 సంవత్సరాలు. 45 మంది మంత్రులు 50- 70 ఏళ్లలోపు వయస్సు గలవారు. ఇక వీరందరిలో 84 శాతం మంది ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. -
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండో సారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తన సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. గురువారం ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాను తొలిసారి క్యాబినెట్లోకి తీసుకున్న మోదీ ఆయనకు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మల సీతారామన్‌కు ఈ సారి ఆర్థిక శాఖ కేటాయించారు. అయితే సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ, ఇతర పాలసీ సమస్యలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖల్ని ప్రధాని మోదీ వద్దే ఉండనున్నాయి. మంత్రులకు కేటాయించిన శాఖలు... సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి కేంద్రమంత్రులు... 1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి) 2. రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ శాఖ) 3. అమిత్ షా (హోం శాఖ) 4. నితిన్ గడ్కరీ (రోడ్లు, రవాణా శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ) 5. సదానంద గౌడ (ఎరువులు, రసాయన శాఖ) 6. నిర్మలా సీతారామన్ (ఆర్థిక శాఖ, కార్పొరేట్ అఫైర్స్) 7. రాంవిలాస్ పాశ్వాన్ (వినియోగదారుల వ్యవహారాల శాఖ ) 8. నరేంద్ర సింగ్ తోమర్ (వ్యవసాయ శాఖ, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్) 9. రవిశంకర్ ప్రసాద్ (న్యాయ శాఖ) 10. హర్సిమ్రత్ కౌర్ బాదల్ (ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ) 11. థావర్ చంద్ గెహ్లాట్ (సామాజిక న్యాయ శాఖ) 12. సుబ్రహ్మణ్యం జయశంకర్ (విదేశాంగ శాఖ) 13. రమేశ్ పోఖ్రియాల్ (మానవ వనరులు శాఖ) 14. అర్జున్ ముండా (గిరిజన వ్యవహారాల శాఖ) 15. స్మృతి ఇరానీ ( మహిళ శిశు సంక్షేమం, జౌళి శాఖ) 16. డాక్టర్ హర్షవర్థన్ (వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ) 17. ప్రకాశ్ జవదేకర్ (అటవీ, పర్యావరణ శాఖ, సమాచార ప్రసార శాఖ) 18. పీయూష్ గోయల్ (రైల్వే శాఖ) 19. ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం శాఖ) 20. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ (మైనారిటీ వ్యవహారాల శాఖ) 21. ప్రహ్లాద్ జోషీ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు గనుల శాఖ) 22. మహేంద్రనాథ్ పాండే (నైపుణ్యాభివృద్ధి శాఖ ) 23. అరవింద్ సావంత్ (భారీ పరిశ్రమల శాఖ) 24. గిరిరాజ్ సింగ్ (పాడి, పశుసంవర్ధక, ఫిషరీస్ శాఖలు) 25. గజేంద్ర సింగ్ షెకావత్ (జల శక్తి) సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1. సంతోష్ కుమార్ గాంగ్వర్ (శ్రామిక, ఉపాధి కల్పన శాఖ) 2. ఇంద్రజిత్ సింగ్ (ప్రణాళిక, గణాంక శాఖ) 3. శ్రీపాద యశో నాయక్ (ఆయుష్, డిఫెన్స్ శాఖ సహాయమంత్రి) 4. జితేంద్ర సింగ్ (సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, పెన్షన్లు, ఈశాన్య రాష్ర్టాల వ్యవహారాలు, పీఎంవో సహాయ మంత్రి) 5. కిరణ్ రిజిజు (క్రీడలు, యుజవన, మైనార్టీ వ్యవహారాలు) 6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ (సాంస్కృతిక పర్యాటక శాఖ) 7. రాజ్ కుమార్ సింగ్ (విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి) 8. హర్దీప్ సింగ్ పూరి (గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ) 9. మన్ సుఖ్ మాండవ్య (షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు) సహాయ మంత్రులు 1. ఫగ్గీన్ సింగ్ కులస్తే (ఉక్కు శాఖ) 2.. అశ్వినీ చౌబే (కుటుంబ, ఆరోగ్య శాఖ) 3. అర్జున్ రామ్ మేఘవాల్ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, భారీ పరిశ్రమలు) 4. జనరల్ వీకే సింగ్ (రోడ్లు, రహదారులు శాఖ) 5. కిృషన్ పాల్ గుజ్జర్ (సాధికారిత, సామాజిక న్యాయం) 6. దాదారావ్ పాటిల్ (పౌర, ప్రజా సరఫరాల శాఖ) 7. కిషన్ రెడ్డి (హోంశాఖ సహాయమంత్రి) 8. పురుషోత్తం రూపాలా (వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ) 9. రాందాస్ అథవాలే (సాధికారిత, సామాజిక న్యాయం) 10. సాధ్వీ నిరంజన్ జ్యోతి (గ్రామీణాభివృద్ధి శాఖ) 11. బాబుల్ సుప్రియో (అటవీ, పర్యావరణ శాఖ) 12. సంజీవ్ కుమార్ బాల్యాన్ (పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్) 13. దోత్రే సంజయ్ శ్యారావ్ (మానవ వనరుల శాఖ,ఐటీ శాఖ) 14. అనురాగ్ సింగ్ ఠాకూర్ (ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ) 15. సురేష్ అంగాడి ( రైల్వేస్) 16. నిత్యానంద్ రాయ్ (హోంశాఖ) 17. రత్తన్ లాల్ కఠారియా (జల శక్తి, సాధికారిత, సామాజిక న్యాయం) 18. వి.మురళీధరన్ ( పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశాంగ శాఖ) 19. రేణుకా సింగ్ (గిరిజన శాఖ) 20. సోమ్ ప్రకాశ్ (వాణిజ్య, పరిశ్రమలు శాఖ) 21. రామేశ్వర్ తెలి (ఫుడ్ ప్రాసెసింగ్) 22. ప్రతాప్ చంద్ర సారంగి (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధక శాఖ) 23. కైలాస్ చౌదరి (వ్యవసాయ శాఖ) 24. దేబశ్రీ చౌదురి (మహిళ శిశు సంక్షేమం) -
ఆ ముగ్గురికి కీలక శాఖలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన క్యాబినెట్లో మంత్రులకు శాఖలను కేటాయించారు. నెంబర్ టూగా వ్యవహరిస్తున్న అమిత్ షాకు హోంశాఖను కేటాయించారు. కీలక ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్‌కు కట్టబెట్టారు. ఇక రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ మంత్రిత్వ శాఖను కేటాయించారు. గత మోదీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన అరుణ్ జైట్లీ అనారోగ్య కారణంతో మంత్రి పదవిని చేపట్టలేనని ప్రధానికి స్పష్టం చేసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖను అప్పగించారు. ఇందిరా గాంధీ తర్వాత ఆమే.. ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ నిర్మలా సీతారామన్ కావడం గమనార్హం. 1969-70ల్లో కొద్ది కాలం ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిత్వ శాఖనూ చేపట్టారు. ఇక 2017లో మోదీ క్యాబినెట్లో కేంద్ర రక్షణశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. దేశ రక్షణశాఖను నిర్వహించిన తొలి మహిళాగా ఖ్యాతికెక్కారు నిర్మలాసీతారామన్. ఆ శాఖ బాధ్యతలను ఏడాదిన్నరపాటు నిష్కళంకంగా.. సమర్థంగా నిర్వహిస్తూ మోదీ ప్రశంసలు అందుకున్నారు. రఫేల్ ఒప్పందంపై ప్రతిపక్షనేత రాహూల్‌గాంధీ తీవ్రస్థాయిలో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డ సందర్భంలో నిర్మలాసీతారామన్ పార్లమెంటులో మోదీకి వెన్నుదన్నుగా తన వాణిని వినిపించారు. కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన జవానులను మట్టుపెట్టిన తరువాత, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నేపథ్యంలో నిర్మలాసీతారామన్ పనితీరుపై ప్రశంసలు వచ్చాయి అమిత్ షాకు అందలం బీజేపీ చీఫ్‌గా లోక్‌సభ ఎన్నికల్లో మోదీతో పాటు పార్టీ అఖండ విజయానికి బాటలు పరిచిన అమిత్ షా తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా పలు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ట్రబుల్ షూటర్‌గానూ ఆయన పేరొందారు. బీజేపీ ఉనికిలేని రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణకు వ్యూహాలకు పదునుపెట్టడంలో అమిత్ షా ఆరితేరారు. మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. ఒకానొక దశలో అమిత్ షా గుజరాత్ మంత్రిగా పలు పోర్ట్పోలియాలను నిర్వహించారు. స్టాక్ మార్కెట్ బ్రోకర్ నుంచి అంచెలంచెలుగా ఆయన అత్యున్నత స్ధాయికి చేరుకున్నారు. విధేయతకు పట్టం ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గత క్యాబినెట్లో హోంశాఖను సమర్ధంగా నిర్వహించిన అనుభవం ఉంది. సీనియర్ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీ సన్నిహితుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. గతంలో యూపీ ముఖ్యమంత్రిగా, బీజేపీ చీఫ్‌గానూ వ్యవహరించిన రాజ్‌నాథ్ సింగ్‌కు పార్టీ దిగ్గజ నేతలతో పాటు ఆరెస్సెస్ అగ్ర నేతలతోనూ విస్తృత పరిచయాలున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయతీరాలకు చేరాలంటే మోదీ నాయకత్వం అవసరమంటూ ఎల్కే అద్వాణీ సహా పార్టీ కురువృద్ధులను ఒప్పించడంలో రాజ్‌నాథ్ కీలక పాత్ర పోషించారు. -
తెలంగాణను చుట్టుముట్టిన కమలదళం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. దీనిలో భాగంగానే నేడు పలువురు కేంద్రమంత్రులు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌లను ప్రచారం కొరకు రంగంలోకి దింపింది. బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కేంద్రమంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి ప్రచారం చేయనున్నారు. అలాగే అంబర్‌పేటలో పురుషోత్తం రూపాల, ఆసీఫాబాద్, మంచిర్యాల, ఇల్లందు, కొత్తగూడెంలో కేంద్రమంత్రి జువల్ ఓరం పర్యటించనున్నారు. భద్రాచలం, ఖైరతాబాద్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి సైతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆమె పటాన్చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. కాగా ఈ ఎన్నికలను కాంగ్రెస్, టీఆర్ఎస్తో సహా బీజేపీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విజయం సాధించిన స్థానాలను అయినా తిరిగి నిలబెట్టుకోవాలని కమలదళం ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలని, ప్రధాని మోదీ సహా, అమిత్‌షా కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మోది ఇప్పటికే తొలి విడత ప్రచారం ముగించుకోగా, రెండో విడత ప్రచారంలో కోసం బీజేపీ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. -
మంత్రుల అవినీతిని బయటపెట్టండి
న్యూఢిల్లీ: 2014–17 మధ్యకాలంలో కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఫిర్యాదులను, వారిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని ముఖ్య సమాచార కమిషనర్ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సంజీవ్ చతుర్వేది పిటిషన్ మేరకు సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాధుర్ పీఎంవోకు పైవిధంగా సూచించారు. మోదీ ప్రధాని అయిన తరువాత విదేశాల నుంచి రప్పించిన నల్లడబ్బుపై పూర్తి సమాచారం ఇవ్వాలని, రప్పించిన నల్లధనం దేశప్రజల బ్యాంకు ఖాతాల్లో ఎంత డిపాజిట్ చేశారో కూడా వెల్లడించాలని ఆయన పీఎంవోను ఆదేశించారు. సంజీవ్ చతుర్వేది గతంలోనే సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి పై విషయాలపై దరఖాస్తు చేసుకున్నారు. అయితే నల్లధనం ‘సమాచారం’ కిందకు రాదని ఆయన దరఖాస్తును ప్రధాని కార్యాలయ వర్గాలు తిరస్కరించాయి. అయితే సమాచార కమిషనర్ ఈ వాదనను కొట్టిపారేశారు. దరఖాస్తుదారుడు తప్పుగా దరఖాస్తు చేశారనడంలో వాస్తవం లేదని, పీఎంవో వాదన సరికాదని ఆయన తేల్చిచెప్పారు. -
తుడిచిపెట్టుకుపోయిన మలిదశ
న్యూఢిల్లీ: పార్లమెంట్ మలి దశ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. సమావేశాల చివరి రోజూ లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. మొదటి రోజు నుంచి ఏపీకి ప్రత్యేక హోదా, బ్యాంకింగ్ కుంభకోణాలు, కావేరీ బోర్డు ఏర్పాటు, తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంపు తదితర అంశాలపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించాయి. రెండో దశలో ఉభయ సభలు 22 సార్లు సమావేశం కాగా ఒక్కరోజు కూడా కార్యకలాపాలు సాగలేదు. బడ్జెట్ సమావేశాల రెండు దశల్లోను లోక్‌సభ 29 సార్లు, రాజ్యసభ 30 సార్లు సమావేశం కాగా.. ఉభయ సభల్లోను కలిపి 250 గంటల పనిదినాలు వృథా అయ్యాయి. సభలో కొన్ని పార్టీల ఆందోళనల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని కూడా లోక్‌సభ చర్చకు చేపట్టలేదు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకూ తొలి దశ సమావేశాలు సాగాయి. లోక్‌సభలో 127 గంటలు వృథా లోక్‌సభ నిరవధిక వాయిదాకు ముందు స్పీకర్ మహాజన్ మాట్లాడుతూ.. ‘బడ్జెట్ సమావేశాల రెండు విడతల్లోను సభ 29 సార్లు సమావేశమైంది. మొత్తం 34 గంటల 5 నిమిషాలు పనిచేయగా.. అంతరాయాలు, వాయిదాల వల్ల మొత్తం 127 గంటల 45 నిమిషాలు వృథా అయ్యాయి. మొత్తం 580 ప్రశ్నల్ని సభ్యులు లోక్‌సభ ముందుంచగా.. కేవలం 17 ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానమిచ్చారు’ అని చెప్పారు. గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు 2017, ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు 2017లు లోక్‌సభ ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. ‘ఈ రోజు చివరిరోజు.. సభ సజావుగా సాగేందుకు మీరు సిద్ధంగా లేకపోతే నిరవధికంగా వాయిదా వేస్తా. చర్చ జరిగేందుకు దయచేసి సహకరించండి’ అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభలో 121 గంటల వృథా రాజ్యసభలోను అదే పరిస్థితి కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను చైర్మన్ వెంకయ్య నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 30 సార్లు సమావేశం కాగా 44 గంటలపాటు సభా కార్యకలాపాలు కొనసాగాయని, 121 గంటల సమయం వృథా అయ్యిందని వెంకయ్య నాయుడు వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు వృథా కావడానికి కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ.. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కేంద్ర మంత్రులు ఆందోళన నిర్వహించారు. -
ప్రత్యేక హోదా రాష్ట్రాలకు టాక్స్ రీఫండ్..
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలు చెల్లించే టాక్స్‌ను తిరిగి ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రతాప్ శుక్లా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన రాజ్యసభలో మంగళవారం వెల్లడించారు. వైఎస్ఆర్ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2017 అక్టోబర్ 5న జారీ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) చేసిన ప్రకటన అనుగుణంగా ఈ వెసులుబాటు కల్పిస్తునట్లు మంత్రి తెలిపారు. గతంలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకం మినహాయింపుకు అర్హత పొందిన పరిశ్రమలకు ఇది వర్తిస్తుందన్నారు. ఆయా పరిశ్రమలు చెల్లించిన సెంట్రల్ టాక్స్, ఇంటిగ్రేటెడ్ టాక్స్ కింద చెల్లించే మొత్తాలతో కొంత శాతాన్ని బడ్జేట్ మద్దతు ద్వారా వాపసు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. జీఎస్టీ అమలు నుంచి స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు ఎలాంటి పన్ను ప్రోత్సహకాన్ని ప్రకటించలేదని మంత్రి స్పష్టం చేశారు. హోమియోపతి బూటకం కాదు.. హోమియోపతి బూటకం కాదని సహాయ మంత్రి యసో నాయక్ రాజ్యసభలో మంగళం తెలిపారు. ఈ వైద్య విధానంతో పద్ధతి ప్రకారం నిర్వహించిన అనేక సమగ్ర అధ్యయనాల సమీక్షల ద్వారా నిశ్చయమైన, నిర్ధిష్టమైన ఫలితాలు ఉంటాయన్నారు. రాజ్యసభలో వైఎస్ఆర్ నేత విజయసాయి రెడ్డి అగిడిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ.. అనేక రోగాలకు సంబంధించి హోమియోపతిలో లభించే వైద్య చికిత్సా విధానాలపై నాలుగు సిస్టమాటిక్/మెటా- అనాలిస్లు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితం అయినట్లు చెప్పారు. వీటిలో మూడు అధ్యయనాలపై వందలాది క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత హోమియోపతి క్లినికల్‌గా సమర్ధవంతమైన ఫలితాలు ఇచ్చినట్లు నిరూపితమైందన్నారు. హోమియోపతి చికిత్స సురక్షితమైనది, సమర్ధవంతమైనదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో హోమియోపతిపై అనేక హై క్వాలిటీ సర్వేలు నిర్వహించారు. దీంట్లో ఈ చికిత్సా విధానానికి ప్రజలలో అత్యధిక ఆమోదం ఉన్నట్లు వెల్లడైనందునే ప్రభుత్వం హోమియోపతిని పోత్సహిస్తున్నట్లు మంత్రి నాయక్ చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో 50 శాతం రోగులు హోమియో చికిత్స ద్వారా స్వస్థత పొందినట్లు మంత్రి తెలిపారు. -
కేంద్ర మంత్రుల రాకపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: మేడారానికి కేంద్ర మంత్రుల రాకపై అయోమయం నెలకొంది. జాతర శనివారంతో ముగియనున్నా.. మంత్రుల రాకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారి పర్యటన కొలిక్కి రాలేదు. మేడారం జాతరకు జాతీయహోదా ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గిరిజన శాఖ ఇదివరకే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా జాతరకు రావాల్సిందిగా కేంద్ర గిరిజన శాఖను ఆహ్వానించింది. ఈ క్రమంలో జాతరపై ఉత్సాహం చూపిన కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేస్తే మంత్రుల బృందంతో హాజరవుతామని చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వస్తే.. హైదరాబాద్ నుంచి జాతర జరిగే చోటుకు హెలికాప్టర్ ద్వారా వారిని చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యం కల్పించాలి. ప్రొటోకాల్ ప్రకారం అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వాస్తవానికి శుక్రవారమే కేంద్ర మంత్రులు బృందం రావాల్సి ఉంది. కానీ జాతరకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేదు. హెలికాప్టర్ పంపాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ మేరకు కేంద్ర గిరిజన శాఖకు సమాచారం ఇవ్వాలి. కానీ రాష్ట్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మేడారంలో వీఐపీల కోసం మూడు హెలిపాడ్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ మేడారం వెళ్లారు. భక్తులూ భారీ సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర మంత్రుల పర్యటన కుదరదని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. -
‘విరుద్ధ ప్రయోజనాల్లో’ దోవల్ కొడుకు!
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కుమారుడు శౌర్యకు చెందిన ఓ సంస్థలో నలుగురు కేంద్ర మంత్రులు డైరెక్టర్లుగా ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శౌర్యకు చెందిన ఇండియా ఫౌండేషన్ సంస్థలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, సురేశ్ ప్రభు, జయంత్ సిన్హా, ఎంజే అక్బర్లు సభ్యులుగా ఉన్నారని, ఇది పరస్పర విరుద్ద ప్రయోజనాలను పొందడమేనని ‘ది వైర్’ వెబ్సైట్ కథనం రాసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ స్పందిస్తూ..‘ అమిత్–జయ్ షాల ఎపిసోడ్ ఘన విజయం సాధించిన అనంతరం బీజేపీ ఇప్పుడు అజిత్ దోవల్– శౌర్యాల కథను కొత్తగా ప్రారంభించింది’ అని ట్వీటర్లో ఎద్దేవా చేశారు. ఈ కథనం పూర్తిగా నిరాధారమని ఇండియా ఫౌండేషన్ స్పష్టంచేసింది. నలుగురు వ్యక్తులు మంత్రులు కాకముందే తమ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారంది. తమ సంస్థ విశ్వసనీయత, గౌరవం, వారసత్వంపై జరుగుతున్న దాడిని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా ఫౌండేషన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న శౌర్య జెమినీ ఫైనాన్సియల్ సర్వీసెస్ అనే సంస్థను నిర్వహిస్తున్నారని ది వైర్ వెల్లడించింది. ఈ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఈసీఈడీ)సభ్యదేశాల నుంచి ఆసియా మార్కెట్లలోకి పెట్టుబడులు వచ్చేలా చూస్తుందని తెలిపింది. -
కేంద్ర మంత్రుల దృష్టికి రాష్ట్ర సమస్యలు
మంత్రి హరీశ్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు బుధవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను, పలు శాఖల కార్యదర్శులతో భేటీ అయ్యారు. అనంతరం వివరాలను విలేకరులకు వివరించారు. పత్తి కోనుగోలు కేంద్రాల పెంపు, పత్తికి మద్దతు ధర కల్పించేలా చొరవ చూపాలని కేంద్ర జౌళి మంత్రి స్మృతి ఇరానీని కోరినట్టు తెలిపారు. ‘‘తెలంగాణలో ఈ ఏడు పత్తి అదనంగా మరో 5 లక్షల హెక్టార్లలో సాగవనుంది. కనుక దాదాపు 143 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరాం. గతేడాది 85 కొనుగోలు కేంద్రాలు పెట్టడంతో పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని మంత్రికి వివరించాం. మెదక్, నల్లగొండ, ఆలేరు, సూర్యపేటల్లోని సీసీఐ సబ్ సెంటర్లను వరంగల్‌కు మార్చాలని విజ్ఞప్తి చేశాం. ఈ నెల 15న తెలంగాణలో పర్యటించాల్సిందిగా జౌళి శాఖ కార్యదర్శి అనంత్ కుమార్ సింగ్‌ను ఇరానీ ఆదేశించారు. రాష్ట్రానికొచ్చే అధికారుల బృందంతో అన్ని అంశాలపైనా చర్చిస్తాం. వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో నాలుగు అంశాలపై చర్చించాం. పెసలకు మద్దతు ధర కల్పించాలని, మద్దతు ధర విధానంలో మార్పులు తెచ్చి తెలంగాణ రైతులను ఆదుకోవాలని కోరాం. రాష్ట్రవ్యాప్తంగా 58 ఈ–నామ్ సెంటర్లను కేటాయించారు. ఒక్కోదానికి రూ.75 లక్షలు రావాల్సి ఉండగా రూ.30 లక్షలే విడుదల చేశారు. మిగతా బకాయిలను విడుదల చేయాలని, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాలకు కొత్తగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరాం. గోదాముల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రానికి బకాయి ఉన్న రూ.132 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యావరణ, అటవీ అనుమతులపై అటవీ శాఖల కార్యదర్శి అజయ్నారాయణ ఝాతో చర్చించాం. కాళేశ్వరం తొలి దశ అనుమతుల మంజూరు ఆలస్యమవుతోందని చెప్పాం. వచ్చే సోమవారం ఉన్నత స్థాయి భేటీ నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ వెంటనే తొలి దశ అనుమతులొస్తాయి’’ అని మంత్రి వివరించారు. భేటీల్లో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొత్త మంత్రులకు వైఎస్ఆర్ సీపీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలియచేసింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఢిల్లీలో వారిని కలుసుకొని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు రాజ్ కుమార్ సింగ్, అల్ఫాన్స్, వీరేంద్ర కుమార్, అనంతకుమార్ హెగ్డే, గజేంద్రసింగ్ షేఖావత్, సత్యపాల్ సింగ్,శివ ప్రతాప్ శుక్,అశ్వినికుమార్ చౌబే తదితరులను విజయసాయి రెడ్డి కలిశారు. దేశ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలకు వైఎస్ఆర్ సీపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అఖిలమ్మ.. ఇదేంటమ్మా!
– నేరుగా ఫోన్ చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు – అందరితో సఖ్యతగా ఉండాలని హితవు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై ఆ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రికి కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా బుధవారం ఫోన్ చేసినట్టు సమాచారం. అందరితో సఖ్యతగా ఉండి.. కలిసి మెలిసి పనిచేసుకుపోకుండా ఒంటెద్దుపోకడలు సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. ప్రధానంగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డితో పాటు నంద్యాల మునిసిపాలిటీలోని మొత్తం కౌన్సిలర్లు పార్టీ మారడం.. మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరడం ప్రారంభమయ్యింది. అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా పార్టీ మారడంతో నంద్యాల నియోజకవర్గంలో మెజార్టీగా టీడీపీ ఖాళీ కావడం అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. పదే పదే కలిసి వెళ్లాలని.. స్వయంగా సీఎం స్థాయిలో చెప్పినప్పటికీ అందుకు భిన్నంగా మంత్రిగా ఉండి గొడవలు పెంచడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. నంద్యాల సీటు విషయంలో పదే పదే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తం మీద అధికార పార్టీలో శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పీఏ వ్యవహారశైలిపై ఆరా నంద్యాల రాజకీయాలతో పాటు మంత్రి పీఏ వ్యవహరశైలిపైనా అధికార పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నీరు–చెట్టు పనులతో పాటు ఇతర నామినేషన్ పనుల విషయంలో పీఏ భారీగా అమ్యామ్యాలు తీసుకున్నట్టు ఆరోపణలు నేరుగా సీఎంకు వెళ్లినట్టు సమాచారం. ఇక ఉద్యోగుల బదిలీల విషయంలో భారీగా మంత్రి నుంచి సిఫారసు లేఖలు పోవడం ఏకంగా సీఎం చంద్రబాబు వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక భూమా నాగిరెడ్డికి ఆప్తమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని కూడా ఎందుకు కలుపుకుని వెళ్లడం లేదన్న అంశంపైనా మంత్రిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద శిల్పా మోహన్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
మీరంతా ఎక్కడికెళ్లారో చెప్పండి: ప్రధాని
-
మీరంతా ఎక్కడికెళ్లారో చెప్పండి: ప్రధాని
గడిచిన మూడు నెలల్లో కేంద్ర మంత్రులంతా ఎక్కడెక్కడకి వెళ్లారో ఆ వివరాలన్నీ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశించారు. పెద్దనోట్ల రద్దు తదితర ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా వాళ్లు ఏమైనా ప్రచారం చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకోడానికే ఈ వివరాలు కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన మంత్రులకు ఈ విషయం చెప్పారు. సోమవారానికల్లా మొత్తం వివరాలన్నీ ఇవ్వాలని మోదీ ఆదేశించారు. ఈ వివరాలను అందరు మంత్రుల నుంచి తీసుకుని ప్రధానికి సమర్పించాల్సిన సమన్వయ బాధ్యతలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు అప్పగించారు. గత మూడు నెలల్లో ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏం చేశారన్న వివరాలు చెప్పాలని, ఒకవేళ ఢిల్లీలోనే ఉండి ఎక్కడకూ వెళ్లకపోతే తమ మంత్రిత్వశాఖ కార్యాలయాలకు వెళ్లారో లేదో కూడా చెప్పాలని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పెద్దనోట్ల రద్దుకు మద్దతుగా ప్రచారం చేశారో లేదో తెలుసుకోవాలని ప్రధాని భావిస్తున్నారని, అదే సమయంలో వాళ్లు ఆఫీసు పని, క్షేత్రస్థాయిలో విధుల మధ్య సమన్వయం ఎలా చేసుకుంటున్నారో చూస్తారని అంటున్నారు. దీంతో మొత్తమ్మీద కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవాళ్లలో ఎవరెవరు ఏమేం చేశారన్న వివరాలను ప్రధాని సమీక్షిస్తారని తేలిపోయింది. -
ఎస్సీలను వర్గీకరించవద్దు
కేంద్ర మంత్రి గెహ్లాట్, ఏచూరిలకు మాల మహానాడు వినతి న్యూఢిల్లీ: ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మాలల కంటే మాదిగలే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ వద్దని కోరుతూ కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు వినతిపత్రాలు సమర్పించారు. సుప్రీంకోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తీర్పులను గౌరవించి వర్గీకరణకు సహకరించవద్దని వారిని కోరారు. మనువాదులతో కుమ్మకై దళితులను చీల్చే కుట్ర: రామూర్తి ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ మనువాదులతో కుమ్మకై దళితులను చీల్చే కుట్ర పన్నుతున్నారని తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పసుల రామూర్తి విమర్శించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. అగ్రవర్ణ నాయకులకు దళితులపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం ద్వారా వచ్చే ఫలాలను వారికి అందేలా చూడాలని కోరారు. -
మేనకాగాంధీ వర్సెస్ జవదేకర్
జంతు వధపై కేంద్ర మంత్రుల మధ్య రచ్చ * పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయాన్ని తప్పుబట్టిన మేనక * రాష్ట్రాల విజ్ఞప్తి మేరకే చంపామన్న జవదేకర్ న్యూఢిల్లీ: జంతు వధ ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య వివాదానికి కారణమైంది. అరుదైన జంతువులను చంపే విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగింది. ఇటీవల బిహార్‌లో 200 అరుదైన బ్లూబుల్స్ (నీల్గాయ్)ను కాల్చి చంపిన నేపథ్యంలో ఈ అంశంపై జంతువుల హక్కుల ఉద్యమకర్త అయిన మేనక తీవ్రంగా స్పందించారు. దీనిని అతిపెద్ద ఊచకోతగా అభివర్ణించిన ఆమె.. కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి జంతువులను చంపేందుకు ఒక జాబితా తయారు చేస్తే తాము అందుకు అనుమతిస్తామని కోరిందని ఆరోపించారు. జంతువులను చంపాలనే పర్యావరణ శాఖ ఆరాటం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఇది సిగ్గు పడాల్సిన విషయమని ఆమె చెప్పారు. బిహార్‌లో నీల్గాయ్లు, పశ్చిమబెంగాల్లో ఏనుగులు, హిమాచల్ ప్రదేశ్‌లో కోతులు, గోవాలో నెమళ్లు, చంద్రపూర్‌లో అడవి పం దుల సంహారానికి కేంద్రం అనుమతిచ్చిం దని ఆరోపించారు. అయితే పర్యావరణ శాఖ నిర్ణయాన్ని ఆ శాఖ మంత్రి జవదేకర్ సమర్థించుకున్నారు. పంటలు, ఆస్తుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే జంతు సంహారానికి అనుమతి ఇచ్చామని, దీనిని నిర్ధిష్ట ప్రాంతాలకు, నిర్ధిష్ట కాల వ్యవధికే పరిమితం చేశామని చెప్పారు. రైతుల పొలాలు ధ్వంసమవుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదన పంపితే అప్పుడే తాము అనుమతి ఇస్తామని చెప్పారు. మంత్రుల మధ్య మాటల యుద్ధంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.మోదీ ప్రభుత్వంలో టీమ్ వర్క్ అనేదే లేదని ఎద్దేవా చేశాయి. వివిధ శాఖల మధ్య వివాదాలు ఇదే తొలిసారి కాదని, టీమ్ వర్క్ లేకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయని జేడీయూ, ఎన్సీపీ విమర్శించాయి. -
'రుణమాఫీని అలవాటు చేయడం సరికాదు'
నెల్లూరు: రుణమాఫీ హామీపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలకు రుణమాఫీ అలవాటు చేయడం సరికాదన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శనివారం మాట్లాడుతూ.. రుణమాఫీలతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందన్నారు. జీఎస్టీ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించేలా చేస్తామని వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రతి జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరులో త్వరలోనే జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ క్లస్టర్ ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. -
కేంద్రమంత్రులతో భేటికానున్న కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం ఢీల్లీ బయలు దేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా రేపు(మంగళవారం) పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు. -
స్టార్టప్‌లకు పేటెంట్ ఫ్రీ
మరిన్ని నిబంధనలు సడలించే యోచనలో సర్కారు న్యూఢిల్లీ: వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రారంభించే యువ వ్యాపారవేత్తలకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. వ్యాపారవేత్తల ఉత్పత్తులకు, ఆలోచనలకు ఇవ్వాల్సిన పేటెంట్, ట్రేడ్‌మార్క్, డిజైన్‌పై పేటెంట్ హక్కుకు పెట్టుకునే దరఖాస్తు ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. స్టార్టప్‌లు కేవలం చట్టపరంగా చెల్లించాల్సిన రశీదు చెల్లిస్తేసరిపోతుంది. మిగతాదంతా ప్రభుత్వమే చూసుకుంటుందని..ప్రభుత్వం విడుదల చేసిన కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసింది. ఇందుకోసం కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రేడ్‌మార్క్ నేతృత్వంలో ఓ ప్యానెల్‌ను కేంద్రం ఏర్పాటుచేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వ్యాపారుల హక్కులను కాపాడటంతోపాటు మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెరుగుతుందని జాతీయ మేధో సంపత్తి సంస్థ (ఎన్ఐపీఓ) అధ్యక్షుడు టీసీ జేమ్స్ తెలిపారు. స్వచ్ఛభారత్‌పై సెక్రటరీల ప్రజెంటేషన్ పాలనలో మార్పుకోసం పలువురు ఉన్నతస్థాయి అధికారులతో ఏర్పాటుచేసిన సెక్రటరీల బృందాలు నాలుగు ఆదివారం ప్రధాని మోదీకి ‘స్వచ్ఛభారత్, శిక్షిత్ భారత్’పై ఐడియాలను అందజేశాయి. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చేసేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ వివిధ విభాగాల అధికారులతో ఎనిమిది సెక్రటరీల బృందాలను ప్రధాన మంత్రి ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. -
మంత్రులతో హరీశ్‌రావు భేటీ
-
కేంద్రమంత్రులతో రేపు చంద్రబాబు భేటీ
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి డా. మహేష్ శర్మలతో ఆయన భేటీ కానున్నారు. -
కొల్లేరు పై ఏరియల్ సర్వే చేసిన కేంద్ర మంత్రులు
కైకలూరు (పశ్చిమ గోదావరి) : కొల్లేరు సమస్యలపై 15 రోజుల్లో అధ్యయనం చేసి పూర్తి వివరాలు అవగాహన చేసుకుంటానని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి శుక్రవారం ఆయన హెలికాప్టర్లో కొల్లేరులో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోటలో సభావేదికపై జవదేకర్ మాట్లాడుతూ.. కొల్లేరు అంశం సుప్రీంకోర్టు ఎంపవర్ట్ కమిటీ అధీనంలో ఉందన్నారు. మరో 15 రోజుల్లో కొల్లేరులో ప్రజలు, పక్షులు అనే రెండు కోణాలను పరిశీలిస్తానన్నారు. బీజేపీకి 12 ఏళ్లుగా గొంతుకగా పనిచేశానని, కొల్లేరు ప్రజల తరఫున సుప్రీంకోర్టులో అదే విధంగా పనిచేస్తానన్నారు. విదేశాల నుంచి పక్షుల వలసలు వస్తాయి కానీ, ఇక్కడి ప్రజలు అక్కడికి వలసలు పోలేరన్నారు. మరో మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కొల్లేరు అంశం చట్టపరిధి దాటి సుప్రీం కోర్టు పరిధిలోకి చేరిందన్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే అయ్యే పనికాదన్నారు. న్యాయపరంగా, శాస్త్రీయంగా అధ్యయనం అవసరమన్నారు. భూసేకరణను అడ్డుకోవడమంటే దేశాభివృద్ధిని అడ్డుకోవడమేనన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య స్పందించారు. కాంగ్రెస్ పాలనలో భూసేకరణ విధానాన్ని మార్పు చేయాలని ప్రధానిని పలు రాష్ట్రాలు కోరాయన్నారు. దీంతో 2014 జూన్ 27న మొత్తం 32 రాష్ట్ర ప్రతినిధులు హాజరు కాగా వారిలో 28 మంది మార్పు చేయాలని కోరారన్నారు. భూసేకరణ చట్టంలో 9 సవరణలు చేసి కమిటీ ముందు నిర్ణయం కాకముందే అంగుళం భూమి తీసుకోనివ్వం అనడం తగదన్నారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో కొల్లేరుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. చేపల ఉత్పత్తులలో కొల్లేరు ప్రాంతం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వివరించారు. ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కడపలో ప్రారంభంకానున్న విమానాశ్రయం
-
రయ్.. య్.. య్..
రేపు ఉదయం 11.30 గంటలకు ల్యాండ్ కానున్న తొలి విమానం కడప-బెంగుళూరు మధ్య సర్వీస్ ప్రారంభోత్సవానికి సీఎం,కేంద్ర మంత్రుల రాక నెలలో కడప-హైదరాబాద్ మధ్య కొత్త సర్వీస్ కడప సెవెన్‌రోడ్స్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఆదివారం కడప విమానాశ్రయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మల సీతారామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వై.సుజనా చౌదరిలు హాజరవుతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎయిర్ పెగాసెస్ సంస్థకు చెందిన విమానం ఆదివారం ఉదయం 10.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత ఈ తొలి విమాన సర్వీసు 11.50 గంటలకు కడపలో టేకాఫ్ తీసుకుని 12.35 గంటలకు బెంగుళూరుకు చేరుకుంటుంది. టిక్కెట్లు అవసరమైన వారు ఎయిర్ పెగాసెస్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. ఇప్పటికే పలువురు తమ టికెట్లను రిజర్వు చేసుకున్నారు. కడప నుంచి బెంగుళూరుకు టిక్కెట్ ధర రూ.1234 ఉంటుందని విమాన సంస్థ ప్రతినిధులు ప్రకటించినప్పటికీ డిమాండును బట్టి టిక్కెట్ ధరలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ప్రయాణీకుల రద్దీ పెరిగే కొద్ది ట్రిప్పులు పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నెల రోజుల్లో హైదరాబాదు-కడప మధ్య కొత్త విమాన సర్వీసు కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం తర్వాత ఐదవదిగా కడప విమానాశ్రయం ప్రారంభమవుతోంది. 1939-45 మధ్య రెండవ ప్రపంచ యుద్ద కాలంలో విమానాలకు ఫ్యూయల్ నింపుకోవడానికి కడపలో ఎయిరోడ్రమ్ ఏర్పాటు చేశారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. విమానాలు, హెలికాఫ్టర్లకు ఫ్యూయల్ నింపుకోవడానికి, ఎవరైనా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చినపుడు ఇక్కడ దిగేందుకు మాత్రమే ఎయిరోడ్రమ్ వినియోగించుకునే వారు. ఆ సందర్భాల్లో మినహా ఇక్కడ జనసంచారం కూడా ఉండేది కాదు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పలు విద్యా సంస్థలు, పరిశ్రమలతోపాటు మౌలిక సదపాయాల కల్పన జరిగింది. పరిశ్రమల స్థాపనకు వీలుగా ఇప్పుడున్న ఎయిర్‌పోర్టు సమీపంలో సుమారు ఏడు వేల ఎకరాల భూమిని సేకరించి ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ పార్కును అప్పట్లో ఏర్పాటు చేశారు. వస్త్ర వ్యాపార దిగ్గజం బ్రాండిక్స్, ఓ ప్రైవేటు స్టీల్ కంపెనీతోపాటు కొన్ని ఐటీ కంపెనీలు కడపలో తమ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపాయి. ఒక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయం ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కడప విమానాశ్రయ అభివృద్ధికి నడుం బిగించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)-రాష్ట్ర ప్రభుత్వం మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) జరిగింది. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అవసరమైన భూమి, నీరు, విద్యుత్, రహదారులు, నెట్ కనెక్టివిటీ, సెక్యూరిటీ వంటి కనీస వసతులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలన్నది ఎంఓయూలోని సారాంశం. దీంతో వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. అప్పటికే ఎయిర్‌పోర్టుకు ఉన్న స్థలానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 287.69 ఎకరాల భూమిని సేకరించి ఏపీఐఐసీ ద్వారా ఏఏఐకి అప్పగించారు. తొలుత 34 కోట్ల రూపాయలు అవసరమవుతుందని భావించినా అన్నీ పూర్తయ్యేసరికి ఈ వ్యయం రూ.42 కోట్లకు చేరింది. ఎయిర్ పోర్టు తొలి దశలో రన్‌వేని ఆరు వేల అడుగులతో విస్తరింపజేశారు. కడప విమానాశ్రయ పరిధిలోని 1060 ఎకరాల చుట్టూ 12 కిలోమీటర్ల మేర ప్రహరీ ఏర్పాటు చేశారు. 2010లో రెండవ దశ కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) భవనం, టెర్మినల్, ఇంటర్నల్ రోడ్లను ఏర్పాటు చేశారు. 2012 జూన్ నాటికే ఎయిర్‌పోర్టు ప్రారంభానికి అవసరమైన అన్ని హంగులు సమకూరాయి. అయితే, చిన్నచిన్న కారణాలు చూపెడుతూ ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆదివారం ఈ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. -
'హైదరాబాద్ కంటే మెరుగ్గా బెజవాడలో..'
హైదరాబాద్: హైదరాబాద్ లో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి కంటే మెరుగైన ఆసుపత్రిని విజయవాడలో ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. కార్మిక రాజ్య బీమా సంస్థ ఉప ప్రాంతీయ కార్యాలయ నూతన భవనాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు శనివారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈఎస్ఐ ఆస్పత్రి గవర్నమెంట్ ఆస్పత్రి కంటే మెరుగ్గా ఉండాలని సూచించారు. దేశ అభివృద్ధిలో కార్మిక శాఖ కీలకమైందన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ప్రావిడెన్స్ ఫండ్ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలో కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. దేశంలో కార్మిక చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాగా, విజయవాడలోని గేట్ వే హోటల్లో మహిళా పారిశ్రామిక నేతల సదస్సుకు వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ప్రత్యేక హోదా కల్పించలేని వెంకయ్యనాయుడు అంటూ వామపక్షాల ఆధ్వర్యంలో హోటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. దాంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
పంట నష్టం 500 కోట్లు
వరి, మొక్కజొన్న (హెక్టార్లలో) 40,000 ఉద్యాన పంటలు (హెక్టార్లలో) 30,000 - వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, మోహనభాయి కాందా రియా సందర్శన సాక్షి, హైదరాబాద్: కాలంగాని కాలంలో కురిసిన భారీ వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో రైతన్న కుదేలైపోయాడు.. వరి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు రూ.500 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయతో పాటు కేంద్ర వ్యవసాయ సహాయమంత్రి మోహనభాయి కాందారియా పర్యటించారు. నల్లగొండ జిల్లాలో నష్టపోయిన పంటలను వెంకయ్య, మోహనభాయి కాందారియా, కరీంనగర్ జిల్లాలో బండారు దత్తాత్రేయ పరిశీలించారు. అలాగే పంట నష్టం అంచనాకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసన్.. రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని సహా ఇతర అధికారులను కలిశారు. పర్యటన అనంతరం పంట నష్టంపై ప్రధాని మోదీకి నివేదిక అందజేస్తామని, అనంతరం రాష్ట్రానికి సాయంపై నిర్ణయం తీసుకుంటారని కేంద్ర ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి వివరించారు. 40వేల హెక్టార్లలో..: ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40,131 హెక్టార్లలో వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఇక 30 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రకటించింది. మొత్తంగా చూస్తే.. వరి 26,632 హెక్టార్లలో, నువ్వులు 7,806, సజ్జలు 3,230, మొక్కజొన్న 1,474, జొన్న 933, పెసర పంటకు 51 హెక్టార్లలో నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని ప్రకటించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో అన్ని పంటలు కలిపి 15,403 హెక్టార్లలో దెబ్బతిన్నాయని... నల్లగొండ జిల్లాలో 11,969 హెక్టార్లు, నిజామాబాద్ జిల్లాలో 7,039 హెక్టార్లలో నష్టం జరిగిందని చెప్పారు. ఇక ఉద్యాన పంటల్లో ప్రధానంగా మామిడికి 15 వేల హెక్టార్లలో నష్టం జరిగిందని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘బీమా’ అందేనా..? భారీగా పంట నష్టం జరిగినా... రైతులకు ఏమేరకు బీమా అందుతుందో కూడా వ్యవసాయశాఖలోని బీమా విభాగం అధికారులు అంచనా వేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నష్టపోయిన రైతుల్లో ఎంతమంది రైతులు రబీలో ప్రీమియం చెల్లించారో కూడా లెక్కలు లేకపోవడం దారుణం. ఇక ఉద్యానశాఖలో రైతులు రూ.56 లక్షల మేరకు ప్రీమియం చెల్లించినా... బీమా సంస్థ అధికారులు పంట నష్టంవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఒక అధికారే పేర్కొనడం గమనార్హం. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం: జిల్లాల్లోని అధికారులు మాత్రమే పంట నష్టపోయిన ప్రాంతాల్లో అక్కడక్కడా పర్యటిస్తున్నారు. కేంద్ర బృందంతో రాష్ట్రస్థాయి అధికారి ఒకరు మాత్రమే ఉన్నారు. వర్షాలు, నష్టాలు తమ పని కాదన్నట్లుగా.. అది పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం పని అన్నట్లుగా వ్యవసాయశాఖ అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం. కనీసం రాష్ట్రస్థాయిలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంలోనూ వ్యవసాయశాఖ విఫలమైంది. వ్యవసాయశాఖలోని ప్రకృతి వైపరీత్యాల విభాగం అధికారుల వద్ద ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఉండటం లేదు. మంత్రి కార్యాలయానికి కూడా తాజా సమాచారాన్ని అందించడంలేదన్న విమర్శలున్నాయి. వర్షాలు తగ్గుముఖం నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్తంత తగ్గుముఖం పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని.. ఆ తర్వాత కురవబోవని పేర్కొంది. గత 24 గంటల్లో అత్యధికంగా వరంగల్ జిల్లా తాడ్వాయిలో 5 సెంటీమీటర్లు, ఘన్‌పూర్‌లో 3.4, వెంకటాపూర్‌లో 2.4, అమ్రాబాద్‌లో 2.6, భూపాల్పల్లి, వెంకటాపురంలలో ఒక్కో సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. 30% నష్టం జరిగినా పరిహారం: వెంకయ్య భువనగిరి: ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు 30 శాతం పంటలను నష్టపోయినా పరిహారం చెల్లిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించాలన్న మోదీ ఆదేశం మేరకు తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నామన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల్లో కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి మోహన్‌భాయ్ కందారియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి ఇటీవలి వర్షాలకు నష్టపోయిన పంటలను వెంకయ్య పరిశీలించారు. అనంతరం భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో 50 శాతం పంట నష్టం జరిగి తేనే పరిహారం ఇచ్చేవారన్నారు. అధికారులు గ్రామాల్లో నష్టం అంచనాలను తయారుచేసి పంచాయతీల వద్ద ఉంచాలన్నారు. తాము ప్రాథమిక అంచనాలను రూపొందించి ప్రధానికి నివేదిక అందిస్తామని, తర్వాత అధికారుల బృందం మళ్లీ నష్టం అంచనాలను సేకరిస్తుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన సాయం: దత్తాత్రేయ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాలను బుధవారం పరిశీలించిన దత్తాత్రేయ.. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ పంట నష్టపరిహారాన్ని 50 శాతం మేరకు పెంచారని దత్తాత్రేయ పేర్కొన్నారు. రైతులను అన్నిరకాలుగా ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. వీలైనంత త్వరగా పరిహారం అంచనాలను రూపొందించి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల నుంచే పెంచిన పరిహారం అమల్లోకి వస్తున్నందున, అందుకు తగినట్లుగా అంచనాలను రూపొందించాలన్నారు. రైతాంగాన్ని ఆదుకుంటాం: కేటీఆర్ జగిత్యాల: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగాపూర్, చల్గల్ , మేడిపెల్లి మండలం కట్లకుంట, కోరుట్ల మండలం జోగిన్‌పెల్లి, మాదాపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు, త్వరలోనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాథమిక సర్వే ప్రకారం దాదాపు 25 శాతం పంటలకు నష్టం జరిగిందని భావిస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో 12 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధంగా ఉందని ఈటెల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లి, పెగడపల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు అధికారుల నివేదిక వచ్చిన తర్వాత 2 నెలల్లోగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలో దెబ్బతిన్న పంటలను మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. నివేదికలు అందిన వెంటనే పరిహారం అందిస్తామన్నారు. వెంటనే వివరాలు సేకరించాలి: జానా, ఉత్తమ్ అకాల వర్షంతో దెబ్బతిన్న పంటల వివరాలను 24 గంటల్లో పూర్తిస్థాయిలో సేకరించాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్లో వానకు దెబ్బతిన్న వరి పంట, మామిడి తోటలను వారు బుధవారం పరిశీలించారు. వర్ష బీభత్సానికి రైతులు నష్టపోయి 2 రోజులైనా.. వారికి భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫల మైందన్నారు. ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నేడు నల్లగొండకు కేంద్రమంత్రులు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహనభాయి కందారియాతో పాటు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ పర్యటనలో పాల్గొననున్నారు. నల్లగొండ జిల్లాకు వెళ్లి జరిగిన పంటనష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందించాల్సిన సాయంపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే ఈనెల 16, 17 తేదీల్లో రాష్ట్రానికి చెందిన బీజేపీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన బృందం పంటనష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనుందని బీజేపీ కార్యాలయ కోఆర్డినేటర్ దాసరి మల్లేశం తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్యమంత్రికి లేఖరాశారు. -
పునర్విభజన చట్టంపై 35మంది కేంద్రమంత్రుల భేటీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విజన చట్టం అమలుపై 35మంది కేంద్రమంత్రులతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణలో అన్ని ప్రాజెక్టుల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరినట్టు వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కేంద్రమంత్రులు మాట్లాడారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు మాట్లాడుతూ.. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చడం.. అలాగే నూతనంగా నడిపే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖ వరకు పొడిగించాలనేదానిపై చర్చ జరిగినట్టు సురేష్‌ప్రభు తెలిపారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి సాయం అందిస్తామని చెప్పారు. తిరుపతిలో ఐఐటీ ఏర్పాటుకు తమశాఖ అనుమతి తెలిపిందని కేంద్ర మానవవనరుల మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఏపీ, తెలంగాణలో త్వరలో పర్యటిస్తానని రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపానని ఆరోగ్యశాఖ మంత్రి జేపీ అడ్డా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు విభజనపై రెండు రాష్ట్రాల చర్యలు తీసుకోవాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. -
కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్
-
మంత్రి బొజ్జలకు చంద్రబాబు పరామర్శ
తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం మంత్రి బొజ్జల రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఇటీవల బొజ్జల తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉదయం రేణిగుంట చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి మండలం ఊరందూరుకు వెళ్లి మంత్రి బొజ్జల కుటుంబానకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరనున్నారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలుస్తారు. గురువారం సాయంత్రం ప్రధానితో భేటీ అవుతారు. పునర్విభజన హామీల అమలు, రాజధాని భూసమీకరణపై ప్రధానితో చర్చిస్తారు. మధ్యాహ్నం కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, ఉమాభారతి, రాధామోహన్తో భేటీ అవుతారు. శుక్రవారం అరుణ్ జైట్లీ, సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీలతో భీటీ కానున్నారు. -
21న ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 21వ తేదీ ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు పరిశ్రమల రాయితీలు తదితర అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. 23 నుంచి 29 వరకు బాబు జపాన్ పర్యటన: సీఎం చంద్రబాబు ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు కనీసం 40 మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు పాల్గొంటారు. సీఎంతో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణతో పాటు కమ్యునికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. -
దేశ సేవకు అంకితంకండి
మంత్రుల ప్రమాణానికి ముందు నేతలకు మోదీ దిశానిర్దేశం తేనీటి విందులో బాధ్యతల నిర్వహణపై గంటపాటు సూచనలు న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ఆదివారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన 21 మంది నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు తేనీటి విందు ఇచ్చారు. సుమారు గంటపాటు సాగిన ఈ భేటీలో నేతలకు కీలకాంశాలపై మోదీ దిశానిర్దేశం చేశారు. బాధ్యతల నిర్వహణలో వ్యవహరించాల్సిన తీరును వారికి వివరించారు. ముఖ్యంగా దేశ సేవకు అంకితం కావాల్సిందిగా నేతలందరికి సూచించారు. అలాగే ఎక్కువ గంటలపాటు పని చేయాలని కోరారు. మంత్రిత్వశాఖలకు సంబంధించిన అన్ని విషయాలను త్వరగా నేర్చుకోవాలని, తన సిద్ధాంతాలను అనుసరించాలని సూచించారు. చివరగా ప్రమాణస్వీకారం సమయంలో ఎలా మెలగాలో వారికి పలు సూచనలు చేశారు. కేబినెట్ విస్తరణ అనంతరం మోదీ నూతన మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధి ప్రయాణ వేగాన్ని పెంచడంలో నూతన మంత్రులతో కలసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధాని ‘ట్వీట్’ చేశారు. కాగా, ప్రమాణస్వీకారం అనంతరం నూతన మంత్రులు జె.పి. నడ్డా, చౌధురి బీరేందర్‌సింగ్, రాజీవ్‌ప్రతాప్ రూడీ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, హన్స్‌రాజ్ ఆహిర్, జయంత్ సిన్హాలు మాట్లాడుతూ ప్రధాని అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, నిజాయితీతో నిర్వహించి ప్రధాని మోదీ అంచనాలకు అనుగుణంగా రాణిస్తామన్నారు. తద్వారా ప్రజలకు మచ్చలేని పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. -
నిఘా నీడలో షార్
సూళ్లూరుపేట: నింగి, నేల, నీరు అనే తేడా లేకుండా షార్ పరిసర ప్రాంతాలు మొత్తం నిఘా నీడలో ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా స్పందించేలా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ పహారా కాస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు షార్కు చేరుకుంటారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, నిర్మల సీతారామన్‌తో పాటు పలువురు ప్రముఖులు షార్కు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు అధికారులతో పాటు ప్రధాన మంత్రి ప్రత్యేక భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కలెక్టర్ శ్రీకాంత్. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ షార్‌లోనే ఉండి భద్రతా ఏర్పాట్లును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 300 మంది పోలీస్ అధికారులు 2700 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎస్పీజీ ఐజీ చతుర్వేది, అసిస్టెంట్ ఐజీలు ధనుష్సింగ్, సుమిత్రారాయ్ ఆధ్వర్యంలో 30 మంది ఎస్పీజీ కమెండోలు షార్‌లో భద్రతను సమీక్షిస్తున్నారు. ప్రధాని బసచేయనున్న భాస్కర్ గెస్ట్హాస్ను ఎస్పీ కమెండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గగనతలంలో గస్తీ ప్రధానమంత్రి చెన్నై విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో షార్కు వస్తారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు గగనతలంలో హెలికాఫ్టర్లతో గస్తీ కాస్తున్నారు. షార్ పరిసరాలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. శనివారం రెండు హెలికాఫ్టర్లతో చెన్నై నుంచి షార్ వరకు రిహార్సల్ నిర్వహించారు. పోలీసులు షార్‌లోని హెలీపాడ్ నుంచి భాస్కర్గెస్ట్హాస్ వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ జరిపారు. మరోవైపు డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది షార్ పరిసరాలను అనువణువూ జల్లెడపడుతున్నారు. సాధారణంగా షార్‌లో భద్రతను పర్యవేక్షించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల (సీఐఎస్ఎఫ్) సిబ్బంది సుమారు 730 మంది పహారాకాస్తున్నారు. సీఐఎస్ఎప్ కమాండెంట్ సుభాష్ సిన్హా ఆధ్వర్యంలో షార్ చుట్టూ మోహరించారు. బంగాళాఖాతంలో మెరైన్ దళాలతో పాటు నౌకయాన సిబ్బంది బోట్లలో గస్తీ తిరుగుతున్నారు. వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో ప్రయోగానికి మూడు రోజుల ముందు నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. -
తిరుమల కోసం కమలదండు యత్నం
సూది కోసం సోదికెళ్తే సుడితిరిందా అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా తాడిపల్లిగుడెం నుంచి గెలుపోందిన ఆ పార్టీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు చంద్రబాబు కేబినెట్లో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టారు. అయితే దేవాదాయశాఖ మాకే దక్కింది కనుక టీటీడీ ఛైర్మన్ పదవి కూడా మాకే దక్కాలంటూ ఆ పార్టీ నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. అందుకోసం ఇప్పటికే కేంద్రంలోని తమ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలతో రాష్ట్ర బీజేపీ నేతలు తమ మంతనాలు తీవ్రతరం చేశారు. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ అయిన కనుమూరి బాపిరాజు ఇప్పటికే రాజీనామా చేయాల్సి ఉంది. అయితే ఆగస్టుతో తన పదవి కాలం ముగియనుంది. ఈ నేపథ్యం తనను రాజీనామా చేయవద్దంటూ ఆయన ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం అనుమతించని పక్షంలో మీసాల రాజుగారు మరో నెల రోజుల్లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఖాళీ అయిన ఆ పదవిని ఎట్లా అయిన సొంతం చేసుకోవాలని రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకోసం కేంద్రమంత్రులతో ఇప్పటికి రంగంలోకి దిగి మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే టీడీపీ ఎంపీలు, మంత్రులు, మాజీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టు ప్రదక్షణాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ పదవి ఇటు టీడీపీ నేతలకా లేక బీజేపీ నేతలకు దక్కనుందా అనేది తేలాల్సి ఉంది. -
మోడీ కేబినెట్ లోఎవరెవరికి ఏ శాఖలు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ 46 మందితో కొలువుతీరింది. ఈ మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్ హోదా, 10 మందికి సహాయ మంత్రులు హోదా, 12 మందికి స్వతంత్ర హోదా దక్కింది. ఇక రక్షణ శాఖను మోడీ తన ఆధ్వర్యంలోనే ఉంచుకోవాలని భావించినా.. ఆ స్థానాన్ని అరుణ్ జైట్లీకి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. నరేంద్ర మోడీ కేబినెట్ లో ఆయా శాఖలు లభించే అవకాశం ఉన్న అభ్యర్థుల వివరాలు.. రాజ్‌నాథ్ సింగ్ -హోంశాఖ అరుణ్‌జైట్లీ - ఆర్ధిక, రక్షణ శాఖ రాధా మోహన్ సింగ్- వ్యవసాయ శాఖ గడ్కరీ- రవాణా శాఖ సదానంద గౌడ - రైల్వేశాఖ సుష్మాస్వరాజ్ - విదేశాంగ శాఖ వెంకయ్యనాయుడు- పట్టణాభివృద్ధి శాఖ మేనకా గాంధీ- మహిళ, శిశు సంక్షేమ శాఖ అనంత్‌కుమార్ - పార్లమెంటరీ వ్యవహారాలు రవిశంకర్ ప్రసాద్- న్యాయశాఖ శాఖ అశోక్‌గజపతిరాజు - పౌరవిమానయాన శాఖ స్మృతి ఇరానీ - మానవవనరుల అభివృద్ధి శాఖ నిర్మలాసీతారామన్ - వాణిజ్య శాఖ (స్వతంత్ర) జవదేకర్ - సమాచార ప్రచార శాఖ(స్వతంత్ర) పియూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు శాఖ (స్వతంత్ర) -
46 మందితో కేంద్ర మంత్రి మండలి
న్యూఢిల్లీ: భారత నూతన ప్రధానిగా నరేంద్ర మోడీతోపాటు 45 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ సాయంత్రం వారిచేత ప్రమాణం చేయించారు. కేంద్ర మంత్రి మండలిలో ఏడుగురు మహిళలకు అవకాశం దక్కింది. మన రాష్ట్రానికి చెందిన ముగ్గురికి ఈ మంత్రి మండలిలో స్థానం లభించింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి: వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వెంకయ్య నాయుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అశోక్ గజపతి రాజు టిడిపి తరపున విజయనగం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యురాలు కాదు. మహిళా మంత్రులు: సుష్మాస్వరాజ్, ఉమా భారతి, నజ్మా హెప్తుల్లా, హర్స్మిత్ కౌర్, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ రోజు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారు: 1.నరేంద్ర మోడీ 2.రాజ్‌నాథ్ సింగ్ 3. సుష్మాస్వరాజ్ 4. అరుణ్ జైట్లీ 5. వెంకయ్య నాయుడు 6. నితిన్ జయరామ్ గడ్కరీ 7. డివి సదానంద్ గౌడ 8. ఉమా భారతి 9. నజ్మా హెప్తుల్లా 10. గోపినాథ్ ముండే 11. రామ్ విలాస్ పాశ్వాన్ 12. కల్రాజ్ మిశ్రా 13. మేనకా సంజయ్ గాంధీ 14. అనంత కుమార్ 15. రవిశంకర్ ప్రసాద్ 16. అశోక్ గజపతిరాజు 17 అనంత్ గీతే 18 హర్స్మిత్ కౌర్ 19. నరేంద్ర సింగ్ తోమర్ 20. జ్యూల్ ఓరమ్ 21. రాధా మోహన్ సింగ్ 22.తవర్ చంద్ గెహ్లాట్ 23. స్మృతి ఇరానీ 24.డాక్టర్ హర్షవర్ధన్ 25. జనరల్ వికె సింగ్ 26. రావ్ ఇంద్రజిత్, 27. సంతోష్ గ్యాంగ్వర్ 28. శ్రీపాద్ నాయక్ 29.ధర్మేంద్ర ప్రధాన్ 30. శర్వానంద్ సొనోవాల్ 31. ప్రకాష్ జవదేకర్ 32. పీయూష్ జయప్రకాష్ గోయల్ 33.డాక్టర్ జితేంద్ర సింగ్ 34.నిర్మలా సీతారామన్ 35.గౌడర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర 36.మనోజ్ సిన్హా 37.నిహాల్ చంద్ 38. సిపి రాధాకృష్ణన్ 39. క్రిషన్ పాల్ గుజర్ 40.డాక్టర్ సంజీవ్ కుమార్ బాలియా 41.వాసవ మున్సుక్ భాయ్ ధనాజీభాయ్ 42.రావు సాహేబ్ దాదారావ్ పటేల్ 43.సుదర్శన్ భగత్ 44.ఉపేంద్ర కుష్వాహా 45.విష్ణుదేవ్ సాయి 46.కిరణ్ రిజిజు -
కాంగ్రెస్ పెద్దోళ్ల డిపాజిట్లు గల్లంతు
రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీలో గొప్పగొప్ప నాయకులు, తురుంఖాన్లు అనుకున్నవాళ్ల డిపాజిట్లన్నీ గల్లంతయ్యాయి. ఇప్పటివరకు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా ఓటమి అన్నదే ఎరుగని అత్యంత సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కు సైతం డిపాజిట్ దక్కలేదు. విశాఖ జిల్లా అరకు నుంచి పోటీ చేసిన ఆయనకు కేవలం 51,898 ఓట్లు మాత్రమే వచ్చాయి. కిశోర్ చంద్రదేవ్‌తో పాటు రాష్ట్ర విభజన విషయంలో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన కేంద్ర మంత్రులకు కూడా ఇదే తరహా పరాభవం ఎదురైంది. శ్రీకాకుళంలో కిల్లి కృపారాణికి 24,163 ఓట్లు, అరకులో కిశోర్ చంద్రదేవ్‌కు 51,898 ఓట్లు, కాకినాడలో పళ్లంరాజు 18,875 ఓట్లు, బాపట్లలో పనబాక లక్ష్మికి 17563 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో వాళ్లంతా కూడా డిపాజిట్లు కోల్పోయారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఇంత ఎదురు గాలి ఉన్నా, రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, విజయనగరంలో బొత్స ఝాన్సీ మాత్రం లక్ష ఓట్లకు పైగా సాధించి.. కాస్త గౌరవప్రదంగా ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ తరఫున రాజంపేటలో పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో దాదాపు 1.75 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినా, తనకంటూ దాదాపు మూడు లక్షలకు పైగా ఓట్లు సంపాదించుకోవడం కొద్దిలో కొద్ది ఊరట. కేంద్రంలో మంత్రులుగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీచేసిన కేంద్ర మంత్రుల్లో అత్యధిక సంఖ్యలో ఓట్లు వచ్చినది ఆమెకే. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక పదవులు పోషించిన చాలామంది కూడా డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్ర విభజన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. చట్టంత తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లు వ్యవహరించినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు.. రాష్ట్ర మంత్రులు నీలకంఠాపురం రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కోండ్రు మురళీ మోహన్, పసుపులేటి బాలరాజు.. అందరూ డిపాజిట్లు కోల్పోయారు. ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. -
'టి' బిల్లు విషయంలో కేంద్రమంత్రుల్లో భిన్న అభిప్రాయాలు
-
సవరణలు తప్ప సమైక్యం ఊసెత్తని సీమాంధ్ర మంత్రులు
-
సీమాంద్ర కేంద్ర మంత్రులకు అశోక్ బాబు హెచ్చరిక
-
కేంద్ర మంత్రులకు పార్టీ బాధ్యతలు
ఢిల్లీ: కేంద్రమంత్రులకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధికార ప్రతినిధులుగా కేంద్ర మంత్రులు చిదంబరం, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సల్మాన్ ఖుర్షీద్, ముకుల్వాసినిక్, శశిథరూర్, అభిషేక్ సింఘ్వి, జోతిరాదిత్య సింధియాలను నియమించారు. వీరితోపాటు మరో 13 మందికి అధికార ప్రతినిధులుగా బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగించినట్లుగా భావిస్తున్నారు. -
కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
-
'ఎంపీలు,కేంద్రమంత్రులు తెలుగు ప్రజలను మోసం చేశారు'
సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజలను మోసం చేశారని తెలుగు ప్రజా వేదిక ఛైర్మన్ ఆంజనేయరెడ్డి ఆరోపించారు. ప్యాకేజీల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని వారు తాకట్టుపెట్టారన్నారు. ఆంజనేయరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... అసెంబ్లీలో టి. బిల్లుపై చర్చించకుండా... బిల్లుకు వ్యతిరేకంగా సమైక్య తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యరాష్ట్రం కోసం తెలుగు ప్రజా వేదిక ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. -
ఇంకా సమైక్యమనడం సరికాదు
విభజన అనివార్యమని తేలింది: సీమాంధ్ర కేంద్రమంత్రులు - సీమాంధ్రకు లాభం చేకూర్చేందుకే ఢిల్లీ పెద్దలను కలుస్తున్నాం - హైదరాబాద్‌ను యూటీ, పోలవరం పూర్తి చేయాలని అడిగాం - సీమాంధ్ర రాజధాని కోసం నిపుణుల కమిటీ వేయాలని కోరాం - జైరాం, చిదంబరంలతో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీలు - రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తామంటూ వారికి హామీ - తమ ప్రతిపాదనలు జీవోఎం నివేదికలో చేర్చాలని వజ్ఞప్తి న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పరిస్థితులను చూస్తుంటే రాష్ట్ర విభజన అనివార్యమని తేటతెల్లమైందని.. ఈ తరుణంలో ఇంకా కలిసి ఉండాలని పట్టుపట్టడం సరికాదని సీమాంధ్ర కేంద్రమంత్రులు మీడియాతో వ్యాఖ్యానించారు. ‘‘మేం ఈ విషయం గ్రహించిన తరువాతే సామరస్యంగా విడిపోయి సీమాంధ్రకు ఏ విధంగా లాభం చేకూర్చాలి? ఏ విధంగా సమన్యాయం పొందాలి? అనే దిశగా ఢిల్లీ పెద్దలను కలుస్తున్నాం’’ అని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే విభజన బిల్లు ఖచ్చితంగా వస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సదుపాయాలన్నీ సీమాంధ్రలో ఏర్పాటు చేసుకునే వరకు మాత్రమే ఆ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్రాన్ని కోరామని శీలం చెప్పారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, జె.డి.శీలం, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మిలు బుధవారం ఉదయం సంయుక్తంగా జీవోఎం సభ్యులు జైరాంరమేశ్, చిదంబరంలను వారి వారి నివాసాలకు వెళ్లి కలిశారు. రాష్ట్ర విభజనకు తాము పూర్తిగా సహకరిస్తామని వారికి హామీ ఇచ్చారు. అయితే.. జీవోఎం నివేదికలో తమ ప్రతిపాదనలను పొందుపరచాలని అభ్యర్థించారు. హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్‌ను శాశ్వతంగా యూటీ చేయాలని చిరంజీవి, సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు హైదరాబాద్‌కు యూటీ హోదా ఇస్తే చాలని శీలం విజ్ఞప్తిచేశారు. పోలవరం ప్రాజెక్టుపై వినిపిస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆ ప్రాజెక్టును తప్పనిసరిగా నిర్మించి తీరాల్సిందేనని కోరారు. ఆయా అంశాలపై జీవోఎం భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని జైరాం పేర్కొన్నట్లు తెలిసింది. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వద్దకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. విభజన విషయంలో ఏకపక్షంగా వ్యవహరించకుండా సీమాంధ్రకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. జైరాంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు యూటీ హోదా ఇస్తే అందరి ఆమోదం ఉంటుందని, సీమాంధ్ర ప్రజల్లోనూ 90 శాతం మంది మద్దతు పలుకుతారని జీవోఎం సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. 1956కు పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్‌ను విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కలపాల్సిందేనని కూడా గట్టిగా కోరామన్నారు. అలాగే సీమాంధ్రలో ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలనే అంశంపై నిపుణుల కమిటీని వేయాలని కోరినట్లు పురందేశ్వరి తెలిపారు. పాలనా సౌలభ్యం, నీటి వసతి, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలకు అనుకూలమైన చోట మాత్రమే కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉన్నప్పటికీ దానిపై చర్చించలేదని సీమాంధ్ర నేతలు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యూటీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలను కూడా కలవాలని భావించిన సీమాంధ్ర కేంద్రమంత్రులు వారి అపాయిట్మెంట్లు కోరారు. ఆ భావన పక్కన పెడితే మేలు: లగడపాటి రాష్ట్రం అనివార్యమనే భావనతోనే సీమాంధ్ర కేంద్రమంత్రులు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నారని.. వారు అలాంటి భావనను పక్కనపెడితేనే మేలని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఏమాత్రం లేవని అభిప్రాయపడ్డారు. ‘‘జీవోఎం నివేదిక పూర్తి కావాలి. అటు నుంచి కేబినెట్‌కు వెళ్లాలి. తరువాత రాష్ట్రపతి, అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లాలి. మధ్యలో సీఎం ఉన్నారు. విభజనను ఆయన అడ్డుకుంటారనే నమ్మకం మాకుంది’’ అని చెప్పుకొచ్చారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటు ఆయా అసెంబ్లీల తీర్మానం తరువాత ఐదు నుంచి పదే ళ్ల సమయం పట్టినందున రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావటం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు. -
'సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు కేంద్రానికి తొత్తులు'
సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు కేంద్రానికి తొత్తులుగా మారారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... రాష్ట్రాన్ని విభజిస్తే తమ ప్రాంతానికి ప్యాకేజీలు కావాలంటూ వారు కేంద్రాన్ని అడుగుతుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. అలాంటి వారు రాష్ట్రానికి దురదృష్టంగా మారారని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి ముసాయిదా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాతామని తెలిపారు. ఈ నెల 24న ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అందులో భవిష్యత్తు కార్యాచరణ చర్చిస్తామన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిపినప్పుడు రెండు అసెంబ్లీ తీర్మానాలు చేసిన సంగతిని అశోక్‌బాబు ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టాల్సిందే. ఆ క్రమంలో నెగ్గితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని తెలిపారు. పార్లమెంట్‌కు విభజన బిల్లు వస్తే దానిని అడ్డుకునేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నట్లు అశోక్‌బాబు వివరించారు. -
కేంద్ర మంత్రులు సీమాంధ్ర ద్రోహులు
ర్నూలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై ముందే సమాచారమున్న అడ్డుకోలేని కేంద్రమంత్రులు సీమాంధ్ర ద్రోహులని నీటి పారుదల శాఖ ఉద్యోగుల జేఏసి అధ్యక్షుడు బందెనవాజ్ విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఇరిగేషన్ ఇంజినీర్ల జేఏసీ కన్వీనర్ సుధాకర్‌బాబు పిలుపు మేరకు గురువారం సాగునీటి కాలువలకు 24 గంటల పాటు నీటిని బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఉద్యమ ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి పారుదల శాఖ జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని సుంకేసుల, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తుంగభద్ర దిగువ కాలువ కింద పలు డిస్ట్రిబ్యూటరీలకు నీటిని బంద్ చేశామన్నారు. కేంద్రమంత్రులు ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి ఇప్పుడు పార్టీ అధిష్టానానికి కట్టుబడతామని చెప్పడం సిగ్గు చేటన్నారు. భ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమంటూ సీఎం ప్రగల్బాలు పలుకుతూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నేరస్తుల ఆర్డినెన్స్‌పై స్పందించిన రాహూల్ గాంధీ తెలంగాణ నోట్‌పై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన జరిగితే శ్రీశైలం మిగులు జలాలపై ఆధారపడి ఉన్న ఎస్సార్బీసీ, తెలుగు గంగ, కేసీ కెనాల్ ఎస్కేప్ చానల్, గాలేరు, హంద్రీనీవాలకు సాగునీరు రాదంటూ నీటి పారుదల శాఖ ఉద్యోగి మహేశ్వరప్ప జెండాపై చిత్రించి ప్రచారం చేశారు. ఆందోళనలో ఇరిగేషన్ ఉద్యోగులు ప్రసాద్‌రావు, మల్లికార్జునరెడ్డి, నవాజ్ జిలాని, లక్ష్మీనారాయణ, విజయకుమార్‌రెడ్డి, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రులంతా సమావేశం అవుతున్నాం: పనబాక
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి ఏం కావాలో చర్చించేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులందరం త్వరలో సమావేశం కానున్నామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. విద్య, ఉద్యోగ, పరిశ్రమలు, నీటి కేటాయింపులుపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ఆ సమావేశంలో ఈ అంశాలపై ముఖ్యంగా చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన జీవోఎమ్ను ఇంకా తాము కలవలేదని పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు. -
మీకిక రాజకీయ సమాధే!
సాక్షి, హైదరాబాద్: కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీ నామా చేసి ప్రజా ఉద్యమంలో భాగస్వాములవ్వాలని, ఈ పని చేయకుండా ఉద్యమానికి తూట్లు పొడవాలని చూస్తే.. వారికి రాజకీయ సమాధి తప్పదని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రులు రాజీనామా చేశారని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రాజీనామా చేశామని కొందరు ప్రకటనలు చేస్తున్నారేగానీ, తమ రాజీనామా పత్రాల్ని ప్రధానికి పంపలేదన్నారు. రాజీనామాలు చేశామంటూ ఢిల్లీలో కూర్చొని డ్రామాలాడుతున్న నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాజీనామాలు సమర్పించి ప్రజా ఉద్యమంలోకి రాకుంటే ఇకపై.. వారి చరిత్ర చీకట్లోనేనని మండిపడ్డారు. కేబినెట్ భేటీలో టీ నోట్‌ను ఇద్దరు మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించినా కేంద్రం లెక్కచేయలేదంటే ఆంధ్రప్రదేశ్ నేతల దుస్థితి ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో ఉండాలో, పదవులు వదిలి ప్రజా ఉద్యమంలోకి రావాలో ఇప్పటికైనా తేల్చుకోవాలని సూచిం చారు. చిరుద్యోగులు 60 రోజులుగా జీతాల్లేకుండా సమ్మె చేస్తూ ఉద్యమాన్ని నడుపుతుంటే.. కొందరు నేతలు పదవులకోసం సోనియాగాంధీ వద్ద మోకరిల్లుతుండడం దౌర్భాగ్యమన్నారు. విభజనను అసెంబ్లీలో వ్యతిరేకిస్తామని సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల ప్రజలకు ప్రమాణ పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వనివారిని ద్రోహులుగానే పరిగణిస్తామన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాం ధ్రతోపాటు తెలంగాణ కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారని గుర్తుచేశారు. కేవలం స్వార్థ ప్రయోజనాలకోసం రాజకీయ నేతలు రాష్ట్రాన్ని రెండుగా చీల్చడం దురదృష్టకరమన్నారు. తెలంగాణపై నోట్‌కు కేబినెట్ ఆమోదం లభించినంత మాత్రాన విభజన జరిగిపోయినట్లు కాదని, కేబినెట్ ఆమోదం తెలపడం కూడా సీడబ్ల్యూసీ నిర్ణయం వంటిదేనన్నారు. కేబినెట్ నిర్ణయంపై సమైక్యవాదులు ఆందోళన చెందనక్కర్లేదన్నారు. ఉద్యమాన్ని, హింస కు తావులేకుండా మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కడప, అనంతపురం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారినట్లు తమ దృష్టికొచ్చిందని, అయితే హింసాత్మక ఘటనలు రాజకీయ ప్రేరితమైనవేగాని, ఉద్యోగులకు సంబంధం లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలో విషాదకర సంఘటనగా మిగిలిపోతుందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత.. ఒక అంశంపై రాష్ట్ర ప్రజలంతా బాధపడిన సంఘటన ఇదేనన్నారు. కొన్ని పార్టీలు సమైక్యాంధ్ర నినాదంతో ముందుకెళుతున్నా.. ఉద్యోగులందరం ఒంటరిగానే పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. దీనిపై 6న జరిగే ఉద్యోగ సంఘాల భేటీలో నిర్ణయిస్తామన్నారు. కేబినెట్ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సులు, విద్యుత్ ఉద్యోగులు తదితర అత్యవసర విభాగాల ఉద్యోగులు కూడా శుక్రవారం నుంచి సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ సెగ కేంద్రానికి తాకేలా, వేలాది మంది ఉద్యోగులతో ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. -
కేంద్రమంత్రి షిండే సారధ్యంలో కమిటి
-
మంత్రులు వీళ్ళెక్కడ ?
-
కేంద్ర మంత్రుల డ్రామా
-
సోనియా ముందు పిల్లుల్లా కేంద్ర మంత్రులు: ఏపీ ఎన్జీవో
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర మంత్రులు సోనియా గాంధీ ముందు పిల్లుల్లా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వాళ్లను మళ్లీ గెలిపించే పరిస్థితి లేదని ఏపీ ఎన్జీవో నేత సత్యనారాయణ మండిపడ్డారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరై తిరిగి వెళ్తూ హయత్ నగర్ ప్రాంతంలో తెలంగాణ వాదుల రాళ్లదాడికి గురైన ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజ్యాంగ సంక్షోభం ద్వారానే విభజనను అడ్డుకోవాలని నాయకులకు సత్యానారాయణ పిలుపునిచ్చారు. -
సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీ'డ్రామా'లు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా డ్రామాలు మొదలుపెట్టారు. గురువారమే మొదలుపెట్టిన ఈ తతంగాన్ని శుక్రవారం కూడా కొనసాగించారు. పురందేశ్వరి, కిల్లి కృపారాణి తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేసినట్టు చెబుతున్నారు. కానీ వారు తమ రాజీనామా లేఖలను ప్రధానమంత్రికి మాత్రం పంపిన దాఖలాలు కనిపించట్లేదు. కేంద్ర మంత్రి చిరంజీవి కూడా రాజీనామా చేసినట్లే చెప్పినా, ఆయనది కూడా అదే పరిస్థితి. అసలు రాజీనామా చేసినట్లయితే.. ఆ విషయాన్ని మీడియాకు బహిరంగంగా ప్రకటించి, లేఖలను కూడా ప్రదర్శించడం ఆనవాయితీ. కానీ తమ పదవులను వదులుకోడానికి ఏమాత్రం ఇష్టం లేని కేంద్ర మంత్రులు, చివరకు మీడియాకు కూడా అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. అసలు వాళ్లు నేరుగా రాజీనామాలను ఆమోదింపజేసుకునే పరిస్థితి ఉందా లేదా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ నాయకుల్లో చాలామందికి చాలాకాలం తర్వాత పదవులు లభించాయి. మరికొందరు ఇన్నాళ్లూ సహాయ మంత్రులుగా ఉన్నా, ఇటీవలే కేబినెట్ ర్యాంక్ సాధించారు. కావూరి సాంబశివరావు లాంటి వాళ్లకు సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత మాత్రమే పదవులు లభించాయి. అందుకే వీళ్లు కేవలం ప్రకటనలు చేసి తప్పించుకుంటున్నారు తప్ప నిజాయితీ కనిపించట్లేదు. సీమాంధ్రలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలను చల్లార్చడానికే ఇలా చేస్తున్నారని, కేవలం ప్రజాగ్రహం నుంచి తప్పించుకోడానికే మాటలు చెబుతున్నా, ఆచరణకు మాత్రం దూరంగా ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఎటూ లేదు కాబట్టి, ఈ చివరి ఏడాది కాలం కూడా పదవులు అనుభవించాలన్నదే వాళ్ల ఆలోచన అని విమర్శకులు అంటున్నారు. -
సీమాంధ్ర కేంద్రమంత్రులపై ఏపీ ఎన్జీవోలు ఆగ్రహం
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఏపీ ఎన్జీవోల సంఘం డిమాండ్ చేసింది. ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు గురువారం న్యూఢిల్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులతో సమావేశమైయ్యారు. అనంతరం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎన్జీవోల సంఘం నాయకులు ప్రసంగించారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు వ్యవహారిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే కేంద్రం తప్పక దిగివస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం వారు సమైక్య రాష్ట్రం కోసం గట్టి పోరాటం చేయాలని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు మాట్లాడటం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం నాయకులు ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. -
దిగ్విజయ్‌ని కలిసిన కేంద్ర మంత్రులు
ఢిల్లీ: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. తమ వాదన వినిపించారు. సమైక్యాంధ్ర తీర్మానాన్ని వారు దిగ్విజయ్ సింగ్‌కు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి, జెడి శీలం విలేకరులతో మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్‌కు తమ వాదన వినిపించినట్లు తెలిపారు. ఎవరికి అన్యాయం జరుగకుండా అందరికీ న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌పై తాము లేవనెత్తి అంశాలను లిఖితపూర్వకంగా తెలియజేయమని ఆయన కోరినట్లు చెప్పారు. హైలెవల్ కమిటీ ముందు త్వరలోనే తమ వాదనలను వినిపిస్తామన్నారు. సమావేశాలకు అడ్డుపడకుండా సీమాంధ్ర ఎంపిలను ఒప్పిస్తామని చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌ను కలిసినవారిలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, పురందేశ్వరీ, కిల్లి కృపారాణి ఉన్నారు. సమైక్యాంధ్రకే తమ మొదటి మద్దతని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. అలా కాకపోతే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల అపాయింట్లు కోరినట్లు చెప్పారు. కమిటీ ముందు వాదనలు వినిపించమని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు కోట్ల తెలిపారు. ఎటువంటి పరిస్థితులలో తాము హైదరాబాద్ వదలుకోం అని, హైదరాబాద్‌తో కలిసే ఉంటామని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి చెప్పారు. శ్రీశైలం జలాశయానికి నీరు ఎలా వస్తాయనేది తమ ప్రధాన సమస్య అన్నారు. పైనుంచి నీరు రాకుంటే తమ ప్రాంతం ఎడారి అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, సీమాంధ్ర ఎంపీలు రేపు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుస్తారు. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరతారు. -
నోరు మూసుకున్న కేంద్ర మంత్రులు: వీరశివారెడ్డి ధ్వజం
హైదరాబాద్: పార్లమెంట్లో ఎంపీలు ధర్నా చేస్తుంటే కేంద్ర మంత్రులు నోరుమూసుకుని కూర్చున్నారని వైఎస్ఆర్ జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. వీరశివా రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన కోసమే చిరంజీవి, కావూరి సాంబశివరావు, జెడి శీలంలకు మంత్రి పదవులిచ్చిందన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులంతా కాంగ్రెస్ అధిష్టానంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే వారు అధికారం కోసం రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక పక్క సీమాంధ్ర ఎంపిలు ఆందోళన చేస్తుంటే మంత్రులు మిన్నకుండటం దారణం న్నారు. వారికి పదవులు తప్ప రాష్ట్ర సంక్షేమం పట్టదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వీరశివా రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని విభజించ వద్దని ఆయన కాంగ్రెస్ ఆధిష్టానంకు విజ్ఞప్తి చేశారు. తెలుగు భాష మాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. -
కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజులపై ప్రజాగ్రహం
-
విభజనపై కాంగ్రెస్ ఎంపీల డబుల్ గేమ్