కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు | Modi Government Allocates Portfolios To Ministers | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

Published Fri, May 31 2019 1:25 PM | Last Updated on Fri, May 31 2019 3:06 PM

Modi Government Allocates Portfolios To Ministers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండో సారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తన సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. గురువారం ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో సహా మొత్తం 58 మంది​ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్‌ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షాను తొలిసారి క్యాబినెట్‌లోకి తీసుకున్న మోదీ ఆయనకు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మల సీతారామన్‌కు ఈ సారి ఆర్థిక శాఖ కేటాయించారు. అయితే సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ, ఇతర పాలసీ సమస్యలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖల్ని ప్రధాని మోదీ వద్దే ఉండనున్నాయి. మంత్రులకు కేటాయించిన శాఖలు...

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కేంద్రమంత్రులు...
1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి)
2. రాజ్‌నాథ్‌ సింగ్ (రక్షణ శాఖ)
3. అమిత్‌ షా (హోం శాఖ)
4. నితిన్‌ గడ్కరీ (రోడ్లు, రవాణా శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు )
5. సదానంద గౌడ (ఎరువులు, రసాయన శాఖ)
6. నిర్మలా సీతారామన్ ‌(ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ అఫైర్స్‌)
7. రాంవిలాస్‌ పాశ్వాన్‌ (వినియోగదారుల వ్యవహారాల శాఖ )
8. నరేంద్ర సింగ్‌ తోమర్‌ (వ్యవసాయ శాఖ, రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీ రాజ్‌)
9. రవిశంకర్‌ ప్రసాద్‌ (న్యాయ శాఖ)
10. హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ (ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమ)
11. థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ (సామాజిక న్యాయ శాఖ)
12. సుబ్రహ్మణ్యం జయశంకర్‌ (విదేశాంగ శాఖ)
13. రమేశ్‌ పోఖ్రియాల్‌ (మానవ వనరులు శాఖ)
14. అర్జున్‌ ముండా (గిరిజన వ్యవహారాల శాఖ)
15. స్మృతి ఇరానీ ( మహిళ శిశు సంక్షేమం, జౌళి శాఖ)
16. డాక్టర్‌ హర్షవర్థన్ (వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)
17. ప్రకాశ్‌ జవదేకర్‌ (అటవీ, పర్యావరణ శాఖ, సమాచార ప్రసార శాఖ)
18. పీయూష్‌ గోయల్‌ (రైల్వే శాఖ)
19. ధర్మేంద్ర ప్రధాన్‌ (పెట్రోలియం శాఖ) 
20. ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ (మైనారిటీ వ్యవహారాల శాఖ)
21. ప్రహ్లాద్‌ జోషీ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు గనుల శాఖ)
22. మహేంద్రనాథ్‌ పాండే (నైపుణ్యాభివృద్ధి శాఖ ‌)
23. అరవింద్‌ సావంత్‌ (భారీ పరిశ్రమల శాఖ)
24. గిరిరాజ్‌ సింగ్‌ (పాడి, పశుసంవర్ధక, ఫిషరీస్‌ శాఖలు)
25. గజేంద్ర సింగ్‌ షెకావత్‌ (జల శక్తి)

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
1. సంతోష్ కుమార్ గాంగ్వర్ (శ్రామిక, ఉపాధి కల్పన శాఖ)
2. ఇంద్రజిత్ సింగ్ (ప్రణాళిక, గణాంక శాఖ)
3. శ్రీపాద యశో నాయక్ (ఆయుష్, డిఫెన్స్ శాఖ సహాయమంత్రి)
4. జితేంద్ర సింగ్ (సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, పెన్షన్లు, ఈశాన్య రాష్ర్టాల వ్యవహారాలు, పీఎంవో సహాయ మంత్రి)
5. కిరణ్ రిజిజు (క్రీడలు, యుజవన, మైనార్టీ వ్యవహారాలు)
6. ప్రహ్లాద్ సింగ్ పటేల్  (సాంస్కృతిక పర్యాటక శాఖ)
7. రాజ్ కుమార్ సింగ్ (విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి)
8. హర్దీప్ సింగ్ పూరి (గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ)
9. మన్ సుఖ్ మాండవ్య (షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు)

సహాయ మంత్రులు
1. ఫగ్గీన్‌ సింగ్‌ కులస్తే (ఉక్కు శాఖ)
2.. అశ్వినీ చౌబే (కుటుంబ, ఆరోగ్య శాఖ)
3. అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, భారీ పరిశ్రమలు)
4. జనరల్‌ వీకే సింగ్‌ (రోడ్లు, రహదారులు శాఖ)
5. కిృషన్‌ పాల్‌ గుజ్జర్‌ (సాధికారిత, సామాజిక న్యాయం‌)
6. దాదారావ్‌ పాటిల్‌ (పౌర, ప్రజా సరఫరాల శాఖ)
7. కిషన్‌ రెడ్డి  (హోంశాఖ సహాయమంత్రి)
8. పురుషోత్తం రూపాలా (వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ)
9. రాందాస్‌ అథవాలే (సాధికారిత, సామాజిక న్యాయం‌)
10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి (గ్రామీణాభివృద్ధి శాఖ)
11. బాబుల్‌ సుప్రియో (అటవీ, పర్యావరణ శాఖ)
12. సంజీవ్‌ కుమార్‌ బాల్యాన్‌ (పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్)
13. దోత్రే సంజయ్‌ శ్యారావ్‌ (మానవ వనరుల శాఖ,ఐటీ శాఖ)
14. అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్ (ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ)
15. సురేష్‌ అంగాడి ( రైల్వేస్‌)
16. నిత్యానంద్‌ రాయ్‌ (హోంశాఖ)
17. రత్తన్‌ లాల్‌ కఠారియా (జల శక్తి, సాధికారిత, సామాజిక న్యాయం)
18. వి.మురళీధరన్‌ ( పార్లమెంటరీ వ‍్యవహారాలు, విదేశాంగ శాఖ)
19. రేణుకా సింగ్‌  (గిరిజన శాఖ)
20. సోమ్‌ ప్రకాశ్‌ (వాణిజ్య, పరిశ్రమలు శాఖ)
21. రామేశ్వర్‌ తెలి (ఫుడ్‌ ప్రాసెసింగ్‌)
22. ప్రతాప్‌ చంద్ర సారంగి (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధక శాఖ)
23. కైలాస్‌ చౌదరి (వ్యవసాయ శాఖ)
24. దేబశ్రీ చౌదురి (మహిళ శిశు సంక్షేమం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement