Portfolios allocated
-
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్!
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనేదానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?. మోదీ మార్క ఉండనుందా? అనే చర్చ మొదలైంది. ఇవాళ(సోమవారం, జూన్ 10) సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలోపు లేదంటే ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ మీద తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మరోవైపు.. భాగస్వామ్య పక్షాల ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో.. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోదీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్లో మోదీ మార్క్‌తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. ఇక.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్ చేశాయి. జేడీఎస్ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్ చేసినట్లు తెలియవస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే.. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.నిన్న రాత్రి 72 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో 30 మంది మంత్రివర్గంలోకి, ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా, అలాగే.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. 43 మంది మూడుకంటే ఎక్కువసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అలాగే.. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను తీసుకోవడం గమనార్హం. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో చోటు దక్కింది. విశేషం ఏంటంటే.. కేంద్ర కేబినెట్లో ఇంకా ఖాళీగానే 9 బెర్తులు ఉండడం. -
Rajasthan: మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్దే 8 కీలక శాఖలు
జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం.. తన కేబినెట్లోని మంత్రులకు శాఖలు కేటాయించింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కీలక ఎనిమిది శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. వీటిలో హోం, ఎక్సైజ్, అవినీతి నిరోధక శాఖ, కార్మిక, గృహశాఖలు ఉన్నాయి. కీలక ఆర్థికశాఖను డిప్యూటీ సీఎం దియా కుమారికి కేటాయించారు. విద్యాధర్ నగర్ ఎమ్మెల్యే అయిన ఆమె పర్యాటకం, కళలు సాహిత్యం సాంస్కృతిక, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమశాఖ వంటి మరో అయిదు విభాగాల బాధ్యతలను స్వీకరించారు. మరో డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ బైరవాకు టెక్నికల్- ఉన్నత విద్య, రవాణా శాఖను కేటాయించారు. ఇతర క్యాబినెట్ మంత్రుల్లో కిరోడి లాల్ మీనాకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖలు, గజేంద్ర సింగ్ ఖిమ్సర్కు వైద్యారోగ్యం, రాజ్యవర్ధన్ రాథోడ్‌కు పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్.. మదన్ దిలావర్ పాఠశాల విద్యను కేటాయించారు. అయితే మంత్రులకు శాఖలను కేటాయించడంలో బీజేపీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత బాధ్యతలను అప్పజెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. కాగా గత నవంబర్‌లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతూ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 15న రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌చంద్ బైర్వా ప్రమాణ స్వీకారం చేశారు. గతవారం (డిసెంబర్ 30) గవర్నర్ కల్రాజ్ మిశ్రా సమక్షంలో రాజ్‌భవన్‌లో 22 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది తొలిసారిగా మంత్రులుగా ఎన్నికైన వారు ఉన్నారు. వీరందరికీ నేడు పోర్ట్‌ఫోలియోల కేటాయింపు జరిగింది. చదవండి: ఢిల్లీ: కన్నీరు పెట్టుకున్న స్వాతి మలివాల్ -
సీఎం సిద్ధరామయ్యకు ఆర్థికం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకుని, ముఖ్యమైన నీటిపారుదల, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ విభాగాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కేటాయించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతోపాటు 8మంది మంత్రులు ఈ నెల 20న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. శనివారం కొత్తగా 24 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. వీరిలో గతంలో హోం శాఖను నిర్వహించిన జి.పరమేశ్వరకు తిరిగి అదే శాఖను కట్టబెట్టారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖను ఎంబీ పాటిల్‌కు, కేజే జార్జికి విద్యుత్ శాఖను కేటాయిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థిక శాఖతోపాటు కేబినెట్ వ్యవహారాలు, పరిపాలన సిబ్బంది వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ తదితర ఇతరులకు ఇవ్వని శాఖలు సీఎం సిద్ధరామయ్య వద్దే ఉన్నాయి. శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి వనరులు, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ శాఖలను ఇచ్చారు. హెచ్‌కే పాటిల్‌కు న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు, లెజిస్లేషన్, పర్యాటక శాఖలు, కేహెచ్ మునియప్పకు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలను కేటాయించారు. రామలింగారెడ్డికి రవాణా, ముజ్రాయ్ శాఖలను ఇచ్చారు. హెచ్‌సీ మహదేవప్పకు సాంఘిక సంక్షేమం, సతీశ్ జర్కిహోళికి పబ్లిక్ వర్క్స్ శాఖలను అప్పగించారు. శివానంద పాటిల్‌కు టెక్స్టైల్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బాధ్యతలు కేటాయించారు. దినేశ్ గుండూరావుకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, రెవెన్యూ శాఖను కృష్ణ బైరెగౌడకు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. ఏకైక మహిళా మంత్రి లక్ష్మి ఆర్ హెబ్బాల్కర్కు మహిళ, శిశు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ సాధికారిత శాఖ ఇచ్చారు. -
లాభాలు తీసుకోండి.. రీబ్యాలెన్స్ చేసుకోండి
స్టాక్ మార్కెట్లు మార్చిలో చూసిన కనిష్టాల నుంచి భారీగానే రికవరీ అయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున వివిధ రంగాల్లోని స్టాక్స్ వరుసగా ర్యాలీ బాట పడుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు సైతం కనిష్ట స్థాయిల నుంచి గణనీయంగానే పెరిగాయి. ఇంకా పెరుగుతాయన్న ధోరణి కాకుండా.. ర్యాలీ కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ పెరిగిందన్న సత్యాన్ని గుర్తించాలి. దీనికి తగినట్టు పోర్ట్ ఫోలియోను సవరించుకోవడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. దీన్నే పోర్ట్ పోలియో రీబ్యాలెన్స్ గా చెబుతారు. ఇన్వెస్టర్ తన లక్ష్యాలకు తగిన రాబడులను ఇచ్చే సాధనాలను ఎంచుకోవడం, అందుకు అనుగుణంగా వాటికి కేటాయింపులు చేసుకోవడం పోర్ట్ ఫోలియో అలొకేషన్ అవుతుంది. వివిధ మార్కెట్లలో రాబడుల తీరుకు అనుగుణంగా పోర్ట్ ఫోలియోలోనూ మార్పులు అవసరం అవుతాయి. ఆ వివరాలను ‘మై మనీ మంత్ర’ ఎండీ రాజ్ ఖోస్లా వివరించారు. అందరికీ అన్ని సాధనాలు ఒకే విధంగా అనుకూలంగా ఉండవు. ఉదాహరణకు రమణ (39) సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు సంపాదన రూ.లక్ష వరకు ఉంటుంది. సంతానం ఒకే కుమారుడు. దీంతో వీరికి ప్రతీ నెలా రూ.60వేల వరకు మిగులు కనిపిస్తోంది. మరో ఉదాహరణలో గోపాల్ (32) ఓ ఫార్మా కంపెనీ ప్రొడక్షన్ యూనిట్లో పనిచేస్తుంటాడు. నెలకు ఆదాయం రూ.40వేలు. సంతానం ఒక కుమార్తె, ఒక కుమారుడు. నెలలో మిగులు కష్టంగా ఉంటోంది. కొన్ని ఖర్చులను నియంత్రించుకుంటే రూ.5వేల వరకు పొదుపు చేసుకోగల సౌలభ్యం ఉంటుంది. ఈ రెండు కేసుల్లో ఆదాయ స్థాయిలు మారిపోయాయి. వారి అవసరాల్లోనూ, కుటుంబ సభ్యుల సంఖ్యలోనూ మార్పులు గమనించొచ్చు. వీరిలో రమణ అధిక ఆదాయ పరుడు. చిన్న కుటుంబం. బాధ్యతలు తక్కువ. కనుక రిస్క్ ఎక్కువగా తీసుకోగలడు. కనుక ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, గోపాల్ పరిస్థితి వేరు. మిగిలేదే తక్కువ. కనుక ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోలేని పరిస్థితి. రిస్క్ ఎక్కువగా తీసుకోలేడు. ఇలా ప్రతీ ఒక్కరూ అవసరాలు, ఆదాయాలు, మిగులు, జీవిత లక్ష్యాలు, బాధ్యతలను అనుసరించి వారి పోర్ట్ ఫోలియో అలొకేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోర్ట్ ఫోలియో అంటే.. ఈక్విటీ, డెట్, డిపాజిట్స్, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాల్లో పెట్టుబడులు. భిన్న సాధనాల మధ్య చేసిన కేటాయింపులను.. అవసరమైనప్పుడల్లా సమతూకం ఉండేలా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల పెట్టుబడులు ఒకే తీరులో, ఒకే దిశలో చలిస్తాయని చెప్పలేము. ఇందుకు ఈ ఏడాది తొలి ఆరు నెలలే ప్రత్యక్ష నిదర్శనం. ఈక్విటీ మార్కెట్లు మార్చి కనిష్టాల నుంచి చూస్తే 50 శాతానికి పైగా ఐదు నెలల్లో పెరిగాయి. బంగారం 20 శాతం పెరిగింది. రాబడులన్నవి ఈక్విటీ, బంగారంలో ఒకే మాదిరిగా లేకపోవడాన్ని గమనించొచ్చు. ఎవరైనా ఒకరు తమ ఆర్థిక ప్రణాళిక మేరకు.. ఈ ఏడాది జనవరిలో 60% ఈక్విటీలకు, 30 శాతం డెట్ సాధనాలకు, మరో 10 శాతం బంగారానికి కేటాయించారనుకుంటే.. ఆగస్ట్ చివరి నాటికి చూస్తే ఈక్విటీ పెట్టుబడుల శాతం 55గాను, డెట్ పెట్టుబడులు 32.5 శాతంగాను, బంగారం 12.5 శాతంగా మారి ఉంటాయి. ఇక రానున్నఆరు నెలల్లో ఈక్విటీలు మరో 5 శాతం క్షీణించి, డెట్ 7 శాతం, బంగారం 10 శాతం పెరుగుతుందనుకుంటే.. అప్పటికి ఈక్విటీల్లో 53 శాతం, డెట్‌లో 34 శాతం, బంగారంలో 14శాతంగాను ఉంటాయి. ఎంత రిస్క్ తీసుకోగలరు, ఎంత రాబడులను ఆశిస్తున్నారనే అంశాల ఆధారంగా ఈ కేటాయింపులు చేసుకుని ఉండొచ్చు. కానీ కొంత కాలానికి వీటిల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈక్విటీలకు 60% అనుకుంటే 55 శాతానికి తగ్గిపోయి, మిగిలిన రెండు సాధనాల్లోని పెట్టుబడుల విలువ పెరిగింది. ఈ వ్యత్యాసం ప్రస్తుతం చూడ్డానికి చాలా స్వల్పమే అనిపించొచ్చు. కానీ దీర్ఘకాలానికి రాబడుల పరంగా ఈ వ్యత్యాసం భారీగా ఉంటుందన్న వాస్తవాన్ని గమనించాలి. అందుకే ఈ సమయంలో పోర్ట్ ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈక్విటీల్లో పెట్టుబడులను తిరిగి 60 శాతానికి పెంచుకోవాలి. అందుకోసం డెట్, బంగారంలో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. బుల్ రన్ చూసి అధిక ఉత్సాహంతో ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకుంటే ఆటుపోట్లు భారీగా పెరిగే అవకాశాన్ని ఇచ్చినట్టే అవుతుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్ పెరిగిన స్థాయి నుంచి మళ్లీ పడిపోతే పెట్టుబడుల విలువ క్షీణిస్తుంది. తగిన ప్రణాళికకు మార్గం పడిన మార్కెట్లు మళ్లీ పెరగడం సహజం. కానీ, మార్కెట్లు రికవరీ అయినా కానీ, ఇన్వెస్టర్ పోర్ట్ ఫోలియోలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ అదే స్థాయిలో రికవరీ అవ్వకపోవచ్చు. అందుకే ఇన్వెస్టర్ రీబ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. దానివల్ల రిస్క్ ను కూడా నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. తద్వారా ఇన్వెస్టర్ విశ్వాసం మరింత పెరుగుతుంది. తన పోర్ట్ ఫోలియోలో ఏదేనీ ఒక విభాగం కరెక్షన్ లోనైనప్పుడు ఇన్వెస్టర్ భయపడిపోకుండా తన పెట్టుబడులను ప్రణాళిక మేరకు సవరించుకుని కొనసాగించుకునే వీలుంటుంది. ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో చాలా మంది ఇన్వెస్టర్లు నష్టాలను ఎదుర్కొని ఉంటారు. కానీ, క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్టర్లు ఎవరైతే ఈ ఏడాది జనవరిలో తమ పోర్ట్ ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకుని ఉండి ఉంటారో వారు మంచి సక్సెస్ చవి చూసి ఉంటారు. ఎందుకంటే ఈ ఏడాది జనవరిలో ఈక్విటీ మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి. రీబ్యాలెన్స్ విధానం తెలిసి, దాన్ని ఆచరిస్తున్నవారు అయితే భారీగా పెరిగిన ఈక్విటీ విభాగంలో పెట్టుబడులను తగ్గించుకుని ఉండేవారు. దాంతో అనంతరం మార్చిలో భారీ పతనం తర్వాత ఈక్విటీ పెట్టుబడుల విలువ తగ్గినందున మరిన్ని పెట్టుబడులకు అవకాశం లభించేది. ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆటుపోట్లను తగ్గించుకునే ప్రయత్నం మార్కెట్లలో ఆటుపోట్లను ఇన్వెస్టర్లు నియంత్రించలేరన్నది నిజం. కాకపోతే ఈ ఆటుపోట్ల ప్రభావం తమ పెట్టుబడులపై తక్కువగా ఉండేలా రిస్క్‌ను నియంత్రించుకోగలరు. ఇందుకు చేయాల్సిందల్లా పెట్టుబడుల్లో సమతుల్యం ఉండేలా చూసుకోవడమే. నిర్ణయించుకున్న మేర వివిధ సాధనాలకు పెట్టుబడుల కేటాయింపులను సవరించుకోవాలి. ఇన్వెస్ట్ చేసి, అవసరం వచ్చే నాటి వరకు వాటిని పట్టించుకోని వారితో పోలిస్తే.. క్రమానుగతంగా తమ పెట్టుబడుల కేటాయింపులను రీబ్యాలెన్స్ చేసుకునే వారే దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను సొంతం చేసుకుంటున్నట్టు చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏదేనీ ఒక విభాగంలో (ఈక్విటీ లేదా డెట్ లేదా గోల్డ్) గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నప్పుడు లేదా కనీసం ఏడాదికి ఒక పర్యాయం అయినా పెట్టుబడుల కేటాయింపులను రీబ్యాలెన్స్ చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఆర్థిక సంవత్సరం చివర్లో ఈ పని చేయడం ద్వారా మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు ఉంటే సొంతం చేసుకోవచ్చు. అయితే రీబ్యాలెన్స్ అన్నది రిస్క్ తగ్గించుకునేందుకే కాదు.. మరెన్నో ప్రయోజనాలు దీనివల్ల ఇన్వెస్టర్ పొందొచ్చు. అప్పటి వరకు బాగా పెరిగిన వాటి నుంచి పెట్టుబడులను తీసుకుని, ర్యాలీకి సిద్ధంగా ఉన్న నాణ్యమైన వాటిల్లోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. చెట్టు నుంచి పుష్పాలను కోసుకుని, మళ్లీ పువ్వుల కోసం చెట్టుకు నీరు, పోషకాలు ఇచ్చినట్టే.. పెట్టుబడుల రీబ్యాలెన్స్ రాబడుల ఫలాలను ఇస్తుందని నిపుణుల సూచన. ఆర్థి క, పెట్టుబడుల వ్యవహారాలు అంత సులభమైనవి కావు. తగిన విషయ జ్ఞానంతోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక సలహాదారులను సంప్రదించడం సూచనీయం. -
శాఖల కేటాయింపు.. ఎన్సీపీ జాక్‌పాట్
సాక్షి, ముంబై : మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూచన మేరకు ఆయన ప్రతిపాదించిన మంత్రుల శాఖల జాబితాను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదివారం ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ముందుగా ఊహించిన విధంగానే ఎన్సీపీ సీనియర్ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థిక, ప్రణాళిక శాఖలను అప్పగించారు. అలాగే ఉద్ధవ్ కుమారుడు, ఆదిత్య ఠాక్రేకు పర్యవరణం, టూరిజం శాఖ దక్కింది. ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు హోంశాఖ, నవాబ్ మాలిక్ మైనార్టీ శాఖ, జయంత్ పాటిల్‌కు జలవనరులు శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్‌కు పబ్లిక్ వర్స్ దక్కింది. అయితే ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ ఎన్సీపీకే దక్కినట్లు తెలుస్తోంది. మిగతా వివరాలు రావాల్సి ఉంది. (శరద్ పవార్.. ప్రభుత్వంలో కీ రోల్) కాగా డిసెంబర్ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు: ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్: ఆర్థిక శాఖ, ప్రణాళికా శాఖ అనిల్ దేశ్‌ముఖ్: హోం శాఖ ఆదిత్య ఠాక్రే : పర్యావరణం, టూరిజం శాఖ బాలా సాహెబ్ తోరత్: రెవెన్యూ శాఖ అశోక్ చవాన్ : ప్రజాపనుల శాఖ (పబ్లిక్ వర్క్స్) ఏక్నాథ్ షిండే : పట్టణాభివృద్ధి శాఖ నవాబ్ మాలిక్ : మైనారిటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఛగన్ భుజ్‌భల్ : ఆహార, పౌర, వినియోగదారుల పరిరక్షణ శాఖ సుభాష్ దేశాయ్: పరిశ్రమలు, మైనింగ్, మరాఠీ భాషా మంత్రిత్వ శాఖ సంజయ్ రాథోడ్ : అటవీ శాఖ ఉదయ్ సామంత్ : ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ, దాదా భుసె : వ్యవసాయం, సందీప్ భుమ్రే : ఉపాధి హామీ, గులాబ్రావ్ పటేల్ : వాటర్ సప్లై, శంకర్రావు గడఖ్ : ఇరిగేషన్ శాఖ కాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ మరియు టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్, న్యాయశాఖ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వద్ద ఉండగా, ఇక ఇతర మంత్రులకు శాఖలు కేటాయించాల్సి ఉంది. -
ఆరుగురు మంత్రులకు శాఖల కేటాయింపు
-
శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే శాఖలను కేటాయించారు. గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌రావుకు.. ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తిరిగి ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు. కీలకమైన విద్యాశాఖను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దక్కించుకున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు నెరవేరుస్తున్న జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్‌శాఖను కేటాయించారు. ఆదివారం సాయంత్రం హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్‌లు మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. నూతన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన.. కొద్ది సమయంలోనే వారందరికీ శాఖలను కేటాయించారు. అయితే ఇవాళ రాత్రి 7 గంటలకు మంత్రివర్గ సమావేశం కానున్నట్లు సమాచారం. బడ్జెట్‌పై చర్చించిన అనంతరం కేబినెట్ దానిని ఆమోదించనుంది. మంత్రుల శాఖలు ఇవే.. కేటీఆర్: ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ హరీష్ రావు: ఆర్థిక శాఖ సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ గంగుల కమలాకర్: బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ సత్యవతి రాథోడ్: గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ పువ్వాడ అజయ్ కుమార్: రవాణ శాఖ చదవండి: వైభవంగా మంత్రుల ప్రమాణ స్వీకారం -
మోదీ..ముద్ర!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కొత్త కేబినెట్లో శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. అమిత్ షా, రాజ్‌నాథ్, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్.. తదితర కీలక నేతలకు మోదీ ఏ శాఖలు అప్పగించనున్నారనే దానిపై ఉత్కంఠ వీడింది. తన సన్నిహితులకు, విధేయులకు కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా తనదైన ముద్ర వేశారు. ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన హోం శాఖను ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి దారులు పరిచిన సన్నిహితుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అప్పగించారు. అదేవిధంగా, సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌కు రక్షణ శాఖను, నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ, గడ్కారీకి రోడ్డు రవాణా, రహదారుల శాఖతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలను అప్పగించారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రధాని మోదీతోపాటు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్, జైశంకర్ తదితరులు శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు. షా రాకతో..తగ్గనున్న ఎన్ఎస్ఏ ప్రాధాన్యం గత ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఎన్కే దోవల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఆయనే తీసుకునేవారు. కానీ, అమిత్ షా రాకతో ఈసారి ఆయన ప్రాధాన్యం తగ్గిపోనుంది. ప్రభుత్వంలో నంబర్–2గా మారనున్న అమిత్ షాయే రక్షణ సంబంధ విషయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. హోం మంత్రిగా అమిత్ షా కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370, 35 ఏ అంశాలతోపాటు ఉగ్రవాదం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మావోయిస్టుల ముప్పు, అస్సాం పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ వంటి వాటిపై ప్రముఖంగా దృష్టిసారించాల్సి ఉంది. అదేవిధంగా ప్రధానితోపాటు హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన ఎంతో కీలకమైన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ స్థానంలో అమిత్ షా, జై శంకర్ చేరారు. పలువురికి అదనపు బాధ్యతలు గత మంత్రి వర్గంలో రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయెల్‌కు ఈసారి వాణిజ్య, పరిశ్రమల శాఖ అదనంగా కేటాయించారు. ఆయనే నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖను మాత్రం కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న ప్రహ్లాద్ జోషికి ఇచ్చారు. జోషికి పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల శాఖను కూడా కేటాయించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆ పార్టీకి కంచుకోటగా భావించే అమేథీలో ఓడించిన స్మృతీ ఇరానీకి జౌళి శాఖతోపాటు ఈసారి మహిళా శిశు అభివృద్ధి శాఖలను ఇచ్చారు. గత మంత్రి వర్గంలో మాదిరిగానే ధర్మేంద్ర ప్రధాన్ ఈసారి కూడా పెట్రోలియం శాఖ ఇచ్చారు. దీంతోపాటు ఉక్కు మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించారు. రవి శంకర్ ప్రసాద్‌కు ఈసారి కూడా న్యాయ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాధ్యతలు ఇచ్చారు. దీంతోపాటు టెలికం శాఖను ఇచ్చారు. ప్రకాశ్ జవడేకర్‌కు ఈసారి పర్యావరణ శాఖతోపాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల బాధ్యతలను, నరేంద్ర సింగ్ తోమర్‌కు వ్యవసాయ శాఖతోపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ బాధ్యతలు ఇచ్చారు. జైట్లీ బాధ్యతలు నిర్మలకు.. నిర్మలా సీతారామన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అనారోగ్య కారణాలతో కేబినెట్‌కు దూరంగా ఉన్న సీనియర్ నేత, గత కేబినెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బాధ్యతలను ఈసారి నిర్మలకు కేటాయించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టనున్న రెండో మహిళా మంత్రిగా> ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. గతంలో ఇందిరాగాంధీ కొంతకాలం పాటు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. గత కేబినెట్లో ఆమెను రక్షణ మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. దౌత్యాధికారులకు అందలం ఊహించని విధంగా కేబినెట్లో చోటు దక్కించుకున్న విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జై శంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖ బాధ్యతలను అప్పగించారు. విదేశాంగ శాఖ బాధ్యతలను చేపట్టిన మొదటి దౌత్యాధికారి ఈయనే. ఏ సభలోనూ ఆయన సభ్యుడు కాదు. దీంతో నిబంధన ప్రకారం ఆరు నెలల్లోగా ప్రభుత్వం ఆయనకు సభ్యత్వం కల్పించే అవకాశం ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ చేసిన జై శంకర్..దౌత్యాధికారిగా విశేష అనుభవం గడించారు. రష్యా, చైనా, అమెరికాల్లో భారత్ తరపున వివిధ హోదాల్లో దౌత్యాధికారిగా సేవలందించారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కేబినెట్లో చోటు దక్కిన మాజీ దౌత్యాధికారి హర్దీప్ పూరికి పౌర విమానయాన, పట్టణాభివృద్ధి శాఖ(స్వతంత్ర హోదా)తోపాటు, వాణిజ్య పరిశ్రమల శాఖ బాధ్యతలు ఇచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్కే సింగ్‌కు విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ అప్పగించారు. టార్గెట్ 35ఏ కశ్మీర్‌పై అమిత్ షా గురి బీజేపీలో నంబర్ టూ స్థానంలో ఉన్న అమిత్ షా దేశానికి కొత్త హోం మంత్రి అయ్యారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, అక్రమ వలసలను అరికట్టడం నూతన హోం మంత్రి ప్రా«థమ్యాలు.అలాగే, ఎన్ఆర్సీ(జాతీయ పౌరసత్వ బిల్లు)ని దేశ మంతా అమలు పరచడం, జమ్ము,కశ్మీర్లో 35ఏ అధికరణను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు కూడా అమిత్ షా తీసుకునే అవకాశం ఉంది. 35ఎ అధికరణం కశ్మీరీలకు(స్థానికులు) ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పిస్తోంది. కశ్మీర్లో మహిళలు, శాశ్వత నివాసులు కానివారి పట్ల వివక్ష చూపుతున్న రాజ్యాంగంలోని 35ఎ అధికరణను రద్దు చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. 35 ఎ అధికరణ రాష్ట్రాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉందని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్లో ప్రజలందరి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలిచ్చే 370వ అధికరణను జనసంఘ్‌లో ఉన్నప్పటి నుంచీ అమిత్ షా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అక్రమ వలసలను అరికట్టడం కోసం ఎన్ఆర్సిని దేశమంతా అమలు చేస్తామని కూడా షా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హోం మంత్రిగా అమిత్ షా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. అపర చాణుక్యుడిగా పేరొందిన అమిత్‌షా మోదీకి అత్యంత విశ్వాస పాత్రుల్లో ఒకరు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా ఆ రాష్ట్ర హోం మంత్రిగా పని చేశారు. దేశంలో మావోయిస్టు హింస పెరుగుతుండటం, కశ్మీర్లో తీవ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరించడం షా ముందున్న ప్రధాన సవాళ్లని పరిశీలకులు అంటున్నారు. కశ్మీర్లో తీవ్రవాదాన్ని బలప్రయోగంతో అణచివేయాలా లేక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలా అన్నది నిర్ణయించడం ఆయన ఎదుర్కొనే మరో కీలకాంశం. సుప్రీం కోర్టు విధించిన గడువు జూలై 31 ఎన్ఆర్సి ప్రక్రియను పూర్తి చేయం, ఆంతరంగిక భద్రత పరిరక్షణ షా ముందున్న మరికొన్ని సవాళ్లు. -
వారందరి లెక్క తేలుస్తాం: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం సంతోషంగా ఉందని సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ కేటాయింపుల్లో హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. కీలక బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. ఉగ్రవాద కార్యకలపాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పడితే వారు మన దేశంలో ఉండేందుకు ఇదేమి ధర్మ సత్రం కాదని చెప్పారు. భారతీయులెవరు? చొరబాటుదారులెవరనేది లెక్క త్వరలోనే తేలుస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ ఉగ్రవాద ఘటన జరిగినా హైదరాబాద్‌ను మూలాలుంటున్నామని, ఉగ్రవాదులు హైదరాబాద్‌ను సేఫ్ జోన్‌గా చేసుకుంటున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని శాశ్వతంగా ఏరివేస్తాని కిషన్ రెడ్డి హెచ్చరించారు. పోలీసుశాఖను ఆధునీకరించి బలోపేతం చేస్తామన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రత మా ప్రధాన లక్ష్యమని, గతంలో బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీమా సురక్ష పేరుతో 25 రోజులు యాత్ర చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అదే అంశానికి సంబంధించిన హోంశాఖకు మంత్రికావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘సంపదకు గుర్తు లక్ష్మిదేవి...తొలిసారిగా ఆర్థికశాఖకు మహిళా మంత్రి అయ్యారు. దేశాభివృద్ధికి, తెలుగురాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాల సహాయం చేస్తారని భావిస్తున్నాం. తెలంగాణలో బీజేపీని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దుతాం. బీజేపీలో చేరేందుకు చాలా మంద్రి సంప్రదిస్తున్నారు. వారందరినీ చేర్చుకుంటాం’’ అని అన్నారు. చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు -
కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు
-
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండో సారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తన సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. గురువారం ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాను తొలిసారి క్యాబినెట్లోకి తీసుకున్న మోదీ ఆయనకు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మల సీతారామన్‌కు ఈ సారి ఆర్థిక శాఖ కేటాయించారు. అయితే సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ, ఇతర పాలసీ సమస్యలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖల్ని ప్రధాని మోదీ వద్దే ఉండనున్నాయి. మంత్రులకు కేటాయించిన శాఖలు... సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి కేంద్రమంత్రులు... 1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి) 2. రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ శాఖ) 3. అమిత్ షా (హోం శాఖ) 4. నితిన్ గడ్కరీ (రోడ్లు, రవాణా శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ) 5. సదానంద గౌడ (ఎరువులు, రసాయన శాఖ) 6. నిర్మలా సీతారామన్ (ఆర్థిక శాఖ, కార్పొరేట్ అఫైర్స్) 7. రాంవిలాస్ పాశ్వాన్ (వినియోగదారుల వ్యవహారాల శాఖ ) 8. నరేంద్ర సింగ్ తోమర్ (వ్యవసాయ శాఖ, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్) 9. రవిశంకర్ ప్రసాద్ (న్యాయ శాఖ) 10. హర్సిమ్రత్ కౌర్ బాదల్ (ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ) 11. థావర్ చంద్ గెహ్లాట్ (సామాజిక న్యాయ శాఖ) 12. సుబ్రహ్మణ్యం జయశంకర్ (విదేశాంగ శాఖ) 13. రమేశ్ పోఖ్రియాల్ (మానవ వనరులు శాఖ) 14. అర్జున్ ముండా (గిరిజన వ్యవహారాల శాఖ) 15. స్మృతి ఇరానీ ( మహిళ శిశు సంక్షేమం, జౌళి శాఖ) 16. డాక్టర్ హర్షవర్థన్ (వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ) 17. ప్రకాశ్ జవదేకర్ (అటవీ, పర్యావరణ శాఖ, సమాచార ప్రసార శాఖ) 18. పీయూష్ గోయల్ (రైల్వే శాఖ) 19. ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం శాఖ) 20. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ (మైనారిటీ వ్యవహారాల శాఖ) 21. ప్రహ్లాద్ జోషీ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు గనుల శాఖ) 22. మహేంద్రనాథ్ పాండే (నైపుణ్యాభివృద్ధి శాఖ ) 23. అరవింద్ సావంత్ (భారీ పరిశ్రమల శాఖ) 24. గిరిరాజ్ సింగ్ (పాడి, పశుసంవర్ధక, ఫిషరీస్ శాఖలు) 25. గజేంద్ర సింగ్ షెకావత్ (జల శక్తి) సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1. సంతోష్ కుమార్ గాంగ్వర్ (శ్రామిక, ఉపాధి కల్పన శాఖ) 2. ఇంద్రజిత్ సింగ్ (ప్రణాళిక, గణాంక శాఖ) 3. శ్రీపాద యశో నాయక్ (ఆయుష్, డిఫెన్స్ శాఖ సహాయమంత్రి) 4. జితేంద్ర సింగ్ (సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, పెన్షన్లు, ఈశాన్య రాష్ర్టాల వ్యవహారాలు, పీఎంవో సహాయ మంత్రి) 5. కిరణ్ రిజిజు (క్రీడలు, యుజవన, మైనార్టీ వ్యవహారాలు) 6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ (సాంస్కృతిక పర్యాటక శాఖ) 7. రాజ్ కుమార్ సింగ్ (విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి) 8. హర్దీప్ సింగ్ పూరి (గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ) 9. మన్ సుఖ్ మాండవ్య (షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు) సహాయ మంత్రులు 1. ఫగ్గీన్ సింగ్ కులస్తే (ఉక్కు శాఖ) 2.. అశ్వినీ చౌబే (కుటుంబ, ఆరోగ్య శాఖ) 3. అర్జున్ రామ్ మేఘవాల్ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, భారీ పరిశ్రమలు) 4. జనరల్ వీకే సింగ్ (రోడ్లు, రహదారులు శాఖ) 5. కిృషన్ పాల్ గుజ్జర్ (సాధికారిత, సామాజిక న్యాయం) 6. దాదారావ్ పాటిల్ (పౌర, ప్రజా సరఫరాల శాఖ) 7. కిషన్ రెడ్డి (హోంశాఖ సహాయమంత్రి) 8. పురుషోత్తం రూపాలా (వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ) 9. రాందాస్ అథవాలే (సాధికారిత, సామాజిక న్యాయం) 10. సాధ్వీ నిరంజన్ జ్యోతి (గ్రామీణాభివృద్ధి శాఖ) 11. బాబుల్ సుప్రియో (అటవీ, పర్యావరణ శాఖ) 12. సంజీవ్ కుమార్ బాల్యాన్ (పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్) 13. దోత్రే సంజయ్ శ్యారావ్ (మానవ వనరుల శాఖ,ఐటీ శాఖ) 14. అనురాగ్ సింగ్ ఠాకూర్ (ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ) 15. సురేష్ అంగాడి ( రైల్వేస్) 16. నిత్యానంద్ రాయ్ (హోంశాఖ) 17. రత్తన్ లాల్ కఠారియా (జల శక్తి, సాధికారిత, సామాజిక న్యాయం) 18. వి.మురళీధరన్ ( పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశాంగ శాఖ) 19. రేణుకా సింగ్ (గిరిజన శాఖ) 20. సోమ్ ప్రకాశ్ (వాణిజ్య, పరిశ్రమలు శాఖ) 21. రామేశ్వర్ తెలి (ఫుడ్ ప్రాసెసింగ్) 22. ప్రతాప్ చంద్ర సారంగి (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధక శాఖ) 23. కైలాస్ చౌదరి (వ్యవసాయ శాఖ) 24. దేబశ్రీ చౌదురి (మహిళ శిశు సంక్షేమం) -
ఏపీ మంత్రుల శాఖలు ఇవే
-
అచ్చెన్నాయుడికి ప్రమోషన్!
అమరావతి: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తన కేబినెట్ లోకి మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం శాఖలు కేటాయించారు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 11 మందిలో ముగ్గురికి కీలక శాఖలు దక్కాయి. సుజయకృష్ణ రంగారావు(మైనింగ్), అమరనాథ్ రెడ్డి(పరిశ్రమలు), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(వ్యవసాయం)లకు కీలక శాఖలు అందుకున్నారు. ఉత్తరాంధ్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడులకు ప్రమోషన్ దక్కింది. ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, కొల్లు రవీంద్రలను అంతగా ప్రాధాన్యంలేని శాఖలకు మార్చారు. ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప శాఖలను యథాతథంగా ఉంచారు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాల రావు శాఖలను మార్చలేదు. తనకు అత్యంత సన్నిహితులైన యనమల రామకృష్ణుడు, నారాయణ, గంటా శ్రీనివాసరావు శాఖల జోలికి చంద్రబాబు పోలేదు. -
ఏపీ మంత్రుల శాఖలు ఇవే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కొత్తగా తీసుకున్న మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. ఇంతకుముందున్న పలువురు మంత్రుల శాఖలను మార్చారు. ప్రతిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత సహా పలువురికి శాఖలను మార్చారు. మంత్రులకు కేటాయించిన శాఖలు ఈవిధంగా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప శాఖల్లో మార్పు లేదు. యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నారాయణ, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ శాఖలు మార్చలేదు. 1. నారాచంద్రబాబు నాయుడు: ఇన్వెస్ట్మెంట్, ఇప్రాస్ర్టక్చర్, మైనారిటీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు 2. కంబాలపాడు ఈడిగ కృష్ణ మూర్తి: డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్, రెవెన్యూ , స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ 3. నిమ్మకాయల చినరాజప్ప: డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్, హోం అండ్ విపత్తు నిర్వహణ 4. యనమల రామకృష్ణుడు: ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ టాక్స్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్ 5. నారా లోకేష్: పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యునికేషన్ 6. కిమిడి కళా వెంకట్రావు: విద్యుత్ 7. కింజారపు అచ్చెన్నాయుడు: రవాణా, బీసీ సంక్షేమం, ఎంపవర్మెంట్, హాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ 8. వెంకట సుజయ్ కృష్ణ రంగారావు: గనులు, జియాలజీ 9. చింతకాయల అయ్యన్నపాత్రుడు: రోడ్లు, భవనాలు 10. గంటా శ్రీనివాసరావు: మానవ వనరుల అభివృద్ధి, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ 11. కొత్తపల్లి శామ్యూల్ జవహర్: ఎక్సైజ్ 12. పితాని సత్యనారాయణ: కార్మిక, ఉపాధి, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ 13. పైడికొండల మాణిక్యాల రావు: దేవాదాయ శాఖ 14. కామినేని శ్రీనివాస రావు: ఆరోగ్య శాఖ, మెడికల్ ఎడ్యుకేషన్ 15. కొల్లు రవీంద్ర: లా అండ్ జస్టిస్, స్కిల్ డెవలప్మెంట్, యూత్, స్పోర్ట్స్, అన్ఎంప్లాయిమెంట్ బెన్ఫిట్స్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ 16. దేవినేని ఉమా మహేశ్వర రావు: జలవనరుల నిర్వహణ 17. నక్కా ఆనంద్ బాబు: సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, సాధికారత 18. ప్రత్తిపాటి పుల్లారావు: పుడ్ అండ్ సివిల్ సప్లైయ్స్, కన్జూమర్ వ్యవహారాలు, ధరల నియంత్రణ 19. శిద్ధా రాఘవ రావు: అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ 20. పొంగూరు నారాయణ: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి, అర్బన్ హౌసింగ్ 21. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి: వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రి ప్రాసెసింగ్ 22. చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి: మార్కెటింగ్, గిడ్డంగులు, యానిమల్ హజ్బాండ్రీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీష్ అండ్ కోపరేటివ్స్ 23. భూమా అఖిల ప్రియా రెడ్డి: టూరిజం, తెలుగు భాష, సంస్కృతి 24. కాల్వ శ్రీనివాసులు: రూరల్ హౌసింగ్ 25. పరిటాల సునీత: మహిళా సాధికారత, శిశు సంక్షేమం, వికలాంగ, వృద్ధుల సంక్షేమం 26. ఎన్. అమర్నాథ్ రెడ్డి: పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్, కామర్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్