
అచ్చెన్నాయుడికి ప్రమోషన్!
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తన కేబినెట్ లోకి మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం శాఖలు కేటాయించారు.
అమరావతి: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తన కేబినెట్ లోకి మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం శాఖలు కేటాయించారు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 11 మందిలో ముగ్గురికి కీలక శాఖలు దక్కాయి. సుజయకృష్ణ రంగారావు(మైనింగ్), అమరనాథ్ రెడ్డి(పరిశ్రమలు), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(వ్యవసాయం)లకు కీలక శాఖలు అందుకున్నారు. ఉత్తరాంధ్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడులకు ప్రమోషన్ దక్కింది.
ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, కొల్లు రవీంద్రలను అంతగా ప్రాధాన్యంలేని శాఖలకు మార్చారు. ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప శాఖలను యథాతథంగా ఉంచారు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాల రావు శాఖలను మార్చలేదు. తనకు అత్యంత సన్నిహితులైన యనమల రామకృష్ణుడు, నారాయణ, గంటా శ్రీనివాసరావు శాఖల జోలికి చంద్రబాబు పోలేదు.