
సాక్షి,విజయవాడ : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ రైతన్నను దగా చేసింది. అన్నదాత సుఖీభవపై యూటర్న్ తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు రైతులకు ఇచ్చేది రూ.14వేలేనని తేల్చి చెప్పింది.
అన్నదాత సుఖీభవపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలుతో కలిపి రూ.20 వేలు ఇస్తామని, మేనిఫెస్టోలో కూడా అదే చెప్పాము అంటూ అబద్ధాలు చెప్పారు. అయితే, మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడ కేంద్రం సహాయం ఇస్తేనే అన్నదాత సుఖీభవ ఇస్తామని ప్రస్తావించలేదు.
ఇప్పుడు అధికారంలోకి రాగానే రైతులకు ఎగనామం పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.14 వేలే ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రైతన్నులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment