annadata sukhibhava
-
అది పోయే ఇది పోయే అన్నదాత సుఖీభవపై అంబటి సెటైర్లు
-
ఆ వెయ్యితోనే సరా?
‘హలో.. 1100 అండీ.. నాపేరు మల్లేశ్వరరావు, మాది చీరాల. అన్నదాతా సుఖీభవ పధకం కింద తొలిసారి వేసిన వెయ్యి రూపాయలు వచ్చాయి గానీ రెండోసారి రూ.3 వేలు రాలేదండి. లైన్లో ఉంటా, ఒక్కసారి కనుక్కుంటారా?’ ‘మీ ఆధార్ నెంబర్ చెప్పండి.. మీకు అన్నదాతా సుఖీభవ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా పంపిన నిబంధనల ప్రకారం మీరు అర్హులు కారు. ఒకసారి పీఎం కిసాన్ నిబంధనలు చదువుకోండి..’ (ఫోన్ కట్) ..మల్లేశ్వరరావు మళ్లీ ఫోన్ చేసి.. ‘ఒక్క నిమిషం నామాట వినండి.. తొలి విడత వెయ్యి రూపాయలు వచ్చాయండి. అందువల్ల నేను అర్హుడినే. రెండో విడత డబ్బులు మాత్రం రాలేదండీ..’ ‘అప్పుడు ఎన్నికలు అని అందరికీ వేసినట్టున్నారు. ఇప్పుడు మాత్రం మీరు అర్హులు కాదని రికార్డులు చెబుతున్నాయి. ఇంతకు మించి మాకు ఏమీ తెలియదు...’ సాక్షి, అమరావతి : అన్నదాతా సుఖీభవ పథకానికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే 1100 నెంబర్లో సంప్రదించాలని సూచించిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఆ పేరు చెబితేనే ఫోన్ కట్ చేస్తున్నారని రైతన్నలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతా సుఖీభవ డబ్బులు తమ ఖాతాలకు జమ కాలేదంటూ 1100 కాల్ సెంటర్‌కు నిత్యం వందల సంఖ్యలో కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నా అటువైపు నుంచి మాత్రం ఒకే సమాధానం వస్తోంది. ‘ఆ పథకం మీకు వర్తించదు... కావాలంటే నిబంధనలు చదువుకోండి’ అంటూ ఫోన్ కట్ చేస్తున్నారు. నది దాటే వరకు ఓడ మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య అంటే ఇదేనంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే రైతులందరికీ ఈ పథకం కింద డబ్బులు జమ కావాల్సి ఉండగా ప్రభుత్వం చేతులెత్తేసింది. అంతా ఆయనే ఇస్తున్నట్లు ప్రచారం ఐదు ఎకరాల లోపు పొలం ఉండే రైతు కుటుంబాలకు ఏటా రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రకటించింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఈ పథకం వర్తించదు. రాష్ట్రంలో 85 లక్షల మందికిపైగా రైతులుండగా 37,97,234 మంది పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు హడావుడిగా అన్నదాతా సుఖీభవ పథకాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు రైతు కుటుంబాలకు రూ.9 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఈ లెక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఇచ్చే మొత్తం రూ.15 వేలు అవుతుంది. అయితే ఇదంతా తానొక్కడినే ఇస్తున్నాననే తరహాలో చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. అనుకూల మీడియాలో ప్రచారం పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.2 వేలను జమ చేసిన అనంతరం అన్నదాతా సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి విడతగా రూ.వెయ్యి జమ చేస్తున్నట్లు ప్రకటించుకుంది. అయితే ఐదు ఎకరాలకుపైగా ఉన్న వారి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో ఓట్ల కోసం పీఎం కిసాన్ పథకం పరిధిలోకి రాని రైతులకు కూడా ఏడాదికి రూ.10 వేలు ఇస్తామంటూ చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు రూ.వందల కోట్లలో నిధులు విడుదలైనట్లు తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఎన్నికలు ముగియడంతో అసలు బండారం బయట పడుతోంది. రుణమాఫీ తరహాలోనే ఈ పథకం కూడా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం ఆకర్షణీయమైన హామీలిచ్చి తరువాత గాలికి వదిలేయడం ఆయనకు అలవాటేనని మండిపడుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత కోటయ్య కమిటీ, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో వడ్డీలకు కూడా చాలని విధంగా దగా చేయడంతో డిఫాల్టర్లుగా మిగలడం తెలిసిందే. ఇప్పుడు అన్నదాతా సుఖీభవ పథకం కూడా అదే కోవలోకి చేరింది. ఎన్నికలకు ముందు తొలి విడతగా రూ.వెయ్యి అందుకున్న వారు మలివిడత రూ.3 వేలు పొందేందుకు ఎందుకు అర్హులు కారో బోధపడటం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కొందరికే ‘సుఖీభవ’
సాక్షి,విజయవాడ: ఎన్నికలకు రెండునెలల ముందు తెలుగుదేశం ప్రభుత్వం రైతులపై ప్రేమ నటిస్తూ ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం అర్హులందరికీ అందడం లేదు. రైతులకు రెండు విడతలు రుణమాఫీ, మూడేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీలు, బీమాలు ఇవ్వకుండా.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టడం..దాన్ని సమర్థంగా అమలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పథకం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో నేరుగా విడతలవారీగా రూ.9వేల జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత రూ.1000, రెండో విడత రూ.2వేలు.. మిగిలిన సొమ్ము రబీలో జమ చేస్తామని చెప్పారు. అయితే చాలా మంది ఖాతాల్లో తొలి విడత రూ.1000 కూడా జమ కాలేదు. జిల్లాలో భూ కమతాలు.. జిల్లాలో 6.14లక్షలు మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే అన్నదాత సుఖీభవకు 3.99 లక్షల కుటుంబాలే ఎంపికయ్యాయి. ఈ విధంగా ఎంపికైన వారిలో 61,938 మందికి ఇప్పటి వరకు కనీసం రూ.1000 జమ కాలేదు. ఆధార్ నంబర్లు వారి వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేయకపోవడం వల్లనే డబ్బులు పడటం లేదని అధికారులు చెబుతున్నారు. అనర్హులకు డబ్బులు అయితే సెంటు భూమి లేని వారి బ్యాంకు ఖాతాలకు రూ.1000 జమ అవుతోంది. గుడివాడ, పెనమలూరులలో ఈ విధంగా డబ్బులు జమ అయ్యాయి. కాగా కొన్ని చోట్ల చనిపోయిన వారి బ్యాంకు ఖాతాల్లోనూ డబ్బులు జమయ్యాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. లబ్ధిదారుల పరిశీలన నిల్.. అన్నదాత సుఖీభవకు అర్హులైన వారి వివరాలను వ్యవసాయశాఖాధికారుల నుంచి తీసుకోలేదు. వెబ్‌ల్యాండ్‌ను అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం లబ్ధిదారులను ఎంపిక రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు చేశారు. దీంతో అనేక వేల మంది ఈ పథకానికి అర్హత పొందలేకపోయారు. రియల్ టైమ్ గవర్నెర్స్ మాయ.. రియల్ టైమ్ గవర్నర్స్ నుంచి ఆయా వసాయశాఖాధికారులకు లిస్టులు వస్తున్నాయి. ఆధార్‌కార్డు అనుసంధానం కాని వారి ఫోన్లు నంబర్లు పంపుతున్నారు. ఆ ఫోన్లకు అను సంధానం చేసే బాధ్యత అధికారులకు అప్పగించారు. ఈ విధంగా అనుసంధానం చేసిన తర్వాత కూడా వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయో లేదో అధికారులకు తెలియదు. అధికారులు చుట్టూ రైతులు ప్రదక్షిణలు.. పథకంలో కొంతమందికి డబ్బులు వచ్చి మరికొంతమందికి డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరు మండల వ్యవసాయశాఖాధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే తాము ఏమీ చేయలేమని, అన్ని అర్హతలు ఉంటే వారి పేరు ఆర్టీజీఎస్కు పంపుతామని చెబుతున్నారు. -
సాయం కొందరికే!
గిద్దలూరు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన అ న్నదాత సుఖీభవ పథకం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. రైతన్నలను గందరగోళానికి గురిచేస్తోంది. రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వేళ మరో తాయిలం ఎరచూపింది. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏడాదికి రూ.6వేలు ఇస్తామని ప్రకటించడంతో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తుగడ వేసింది. కేంద్ర సాయానికి మరో రూ.4వేలు జతచేసి రూ.10వేలు అ న్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రచారం చేసింది. రైతుల ఖాతాల్లో ముందుగా రూ.వెయ్యి జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నగదు కొందరు రైతుల ఖాతాలకే జమవడంతో మిగిలిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు భూములు ఉన్నాయి, పంటలు పండిస్తున్నాం, ఆన్లైన్లో భూముల వివరాలు కనిపిస్తున్నా తమకు నగదు ఎందుకు పడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జిల్లాలో 92,571మంది రైతులకు రైతు సుఖీభవ పథకం నగదు ఖాతాలకు చేరలేదు. దీంతో రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు నగదు ఎలా వస్తుందని అధికారులను అడిగినా కొన్ని మండలాల్లోని వ్యవసాయ కార్యాలయాల్లో అధికారులు అందుబాటలో లేకపోవడం, ఎంపీఈఓలు సమ్మెలో ఉండటంతో రైతులు ఏం చేయాలో పాలుపోక ఆవేధనకు గురవుతున్నారు. వెబ్‌ల్యాండ్‌కు లింక్ కాని ఆధార్... రైతుల భూములకు వెబ్ ల్యాండ్‌లో ఆధార్ లింక్ కా>కపోవడంతో రైతు సుఖీభవ నగదు ఖాతాల్లో జమకావడం లేదని అధికారులు చెబుతున్నారు. మరికొందరికి బ్యాంకు ఖాతా నెంబర్లు సక్రమంగా నమోదు చేయకపోవడం, వీటితో పాటు రైతుల ఫోన్ నంబర్‌కు ఆధార్ సీడింగ్ కాకపోవడం వంటి కారణాలతో రైతులకందాల్సిన సాయం అందడం లేదన్న వాదనలు వినవస్తున్నాయి. దీంతో రైతుల్లో బేస్తవారిపేట వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద రైతుల నిరసన అర్హత ఉన్నా పేర్లు జాబితాలో లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నిస్తున్న రైతులు గందరగోళం నెలకొంది. వ్యవసాయ పెట్టుబడి నిధి కింద 5 ఎకరాల లోపు రైతులకు రూ.9 వేలు, 5ఎకరాల పైబడిన రైతులకు రూ.10వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలివిడతగా రూ.వెయ్యిని ఖాతాలకు జమచేశారు. చాలా మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో తమకు నగదు ఎందుకు రాలేదోనని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమాధానం చెప్పేవారు కరువు.. పెట్టుబడి సాయం ఖాతాలో జమ అయినట్లు కొందరు రైతుల సెల్ ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు రాని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం 80 శాతం మంది రైతుల ఖాతాలకు డబ్బలు జమ అయినట్లు చెబుతున్నా అవి ఏ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయో, ఎవరెవరి ఖాతాల్లో పడ్డాయో రైతులు తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు నగదు పడని రైతుల పేర్లు నోటీసు బోర్డులో అంటించారు. అవి ఆంగ్లంలోలో ఉండటంతో వారికి అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు చెప్పేందుకు అధికారులు లేకపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా, ఎంపీఈఓలు వారి సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. దీంతో బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడని రైతులు సుఖీభవ సాయం కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా డబ్బులు పడని రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. రైతుల ఖాతాల వివరాలు ఆన్లైన్లో సక్రమంగా లేకపోవడం, వెబ్ ల్యాండ్‌లో వారి భూములకు ఎదురుగా ఆధార్ నంబర్ లేకపోవడం సమస్యగా మారింది. వీటితో పాటు స్మార్ట్‌పల్స్ సర్వేలో నమోదు కాకపోయినా ఈ రైతులకు సుఖీభవ సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. వెబ్‌ల్యాండ్‌లో వివరాలు సక్రమంగా ఉన్నప్పటికీ వారి బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ జరగకపోవడం, వారి ఫోన్ నంబర్లకు ఆధార్ సీడింగ్ లేకపోవడం వలన కూడా సుఖీభవ పథకానికి సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఏ రైతుకు ఏ సమస్యపై నగదు రాలేదో అర్థంకాక సతమతమవుతున్నారు. జిల్లాలో 92,571మందికి అందని సాయం.. జిల్లాలో 92,571 మంది రైతులకు సుఖీభవ నగదు జమకాలేదు. వీరిలో 4,713 మంది రైతుల పత్రాలు అప్లోడ్ చేశామని, 87,858 మంది రైతుల పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉందని ఆన్లైన్లో నమోదు చేశారు. కానీ, నగదు వారి ఖాతాలకు చేరకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు నగదు రాకపోవడానికి కారణం చెప్పాలని కోరుతున్నారు. బేస్తవారిపేటలో రైతుల ఆందోళన బేస్తవారిపేట: అన్నదాత సుఖీభవ కింద అందిస్తానని ప్రభుత్వం ప్రకటించిన మొత్తం అందక గిద్దలూరు నియోజకవర్గంలోని వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.9 వేలు విడుతల వారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రైతు కాతాలకు రూ.1000 జమ చేశారు. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది రైతుల ఖాతాలు గల్లంతయ్యాయి. తమ ఖాతాల్లో నగదు పడలేదని పేద రైతులు వారం రోజులుగా పనులు పోగొట్టుకుని బ్యాంకులు, వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. శుక్రవారం బేస్తవారిపేట మండలానికి చెందిన రైతులు స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏఈఓలు తలలు పట్టుకుంటున్నారు. -
కరువు, చంద్రబాబు ఇద్దరు కవలలు
సాక్షి, విజయవాడ: అన్నదాత సుఖీభవ అనే అర్హత టీడీపీ ప్రభుత్వానికి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను నిలువునా ముంచారని దుయ్యబట్టారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల గురించి ఆలోచించి రెండేళ్ల కిందటే రైతు భరోసా పథకాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. ఓ వైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాదంటూనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 6 వేలతో కలిపి మొత్తం రూ. 10 వేలు ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచన చేయడమే అని నాగిరెడ్డి మండిపడ్డారు. ఏపీని దుర్భిక్షాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ ఇప్పటివరకూ కాలేదని.. రైతుల బకాయిలూ ఇప్పటికీ చెల్లించలేదన్నారు. కరువు, చంద్రబాబు ఇద్దరూ కవల పిల్లలని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే తన పాలన చూసి ఓటెయ్యమని అడగగలరా అని ప్రశ్నించారు. రైతుల ఉసురుతో రానున్న ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని నాగిరెడ్డి జోస్యం చెప్పారు. -
కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రైతులకు సాయం
సాక్షి, అమరావతి: అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6 వేలతో కలిసి మొత్తం రూ.10 వేలు ఇవ్వనున్నారు. ఖరీఫ్‌లో మొదటి దశ, రబీలో రెండు దశలు మొత్తం మూడు దశల్లో ఈ మొత్తాన్ని ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఎన్నికలు ముందు వరుసగా మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో బుధవారం మరోసారి నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీ వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 5 ఎకరాలలోపు ఉన్న 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.6 వేలను మూడు వాయిదాల్లో ఇవ్వనుందని, అది ఏమాత్రం చాలదని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అందుకే 54 లక్షల కుటుంబాలకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు తాము రూ.4 వేలు కలిపి మొత్తం రూ.10 వేలు ఇస్తామని అన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం లెక్కలోకి రాని 5 ఎకరాలకు పైగా భూములున్న రైతులు మరో 15 లక్షల మంది ఉంటారని, వారికి రాష్ట్రం నుంచే మొత్తం రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. 54 లక్షల మందికి కేంద్రం తొలివిడత ఇచ్చే రూ.2 వేలకు తాము రూ.3 వేలు కలిపి మొత్తం రూ.5 వేలు ఇస్తామన్నారు. కేంద్రమిచ్చేది తొలి విడత రూ.1,080 కోట్లుకాగా, తాము తొలి విడత (రూ.3 వేల చొప్పున) ఇచ్చేది రూ.1,620 కోట్లని వెల్లడించారు. కేంద్ర పథకం పరిధిలోకి రాని సుమారు 15 లక్షల మందికి రూ.10 వేలు రాష్ట్రం ఇస్తుంది కాబట్టి దానికి రూ.750 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. కౌలు రైతుల లెక్కలు తీసి ఖరీఫ్‌లో వారికి సుఖీభవ పథకం కింద డబ్బులిస్తామన్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు... సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేయాలని నిర్ణయం. ఫిబ్రవరి నెలాఖరులో అన్నదాత సుఖీభవ చెక్కులు పంపిణీకి చేసేందుకు ఆమోదం. కేంద్రం ప్రకటించిన రైతు పథకం పరిధిలోకి రాని రైతులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం. రైతు రుణమాఫీ కింద మిగిలినపోయిన చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయం. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేందుకు ఆమోదం. సిమ్ కార్డుతోపాటు మూడేళ్లు కనెక్టివిటీ ఇచ్చేలా నిర్ణయం. ఏపీ వ్యవసాయ మండలి ఏర్పాటుకు ఆమోదం. వ్యవసాయ, ఉద్యానవనాల విద్య క్రమబద్ధీకరణకు ఈ మండలి ఏర్పాటు. - పంచాయతీల్లో కంటింజెన్సీ ఉద్యోగులకు జీతాల పెంపుపై నిర్ణయం. - 1998లో డీఎస్సీలో క్వాలిఫై అయిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయం. - 1983–96 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయం. - వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం–తిరుపతి ఆధ్వర్యంలో తొమ్మిది పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, తొమ్మిది ఫిషరీస్ పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు ఆమోదం. - ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు (రైలుకు రూ.1.23 కోట్లు, ఏపీ భవన్లో ఖర్చు రూ.1.60 కోట్లు) మొత్తం రూ.2.83 కోట్లకు ఆమోదం. - తిత్లీ, పెథాయ్ తుపాన్లలో నష్టపోయిన రైతులకు మిగిలిన పెండింగ్ సొమ్మును వెంటనే ఇవ్వాలని నిర్ణయం. - 78 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల మంజూరుకు ఆమోదం. వీటితోపాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్స్, 28 మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు, 28 మంది శాంప్లింగ్ అసిస్టెంట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని నిర్ణయం. భూ కేటాయింపులు - సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సీఈఎస్ఎస్) సంస్థకు అమరావతి కేపిటల్ సిటీ వెలుపల 10 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం. - తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి చెందిన 17.17 ఎకరాల భూమి ఉచితంగా కేటాయింపు. - విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మారుపల్లిలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి బదలాయింపు. - వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు. ఇందుకోసం 153.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా కేటాయింపు. - వైకుంఠపురం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ తీర్మానం. అన్నదాత సుఖీభవతో రైతులకు సాయం: మంత్రి సోమిరెడ్డి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ.10,000 సాయం చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం చెప్పారు. కేంద్రం ఒక్కో విడత ఇచ్చే రూ.2,000తో పాటు మరో రూ.3,000 కలిపి మొత్తం రూ.5,000 చొప్పున రెండుసార్లు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. కేంద్రం ప్రకటించిన పథకం కింద రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు అర్హత సాధిస్తారని, వీరితోపాటు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న వారు 15 లక్షల వరకు ఉంటారని, వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 చొప్పున సాయం చేస్తుందని మంత్రి ప్రకటించారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో మార్చి నెలలో రూ.4,000 కోట్లు, ఏప్రిల్‌లో మరో రూ.4,000 కోట్లు జమ చేస్తామని తెలిపారు. -
‘అన్నదాత’కు మళ్లీ టోకరా!
సాక్షి, అమరావతి: అన్నదాత సుఖీభవ పేరుతో మరో వంచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీశారు. ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇస్తామని ఊదరగొట్టి ఎల్లో మీడియా ద్వారా లీకులు ఇచ్చి చివరకు పంచ పాండవులు అంటే మంచపు కోళ్లు అనే మాదిరిగా వ్యవహరించారు. తాను ఏం ఇస్తారో చెప్పడానికి బదులు తనకు సంబంధం లేని మొత్తాన్ని కలిపేసుకుని అంకెల గారడీ చేస్తున్నారు. చివరకు రైతు కుటుంబాలను, సాగు విస్తీర్ణాన్ని సైతం తారుమారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వేను బుట్టదాఖలు చేసి మోసానికి మారుపేరుగా నిలిచారు. తానిస్తానని ప్రచారం చేసుకున్న రూ.10 వేలకు కత్తెర వేసి రూ.4 వేలకు కుదించారు. రైతు కుటుంబాల సంఖ్య, నిధుల్లోనూ దారుణంగా కోత వేశారు. చంద్రబాబు దిగిపోయే ముందు ప్రవేశపెట్టిన తనది కాని చివరి బడ్జెట్లో రైతులకు తూతూమంత్రంగా రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి దాంట్లోనూ సగం కోత విధించారు. మరోపక్క ప్రధాని మోదీ రాష్ట్రానికి ద్రోహం చేశారని దేశ రాజధాని ఢిల్లీ మొదలు గల్లీ వరకు ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఆయన ప్రకటించిన సాయాన్ని కూడా కలిపేసుకుంటున్నారంటే పరమార్థం ఏమిటి? ఒపక్క మోదీ తిరిగి అధికారంలోకి రాడని చెబుతూ మరోపక్క ఆయన సాయాన్ని కలిపేసుకుంటున్నారంటే మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నట్లు ఉందనే భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. లెక్కల్లోనూ మోసం... అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేల సాయం ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అశ్వత్థామ హతఃకుంజరః అన్నట్టు కేంద్ర సాయం కలుపుకొని చావుకబురు చల్లగా– చెప్పారు. ఈ మోసం ఇంతటితో ఆగలేదు. రాష్ట్రంలో రైతు కుటుంబాలలోనూ కోత వేశారు. వ్యవసాయ శాఖ 2015–16 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 85,35,150 రైతు కుటుంబాలున్నాయి. వీరిలో ఐదు ఎకరాలలోపు ఉన్న వారు 75 లక్షలకు పైగా ఉన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వీరిని 54 లక్షలకు కుదించింది. అంటే సన్న,చిన్నకారు రైతులను సైతం మోసగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. 5 ఎకరాల పైబడి ఉన్న వారి సంఖ్యలోనూ చేతి వాటం చూపి అంకెల గారడీ చేశారు. కౌలు రైతుల విషయంలోనూ ఇదే జరిగింది. 2015లో ప్రభుత్వ అంచనా ప్రకారం 17 లక్షల మంది కౌలు రైతులున్నారు. వారందరికీ రుణ అర్హత పత్రాలు, సాగు ధృవీకరణ పత్రాలు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు వారి సంఖ్యను 15 లక్షలకు కోత వేశారు. ఇలా రైతుల సమాచారం మొత్తాన్ని తిమ్మిని బమ్మిని చేసి మాయాబజారు సినిమా చూపించారు. నిధుల్లో కోత.. నిధుల వ్యవహారంలోనూ చంద్రబాబు దగాకు పాల్పడ్డారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.60 కోట్ల ఎకరాలు. ఈ లెక్కన చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం ఎకరానికి పది వేల చొప్పున రూ.16 వేల కోట్లు కావాలి. నవరత్నాలను కాపీ కొడుతున్న చంద్రబాబు.. రైతు భరోసా పథకాన్ని అయినా సరిగా చేశారా అంటే అదీ లేదు. 2017లోనే వైఎస్ జగన్ పార్టీ ప్లీనరీలో ప్రకటించిన దాని ప్రకారం ప్రతి రైతుకుటుంబానికి పెట్టుబడి సాయం కింద ఏటా రూ.12,500 ఇస్తానన్నారు. రాష్ట్రంలో 86 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన కుటుంబానికి రూ.12,500 అనుకున్నా రూ.10,600 కోట్లు కావాలి. కానీ చంద్రబాబు తనది కాని తాత్కాలిక బడ్జెట్లో కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించి మోసం చేశారు. ఆ మోసంలోనూ మరో ఘరానా మోసం ఏమిటంటే దాంట్లో సగం కూడా రైతన్నలకు విదల్చకపోవడమే. కుటుంబాల సంఖ్యను కోత వేసి సాయాన్ని తగ్గించి వేశారు. ప్రతి ఎకరానికి రూ.10 వేలని ఊదరగొట్టి ఇప్పుడు దాన్ని రూ.4 వేలకు పరిమితం చేశారు. చంద్రబాబు మోసాలు ఇంతటితో ఆగలేదు. కాపీ కొట్టడంలోనూ ఫెయిల్.. వ్యవసాయం సంక్షోభంలో చిక్కి, అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్న స్థితిలో రెండేళ్ల కిందటే ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం కింద ప్రతి ఖరీఫ్‌కు ముందు చెల్లిస్తానని చెప్పారు. దీంతో ఎన్నికల ముందు చంద్రబాబు రైతుబంధు, రైతు రక్ష అంటూ రకరకాల లీకులు ఇచ్చి చివరకు అన్నదాత సుఖీభవ పథకం తెచ్చారు. జగన్ చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలోని రైతు కుటుంబాలన్నింటికీ రూ.12,500 చొప్పున చెల్లించడానికి ఏడాదికి రూ.10,600 కోట్లు అవసరం. రైతుల్ని ఆదుకుంటామని నమ్మబలుకుతూ తాజా బడ్జెట్లో చంద్రబాబు కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించి మళ్లీ అందులోనూ మోసం చేసి సగానికిపైగా కోత విధించారు. మోదీ మళ్లీ రారంటూ ఆయన సాయాన్ని కలిపేసుకుంటారా? నరేంద్ర మోదీ అంతుచూస్తాననంటూ ఆయన ప్రకటించిన సాయాన్ని చంద్రబాబు కలిపేసుకోవడం పట్ల రాష్ట్ర ప్రజలలో విస్మయం వ్యక్తమవుతోంది. రైతులకు ఆర్థిక సాయం పేరిట కేంద్రం సన్నచిన్న కారు రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తామని తన బడ్జెట్లో పెట్టినప్పుడు ముష్టి వేసినట్టు వేస్తారా? అని దుమ్మెత్తిపోసిన చంద్రబాబు ఇప్పుడు ఆ సాయంతో కలుపి రూ.10వేలు ఇస్తాననడం విడ్డూరం. ఓపక్క మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానంటున్న చంద్రబాబు రాష్ట్రంలో రైతుల్ని మాత్రం అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నారు. ఎకరానికి పది వేల రూపాయల సాయం చేస్తానని చెప్పిన పెద్దమనిషి ప్లేట్ ఫిరాయించి కేంద్రం డబ్బును కలిపి ఇస్తానంటున్నారు. అంటే దాని అర్థం తిరిగి మోదీ అధికారంలోకి వస్తారనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న మోసానికి ఇది పరాకాష్ట కాదా? అని నిలదీస్తున్నారు. తనది కాని బడ్జెట్లో ఇలా చేయవచ్చా? చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 5 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రవేశపెట్టింది కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. నిజానికి ఇందులో ఎటువంటి విధానపరమైన వాటికి కేటాయింపులు ఉండకూడదు. కేవలం జీతభత్యాలు, దైనందిన అవసరాల ఖర్చులు మాత్రమే చూపాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు పెట్టారు. ప్రజల తీర్పు అనంతరం వచ్చే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రైతుల్ని రుణమాఫీ పేరిట, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పేరిట మోసం చేయడం తెలిసిందే. ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందాన కేంద్రం సొమ్ముతో తానే రైతు కుటుంబానికి పది వేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం విడ్డూరం. ఇదేదో బ్రహ్మాండం బద్ధలయిపోయినట్టుగా ఎల్లో మీడియా ద్వారా ఊదరగొట్టించడం, చర్చలు పేరిట రాద్దాంతాలు సృష్టించారు. తాను ఇవ్వాల్సింది ఇస్తానని చెప్పడానికి బదులు కేంద్రం డబ్బులు కలిపి రూ.పది వేలని హడావిడి చేయడం గమనార్హం. తొలి సంతకానికే దిక్కులేదు... అధికారం కోసం రుణమాఫీని ప్రకటించి తొలిసంతకం అంటూ ప్రచారం చేసుకుని రైతుల్ని నిలువునా వంచించిన చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని ప్రాధమిక మిషన్‌లో చేర్చి ఆర్భాటం చేశారు. కోటయ్య కమిటీ, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, పలు వడపోతలతో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా రైతులను అప్పుల ఊబిలోకి దించారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రూ.3వేల కోట్లు ఇంతవరకు రాలేదు. రబీ పరిహారం ఇంతవరకు లెక్క తేలలేదు. గత ఏడాది రైతులకు బీమా, పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సిన మరో వేయి కోట్లు అలాగే ఉండి పోయాయి. ఇవన్నీ వెరసి రూ.15 వేల కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని ఎగ్గొట్టి అన్నదాతా సుఖీభవా అంటూ కేంద్రం సాయాన్ని కలిపేసుకోవడం గమనార్హం. -
రైతులు బంద్ ప్రకటిస్తే?
‘‘రైతే రాజు అంటారు. ఆ రాజే లేకపోతే ప్రజలు ఏమవుతారు? ౖరైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలన్నా.. వ్యవసాయం దండగ కాదు, పండగ కావాలన్నా డా.స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ రేపు రిలీజ్ అవుతోంది. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘పంటలకు మద్దతు ధర లేకుంటే రైతులు సహనం కోల్పోతారు. అలుగుటయే ఎరుగని ధర్మరాజు అలిగితే ఎలా ఉంటుందో.. గంగిగోవులాంటి రైతు కోపోద్రిక్తుడై రైతు బంద్ ప్రకటిస్తే ప్రజల పరిస్థితి ఏంటì ? అన్నదే మా సినిమా. సుద్దాల అశోక్‌తేజ, గోరటి వెంకన్న, గద్దర్, వంగపండు మంచి పాటలిచ్చారు’’ అన్నారు. -
దర్శకులు మెచ్చిన ‘అన్నదాత సుఖీభవ’
ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులకు ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు ఆర్. నారాయణమూర్తి. చిత్రాన్ని వీక్షించిన అనంతరం ప్రముఖులు ఈ విధంగా స్పందించారు. నగలు తాకట్టు పెట్టానన్నాడు: కోడి రామకృష్ణ ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి టీచర్, ప్రతి రాజకీయ నాయకుడు.. ముఖ్యంగా మన భారత ప్రధాని ఈ సినిమా చూడాలి. సినిమా చూస్తున్నప్పుడు మనం రైతులను వెంటనే కాపాడాలనే ధైర్యం, ఆత్రుత కలిగాయి. నాకు కౌలు రైతులున్నారు. వారు నా దగ్గరికి కౌలు డబ్బులు ఇవ్వటానికి వచ్చినప్పుడల్లా ఈసారి గిట్టుబాటు ధర రానందున మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి తెచ్చానండి అనేవాడు. మరో రైతు మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలేదన్నాడు. ఇలా చెబుతున్నప్పుడు ఇప్పుడు మనం ఈ డబ్బులు తీసుకోవాలా, అలా తీసుకుంటే మనం రాక్షసులం అనే ఫీలింగ్ వచ్చేది నాకు. అందుకే నాలా ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వండి. పంటలు పండించే రైతును మనం సానుభూతితో చూద్దాం. రైతు లేనిదే దేశం లేదు: ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రంలో ప్రతి పాటా మెసేజ్ ఓరియంటెడ్‌గా ఉంది. రైతు లేనిదే దేశం లేదు. గ్రామాలనుండి, పట్టణాల వరకు రైతు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, రైతుల డిమాండ్‌ను పాలకులు పట్టించుకోకపోతే తిరగబడి రైతులందరూ సమ్మె చేస్తే.. ఈ సినిమాకు ఇది అద్భుతమైన ఫినిషింగ్. కల్తీ గురించి బాగా చూపించారు: కోదండ రామిరెడ్డి ప్రతిరోజు అందరం వింటున్నాం. పాలల్లో కల్తీ, నూనెల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ.. ఇలా ప్రతిదీ కల్తీనే. దీని గురించి సినిమాలో బాగా చూపించారు. ప్రతి సమస్యను చర్చించారు: తమ్మారెడ్డి భరధ్వాజ ఈ చిత్రంలో రైతుకి ఉండే ప్రతి సమస్యను చర్చించారు. వాటి పరిష్కార మార్గాల్ని చూపించారు. ఇంత ధైర్యంగా సినిమా తీసినోడు ఎవరూ లేరు. మంచి సినిమా తీశారు. ఈ సినిమా అందరూ చూడాలని.. చూస్తారని ఆశిస్తున్నా. ఆత్మహత్యలు లేని రైతు రాజ్యం రావాలి: యన్.శంకర్ ఇప్పుడున్న జనరేషన్‌కి వాళ్లు తింటున్న అన్నం ఎక్కడి నుండి వస్తుంది? అదెక్కడ పుడుతుంది? ఎవరు పుట్టిస్తారు అనేది తెలియదు. ఈ సినిమాను ఈ జనరేషన్ పిల్లలు చూడాలి. ఆత్మహత్యలు లేని రైతు రాజ్యం రావాలని, రైతు ఇంట్లో సంబంధం అంటే ఎంత గౌరవంగా ఉంటుందో అనే విధంగా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నా. రైతు సమస్యకు పరిష్కారం లేదు: ధవళ సత్యం ఈ దేశానికి కొరుకుడు పడని సమస్య రైతు సమస్య. ఆ సమస్యలకు పరిష్కారం లేనివాడు రైతే. రైతులందరూ ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. తను పండించిన పంట గిట్టుబాటు ధర రానందుకు ఆత్మహత్య తప్ప వేరే మార్గమే లేదు అనుకునే సమయంలో ఒక రైతు ‘తిరగ బడదాం, గిట్టుబాటు ధర కోసం.. పోరుబాట చేద్దాం’ అనేదే ఈ చిత్రకథ. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఏం సిఫారసు చేసిందంటే.. రైతు పండించే పంటకు, ఉత్పత్తి అయ్యే ఖర్చు ఏమైతే ఉందో, ఆ రైతు శ్రమ, రైతు కుటుంబ శ్రమ, పెట్టుబడి, వడ్డీ, కౌలు సమస్తం పోను అదనంగా 50 శాతం లాభం ఇవ్వాలి. దానిని ఇంప్లిమెంట్ చేయాలని ఈ ‘అన్నదాత సుఖీభవ’ చిత్రం ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా ఈ చిత్రాన్ని వీక్షించిన దర్శకులు రేలంగి నరసింహారావు, వైవీయస్ చౌదరి, వీర శంకర్, రాంప్రసాద్, దేవీ ప్రసాద్, సంగీతం దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు ‘‘అన్నదాత సుఖీభవ’ అందరూ చూడాల్సిన సినిమా’’ అన్నారు. -
రైతు బతుకుపోరే ఈ చిత్రం
‘‘సమస్యల కోసం పోరాడే ప్రజల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని 30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. నా ప్రతి విజయంలోనూ ప్రజా కవుల సహకారం ఉంది. 1995 నుంచి 2018 వరకు 3 లక్షల 25వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలని నా వంతుగా చేసిన ప్రయత్నమే ‘అన్నదాత సుఖీభవ’ అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని జూలై 7న పునః విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు బతుకుపోరే ఈ సినిమా. పాలకులు రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలి. జయతి ఘోష్, రాధాకృష్ణన్ కమిషన్, స్వామినాథన్ కమిషన్లను ప్రభుత్వం ఆ ప్రయత్నంలో భాగంగానే నియమించింది. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. రైతులకు, పంటలకు బీమా కల్పించాలి’’ అన్నారు. ‘‘నా దృష్టిలో జగపతిబాబు, రాఘవ, రామోజీరావు, రాఘవేంద్రరావువంటి కొందరు గొప్పవాళ్లున్నారు. వాళ్లందరిలోని లక్షణాలు నాకు ఆర్. నారాయణమూర్తిగారిలో కనిపిస్తాయి. ప్రపంచం గురించి విపరీతమైన జ్ఞానం ఉంది ఆయనకు. అలాంటి వ్యక్తి సినిమాల్లో చేసింది చాలు అని భావించి, క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలి. ఆయన ద్వారా ప్రజలకు మరింత లాభం చేకూరుతుంది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ‘‘సాంస్కృతిక దండయాత్ర జరుగుతున్న తరుణమిది. ఇండియాలో 20–35 ఏళ్లున్న యువతను మరో వైపు ఈ దండయాత్ర తీసుకెళ్తోంది. రైతంటే ఎవరని ప్రశ్నించే పాలకులకు సమాధానమే ‘అన్నదాత సుఖీభవ’’ అన్నారు ప్రజా గాయకుడు గద్దర్. ఈ కార్యక్రమంలో అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్, రాజేంద్రకుమార్, సుద్దాల అశోక్ తేజ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు
-
రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి
‘‘రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తే ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడు. వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వలో రూపొందించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పరిస్థితి మారాలి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇటువంటి పథకాలను దేశంలో అన్ని రాష్ట్రాల వారు రూపొందించాలి. స్వామినాధన్ కమిటీ రైతులకు ఏర్పాటు చేసిన గిట్టుబాటు ధర లభిస్తే దేశానికి వెన్నుముక్క లాంటి రైతు సంతోషంగా ఉంటాడు. అందరికీ అన్నం పెట్టే రైతు నోట్లోకి కూడా నాలుగు మెతుకులు వెళ్తాయి’’ అన్నారు. -
ప్రజలంటే భయం ఉండాలి
‘‘నా ‘అన్నదాత సుఖీభవ’ సినిమా సెన్సార్‌కు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా సెన్సార్ రివైజింగ్ కమిటీ అన్నదాత సుఖీభవ అని ప్రకటించింది’’ అన్నారు దర్శక– నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. సెన్సార్ రివైజింగ్ కమిటీ ‘యు’ సర్టిఫికెట్‌ను అందజేసింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు పరిస్థితి నేడు దారుణంగా ఉంది. అన్నదాత సుఖీభవలా లేదు.. దుఃఖీభవ అనేలా ఉంది. పాలకులకు ప్రజలంటే భయం ఉండాలి. అప్పుడే వ్యవస్థ బాగుంటుంది. ఈ చిత్రానికి రైతు సంక్షేమ సంఘాలు, వామపక్షాలు సహకరించాయి. ఈ నెల 14న పాటలను విడుదల చేసి జూన్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. -
రివైజింగ్ కమిటీకి వెళతా
‘‘బడా పారిశ్రామికవేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు. కానీ రైతు అప్పు కట్టకపోతే పొలాల్ని, ఇంటిని జప్తు చేస్తారు. వాటిని నా ‘అన్నదాత సుఖీభవ’ చిత్రంలో చూపించా. సినిమాకి కీలకమైన ఆ సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డ్ చెప్పడం బాధ కలిగించింది. అసలు రైతుల బాధలను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం తీశా’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు చెప్పిన సన్నివేశాల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక రైతు అంటారు. అన్నం పెట్టే అన్నదాత పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. నోట్ల రద్దు వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీఎస్టీ వల్ల వేల కోట్ల ధనం ప్రజలు కోల్పోతున్నారు. ఈ అంశాలన్నింటినీ మా సినిమాలో ప్రస్తావించా. ఈ నెల 14న సినిమాను విడుదల చేయాలని మార్చిలో సెన్సార్‌కు అప్లై చేశా. వారం క్రితం సినిమా చూసిన సెన్సార్ బోర్డు నోట్ల రద్దు, జీఎస్టీ సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకున్నా. కానీ, సినిమాకి కీలకమైన రైతు సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకోలేదు. అందుకే నా సినిమాకు సెన్సార్ చేయలేదు. సెన్సార్ బోర్డు తీరుకు నిరసనగా నేను రివైజింగ్ కమిటీకి వెళ్తున్నా. 30 ఏళ్లుగా నేను ప్రజా సమస్యలపై మాత్రమే సినిమాలు తీస్తున్నా. సెన్సార్ విషయంలో శ్యామ్ బెనగల్ సూచనలను అమలు చేయాలని అన్ని ఇండస్ట్రీల నిర్మాతలు పోరాటాలు చేయాలి’’ అన్నారు. -
రైతు బతకాలి.. ప్రపంచాన్ని బతికించాలి
‘‘రైతే రాజు అన్న నానుడి ఇప్పుడు లేదు. రైతు పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు ధర లేకపోవడమే ఇందుకు కారణం. 2009 నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం మన దౌర్భాగ్యం. రైతు బతకాలి. ప్రపంచాన్ని బ్రతికించాలి’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణమూర్తి నటిస్తూ, రూపొందిస్తున్న చిత్రం ‘అన్నదాతా సుఖీభవ’. ఆయన మాట్లాడుతూ– ‘‘స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించాం. వ్యవసాయం దండగ కాదు. పండగ అని చెప్పే చిత్రమిది. ఈ సినిమాలో వంగపండు రాసిన పాటను బాలసుబ్రహ్మణ్యంగారు ఎంతో చక్కగా పాడారు. ఆయనకు హ్యాట్సాఫ్. గద్దరన్న, గొరేటి వెంకన్న, సుద్దాల అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను మా గురువుగారు దాసరి నారాయణరావుగారికి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ డిమాండ్స్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమ చేస్తున్న పోరాటం గొప్పది. సినిమా పరిశ్రమలు గురవుతున్న దోపిడీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమిది. హాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో లేని రేట్స్ మన ప్రాంతీయ సినిమాపైనే ఎందుకు? ఈ పోరాటానికి ప్రజలు కూడా సహకరించాలి’’ అని అన్నారు. -
అన్నదాత... సుఖీభవ
‘‘అందరికీ అన్నం పెట్టే రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, రైతుల ఆత్మహత్యలను రూపుమాపేలా చర్యలు తీసుకోవాలని మా నూతన చిత్రం ద్వారా చెప్పాలనుకుంటున్నాం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రం‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రం రెగ్యులర్ షూటిం ఈ నెల 4న ఆరంభం కానుంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయల సమావేశంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ప్రధాని మోదీగారికి, తెలంగాణ సీయం కేసీఆర్‌గారికి, ఏపీ సీయం నారా చంద్రబాబునాయుడుగారికి నా సినిమా ద్వారా మూడు విజ్ఞప్తులు చేయాలనుకుంటున్నాను. రైతుల ఆత్మహత్యలను జాతీయ విపత్తుగా భావించడంతో పాటు శాస్త్రవేత్త ఎమ్.ఎస్. స్వామినాథన్ సిఫార్సులను పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. అలాగే, కేసీఆర్‌గారు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతోపాటు అనేక సౌకర్యాలను కలిపిస్తూ రైతులకు మేలు చేస్తున్నారు. అయితే గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతుల ఆత్మహత్యలు తగ్గడం లేదు. ఈ విషయంపై కేసీఆర్‌గారు తగు చర్యలను తీసుకోవాలని ఈ చిత్రం ద్వారా కోరుతున్నాం. ఏపీ సీయం చంద్రబాబునాయుడుగారు నదుల అనుసంధానంతో రైతులకు మరింత మేలు చేయాలని ఈ చిత్రంతో చెప్పాలనుకుంటున్నాం. అన్నదాతలూ మీరు చనిపోవద్దు. మీరు బతకండి... మమ్మల్ని బతికించండి’’ అన్నారు.