‘‘రైతే రాజు అన్న నానుడి ఇప్పుడు లేదు. రైతు పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు ధర లేకపోవడమే ఇందుకు కారణం. 2009 నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం మన దౌర్భాగ్యం. రైతు బతకాలి. ప్రపంచాన్ని బ్రతికించాలి’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణమూర్తి నటిస్తూ, రూపొందిస్తున్న చిత్రం ‘అన్నదాతా సుఖీభవ’. ఆయన మాట్లాడుతూ– ‘‘స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించాం. వ్యవసాయం దండగ కాదు. పండగ అని చెప్పే చిత్రమిది.
ఈ సినిమాలో వంగపండు రాసిన పాటను బాలసుబ్రహ్మణ్యంగారు ఎంతో చక్కగా పాడారు. ఆయనకు హ్యాట్సాఫ్. గద్దరన్న, గొరేటి వెంకన్న, సుద్దాల అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను మా గురువుగారు దాసరి నారాయణరావుగారికి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ డిమాండ్స్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమ చేస్తున్న పోరాటం గొప్పది. సినిమా పరిశ్రమలు గురవుతున్న దోపిడీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమిది. హాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో లేని రేట్స్ మన ప్రాంతీయ సినిమాపైనే ఎందుకు? ఈ పోరాటానికి ప్రజలు కూడా సహకరించాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment