
ఆర్. నారాయణమూర్తి
‘‘రైతే రాజు అంటారు. ఆ రాజే లేకపోతే ప్రజలు ఏమవుతారు? ౖరైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలన్నా.. వ్యవసాయం దండగ కాదు, పండగ కావాలన్నా డా.స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ రేపు రిలీజ్ అవుతోంది.
నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘పంటలకు మద్దతు ధర లేకుంటే రైతులు సహనం కోల్పోతారు. అలుగుటయే ఎరుగని ధర్మరాజు అలిగితే ఎలా ఉంటుందో.. గంగిగోవులాంటి రైతు కోపోద్రిక్తుడై రైతు బంద్ ప్రకటిస్తే ప్రజల పరిస్థితి ఏంటì ? అన్నదే మా సినిమా. సుద్దాల అశోక్‌తేజ, గోరటి వెంకన్న, గద్దర్, వంగపండు మంచి పాటలిచ్చారు’’ అన్నారు.