
ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’. గత శుక్రవారం విడుదలైన మా సినిమా మంచి విజయం సాధించింది అంటున్నారు నారాయణమూర్తి. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘క్యాడర్ వర్సెస్ లీడర్’ అనే కా¯ð ్సప్ట్‌తో తెరకెక్కిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండోరోజు కంటే మూడోరోజు వసూళ్లు పెరిగాయి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూసి కుటుంబ కథా చిత్రం అంటున్నారు. సినిమా బాగుందంటూ ప్రేక్షకులు ఫోన్‌చేసి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రజా ప్రతినిధుల ఫిరాయింపులను అడ్డుకోవాలని చూపించిన పాయింట్‌ను జనం అభినందిస్తున్నారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment