
ఆర్. నారాయణమూర్తి
‘‘రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తే ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడు. వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వలో రూపొందించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు పరిస్థితి దారుణంగా ఉంది.
ఆ పరిస్థితి మారాలి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇటువంటి పథకాలను దేశంలో అన్ని రాష్ట్రాల వారు రూపొందించాలి. స్వామినాధన్ కమిటీ రైతులకు ఏర్పాటు చేసిన గిట్టుబాటు ధర లభిస్తే దేశానికి వెన్నుముక్క లాంటి రైతు సంతోషంగా ఉంటాడు. అందరికీ అన్నం పెట్టే రైతు నోట్లోకి కూడా నాలుగు మెతుకులు వెళ్తాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment