వీర్నపల్లిలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తెలంగాణ ప్రభుత్వం తమ జేబులు నింపుకునేందుకు కమీషన్లకోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని.. 2019లో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి, తిమ్మాపూర్, వీర్నపల్లి మండలం, కంచర్ల, మద్దిమల్ల, వీర్నపల్లి గ్రామాల్లో శనివారం మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్‌రెడ్డితో కలసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. అటవీ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రభాకర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదన్నారు.
ఏ గ్రామంలో చూసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులే కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. 2019లో కాంగ్రెస్‌పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సుద్దాల దేవయ్య మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్న కాలంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా అప్పటి అభివృద్ధే కనిపిస్తోందన్నారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురు యువకులు పొన్నం సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సాహేబ్, సంగీతం శ్రీనివాస్, ఎస్‌కే. గౌస్, బుగ్గ కృష్ణమూర్తిశర్మ, బూత శ్రీనివాస్, లెంకల రాజు, జనార్దన్, సతీశ్, రవి, రాములునాయక్, మహిపాల్, శంకర్, అబ్బనవేణి సత్తయ్య, మద్దిమల్ల తిరుపతి, హైమద్‌హుస్సెన్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment