హైదరాబాద్: పార్లమెంట్‌లో ఎంపీలు ధర్నా చేస్తుంటే కేంద్ర మంత్రులు నోరుమూసుకుని కూర్చున్నారని వైఎస్ఆర్ జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. వీరశివా రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన కోసమే చిరంజీవి, కావూరి సాంబశివరావు, జెడి శీలంలకు మంత్రి పదవులిచ్చిందన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులంతా కాంగ్రెస్ అధిష్టానంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే వారు అధికారం కోసం రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక పక్క సీమాంధ్ర ఎంపిలు ఆందోళన చేస్తుంటే మంత్రులు మిన్నకుండటం దారణం న్నారు. వారికి పదవులు తప్ప రాష్ట్ర సంక్షేమం పట్టదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వీరశివా రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని విభజించ వద్దని ఆయన కాంగ్రెస్ ఆధిష్టానంకు విజ్ఞప్తి చేశారు. తెలుగు భాష మాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు.
నోరు మూసుకున్న కేంద్ర మంత్రులు: వీరశివారెడ్డి ధ్వజం
Published Mon, Aug 5 2013 2:37 PM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement