Central Minister Praises Rahul Gandhi For Development In Ladakh - Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ బైక్ రైడ్‌.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు..

Aug 20 2023 4:16 PM | Updated on Aug 20 2023 4:43 PM

Central Ministers Praise Rahul Gandhi For Development In Ladakh - Sakshi

 ఢిల్లీ: రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. పాంగాంగ్ సరస్సు వరకు బైక్ రైడ్‌ను చేపట్టారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. కశ్మీర్‌లో ప్రస్తుతం రహదారులు ఎలా ఉన్నాయో..? బైక్‌ రైడ్‌ ద్వారా తెలుపుతూ ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్యు అంటూ కామెంట్ పెట్టారు. 2012కి పూర్వం అక్కడ ఉన్న రోడ్ల దుస్థితిని ప్రస్తుతం ఉన్న రహదారులను పోల్చుతూ ఓ వీడియోను పోస్టు చేశారు.

ప్రధాని మోదీ హయాంలో హిమాలయాల్లో ఎలాంటి రోడ్లను నిర్మించారో జాతి మొత్తం చూస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా అన్నారు. రాహుల్ యాత్ర చేపడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కశ్మీర్‌లో లాల్ చౌక్‌ వద్ద జాతీయ జెండా నేడు స్వేచ్ఛగా రెపరెపలాడుతోందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే కశ్మీర్‌లో సరైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. 

లద్ధాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్.. తాను ఇటీవల కొనుగోలు చేసిన కేటీఎమ్ బైక్‌పై పాంగాంగ్ లేక్ వరకు రైడ్ చేపట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.' ప్రపంచంలో అత్యంత సుందరమైన ప్రదేశం హిమాలయాల్లో ఉన్నాయని మా నాన్న తెలిపారు' అని రాహుల్ పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం రాహుల్ యాత్రకు కేంద్ర మంత్రులు స్పందించారు. 

ఇదీ చదవండి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement