లేహ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన పాంగాంగ్ సరస్సు వరకు బైక్ రైడ్ చేపట్టారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను ఆగష్టు 20న అక్కడే నిర్వహించనున్నారు. బైక్ రైడ్‌కు సంబంధించిన దృశ్యాలను ఆయన తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు.
KTM 390 బైక్‌ను కొనుగోలు చేసినట్లు రాహుల్ గాంధీ ఒకప్పుడు సోషల్ మీడియాలో తెలిపారు. కానీ భద్రతా కారణాల రీత్యా ఆ బైక్‌పై సెక్యూరిటీ బయటకు వెళ్లనీయడం లేదని అన్నారు. అయితే.. ప్రస్తుతం ఆ బైక్‌పైనే ఆయన పాంగాంగ్ సరస్సు వరకు వెళ్లనున్నారు. "ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్ గాంధీ) చెప్పేవారు" అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకుంది. రాహుల్ లద్దాఖ్ పర్యటన ఆగష్టు 25న ముగియనుంది.
Upwards and onwards - Unstoppable! pic.twitter.com/waZmOhv6dy
— Congress (@INCIndia) August 19, 2023
దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇటీవలే తమిళనాడు వెళ్లి ఊటీ సమీపంలో గిరిజన తెగలతో కలిసి ఆడిపాడారు. ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో బైక్‌పై పాంగాంగ్ సరస్సు వరకు పర్యటిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్ లద్దాఖ్‌కు రావడం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి: మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి.. కేంద్రానికి అఖిలేష్ కౌంటర్..
Comments
Please login to add a commentAdd a comment