
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులు తెలంగాణబాట పట్టారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆదివారం ముషీరా బాద్ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మత్స్యకారులతో సమావేశం కాను న్నారు. అనంతరం అంబర్‌పేట జరిగే మత్స్య కారు ల సమావేశంలోనూ పాల్గొననున్నారు.
సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగే జమ్మికుంట బహిరంగసభలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తారని, అదేరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ సభ లోనూ పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండల బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్థక శాఖల మంత్రి పురు షోత్తం రూపాలా ప్రారంభించనున్నారు. అనంతరం కల్వకుర్తిలో జరగనున్న బహిరంగ సభలో రూపాలా పాల్గొంటారని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment