tours
-
ట్రా'వెల్నెస్' టిప్స్..!
నిన్నమొన్ననే జరిగిన క్రిస్మస్ సెలవుల కోసమని కొందరు, జనవరి మొదటిరోజు తమకు ఇష్టమైన వారిని కలవడం కోసం లేదా రాబోయే సంక్రాంతికి ఇంకొందరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కారణమేదైనా రకరకాల అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ప్రయాణాలు చేయాల్సిన ఆవశ్యకత ఉండనే ఉంటుంది. ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది. అన్నిటికంటే ముందుగా ప్రయాణం చేయబోయే ముందర తాము రెగ్యులర్‌గా సంప్రదించే జనరల్ ఫిజీషియన్‌ను తొలుత తప్పనిసరిగా కలవాలి. తాము వెళ్తున్న ప్రదేశం గురించి తెలపాలి. అక్కడ ఉండే వాతావరణానికి అనువుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని... ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్‌కు చెప్పి, ఆ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోవాలి. ఆ మేరకు డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేసిన ప్రకారం... తమకు అవసరమైన మందులను ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఉదాహరణకు హై–బీపీ, డయాబెటిస్, హై–కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు తాము ప్రయాణం చేసే కాలానికి అవసరమైనన్ని మందులను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సరిగ్గా తాము అనుకున్న వ్యవధికి అవసరమైనన్నే కాకుండా... వీలైతే కొద్దిగా ఎక్కువ మందులే తీసుకెళ్లడం మంచిది. ఉదాహరణకు ఆస్తమా బాధితులు ఎటాక్ వచ్చిన వెంటనే తాము తక్షణం వాడాల్సిన (ఎస్ఓఎస్) మందుల్ని వెంట ఉంచుకోవాలి. అలాగే వారు తమతోపాటు క్యారీ చేయాల్సిన ఇన్హేలర్స్, ప్రివెంటివ్ ఇన్హేలర్స్ను (వీలైతే ఒకటి రెండు ఎక్కువగానే) తీసుకెళ్లాలి. ఇది ఉదాహరణ మాత్రమే. ప్రయాణికులు తమ ఆరోగ్య సమస్యను బట్టి మందులు క్యారీ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు... అక్కడ ఉండే ఆరోగ్య పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన ముందస్తు టీకా మందులు (వ్యాక్సిన్స్) తీసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్రికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో ఫీవర్ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఆ దేశాలకు ప్రయాణం చేసేవారు ముందుగానే అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలి. గర్భవతులు తాము వాడాల్సిన మందులూ, అలాగే తీసుకోవాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లను తీసుకొని ఉండాలి. పిల్లలకు వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి వారు తీసుకోవాల్సిన మందుల్ని రెడీగా ఉంచుకోవాలి. ఆయా దేశాలే కాదు... కొన్ని సందర్భాల్లో తాము ప్రయాణం చేసే విమాన సంస్థలు సైతం కొన్ని ఆంక్షలు పెడుతుంటాయి. ‘‘ఫిట్ టు ఫ్లై’’ నిబంధనలుగా పేర్కొనే ఈ నిబంధనల గురించి ముందుగానే తెలుసుకోవాలి. దీంతో తమ ప్రయాణంలో రాబోయే సమస్యలను తెలుసుకుని, నివారించుకోవడం తేలికవుతుంది. తాము బస చేయబోయే చోట కొందరు పాస్ట్ ట్రావెల్ హిస్టరీ’ అడిగి తీసుకుంటూ ఉంటారు. అంటే... గతంలో ఏయే ప్రాంతాలు / దేశాలు తిరిగివచ్చారో అడిగి తెలుసుకుంటుంటారు. తమ పాస్ట్ ట్రావెల్ హిస్టరీ గురించి ఎవరికి వారు ముందుగానే సమీక్షించుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అయితే ప్రజలందరి సంక్షేమం కోసం తమ ట్రావెల్ హిస్టరీని పారదర్శకంగా సమర్పించడం ప్రయాణికులకూ మేలు. ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టడం... వారికే ఇబ్బందులు తెచ్చేందుకు అవకాశమిస్తుంది. ఇవే గాకుండా... తాము వెళ్లబోయే ప్రదేశంలో ఉండే వాతావరణానికి అనువుగా దుస్తులు, అక్కడ ఎదురవ్వబోయే సమస్యలకు అనువుగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం మంచిది. ఇటీవల పిల్లలకూ, పెద్దలకు దాదాపుగా అందరికీ కళ్లజోళ్లు ఉంటున్నాయి. ఉన్న కళ్లజోడుకి తోడుగా మరొకటి అదనంగా తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే జర్నీలో కళ్లజోడు పోయినా లేదా విరిగిపోయినా అప్పటికప్పుడు మరొకటి సమకూర్చుకోవడం ప్రయాణ సమయంలో కష్టమవుతుంది. మరొకటి అదనంగా (స్పేర్‌గా) పెట్టుకోవడం చాలావరకు ఉపకరిస్తుంది. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రయాణంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యల్ని తేలిగ్గానే అధిగమించవచ్చు. అందుకే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ప్రయాణం మొదలుపెట్టడం చాలావరకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ∙ -
బడ్జెట్ పర్యటనలవైపే చూపు: ఎక్కువ బుకింగ్స్ అక్కడికే..
ముంబై: మారుమూలనున్న సాహస కేంద్రాలు, అందుబాటు ధరల్లో ఉన్న కేంద్రాలను సందర్శించేందుకు దేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాసియాలోని పేరొందిన ప్రదేశాలు పర్యాటకుల ప్రముఖ ఎంపికగా ఉంది.ట్రావెల్ బుకింగ్ సేవల్లోని ‘క్లియర్‌ట్రిప్’ నివేదికను పరిశీలించగా.. జెనరేషన్ జెడ్ (1996–2009 మధ్య జన్మించిన వారు), వృద్ధులు అందుబాటు ధరల్లోని ప్రాంతాలకు ఈ ఏడాది ఎక్కువగా బుకింగ్ చేసుకున్నారు. సులభతర చెల్లింపుల విధానాలకు సైతం ఆమోదనీయం పెరుగుతోంది. ఈ విషయంలో జెనరేషన్ జెడ్‌లో 1.4 రెట్ల అధిక ఆమోదం కనిపించింది. ‘‘వీసా రహిత విధానాలు, ట్రావెల్ నిబంధనలను సడలించడంతో దక్షిణాసియా ప్రాంతాలు ట్రావెలర్ల ముఖ్య ఎంపికగా మారాయి. అందుబాటు ధరల్లో ఉన్న ప్రాంతాలను సందర్శించేందుకు ఈ ఏడాది పర్యాటకులు ప్రాధాన్యం ఇచ్చారు’’అని క్లియర్‌ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనుజ్రాతి తెలిపారు. ➜బాలిలోని డెన్పాసర్కు బుకింగ్‌లు 2023తో పోల్చితే 73 శాతం పెరిగాయి. బాలికి బెంగళూరు నుంచి ఇండిగో డైరెక్ట్ ఫ్లయిట్ సేవలను ప్రారంభించడంతో దేశీయ పర్యాటకులకు ఇది అందుబాటులోకి వచ్చింది.➜దేశీయంగా పెరుంబాకం, పంగాల, టెక్కుమురి ప్రాంతాలకూ ఆదరణ లభించింది.➜దేశీయంగా చూస్తే లక్షద్వీప్‌లోని అగట్టి దీవికి ఏకంగా 94 శాతం మేర బుకింగ్‌లు పెరిగాయి. డయ్యూకి 130 శాతం అధికంగా బుకింగ్‌లు వచ్చాయి. బెంగళూరు నుంచి గోవా, డయ్యూని కలుపుతూ అగట్టికి ఇండిగో సేవలు ప్రారంభించడం ఇందుకు నేపథ్యం. ➜ఎక్కువ మంది అన్వేషించిన దేశీయ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గోవా మొదటి స్థానంలో ఉంది. గతేడాదితో పోల్చితే గోవాకి ఫ్లయిట్ అన్వేషణలు 200% పెరిగాయి. అమృత్‌సర్‌కు 106% బుకింగ్‌లు పెరిగాయి. ➜ఎక్కువ మంది అన్వేషించిన అంతర్జాతీయ కేంద్రంగా అజర్‌బైజాన్‌లోని షాదాగ్ నిలిచింది. అలాగే అదుబాబి, కౌలాలంపూర్, మెల్బోర్న్, లండన్, బ్యాంకాక్ ఫ్లయిట్ అన్వేషణల్లో ప్రముఖంగా నిలిచాయి. గతేడాదితో పోలిస్తే 90 - 150 శాతం పెరుగుదల కనిపించింది. -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
ప్రధాని సుడిగాలి పర్యటనలు.. ప్రసంగాల్లో ఆ అంశంపైనే ఫోకస్ !
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభల్లో ఈ పదేళ్లలో తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించనున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ప్రధాని ఈ తరహాలోనే దేశవ్యాప్తంగా పర్యటించారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా ఈ నెలలో 15 రోజులు ఈ పనిమీదే ప్రధాని దృష్టిపెట్టనున్నారు. ఈ వారంతంలో ప్రధాని ఒడిషా,అస్సాంలలో పర్యటించనున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు కాకుండా ప్రధాని తన ప్రసంగాల్లో అయోధ్యలో ఇటీవల జరిగిన రామమందిర ప్రారంభోత్సవ అంశం కంటే ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధినే ఎక్కువగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాజాగా పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రసంగం తర్వాత ఆయన గోవాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ కూడా అయోధ్య ప్రస్తావన తీసుకురాలేదు. దీన్ని బట్టి ఆయన ఇక ముందు కూడా తన ప్రసంగాల్లో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెబుతున్నారు. అయితే అయోధ్య రామమందిర అంశాన్ని కూడా అవసరమైనపుడు తప్పకుండా ప్రచారంలో వాడుతారని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇదీ.. చదవండి.. టీఎంసీ మిత్ర పక్షమే: రాహుల్ గాంధీ -
ఒకే నెలలో ఐదు సార్లు రాష్ట్రానికి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నెల ఏడో తేదీన, తాజాగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లోనూ బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. ఈనెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. బీజేపీకి ఊపు తెచ్చేందుకు 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభల్లో, 27న హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్‌షోలో మోదీ పాల్గొననున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ పర్యటన షెడ్యూల్ ఖరారైతే.. ప్రధాని మోదీ నెల రోజుల్లోనే ఐదుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. అయితే ప్రధాని గత నెల 1, 3వ తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అవి కూడా కలిపితే రెండు నెలల్లో ఏడుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. దీపావళి దాటగానే జోరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపావళి పండుగ దాటగానే జోరు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. దీపావళి తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచి ప్రచార గడువు ముగిసే 28వ తేదీ వరకు ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యూపీ, మహారాష్ట్ర, అస్సాం, గోవా సీఎంలు యోగి ఆదిత్యనాథ్, ఏక్నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్‌లతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
నేడు, రేపు పలువురు కేంద్రమంత్రుల పర్యటనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులు తెలంగాణబాట పట్టారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆదివారం ముషీరా బాద్ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మత్స్యకారులతో సమావేశం కాను న్నారు. అనంతరం అంబర్‌పేట జరిగే మత్స్య కారు ల సమావేశంలోనూ పాల్గొననున్నారు. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగే జమ్మికుంట బహిరంగసభలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తారని, అదేరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ సభ లోనూ పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండల బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్థక శాఖల మంత్రి పురు షోత్తం రూపాలా ప్రారంభించనున్నారు. అనంతరం కల్వకుర్తిలో జరగనున్న బహిరంగ సభలో రూపాలా పాల్గొంటారని తెలియజేశారు. -
ఎన్నికల సందడి.. స్టార్ క్యాంపెయినర్లతో విమానాలకు డిమాండ్
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, వందల సంఖ్యలో ప్రచార సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ ‘టేకాఫ్’ తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చే జాతీయ పార్టీ నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వీటిని అద్దెకు తీసుకునేందుకు సై అంటున్నారు. ఒత్తిడి లేకుండా, వేగవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే వీలుతో పాటు సమయం ఆదా అవుతుండటంతో అద్దె హెలికాప్టర్లకు ఎన్నికల వేళ గిరాకీ జోరందుకుంటుంది. గంటల వ్యవధిలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లి పలు ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉండటం కూడా నేతలను గాల్లో చక్కర్లు కొట్టేలా చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ అద్దె లక్షల్లోనే... బ్లేడ్ ఇండియా, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్విసెస్, జెట్‌సెట్‌గో వంటి కంపెనీలు హెలికాప్టర్లు, జెట్ విమానాలను అద్దెకు ఇస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా కూడా హెలికాప్టర్లతో సహా వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా బెల్ 407, ఎయిర్‌బస్ హెచ్125, హెచ్130 వంటి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటారు. ఇందులో అయిదుగురు ప్రయాణించవచ్చు. సాధారణంగా సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె గంటకు రూ.1.5 లక్షల నుంచి ఉంటుంది. రెండు ఇంజిన్ల సామర్థ్యం ఉంటే రూ.2.75 లక్షల వరకు అవుతుంది. జాతీయ పార్టీల నుంచి డిమాండ్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, స్టార్ క్యాంపెనర్లతో తెలంగాణలో ప్రచారం చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో అద్దె హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లయిట్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి హెలిక్టాపర్ల అద్దెకు అభ్యర్థనలు వస్తున్నాయని ఓ సంస్థ ప్రతినిధిని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో తమ హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని ప్రచారం సాగించారని తెలిపారు. తెలంగాణలోనూ ఇరు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉండటం వల్ల ఇక్కడ కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీజీసీఏ మార్గదర్శకాలు తప్పనిసరి.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించిన నిబంధనలను ఆపరేటర్లు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందే. పైగా ఎన్నికల సమయంలో ప్రత్యేక మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. మంత్రులు, సీనియర్ రాజకీయ నేతలు రెండు ఇంజిన్లు ఉన్న హెలికాప్టర్ లేదా విమానంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. వీఐపీ విమానాలను నడిపే పైలట్లు ని ర్మిష్ట రకం విమానం లేదా హెలికాప్టర్లో నిర్దిష్ట సంఖ్యలో ఫ్లయింగ్ గంటల అనుభవాన్ని కలిగి ఉండాలి. అద్దె ఖర్చు ఎవరి ఖాతాలో.. హెలికాప్టర్ అద్దెలపై కూడా ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక డిప్యూటీ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టార్ క్యాంపెయినర్ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తే అభ్యర్థి పేరు తీసుకోకుండా లేదా అభ్య ర్థితో వేదికను పంచుకోకుండా ప్రసంగాలు చేస్తే అప్పుడు ఆ ఖర్చు మొత్తం పార్టీపైనే పడుతుంది. ఒకవేళ అభ్యర్థి పేరుతో ప్రచారం చేస్తే గనుక అప్పుడు ఆ వ్యయం పార్టీ, అభ్య ర్థికి చెరి సగం పడుతుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. సొంతంగా హెలికాప్టర్లు ఉన్న వారి ప్రయాణ సమయం, అద్దెను అభ్యర్థుల ఖర్చుగా పరిగణిస్తారు. ప్రచార రథాలు సిద్ధం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వివిధ పార్టీలకు ప్రచార వాహనాలను రూపొందించే సిబ్బందికి, వాహనాలకు, డ్రైవర్లకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. పార్టీల జెండాలు, బ్యానర్లను తయారు చేసే టైలర్లకు సైతం భారీ గిరాకీ వచ్చింది. ఉప్పల్, చర్లపల్లి తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రెడీమేడ్ దుస్తులను తయారు చేసే పలు కంపెనీల్లోని కుట్టుమిషన్లపైన ఇప్పుడు పార్టీల జెండాలు రెడీ అవుతున్నాయి. అంబర్పేట్ పటేల్‌నగర్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల్లోనూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలను, బ్యానర్లను తయారు చేసే మహిళా టైలర్లకు డిమాండ్ వచ్చేసింది. తాత్కాలికంగా అయినా ఇప్పుడు ఇది ఓ కుటీర పరిశ్రమగా మారినట్లు పటేల్‌నగర్‌కు చెందిన బాలమణి తెలిపారు. రోజుకు 250 నుంచి 300 వరకు బ్యానర్లు, జెండాలు, ఇతర ప్రచార సామగ్రిని తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రచార రథాలకు మేకప్.... నేతలు ప్రచార వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార వాహనాల కోసం వినియోగించే టాటా, మహీంద్ర వాహనాలకు డిమాండ్ వచ్చేసింది. అభ్యర్థుల కటౌట్లు, బ్యానర్లు తదిర హంగులతో ప్రచార రథాలుగా తీర్చిదిద్దేందుకు కా ర్మికులు, టెక్నీషియన్లు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. మూసారాంబాగ్, ఇందిరాపార్కు, తదితర ప్రాంతాల్లో ప్రచార ర«థాల తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి. -
గులాబీ నేతల దూకుడు.. సుడిగాలి పర్యటనలలో మంత్రులు
కామారెడ్డి: ఎన్నికల షెడ్యూల్ రాకముందే అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తున్నారు. పనిలో పనిగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యేలకు పార్టీ కీలక నేతలైన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తోడయ్యారు. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, మరో ముఖ్య నాయకుడు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావులు అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోనూ ఇరువురు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాన్సువాడ పట్టణంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రాకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు రానున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డిలో కేటీఆర్ సభ మున్సిపల్ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం కామారెడ్డిలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పది వేల మందితో సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక్కడినుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీకి మరింత ఊపు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. -
ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో విదేశాల్లో అధికారిక పర్యటనలు చేపట్టారు. తాజాగా గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను పార్లమెంట్లో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు.. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.239 కోట్లుకుపైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ‘అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సన్నిహత సంబంధాలను పెంపొందించుకోవటం, స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను విస్తరించటమే ప్రధాని విదేశీ పర్యటనల లక్ష్యం. దేశ ప్రయోజనాలతో పాటు విదేశాఘ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ పర్యటనలు ఎంతో ముఖ్యం.’ అని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్. మోదీ విదేశీ పర్యటన వివరాలు.. ► ఇటీవల జీ20 సమ్మిట్ కోసం పీఎం మోదీ ఇండోనేసియాకు వెళ్లారు. దాని ఖర్చు రూ.32,09,760గా కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతకు ముందు సెప్టెంబర్ 26-28 మధ్య జపాన్ పర్యటనకు వెళ్లగా అప్పడు రూ.23,86,536 అయింది. ► 2022 తొలినాళ్లలో యూరప్ పర్యటనకు రూ.2,15,61,304, 2019 సెప్టెంబర్ 21-28 మధ్య అమెరికా వెళ్లగా రూ.23,27,09,000 అయింది. ► గడిచిన ఐదేళ్లలో 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది. ► 2017లో తొలుత ఫిలిప్పైన్స్‌లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీకి వెళ్లారు. మొత్తంగా ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు కాగా.. అందులో అమెరికా వెళ్లినప్పుడు అత్యధికంగా రూ.23 కోట్లు ఖర్చు అయింది. ఇదీ చదవండి: సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు -
ఎడిటర్ కామెంట్ : మన రాష్ట్రానికి ఇదేమి ఖర్మ అంటూ చంద్రబాబు పర్యటనలు
-
మళ్లీ జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మళ్లీ జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈనెల 25న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 29న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 10న జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారైనట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది. -
వీకెండ్ ఎంజాయ్..దేశంలో పెరిగిన పర్యటనలు
సాక్షి, అమరావతి: దేశంలో వారాంతపు పర్యాటకం విస్తరిస్తోంది. ఉద్యోగులు, వ్యాపారులు నెలల ముందుగానే వారాంతపు సెలవులను ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సుమారు 86 శాతం మంది భారతీయులు రానున్న 12 నెలల్లో కచ్ఛితంగా ఏదో ఒక పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఆసియన్ పసిఫిక్ ట్రావెల్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు 78 శాతం మంది ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. పర్యాటక పండుగ సీజన్ మొదలు.. ఈ నెలలో వారాంతపు సెలవులు ఎక్కువగా రావడంతో పర్యాటక పండుగ సీజన్ ప్రారంభమైందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఈ నెల నుంచే వీకెండ్ ప్రయాణాలు ఊపందుకున్నాయి. దీంతో ట్రావెల్ బుకింగ్ సంస్థలు గెట్ అవే డీల్స్‌ను అందిస్తున్నాయి. తదుపరి ట్రిప్‌లో దాదాపు 10 శాతం పైనే రాయితీలను ప్రకటిస్తున్నాయి. మరోవైపు వారాంతపు సెలవుల్లో హోటళ్లు, రిసార్టులు దాదాపు నిండిపోవడంతో పర్యాటకులు హాస్టళ్లు, హోం స్టేలను ప్రత్యామ్నాయంగా తమ జాబితాలో చేర్చుకుంటున్నారు. ప్రదేశాల ఎంపికకు ప్రాధాన్యం.. పర్యాటకులు గమ్యస్థానాల ఎంపికకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి మెట్రో నగరాలతోపాటు మహారాష్ట్రలోని లోనావాలా, పూణే, కొచ్చి ప్రాంతాలను విశ్రాంత విడిది కేంద్రాలుగా ఇష్టపడుతున్నారు. తిరుపతి, షిర్డీ, రిషికేశ్, వారణాసికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. భారతీయ సంస్కృతిని పరిచయం చేసుకునేలా జయపూర్, ఉదయపూర్, ఆగ్రా చుట్టి వస్తున్నారు. పుదుచ్చేరి, గోవా బీచ్‌లు, ఊటీ, మున్నార్, కొడైకెనాల్ వంటి హిల్స్టేషన్లు పాశ్చాత్య అనుభావాలను అందిస్తుండటంతో యువత ఎక్కువగా అటువైపు క్యూ కడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ పర్యటనల్లో భారతీయ ప్రయాణికులు ఎక్కువగా యూకే, యూఎస్ఏ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, మలేషియాతో పాటు తక్కువ సమయంలో వెళ్లి వచ్చేలా థాయ్‌లాండ్, ఇండోనేషియా, టర్కీ, వియత్నాం, యూఏఈలను ఎంపిక చేసుకుంటున్నారు. -
ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు.
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాల పర్యటనకు స్వదేశీ దర్శన్ పర్యాటక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డిఫ్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. కోవిడ్ అనంతరం అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ పర్యటనలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా పర్యాటకుల రద్దీ పెరిగిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారన్నారు. గత ఏప్రిల్‌లోనే రూ.1.5 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపారు. గతేడాది సుమారు 50 వేల మంది ఐఆర్సీటీసీ ప్యాకేజీలను వినియోగించుకున్నారని, ఈ ఏడాది 70 వేల మందికి పైగా ఐఆర్సీటీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ టూర్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఐఆర్సీటీసీ టూర్లు ఇవీ... తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా ఈ నెల 27న స్వదేశీ దర్శన్ రైలు బయలుదేరనుంది. జూన్ 3వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుంది. ఈ టూర్లో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. అన్ని రకాల సదుపాయాలతో స్లీపర్ క్లాస్ రూ.18,120, ఏసీ క్లాస్ రూ.22,165 చొప్పున ప్యాకేజీ ఉంటుంది. మరో ట్రైన్ మహాలయ పిండదాన్– సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15న బయలుదేరి 20న తిరిగి చేరుకుంటుంది. ఈ పర్యటనలో వారణాసి, ప్రయాగ్, గయ, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. స్లీపర్ రూ.14,485, ఏసీ రూ.18,785 చొప్పున చార్జీ ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి. షిరిడి సాయి దర్శనానికి, తిరుపతి పుణ్యక్షేత్రానికి, ఒడిషా జగన్నాధ రథయాత్రకు ప్రత్యేక డొమెస్టిక్ పర్యాటక ప్యాకేజీలను కూడా సిద్ధం చేశారు. కేరళ, జమ్ముకాశ్మీర్, అస్సామ్, మేఘాలయ, తదితర ప్రా ంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఐఆర్సీటీసీ సిద్ధం చేసింది. అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా రాయల్ నేపాల్ టూర్ ను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 26 నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అన్ని వసతులతో కలిపి రూ.40 వేల వరకు చార్జీ ఉంటుంది. (చదవండి: మాస్కు మస్ట్... ఆలస్యమైన అనుమతించరు) -
కాళ్లలో లేదు చలనం ఆశల్లో ఉంది జీవనం
19 ఏళ్లు..ఉత్సాహం ఉరకలెత్తే వయస్సు..ఎగసే అలల్లా జీవితంపై ఎన్నో ఆశలు..ఆకాంక్షలు..ఈ చురుకైన యువకుడ్ని చూసి విధికి కన్నుకుట్టింది. 2009లో జరిగిన ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబంలో నిశ్శబ్ధ వాతావరణం..ఎదిగిన తమ బిడ్డ ఇలా దివ్యాంగుడిగా మారిపోవడం తల్లిదండ్రులు జీర్జించుకోలేకపోయారు. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయితే ఆ యువకుడు కుంగిపోలేదు. సంద్రంలో అలలే స్ఫూర్తిగా తీసుకున్నాడా యువకుడు. జీవితంలో అవిటితనం ఓ చిన్న సమస్యే..అంతకు మించి జిందగీలో చాలా ఉందని భావించాడు. సూర్యుడు ఉదయిస్తాడు... అస్తమిస్తాడు... అస్తమించినంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు...ఈ రవివర్మ కూడా అంతే...ఉదయించే సమయంలో విధి ఓటమి పాల్జేస్తే... నడవలేని స్థితిలో రవి ఆ విధిపై విజయం సాధించాడు. ర్యాప్ అనే ఫౌండేషన్ స్థాపించి ఎందరో దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు...ఆ విజేతే మన సీతమ్మధారకు చెందిన రవివర్మ. సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రమాదానికి ముందు రవివర్మకు పర్యాటక ప్రాంతాలు వీక్షించడమంటే చాలా ఇష్టం. అయితే నడవలేని స్థితిలో ఉన్న రవి దాదాపు చాలా రోజులు యాత్రలకు వెళ్లలేకపోయాడు. తరువాత తనకుతాను స్ఫూర్తి నింపుకున్నాడు. ఇది కాదు జీవితం...లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్...దానిని ఆస్వాదించాలనుకున్నాడు. తన పనులు తాను చేసుకునేస్థాయిలో వచ్చాడు. వీలు చైర్లోనే నగరంలో తనకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేవాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టాడు. కారుకు ప్రత్యేక మార్పులు చేయించాడు. తనుకు అనుకూలంగా కారును డిజైన్ చేయించుకున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు విశాఖ నుంచి సోమవారం బయలుదేరాడు. వెలుగు రేఖ వెతకాలి జీవితంలో ఓటమి ఎదురైందని చీకట్లో కూర్చుంటే వెలుగే కనిపించదు..మనసులో కుంగిబాటు అనే కర్టెన్ తీసేయాలి..అప్పుడు ఎంతటి బాధనైనా... అంగవైకల్యమైనా మనల్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది. నా జీవితమే ఇందుకు ఓ ఉదాహారణ. కుంగిపోయి కూర్చుంటే నేనీరోజు దేశవ్యాప్తంగా యాత్ర చేసే స్థాయికి చేరుకునేవాడ్ని కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు కామన్..వాటిని అధిగమిస్తే విజేతగా నిలవవచ్చు. వంద రోజులకు పైగా దేశవ్యాప్త యాత్రలో వేల మంది దివ్యాంగులను కలిసి వారికి మనోధైర్యం నింపాలన్నదే నా లక్ష్యం. – రవి వర్మ ఇటువంటి యాత్రలంటే ఇష్టం రవి వర్మకు ప్రమాదం జరగక ముందు నుంచి ఇంటువంటి యాత్రలు చేయడం ఇష్టం. ప్రమాదం జరిగిన తరువాత మేమంతా ధైర్యం కోల్పోయాం. రవివర్మ మాత్రం ధైర్యం తెచ్చుకొని తన సాధారణ జీవితం గడిపేలే ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఇన్ని రోజులు కారు యాత్రకు వెళ్తూ అందరిలో స్ఫూర్తి నింపాలనుకోవడం చాలా గర్వంగా ఉంది. – తల్లి రాజేశ్వరి, సోదరి పూజిత. సాహసయాత్ర ప్రారంభం వీలుచైర్ కారు ద్వారా 24 వేల కిలోమీటర్లు యాత్ర చేస్తున్న రవివర్మ అందరికీ స్ఫూర్తి అని ఎంపీ ఎంవీవీ సత్యరాయణ అన్నారు. యాత్రను ఆయన సోమవారం బీచ్‌రోడ్డులో జెండా ఊపి ప్రారంభించారు. సాధారణ వ్యక్తికి సైతం 24 వేల కిలోమీటర్లు కారు యాత్ర చేయటం చాలా కష్టం. అటువంటిది రవివర్మ చేయడం నిజంగా సాహసమే. యాత్రలో ఎటువంటి ఇబ్బందుల లేకుండా విజవంతంగా పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జీవీ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం!) -
స్వల్ప బడ్జెట్‌తో స్త్రీలకు లోకం చూపిస్తోంది!
అమ్మాయ్ వెళ్దామా... వదినా వెళ్దామా... పొరుగింటి పిన్నిగారూ వెళ్దామా.. ఇరుగింటి లక్ష్మిగారూ రెడీనా... కేవలం ఆడవాళ్లు మాత్రమే కలిసి పర్యటనలు చేస్తే ఎలా ఉంటుంది? మగవాళ్ల అదుపు, ఆజమాయిషీ, అనవసర కేరింగ్ లేకుండా స్వేచ్ఛగా తాము మాత్రమే రెక్కలు ధరిస్తే ఎలా ఉంటుంది? కేరళకు చెందిన సజనా అలీకి ఈ ఆలోచనే వచ్చింది. ‘అప్పూపత్తాడి’ (దూదిపింజె పురుగు) పేరుతో లేడీస్ ఓన్లీ ట్రావెల్ గ్రూప్న నడుపుతూ స్వల్ప బడ్జెట్‌తో స్త్రీలకు లోకం చూపిస్తోంది. ఆడవారి భ్రమణకాంక్షకు ఇది బెస్ట్ టూర్ టికెట్. కిచెన్లోనే ఉండిపోతున్నారా? ఆఫీస్ పనితోనే సరిపోతోందా? ఎక్కడికైనా కదులుదామంటే భర్తగారికి వీలవుతుందో కాదో. పిల్లలు పరీక్షలు అంటారో ఏమో. లేకుంటే ‘ఇప్పుడు ఏం అవసరం. ఓటిటిలో సినిమా చూసి పడుకోక’ అనొచ్చు కదా. ఏడ్చినట్టుంది. లోకం అంటే ఇదేనా. ఇంతేనా? ఉదాహరణకు వీటిలో ఎన్ని చూసి ఉంటారు మీరు? లక్నో, అలహాబాద్, గయా, పాట్నా, వారణాసి, గౌహతి, కోల్కటా ఆఖరున మేఘాలయా. వీటిలో నిజంగా ఎన్ని చూసి ఉంటారు మీరు. సజనా అలీని కలిస్తే ఇవన్నీ మిమ్మల్నో 15 రోజుల ట్రిప్పులో చూపించేస్తుంది. ఖర్చు? చాలా తక్కువ. తోడు? మొత్తం ఆడవాళ్లే. అక్కడా అక్కడా అక్కడా... లోకం చూడాలనుకుని తపించే స్త్రీలు... వారు గృహిణులు కావచ్చు, ఉద్యోగినులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు... ఒక గ్రూప్‌గా బయలుదేరి వెళతారు. సజనా అలీ మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. కొత్త దోస్తులు... కొత్త లోకం... ఇంతకు మించి ఆనందం ఏముంటుంది? లోకం చూడకుండా కళ్లుండి గంతలు కట్టుకుంటామా? ∙∙ దూదిపింజె పురుగును మనం చూసి ఉంటాం. తేలిగ్గా సన్నటి దారాల ఒంటితో గాలిలో అలా తేలుతూ వెళుతుంటుంది. గాలి ఎటు వీస్తే అటు దాని పయనం. హాయిగా వెళుతూ ఉండటమే. సజనా అలీ 2016లో మొదలెట్టిన ట్రావెల్ సంస్థ పేరు కూడా అదే... మలయాళంలో ‘అప్పుపత్తాడి’ అని. కోజికోడ్‌కు చెందిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఉద్యోగం మానేసి కేవలం టూర్ ఆపరేషన్స్‌తో ఉపాధి పొందుతోంది. ఇందులో రెండు సంతృప్తులు. ఒకటి తాను తిరగగలుగుతోంది. రెండు తన వంటి స్త్రీలను తిప్పగలుగుతోంది. ‘మా నాన్న లారీ డ్రైవర్. తాను వెళ్లిన చోటు గురించి వచ్చి ఇంట్లో చెబుతుండేవాడు. నేనూ వస్తాను అంటే తీసుకెళ్లేవాడు కాదు... ఆడపిల్లలకు వాష్‌రూమ్ సౌకర్యాలు ఉండవని. కాని ఎప్పుడైనా ఒకరోజు దూరం ట్రిప్పులు వెళుతుంటే తీసుకెళ్లి తెచ్చేవాడు. నాకు చాలా సంతోషం వేసేది. పెద్దదాన్నయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాక ఒకసారి అందరం విమెన్ కొలిగ్స్‌తో ఒరిస్సా టూర్ ప్లాన్ చేశాను. 2015లో. ఎనిమిది మంది వస్తామన్నారు. తీరా బయల్దేరే సమయానికి ఎవరూ రాలేదు. నేనొక్కదాన్నే మిగిలాను. కాని నేను ఆగలేదు. ఒక్కదాన్నే బయలుదేరి 8 రోజుల పాటు తిరిగి ఆ విశేషాలు ఫేస్బుక్లో పెట్టాను. అవి చూసి ఎవరైతే రాము అన్నారో వాళ్లంతా ఈసారి పిలూ వస్తాం అన్నారు. ఆ ఉత్సాహంతో కేరళలోనే కొల్లం జిల్లాలో ఉండే రోసెమలా అనే ట్రెక్కింగ్‌కి ప్లాన్ చేశాను. 20 మంది వస్తామని ఎనిమిది మంది తేలారు. ఆ 8 మందిమే ఒక జీప్ తీసుకుని వెళ్లాం. వచ్చిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన– ఎందుకు కేవలం స్త్రీల కోసమే ట్రిప్స్ ప్లాన్ చేయకూడదు? అని. ఇక ఉద్యోగం మానేసి ‘అప్పుపత్తాడి’ ట్రావెల్ సంస్థను ప్రారంభించాను’ అంటుంది సజనా అలీ. ∙∙ సజనా అలీ చేసిన ఈ ఆలోచనలో ఒక మేలు, ఒక ఇబ్బంది ఉన్నాయి. మేలు ఏమిటంటే కుటుంబంతో మాత్రమే ప్రయాణం చేయాలనుకునే స్త్రీలు ఆ తప్పనిసరిని వదులుకుని ‘తోడు మహిళలు ఉన్నారు’ అని చెప్పి టూర్లకు రాగలగడం. ఇబ్బంది ఏమిటంటే.. అందరూ ఆడవాళ్లే అయితే సేఫ్టీ సంగతి ఏమిటి? అనే ప్రశ్న తలెత్తడం. ‘సేఫ్టీ గురించి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ బస చేయాలో ఏ రూట్లో వెళ్లాలో పక్కా ప్లాన్ చేసుకుంటాం. స్త్రీలకు తమ జాగ్రత్త తమకు తెలుసు. ఏ ఇబ్బందీ లేదు’ అంటుంది సజనా అలీ. అయితే ఈ జాగ్రత్త కంటే కూడా ఆమె శ్రద్ధ పెట్టే విషయం– బడ్జెట్. ‘ఎక్కువ మంది స్త్రీలు మిడిల్ క్లాస్ నుంచి ఉంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తిరగడం వారికి వీలు కాదు. అందుకే వీలైనంత తక్కువ ఖర్చులో వారిని తిప్పి చూపించడానికి నేను ప్రాధాన్యం ఇస్తాను. ఆ మేరకు రూములు, రెస్టరెంట్లతో టై అప్ చేసుకుంటాను’ అంటుంది సజనా అలీ. సజనా అలీ కేరళ కేంద్రంగా పని చేస్తూ దేశమంతా విమెన్ ఓన్లీ టూర్లు నిర్వహిస్తోంది. తాజాగా తన ఫేస్బుక్ పేజీలో ధనుష్కోటికి వెళ్లిన బృందం ఫొటో పెట్టి ‘338వ ట్రిప్’ అని పోస్ట్ చేసింది. అంటే గత ఐదేళ్లలో ఆమె 338 విమెన్ ఓన్లీ టూర్లు ఆపరేట్ చేసింది. ఎంత లేదన్నా ఐదు వేల మంది స్త్రీలు దేశంలోని రంగు రంగుల ప్రాంతాలను, సంస్కృతులను ఆమె పుణ్యాన దర్శించి ఉంటారు. రోజువారీ రొడ్డకొట్టుడు నుంచి బయటపడటానికి కొద్ది మంది గృహిణులు కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం ఇటీవలి సినిమాల్లో కనిపిస్తోంది. ఆ సినిమాల కంటే ముందే సజనా అలీ స్త్రీలకు ప్రకృతి సినిమా చూపిస్తోంది. అలాంటి వారి స్ఫూర్తితో ఈ కోవిడ్ గోల తగ్గాక మీరూ రెక్కలు కట్టుకుని తోటి మిత్రులతో ఎగిరెళ్లిపోండి. హ్యాపీ జర్నీ. -
పదేళ్లలో దేశాన్ని చుట్టి వచ్చారు
మధురవాడ (భీమిలి): ఆయన రాజకీయ నాయకుడే కాదు. ఓ గొప్ప ఆధ్యాత్మిక వాది. అనుకున్నదే తడువుగా పదేళ్లలో తీర్థయాత్రలు చుట్టివచ్చాడు. హిమాలయాల్లో జిరో డిగ్రీల ఉండే డార్జిలింగ్ నుంచి సముద్ర మట్టానికి 20 వేలు కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని చూశారు. ఆయనే జీవీఎంసీ 7వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు. దర్శించుకున్న క్షేత్రాలు 2008లో చార్దామ్ యాత్ర చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పుణ్య క్షేత్రాలను పర్యటించాలని ఆలోచన వచ్చిందని శ్రీనివాసరావు చెప్పారు. 2018 నాటికి భార్యతో కలిసి అన్ని పుణ్యక్షేత్రాలను చూసివచ్చా. జ్యోతిర్లింగాలు, హిమాలయాలు, జ్వాలాముఖి, భూటాన్, గుజరాత్ ఇలా ముఖ్య ప్రాంతాలు అన్నీ చుట్టి వచ్చా.. పంచకైలాసాలు హిమాలయాల్లోని మాసన సరోవరం, ఓంకార్ పర్వతం, ఆది కైలాష్, మణికంఠ కైలాసం, కిన్నెర కైలాసాన్ని దర్శించుకున్నా.. శక్తి పీఠాలు 18 ఉంటే 14 సందర్శించాను. గంగోత్రి, యమునోత్రి, కేధార్నాథ్, బద్రీనాథ్, చార్దామ్ యాత్రలు పూర్తి చేశా.. షిరిడి, తిరుపతి, కాశీ యాత్రలు ఏడాది ఒకటి రెండు సార్లు వెళతామని చెప్పారు. మానస సరోవరంలో 48 కిలో మీటర్ల నడక భార్యతో కలసి మానస సరోవరం యాత్రకు వెళ్లా. మార్గ మధ్యలో గైడ్‌తో పాటు వెళుతున్న క్రమంలో గుర్రం నన్ను కిందకు పడేసింది. నా భార్యను గుర్రంపై ఎక్కించి నేను ఆ గమ్యాన్ని చేరుకోవడానికి 48 కిలోమీటర్లు రెండు రోజులు పాటు నడవాల్సి వచ్చింది. ఇదే కాదు హిమాలయాలు, దేవ భూమి ఉత్తరాఖండ్‌లో ఉన్న యాత్రలు అన్నీ చేయడం దైవం కల్పించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని శ్రీనివాసరావు చెప్పారు. -
కోవిడ్ ప్రమాద ఘంటిక వేళ... సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్న నగరవాసులు
సాక్షి హైదరాబాద్: ఒకవైపు కోవిడ్ ప్రమాద ఘంటికలు. మరోవైపు కలిసొచ్చిన సంక్రాంతి సెలవులు. నగరవాసులు బతుకుజీవుడా అంటూ పల్లెబాట పడుతున్నారు. పిల్లలకు సెలవులు మొదలవడంతో సొంతూరుకు ప్రయాణాలు పెరిగాయి. పది రోజుల పాటు ఊరిలో ప్రశాంతంగా ఉండవచ్చనే ఉద్దేశంతో చాలా మంది తరలివెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టవచ్చనే ఆశావహ దృక్పథంతో బయలుదేరుతున్నారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. నగర శివార్లలోని పలు కూడళ్లు సైతం ప్రయాణికులతో పోటెత్తాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలామంది సొంత వాహనాలపై తరలి వెళ్లారు. ఒక్కసారిగా పెరిగిన వాహనాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. మరో వారం రోజుల పాటు సంక్రాంతి ప్రయాణాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. రైళ్లలో పెరిగిన రద్దీ.. కొంతకాలంగా తప్పనిసరి ప్రయాణాలు, సాధారణ రాకపోకలతో కనిపించిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ఒక్కసారిగా రద్దీగా పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు, పాట్నా, ముంబై తదితర ప్రాంతాలకు బయలుదేరిన రైళ్లలో రిజర్వేషన్ బోగీలతో పాటు జనరల్ బోగీలు సైతం కిక్కిరిశాయి. సాధారణ రోజుల్లో సుమారు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా శనివారం మరో 25 వేల మంది అదనంగా బయలుదేరినట్లు రైల్వే అధికారులు అంచనా వేశారు. ఏపీ, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లతో పాటు, ఉత్తరాది రైళ్లలోనూ రద్దీ పెరిగింది. బస్స్టేషన్లలో సందడి.. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సులు ప్రయాణికులతో నిండుగా బయలుదేరాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సందర్భంగా 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ బస్సుల్లోనే ఎక్కువ మంది తరలివెళ్లారు. ఒకటి, రెండు రోజుల్లో పండుగ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారుల అంచనా. మరోవైపు నగర శివార్లలోనూ అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలా మంది సొంత బైక్‌లు, కార్లలో ఊళ్లకు బయలుదేరారు. సిటీలో పెరిగిన ట్రాఫిక్.. వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో నగరంలోని అనేక చోట్ల ట్రాఫిక్ ర ద్దీ నెలకొంది. ఉప్పల్– వరంగల్, సికింద్రాబాద్–బేగంపేట్, అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్–ఎల్బీనగర్, మెహిదీపట్నం, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ చోటుచేసుకుంది. -
టూర్ వెళ్లాలంటే పుట్టిన తేదీ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: కోవిడ్-19 మొదటి, రెండు డోసులు తీసుకోవడమే కాక కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లో కూడా పుట్టిన తేదీ నమోదు చేసుకుంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) చీఫ్ డీఆర్ శర్మ స్పష్టం చేశారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పుట్టిన తేదీకి ఒక ఫార్మాట్ (సంవత్సరం\ నెల\ తేదీ) విధానాన్ని కూడా సూచించింది. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు, దుకాణలు, కార్యాలయాలు నెమ్మదిగా తెరుచుకుని యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. (చదండి: సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కొడుకు.) ఈ కమంలో ప్రయాణికులు సురక్షితంగా ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా ప్రయాణించాలంటే ఈ విధమైన నిబంధనలే సురక్షితమని చెప్పారు. ఒకవేళ రెండు డోసులు వేయించుకున్నప్పటికీ పుట్టిన తేదీ నమోదు చేయించుకోకపోతే వెంటనే మీ పాస్‌పోర్ట్‌లో పుట్టిన తేదీలో ఎలా ఉందో అలా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మార్పులు చేయించుకోవాలని డీఆర్ శర్మ సూచించారు. పుట్టిన సంవత్సరం ఆధారంగా సదరు వ్యక్తుల వయసు కూడా స్పష్టమవుతోందని తెలిపారు. ఎన్నో అభ్యంతర పరిణామాల మధ్య యూకే తయారు చేసిన కోవిషీల్డ్‌కి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. (చదవండి: వర్క్‌ఫ్రమ్ హోమ్: కంపెనీల కొత్త వ్యూహం) -
మారిన టూర్ ట్రెండ్: ప్రయాణికులంతా ఆ దారిలోనే!
సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రియులు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సమాజాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకు విమాన ప్రయాణానికే ఓటేస్తున్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ అనంతరం గత 2 నెలల్లో సువరు 20 ఎయిర్ ప్యాకేజీలను నిర్వహించినట్లు ఐఆర్సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ నర్సింగ్‌రావు తెలిపారు. కోవిడ్ మొదటి ఉధృతి అనంతరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 38 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. 2019లో హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఏకంగా 175 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వేలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అదే సమయంలో రైల్ టూర్లు, ఉత్తర, దక్షిణాది పర్యాటక రైళ్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇవిగో ఎయిర్‌ప్యాకేజీలు... ► గోవా టూర్ సెప్టెంబర్ 24న ప్రారంభంకానుంది. విమాన ప్రయాణంతో పాటు రోడ్డు, రవాణా, గోవాలో హోటల్ సదుపాయం, తదితర అన్ని ఏర్పాట్లు ఐఆర్సీటీసీ అందజేస్తుంది. ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ గోవాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ (మూడు రాత్రులు..నాలుగు పగళ్లు)ఒక్కరికి రూ.15,780 చొప్పున ఉంటుంది. ► స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పర్యటన ప్యాకేజీ(ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) విలువ ర.23,150. అక్టోబర్ 1వ తేదీన ఈ పర్యటన మొదలవుతుంది. అహ్మదాబాద్, ద్వారక, సోమ్‌నాథ్ ఆలయాలతో పాటు సర్ధార్ వల్లభ్‌బాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించవచ్చు. ► హౌస్‌బోట్ సదుపాయంతో కూడిన కశ్మీర్ పర్యటన సెపె్టంబర్ 16న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో( ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గావ్, సోన్మార్గ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ ప్యాకేజీ రూ.24.480 చొప్పున ఉంటుంది. ► రాయల్ రాజస్థాన్ యాత్ర (ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. జైపూర్, జోథ్‌పూర్, పుష్కర్, ఉదయ్‌పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. రూ.23,900 చొప్పున ఈ పర్యటన ప్యాకేజీ ఉంటుంది. ఉత్తరభారత యాత్ర... ► ట్రైన్లో వెళ్లే పర్యాటకుల కోసం ఉత్తర భారతయాత్ర, వారణాసి–గయ–ప్రయాగ్‌రాజ్, దక్షిణభారత యాత్ర రైళ్లను సిద్ధం చేసింది. ఉత్తర భారతయాత్ర, ఈ నెల 27 నుంచి సెపె్టంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, హరిద్వార్, దిల్లీ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఒక్కొక్కరికి అన్ని సదుపాయాలతో రూ.10,400 చొప్పున ఉంటుంది. ►దక్షిణభారత యాత్ర అక్టోబర్ 19న ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుచురాపల్లి, తంజావూరు,రామేశ్వరం, మధురై, కన్యాకువరి, మహాబలిపురం, కాంచీపురం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీ రూ.6,620 చొప్పున ఉంటుంది. వివరాలకు: ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. ఫోన్ నెంబర్లు: 04027702407, 97013 60701 -
జీహెచ్ఎంసీ ఎన్నికలు: గడప దాటి వచ్చేవారెందరు..?
సాక్షి,హైదరాబాద్: వరుసగా నాలుగు రోజులు సెలవులొచ్చాయంటే చాలు సిటీజనులు ఆకస్మాత్తుగా జంప్‌జిలానీలవుతారు. ఏ టూరిస్ట్ ప్లేస్‌కో.. లేదంటే సొంత ఊళ్లకో పరుగులు తీస్తారు. ఆ నాలుగు రోజులు సరదాగా గడిపి వచ్చేస్తారు. సహజంగానే ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి లేని వర్గాలకు ఈ వరుస సెలవులు ఒక వరంలా మారుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు కూడా వరుస సెలవుల గండం వచి్చపడింది. ఆఖరు శనివారం బ్యాంకు కార్యకలాపాలకు సెలవు, ఆదివారం సంగతి సరే సరి. సోమవారం గురునానక్ జయంతి. ఇక మంగళవారం పోలింగ్ రోజు ఎలాగూ సెలవు ఉంటుంది. అందుకే నగరవాసులు ఛల్ మోహనరంగా అంటే ఊరుకు చెక్కేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు కోవిడ్ దృష్ట్యా సాఫ్ట్వేర్ సంస్థలు ‘వర్క్‌ఫ్రమ్ హోమ్’ వెసులుబాటునివ్వడంతో చాలా మంది టెకీలు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. డిసెంబర్ నెలాఖరు వరకు వాళ్లు ఊళ్లకే పరిమితమవుతారు. సాధారణంగానే ఎన్నికలకు దూరంగా ఉండే టెకీలు ఈ ఎన్నికల్లో కూడా వర్క్‌ఫ్రమ్ హోమ్ కారణంగా దూరంగానే ఉండే అవకాశం ఉంది. మధ్యతరగతి, సాఫ్ట్వేర్ వర్గాలు తమ ఓటు హక్కును వినియోగించుకోపోవడం వల్లనే గత మున్సిపల్ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఎన్నికల నిఘా వేదిక వంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కానీ రాజకీయాల పట్ల మధ్యతరగతి ప్రజల్లో ఉండే విముఖత పోలింగ్ పైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఓపిగ్గా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేస్తారా..? లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించడంతో జనం చాలా వరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు సాధారణమయ్యాయి. 70 శాతం ప్రజలు బయట తిరుగుతుండగా 30 శాతం మాత్రమే ఇళ్లలో ఉంటున్నట్లు సమాచారం. పోలింగ్ రోజు సెలవు కావడం వల్ల జనమంతా ఇళ్లకే పరిమితమవుతారు. ఓపిగ్గా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేస్తారా..? అనేది సందేహాస్పదమే. కోవిడ్ దృష్ట్యా చాలామంది పోలింగ్ బూత్‌ల వద్ద నిరీక్షించేందుకు వెనుకంజ వేస్తే ఈ సారి కూడా పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ నగర అభివృద్ధి దృష్ట్యా ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. ఆ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. -
అందరం మనమే ఆనందం మనదే
ఇంట్లో ఉన్నది చాలు కాసింత ఊపిరి పీల్చుకుందాం పద అని బయలుదేరారు ఇండోర్ స్త్రీలు. అక్కడి ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ కోవిడ్ వల్ల గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే దీపావళి వేళ పండగ పర్యటనకు బయలుదేరారు. ఇండోర్ వ్యాపారవేత్త శ్రేష్టా గోయల్ ఈ గ్రూప్‌ను నడుపుతారు. స్త్రీలను విహారాలు, పర్యటనలు, యాత్రలు చేసేందుకు ప్రోత్సహిస్తుంటారు. సెప్టెంబర్ 20, 2020న ఇండోర్‌లో ఒక ఈవెంట్ జరిగింది. దానిని ఆర్గనైజ్ చేసింది ఆ నగరంలో ఉన్న ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’. దాని స్థాపకురాలు శ్రేష్టా గోయల్. ఆ ఈవెంట్ పేరు ‘డ్రైవింగ్ ఈజ్ మై పేషన్’. ఇండియాలో కార్లున్న లక్షలాది ఇళ్లల్లో స్త్రీలకు ఆ ఇళ్లలోని వంట గదులో, వరండాలో అప్పజెబుతుంటారు డ్రైవింగ్ చేయడానికి కారు మాత్రం ఇవ్వరు. ఎంత ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కారులో కూచోబెట్టి ఊరికో, ఉద్యోగానికో తీసుకెళ్లి దింపుతారు కాని స్టీరింగ్ అప్పజెప్పరు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేల ప్రకారం పురుషుల కంటే స్త్రీలే సేఫ్ డ్రైవర్లని తేలింది. అయినా సరే స్త్రీలకు కారు డ్రైవింగ్ ఇంకా నిరాకరింపబడే విషయంగానే ఉంది. అందుకే శ్రేష్టా ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. 10 రోజులు 200 మంది సెప్టెంబర్ 10 నుంచి 30వ తేదీ వరకూ దేశంలోని ఐదారు రాష్ట్రాలు, కేరళతో సహా కార్లు డ్రైవ్ చేసే స్త్రీలు వారు గృహిణులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు వచ్చి ఇండోర్‌లో తమ వాహనాలతో తిరిగారు. ‘డ్రైవింగ్ ఈజ్ మై పేషన్’ అని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇండోర్‌లో, మధ్యప్రదేశ్‌లో, ఇతరరాష్ట్రాలలో వివిధ శాఖలలో పని చేస్తున్న స్త్రీలు.. ముఖ్యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వచ్చే ఉద్యోగులు స్త్రీలను ఉత్సాహపరచడానికి వీడియోలు విడుదల చేశారు. ‘జీవితంలో ముందుకు వెళ్లాలంటే వాహనాన్ని నడపడం తెలియాలి. ఈ స్కిల్ స్త్రీలకు చాలా ముఖ్యం. కారు నడపడం లగ్జరీ కాదు. అవసరం. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఒంటరి కారు ప్రయాణాలు చేయగలరు. అడ్వంచర్లు చేయగలరు. నేనైతే కారులో జైపూర్ నుంచి బద్రీనాథ్‌కు, మంగళూరు నుంచి కేరళకు కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాను. రాక్ ది రోడ్స్’ అంటూ ఇండోర్ ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ అర్యామా సన్యాల్ ఒక వీడియో విడుదల చేశారు. ‘డ్రైవింగ్ చేస్తే ఫోకస్ తెలుస్తుంది. వాహనాన్నే కాదు జీవితాన్ని కంట్రోల్ చేయడం కూడా తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని కర్ణాటక రాష్ట్రమహిళా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు శిఖ ఒక వీడియో విడుదల చేశారు. మొత్తంగా ఈ ఈవెంట్ విజయవంతమైంది. స్త్రీలు తమ డ్రైవింగ్ అనుభవాలు పంచుకుని స్త్రీలను ఉత్సాహపరిచారు. దీని కారకులలో ముఖ్యురాలు శ్రేష్టా గోయల్. అడ్వెం‘టూర్’ ఇండోర్‌లో ఒక ఫార్మాసూటికల్ కంపెనీ సి.ఇ.ఓ అయిన శ్రేష్టా గోయల్ తనకు అత్యంత ఇష్టమైన విషయం తన జిప్సీని డ్రైవ్ చేయడమే అని చెప్పుకుంటారు.‘జీవితమే ఒక సాహసం. ప్రయాణాల ద్వారా ఆ సాహసాన్ని కొనసాగించాలి’ అని చెబుతారామె. అందుకనే ఇండోర్‌లో ఆమె ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ అనే సంస్థను స్థాపించారు. కాళ్లకు చక్రాలున్నాయని నమ్మే స్త్రీలు ఈ గ్రూప్‌లో సభ్యులు. ఇంటికి, ఉపాధికి సమయం ఇస్తూనే తమదంటూ జీవితాన్ని లోకం చూడటం ద్వారా గడపడానికి ఇష్టపడే స్త్రీలు ఈ గ్రూప్ ద్వారా ఒక చోట చేరారు. ‘మేము పర్యటించడమే కాదు పర్యటించమని స్త్రీలకు స్ఫూర్తినిస్తాం’ అంటారు వాళ్లు. ఈ టూర్లను అడ్వెంటూర్లని అంటారు. రెండు మూడు నెలలకోసారి వీరో పర్యటనను ప్లాన్ చేస్తారు. ‘అందరం మనమే ఆనందం మనదే’ అన్నట్టు తిరుగుతారు. నదులు, పర్వతాలు, అడవులు వీరి పర్యటనా స్థానాలు. అడపాదడపా ఇంటికి వచ్చే బంధువులు, వెళ్లే బంధువులు పిండివంటలు ఇంటి అలంకరణలు... ఈ పని ఎలాగూ తప్పదు. దానికి సిద్ధమయ్యే ముందు ఈ లాక్డౌన్ ఇచ్చిన వొత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఒక విహారం అవసరం అని అక్టోబర్ 9న ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ సభ్యులు ఇండోర్ నుంచి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ఒకరోజు విహారానికి బయలుదేరారు. యాభైకిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలు చూసి వచ్చారు. చాలా బాగా అనిపించింది’ అంది శ్రేష్టా గోయల్. ఇండోర్‌లోనే కాదు దేశంలోని ప్రతి చిన్న పట్టణంలో ఇలాంటి బృందాలు అవసరం అనిపిస్తుంది వీరిని చూస్తుంటే. -
శ్రీదేవిలో మనకి తెలియని మరో టాలెంట్..
-
శ్రీదేవిలో మనకి తెలియని మరో కోణం ..
సినీ ప్రపంచాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచుతూ అతిలోక సుందరి శ్రీదేవి నింగికేగారు. మొన్నటి వరకు శ్రీదేవి ఓ గొప్పనటిగా మాత్రమే మనందరికి తెలుసు. దాదాపు మూడు తరాల అభిమానులకు తనవైపుకు తిప్పుకున్న శ్రీదేవిలో మనకి తెలియని మరో టాలెంట్ ఉంది. పెయింటింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టమట. గత ఐదేళ్ళుగా ఎవరికి తెలియకుండా పెయింటింగ్స్ వేస్తుందట. సినీ కేరీర్ వల్ల ఆ టాలెంట్‌ను శ్రీదేవి ఎప్పుడూ బయపెట్టలేదు. తీరిక దొరికినప్పుడల్లా శ్రీదేవి పెయింటింగ్‌లు వేసి నచ్చిన వాళ్ళకి బహుమతిగా ఇస్తారట. ఇటీవల తన మరిది కూతురు సోనమ్ కపూర్‌కి అద్భుతమైన పెయింటింగ్ వేసి ఇచ్చిందట శ్రీదేవి. ఆ పెయింటింగ్ ను చూసి ఫుల్ ఖుష్ అయిన సోనమ్ ఆ మరుపురాని జ్ఞపకాన్ని తన రూమ్‌లో దాచుకుందట. మరోవైపు సల్మాన్ ఖాన్, డిజైనర్ మనీష్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలకు కూడా తన పెయింటింగ్స్ బహుమతులుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీదేవికి తన ఇద్దరు కుమార్తెలు అంటే ప్రాణం..అందుకేనేమో ఆమె పెయింటింగ్స్‌లో జాన్వి, ఖుషీలవి కూడా ఉన్నాయట. అదేవిదంగా మైకేల్ జాక్సన్‌ను ఎంతో ఇష్టపడే శ్రీదేవి ఆయన పెయింటింగ్‌ను గీశారు. కాగా, శ్రీదేవి పెయింటిగ్స్‌తో ఓ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సంస్థ ఛారిటి నిమిత్తం దుబాయ్‌లో ఓ షో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసిందని కూడా వార్తలు వెలువడ్డాయి. శ్రీదేవి గీసిన సోనమ్ పెయింటింగ్ ప్రయాణాలంటే ఇష్టం శ్రీదేవికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. తీరిక దొరికనప్పుడల్లా భర్త బోనీ, పిల్లలతో కలిసి తరచూ విదేశీ పర్యటనకు వెళతామని ఆమె ఓ ఇంటర్వూలో తెలిపారు. రోమ్, ఇటలీ నగరాలు బాగా నచ్చుతాయని తెలిపింది. లేతరంగు చీరలను ఇష్టపడే శ్రీదేవి.. చీర ఎలా కట్టుకోవాలో వాళ్ల అమ్మ దగ్గర నేర్చుకుందట. సంగీతం వింటూ పనులు చేసుకునే శ్రీదేవి తెలుగు, హిందీ, తమిళ పాటను ఎక్కువగా వింటుంది. అదే విధంగా దేవుడిపైనా శ్రీదేవికి నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని ప్రారంభించే ముందు పూజ చేయడం అమెకు అలవాటు. మైకేల్ జాక్సన్ పెయింటింగ్ -
కేంద్రం అలర్ట్ : ముఖ్యమంత్రులకు ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రులకు భద్రతాపరమైన ముప్పు ఉందని హెచ్చరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో పర్యటించే సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరింది. ఆకస్మిక పర్యటనల్లో సీఎంలపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఇంటిలిజెన్స్ పక్కా సమాచారంతోనే కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. -
రాష్ట్రా వ్యాప్తంగా కమల్ పర్యటనలు
-
మదినిండుగ విహర పండగ
తీర్థ యాత్రలు / విహార యాత్రలు ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసమైన మార్పుకోసం విహార యాత్రలు చేస్తుంటాం. ఇంటిల్లిపాదితో కలిసి యాత్ర చేస్తే ఆ ఆనందమే వేరు. అయితే, ఏదైనా టూర్ వెళ్లాలి అని అనుకోగానే ఎక్కడికి, ఎలా? అనే అన్వేషణ మొదలవుతుంది. ఇలా ఆనందంగా వెళ్లిరావడానికి మన దేశంలో అనేక ప్రదేశాలున్నాయి. చరిత్ర, సంస్కృతి, మతాలను ప్రతిబింబించే ప్రదేశాలు కోకొల్లలు. ప్రకృతి అందాలు, జంతు ప్రదర్శనశాలలు, కొండలు, కోనలు, అడవులు, జలపాతాలు, బీచ్‌లు, నదులు.. ఇలా సువిశాల భారతదేశంలో ఎన్నెన్నో అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఏదో మొక్కుబడిగా కాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని యాత్ర ప్రారంభిస్తే అనవసర హడావిడికి తావుండదు. మరుపురాని ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాల నుంచి మన తీర్థయాత్రను ప్రారంభిద్దాం. చార్ధామ్: మన దేశంలోని గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలే చార్‌ధామ్‌గా జగత్ ప్రసిద్ధి. ఈ నాలుగు ఆలయాలను జీవితంలో ఒక్కసారైన సందర్శించాలని ప్రతీ ఒక్కరు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి. కాశీ యాత్ర: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధాని. ఈ నగరం నడిబొడ్డున కొలువైన కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నీరాజనాలను అందుకుంటోంది. మహిమాన్వితమైనది కాబట్టే జీవితంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ. రామేశ్వరం: రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వినుతికెక్కింది. శ్రీ రామేశ్వరం పాంబన్కు ఈశాన్య భాగమందు, ధనుష్కోటికి ఆగ్నేయ భాగంలో ఉంది. విష్ణు ప్రియమైన రామేశ్వరం శంఖు ఆకారంలో కనబడుతుందంటారు. కాశీయాత్ర ఫలితము ధనుష్కోటి సేతులో స్నానం చేసి, రామనాధుని పూజించిన పూర్తి అవుతుందని చెబుతారు. అమర్నాథ్ యాత్ర: మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు, లోతెంతో తెలియని లోయలు, మైనస్ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి, ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే ‘ఓం నమఃశివాయ.’ ఏడాదిలో 45 రోజుల పాటు కనిపించే మంచు లింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. కైలాస మానస సరోవరం: సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు అతిపవిత్రం. శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాస మానస సరోవరం. విహార యాత్రలు మున్నార్: ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళ ప్రకృతి అందాల విందుకు నెలవు. ఇక్కడి మున్నార్ ప్రకృతి అందాల విందును కనులారా ఆరగించాలంటే కనీసం మూడురోజులు పడుతుంది. చూడముచ్చటైన వృక్షాల అందాలు, తేయాకు తోటల ఘుమఘుమలు, పన్నెండేళ్ళకోసారి పూచే కురింజి పువ్వు సోయగాలు, బోట్‌రైడింగ్ అనుభూతులు, చల్లని పిల్ల తిమ్మెరలు.. మెుత్తానికి వసంతంలో శిశిరంలా ఉంటుంది మున్నార్ విహారం. మనాలి: హిమలయపు అందాల నడుమ విరాజిల్లుతున్న ప్రాంతమే మనాలి. దీన్ని‘స్విడ్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అంటారు. ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి మనాలీకి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి 3 కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉన్నాయి. చుట్టూ మంచులోయల మధ్య వేడి నీటి కొలనులు ఉండటం ఆశ్చర్యం. సిమ్లా పరిసరాల్లో కుఫ్రీ షార్ట్ ట్రిప్, లీజర్ వాక్, హిడింబా ఆలయం, టిబెటన్ మోనస్టరీ, సోలంగ్ లోయ చూడొచ్చు. నాగర్ ఫోర్ట్, రహాలా జలపాతాలు, బీస్ నదిలో సాహస క్రీడలు, రాఫ్టింగ్ కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయ్. సిమ్లా: పెళ్లినాటి తొలిరోజులను ఆహ్లాదంగా గడిపేందుకు ఇదో చక్కని ప్రదేశం. సిమ్లా ఆపిల్ పండ్లకు ప్రసిద్ధి. ఎత్తయిన కొండలు, మల్లెపూల వానలా కురిసే మంచు, చల్లటి వాతావరణం కట్టిపడేస్తాయ్. వందల ఏళ్ల నాటి ఆలయాలు, చర్చిలు, బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎన్నో భవనాలు ఆకట్టుకుంటాయి. ఎటుచూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లుగా ఉండే ఫైన్, ఓక్ చెట్లు అడుగడుగునా ప్రత్యక్షమవుతాయి. స్నో స్కీయింగ్ ఇది స్వర్గధామమే. ఊటి, కొడైకనాల్: తమిళనాడు మధ్య ప్రాంతంలో ఉన్న సుందరమైన పర్వతప్రాంతం ఊటి, కొడైకెనాల్. తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఘాట్రోడ్లో ప్రయాణించాల్సిందే. కొడై సరస్సు, సెయింట్ మేరీ చర్చ్, పంపార్ పాల్స్, గ్రీన్ వ్యాలీ, గుణ గుహ, పైన్ వృక్షాల వనం పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇందులో కొడై అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. అంతర్జాతీయ యాత్రలు సింగపూర్: పచ్చదనానికి, పరిశుభ్రతకు మరో పేరు సింగపూర్. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఆ దేశ అందాలను వీక్షించేందుకు విచ్చేసే పర్యాటకుల సంఖ్య కోకొల్లలు. ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిపిన ఈ అరుదైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే సింగపూర్ వెళ్లి రావాల్సిందే. మలేషియా: నీలిరంగు కప్పుకున్న సముద్రం తెల్లగా మెరిసిపోయే ఇసుక, ఆ పక్కనే పచ్చదనం పరుచుకున్న వృక్షసంపద, నీటి మీద తేలియాడే మరపడవలూ, తీరాన్ని తాకాలనే ఉత్సాహంతో ఉరకలు వేసే సముద్ర కెరటాలు... ఇలా మలేషియా అందాలన్నీ రంగుల హరివిల్లులై పర్యాటకుల మది దోచుకుంటుంటాయి. చిన్న చిన్న దీవులతో ఏర్పడ్డ సుందర ప్రదేశమే మలేషియా. దట్టమైన అరణ్యాలూ, ఎత్తయిన కొండలూ, తెల్లని బీచ్‌లతో చూడముచ్చటగా ఉంటుంది. థాయ్‌లాండ్: ఏటా లక్షలాదిమంది పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతం థాయ్‌లాండ్. బీచ్‌లో సేద తీరాలన్నా, స్పా, మసాజ్ సెంటర్లలో రిలాక్స్ అవాలన్నా థాయ్ ది బెస్ట్ ప్లేస్. డిసెంబర్, మార్చి మధ్య థాయ్‌లాండ్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కాకుండా హాఫ్ సీజన్లో ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చులో టూర్ ప్రశాంతంగానూ పూర్తవుతుంది. శ్రీలంక: పూల సుగంధ పరిమళాల గుబాళింపు, పక్షుల కిలకిలారావాలు, ఎటువైపు చూసినా కనువిందు చేసే పచ్చదనం, స్వచ్ఛమైన చల్లని పిల్లగాలులు, సముద్ర తీరం హŸయలు వీటన్నింటినీ స్వయంగా ఆస్వాదించాలంటే శ్రీలంకకు వెళ్లాల్సిందే. హైదరాబాదు నుంచి కొలంబోకు సరిగ్గా రెండు గంటల ప్రయాణం మాత్రమే. శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే కాబట్టి టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. హాంకాంగ్ మకావా: హాలీడేస్‌లో ఎక్స్ట్రార్డినరీ అనుభూతి. సముద్ర గర్భ మార్గం, కొండల్ని తొలుస్తూ వేసిన అండర్‌పాస్‌లు, సుదూర ప్రాంతాలను కలిపే వేలాడే వంతెనలు.. భూతల స్వర్గాన్ని తలపించే హాంకాంగ్ చైనాకు ఆగ్నేయ తీరంలో ఉంటుంది. పలు చిన్న చిన్న ద్వీపాల సమూహమిది. నేపాల్: ఎవరెస్టు శిఖరం మీద ఎగురుతూ ధవళవర్ణంలో ధగధగలాడే హిమాలయ పర్వతశ్రేణుల సౌందర్యాన్నీ ఆ కొండల్లోంచి జాలువారి వయ్యారంగా మలుపులు తిరుగుతూ సాగే నదుల అందాలనూ... ఎంతసేపు చూసినా విసుగనిపించదు. అలాంటి అందాల నెలవు నేపాల్. RVటూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పో ఎప్పుడెప్పుడు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవాలకునే భక్తుల సౌలభ్యం కోసం / విహార పర్యాటక ఔత్సాహికుల కోసం ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ వేసవి సెలవులతో పాటు సంవత్సరం పొడవునా వచ్చే విశేష ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నేటి నుండి జనవరి 24 వరకు ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తోంది. ఈ ఎక్స్పో లో 2018 ఫిబ్రవరి వరకు చేయబోయే ఆధ్యాత్మిక, వినోద, విహార లేదా అంతర్జాతీయ యాత్రలను అడ్వాన్స్‌గా కొంత మొత్తము ప్యాకేజీ అమౌంట్‌ను కట్టినట్లయితే భారీ డిస్కౌంట్ పొందే సదావకాశం కల్పిస్తోంది. నేరుగా హైదరాబాద్ కూకట్పల్లి లోని ఖVప్రధాన కార్యాలయాన్ని సందర్శించి గాని లేదా ఫోన్ ద్వారా కానీ వివరాలు పొందవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక తగ్గింపు ప్యాకేజీలను వినియోగించుకోవచ్చు. గమనిక: ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ట్రావెల్ ఎక్స్పోను సందర్శించండి. భారీ డిస్కౌంట్ పొందండి. ఈ అవకాశం 21, 22, 23, 24 తేదీలలో మాత్రమే. ఆర్ వి టూర్స్ – ట్రావెల్స్ 3వ అంతస్తు, భాగ్యనగర్ కాంప్లెక్స్, బి.జె.పి. ఆఫీస్ ఎదురుగా, మెట్రో పిల్లర్ నెం. 15, కూకట్పల్లి, హైదరాబాద్ ఆర్.వి.రమణ ఆర్.వి.టూర్స్ – ట్రావెల్స్ అధినేత -
ఇక టీఆర్ఎస్ ప్రాజెక్టు యాత్రలు
-
రేటు రూ. 5 కోట్లు.. స్పీడు 100 కి.మీ.
-
కానుకగా.. ఉపయుక్తంగా...!
ట్రావెల్ గేర్ పర్యటనలు ఎక్కువగా చేసే బంధువులు, మిత్రులు ఉంటే వారికి ఏదైనా మంచి కానుక ఇవ్వాలనుకుంటారు. కానీ, సమయానికి ఏదీ మైండ్‌కు తట్టదు. ట్రావెలర్స్‌కు ఉపయోగపడే కొన్ని వస్తువులపై దృష్టిపెడితే అద్భుతమైన కానుకలను అందించవచ్చు. వారి జ్ఞాపకాలలో మీరు పదిలంగా నిలిచిపోవచ్చు. మీ కానుకల జాబితాలో వీటిని చేర్చండి... కంపాస్ నెక్లెస్ వెంట తీసుకెళ్లాల్సిన వస్తువుల జాబితాలో ‘దిక్సూచి’ గురించి అంతగా ఎవరూ పట్టించుకోరు. కానీ, తూర్పు - పడమర, ఉత్తర - దక్షిణ దిక్కులను సూచించే దిక్సూచి వెంట ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, ఇతర వస్తువులతో పాటు దిక్సూచినీ కలిపి ప్యాక్ చేస్తే ఎక్కడైనా పడిపోయే అవకాశాలు ఎక్కువ. అదే గొలుసులా ఉండే ఈ దిక్సూచి ఉంటే మెడలో వేసుకోవచ్చు. స్టైల్‌గానూ, ఉపయుక్తంగానూ ఉంటుంది. మన దగ్గరి వారి జ్ఞాపకంగా ప్రేమను వ్యక్తం చేయడంలో ముందుంటుంది. ఆప్తుల్లో ట్రావెలర్స్ ఉంటే వారిని ఆశ్చర్యపరిచేలా ఈ కానుకను అందజేయవచ్చు. కంపాస్‌ను వెండి, బంగారు, స్టీల్ లోహాల గొలుసు డిజైన్లలో లాకెట్లాగానూ ఉపయోగించవచ్చు. పర్యావరణ హితం బామ్మల నాటి కాలంలో దగ్గరి విహార ప్రదేశాలకు వెళ్లాలంటే చెక్క, చెట్ల వే ళ్లతో అల్లిన బుట్టలలో కావల్సిన పదార్థాలను సర్దుకుని వెంట తీసుకెళ్లేవారు. ప్లాస్టిక్ మయం అయిపోయిన ఈ రోజుల్లో తేలికగా ఉండేలా కలపతో తయారైన ప్లేట్లు, స్పూన్లు, అందమైన అల్లిక గల బుట్ట.. వంటివన్నీ విడి విడిగా సేకరించి ఒక సెట్ రూపంలో కానుకగా ఇస్తే ఎంతో ఉపయుక్తంగానూ, విభిన్నంగా ఉంటుంది. -
వస్తున్నారు.. వెళ్తున్నారు
సాక్షి ప్రతినిధి, కడప: పళ్లు ఊడగొట్టేందుకు ఏ రాయి అయితేనేం... అన్నట్లుగా మంత్రుల పర్యటనలు సాగుతున్నారుు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆమాత్యుల పర్యటనలు విందులకే పరిమితమవుతున్నారుు. టీడీపీ నేతల పరపతి పెంచితే అదే పదివేలు అన్నట్లుగా వారి పర్యటనలు తలపిస్తున్నాయి. పరిటాల సునీత మొదలు డిప్యూటీ సీఎం చిన రాజప్ప వరకూ చేపట్టిన జిల్లా పర్యటన అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శాఖా పరంగా అభివృద్ధిపై చర్చకంటే అధికారపార్టీ నాయకుల్ని సంతృప్తి పర్చడంతోనే ముగుస్తున్నారుు. జిల్లాలో శరవేగంగా చోటుచేసుకున్న పలు అభివద్ధి పనులు ఆర్ధాంతరంగా నిలిచిపోయాయి. అధికారంలో ఉన్నవారు వాటిని పూర్తి చేసి ప్రజావిశ్వాసం పొందాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా అభివృద్ధి పనులపై అధికార పార్టీ నేతలకు శ్రద్ధ ఇసుమంతైనా కన్పించడం లేదు. నాలుగునెలల్లో మంత్రులు పర్యటనలు మినహా జిల్లాకు ఒనగూరిందేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. తుదకు ఎయిర్‌పోర్టు సామర్థ్యం మేరకు పనులు పూర్తి అయినా ప్రారంభోత్సవానికి కూడా పాలకులు వెనకగుడుకు వేస్తున్న పరిస్థితి. కలెక్టరేట్ భవన సముదాయం, ఐజీ కార్ల్ పశుపరిశోధన కేంద్రం దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు ఉన్నా జిల్లాకు తెప్పించుకోలేని దుస్థితి. మైలవరం, గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాళెం, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లల్లో సులువుగా 30 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. ఆ దిశగా పాలకపక్షం చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు అధికంగా ఉన్నాయి. ఏమంత్రి పర్యటన ఉన్నా, అధికారపార్టీ నేతలకు తమ ఇళ్లుకు రావాలనే తపన తప్పా, ప్రాంతం అభివద్ధికి యోగ్యం కావాలనే తలంపు కన్పించలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇసుమంతైనా అభివృద్ధి ఏదీ.... జిల్లాలో ఇప్పటి వరకూ ఏడుగురు మంత్రులు పర్యటించారు. మంత్రుల పర్యటనలను పరిశీలిస్తే అధికార పార్టీ నేతల మెప్పు మినహా ఏమాత్రం అభివృద్ధి ఏదని విశ్లేషకులు పశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రాభవం కోసం మినహా ప్రాంతాల అభివృద్ధిపై శ్రద్ధ లేదని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిశోర్‌బాబు, శిద్ధా రాఘవరావు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, డిప్యూటీ ముఖ్యమంత్రి (హోంమంత్రి) చిన రాజప్పలు పర్యటించారు. ఈ ఏడుగురు మంత్రుల పర్యటనలు నాయకుల గ్రామాలు, ఇళ్లతో ముడిపడి ఉంది. శాఖ పరంగా లోటుపాట్లపై సమీక్షలు నిర్వహించడంలో దాదాపు విఫలం అయ్యారనే ఆరోపణలు విన్పిస్తోన్నాయి. ఒకవేళ సమీక్షలు చేపట్టినా అధికార పార్టీ నాయకుల కోసమే అన్నట్లుగా వ్యవహరించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. జిల్లాలో మెట్ట సేద్యం అచ్చిరాక, రైతన్నలు అనేక అవస్థలు పడుతున్నారు. పండ్లతోటల రైతుల స్థితి రోజురోజుకూ దీనస్థితిగా మారుతోంది. వారికి శాశ్వత పరిష్కార మార్గంగా అడుగులు పడుతాయనే ఆశలు ఏమాత్రం కన్పించడం లేదని విశ్లేషకులు భావిస్తోన్నారు. ఆయా శాఖలల్లో గ్రిప్ కోసమే.... మంత్రులు పర్యటిస్తే శాఖ పరంగా సమీక్షలు నిర్వహించి ఆశాఖలో జిల్లాకు యోగ్యకరంగా ఉంటారని భావించేవారు. అయితే ఆయాశాఖల్లో తెలుగుతమ్ముళ్లు పరపతి పెంచేందుకు మంత్రులు పర్యటనలు సాగుతున్నారుు. డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి చిన రాజప్ప పర్యటన సైతం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగు తమ్ముళ్లుకు అండగా నిలవని అధికారులను ఆదిశగా ప్రోత్సహించేందుకే ఆయన పర్యటన ఉన్నట్లుగా పరిశీలకులు ఆరోపిస్తున్నారు. -
యాత్రల పేరిట వచ్చే పార్టీలను తరిమికొట్టాలి
సూర్యాపేట : కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి నాలుగు మాసాలైనా గడవకముందే అభివృద్ధి చేయలేదంటూ గ్రామాలకు యాత్రల పేరుతో వచ్చే టీడీపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు తరిమి కొట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సూర్యాపేట నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. టీడీపీనేతలు బస్సు యాత్ర మాని కాశీ యాత్ర చేపట్టాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అని ఆరోపించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత విద్యుత్ పీపీఏ ఒప్పందాలను రద్దు చేసి కరెంటు కోతలకు బాబు కారణమయ్యారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆపార్టీ నేతలే అభివృద్ధి చేయడం లేదంటూ యాత్రల పేరుతో గ్రామాలకు వస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపని పొన్నాల, జానారెడ్డిలు నేడు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలు అమలు చేస్తుంటే విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు, తదితర సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నింటిపై ప్రభుత్వం విచారణ చేసి బయటకు తీస్తుందన్నారు. అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలను జైలులో పెట్టేందుకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించే ప్లీనరీ, బహిరంగ సభలకు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నేతలు వ్యవహరించినట్టు కాకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, టీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, కాకి దయాకర్‌రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, మోదుగు నాగిరెడ్డి, అప్పిరెడ్డి, కాకి కృపాకర్‌రెడ్డి, తూముల ఇంద్రసేనారావు, కరుణాకర్‌రెడ్డి, ఉప్పల ఆనంద్, శనగాని రాంబాబుగౌడ్, ఉయ్యాల వెంకటేశ్వర్లు, మారిపెద్ది శ్రీనివాస్, ఎంపీపీలు కసగాని లక్ష్మి, భూక్య పద్మ, జెడ్పీటీసీ పెరుమాళ్ల సంపత్రాణి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి గుంటూరు జిల్లాలో జగన్ పర్యటన
-
సహకరించాలంటూ సద్భావన యాత్ర: తెలంగాణ జేఏసీ
సాక్షి, నెట్వర్క: రాష్ర్ట ఏర్పాటుకు అడ్డుపడవద్దని కోరుతూ టీ-జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లో శాంతిర్యాలీలు, సద్భావనా యాత్రలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర అధికారుల వ్యవహారశైలిని నిరసిస్తూ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మంలో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, బోనకల్లులలో శాంతిర్యాలీలు నిర్వహించగా అశ్వారావుపేటలో మోటార్‌సైకిల్ ర్యాలీ తీశారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలంటూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్ వద్ద శనివారం శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో అన్ని శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూమి తలకిందులైనా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం మారదన్నారు. కరీంనగర్లో విద్యార్థులు శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించగా, గిరిజన ఉద్యోగి హన్మంతు నాయక్‌పై దాడిని నిరసిస్తూ తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో సీమాంధ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. గోదావరిఖనిలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. మేడిపెల్లిలో ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయంతోపాటు ఐకేపీ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. చందుర్తిలో ఏబీవీపీ నాయకులు సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఐదోరోజు నిరసన కొనసాగింది. ఇచ్చోడలో రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్ దిగంబర్ మంజూలేకు వినతిపత్రం అందజేశారు. కాగా, తెలంగాణవాదులతో సమాచార హక్కుచట్టం కమిషనర్ తాంతియా కుమారి వ్యవహరశైలిని నిరసిస్తూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు.