శ్రీదేవిలో మనకి తెలియని మరో కోణం .. | Sridevi impresses with her paintings skills | Sakshi
Sakshi News home page

శ్రీదేవిలో మనకి తెలియని మరో కోణం..

Published Mon, Feb 26 2018 1:39 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

Sridevi impresses with her paintings skills - Sakshi

సినీ ప్ర‌పంచాన్ని తీవ్ర శోక‌సంద్రంలో ముంచుతూ అతిలోక సుంద‌రి శ్రీదేవి నింగికేగారు. మొన్నటి వరకు శ్రీదేవి ఓ గొప్పనటిగా మాత్రమే మనందరికి తెలుసు. దాదాపు మూడు తరాల అభిమానులకు తనవైపుకు తిప్పుకున్న శ్రీదేవిలో మనకి తెలియని మరో టాలెంట్ ఉంది. పెయింటింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టమట. గత ఐదేళ్ళుగా ఎవరికి తెలియకుండా పెయింటింగ్స్ వేస్తుందట. సినీ కేరీర్‌ వల్ల ఆ టాలెంట్‌ను శ్రీదేవి ఎప్పుడూ బయపెట్టలేదు. తీరిక దొరికినప్పుడల్లా శ్రీదేవి పెయింటింగ్‌లు వేసి నచ్చిన వాళ్ళకి బహుమతిగా ఇస్తారట.

ఇటీవల తన మరిది కూతురు సోనమ్ కపూర్‌కి అద్భుతమైన పెయింటింగ్ వేసి ఇచ్చిందట శ్రీదేవి. ఆ పెయింటింగ్‌ ను చూసి ఫుల్‌ ఖుష్‌ అయిన సోనమ్‌ ఆ మరుపురాని జ్ఞపకాన్ని తన రూమ్‌లో దాచుకుందట. మరోవైపు సల్మాన్ ఖాన్, డిజైనర్ మనీష్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలకు కూడా తన పెయింటింగ్స్ బహుమతులుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీదేవికి తన ఇద్దరు కుమార్తెలు అంటే ప్రాణం..అందుకేనేమో ఆమె పెయింటింగ్స్‌లో జాన్వి, ఖుషీలవి కూడా ఉన్నాయట. అదేవిదంగా మైకేల్ జాక్సన్‌ను ఎంతో ఇష్టపడే శ్రీదేవి ఆయన పెయింటింగ్‌ను గీశారు. కాగా, శ్రీదేవి పెయింటిగ్స్‌తో ఓ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సంస్థ ఛారిటి నిమిత్తం దుబాయ్‌లో ఓ షో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసిందని కూడా వార్తలు వెలువడ్డాయి. 

శ్రీదేవి గీసిన సోనమ్‌ పెయింటింగ్‌

ప్రయాణాలంటే ఇష్టం
శ్రీదేవికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. తీరిక దొరికనప్పుడల్లా భర్త బోనీ, పిల్లలతో కలిసి తరచూ విదేశీ పర్యటనకు వెళతామని ఆమె ఓ ఇంటర్వూలో తెలిపారు.  రోమ్‌, ఇటలీ నగరాలు బాగా నచ్చుతాయని తెలిపింది. లేతరంగు చీరలను ఇష్టపడే శ్రీదేవి.. చీర ఎలా కట్టుకోవాలో వాళ్ల అమ్మ దగ్గర నేర్చుకుందట. సంగీతం వింటూ పనులు చేసుకునే శ్రీదేవి తెలుగు, హిందీ, తమిళ పాటను ఎక్కువగా వింటుంది. అదే విధంగా దేవుడిపైనా శ్రీదేవికి నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని ప్రారంభించే ముందు పూజ చేయడం అమెకు అలవాటు. 

మైకేల్ జాక్సన్‌ పెయింటింగ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement