చిత్రకారులు కుంచెలతో చిత్రాలు గీస్తారు. సుచిత్రా మట్టాయ్ మాత్రం పాతకాలపు చీరలను ఉపయోగిస్తూ అందమైన చిత్రాలను రూపొందిస్తుంది. వాషింగ్టన్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఆర్ట్స్‌లో పాతకాలపు చీరల నుంచి అల్లిన ప్రకృతి దృశ్యం ‘త్రూ ది ఫారెస్ట్, అక్రాస్ ది సీ, బ్యాక్ హోమ్ ఎగైన్‘... వంటి చిత్రాలను ప్రదర్శించింది. ఎరుపు, గులాబీ, నారింజ, గోధుమ రంగులు.. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా రూపొందించింది.
ఇండో–కరేబియన్ సంతతికి చెందిన ఆర్టిస్ట్ సుచిత్రకు తమ చీరలను పంపేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వారిలో విదేశాలలో నివసిస్తున్న ఇండియన్స్ కూడా ఉన్నారు. ఆమె తల్లి, సెకండ్‌హ్యాండ్ షాపుల నుండి చీరలను సేకరించి, లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్న తన కుతురుకి పంపిస్తుంది. వాటిలో తమ స్నేహితులు, బంధువుల నుంచి సేకరించినవి కూడా ఉంటాయి. సుచిత్ర అభిమానులు కొందరు విలువైన, సున్నితమైన దారాలతో నేచిన వారి స్వంత వస్త్రాలను కూడా పంపుతారు. ‘సైలెంట్ రిట్రీట్‘ (2023) కోసం సుచిత్ర తన చీరలలో ఒకదానిని – క్లిష్టమైన నమూనాలతో, మిరుమిట్లు గొలిపే ఎంబ్రాయిడరీ టేప్‌స్ట్రీలో చేర్చింది.
ఎంబ్రాయిడరీతో జత కలిపి
51 ఏళ్ల సుచిత్రా మట్టాయ్ ఈ డిజైన్స్ రూపకల్పన గురించి మరింతగా వివరిస్తూ – ‘మా అమ్మ సుభద్ర మట్టాయ్ పూర్వీకులు ఒప్పంద కార్మికులుగా ఉత్తరప్రదేశ్‌ను విడిచిపెట్టి, దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న గయానాలో చెరకు తోటలలో పనిచేసేవారు. ఆ కుటుంబ కథలను పెయింటింగ్‌లో వచ్చేలా ఫ్యాబ్రిక్ పీసెస్‌ను కలిపి డిజైన్ చేశాను. ‘సైలెంట్ రిట్రీట్‘తోపాటు ఇతర చిత్రాలలో టేప్‌స్ట్రీలలోని బొమ్మలలో రంగు వేయడానికి ఎంబ్రాయిడరీ ఫ్లాస్‌ను ఉపయోగించాను. పోస్టోరల్ యూరోపియన్ దృశ్యాలను పరిచయం చేసే ఈ ప్రక్రియను ‘బ్రౌన్ రీక్రియెట్‘గా చూశాను’ అని తెలియజేస్తుంది.
అలంకారిక అంశాలు
జనవరి 12 వరకు ప్రదర్శించే ఈ కళారూపాలలో చరిత్రాకాంశాలను కూడా పరిచయం చేస్తుంది. దొరికిన వస్త్రాలు సుచిత్ర చిత్రాలకు పునాదిగా పనిచేస్తాయి. తరచుగా అవి భారీ–ఉత్పత్తి కిట్లు లేదా ఇతర వాణిజ్య నమూనాల ఆధారంగా సూది, దారాలతో అలంకారిక అంశాలను చేతితో జోడిస్తుంది.
‘టైమ్ ట్రావెలర్స్‘లో పూసల అంచు, బంగారు తాడు వంటి కొన్ని అలంకార అంశాలను జోడించింది. మట్టై చిత్రకారిణిగా శిక్షణ పొదింది. అమ్మ, అమ్మమ్మల కథలను అర్ధమయ్యే విధంగా తెలియజేయడానికి వస్త్రాల వైపు మొగ్గు చూపింది. యునైటెడ్ స్టేట్స్‌లో సుచిత్ర మొట్టమొదటి సోలో మ్యూజియం ప్రదర్శనలలో ‘మిత్ ఫ్రమ్ మేటర్‘ ఒకటి.
(చదవండి: 'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..)
Comments
Please login to add a commentAdd a comment