మదినిండుగ విహర పండగ | RV Tours - Travels special story | Sakshi
Sakshi News home page

మదినిండుగ విహర పండగ

Published Sat, Jan 21 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

RV Tours - Travels special story


తీర్థ యాత్రలు / విహార యాత్రలు

ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసమైన మార్పుకోసం విహార యాత్రలు చేస్తుంటాం. ఇంటిల్లిపాదితో కలిసి యాత్ర చేస్తే ఆ ఆనందమే వేరు. అయితే, ఏదైనా టూర్‌ వెళ్లాలి అని అనుకోగానే ఎక్కడికి, ఎలా? అనే అన్వేషణ మొదలవుతుంది. ఇలా ఆనందంగా వెళ్లిరావడానికి మన దేశంలో అనేక ప్రదేశాలున్నాయి. చరిత్ర, సంస్కృతి, మతాలను ప్రతిబింబించే ప్రదేశాలు కోకొల్లలు. ప్రకృతి అందాలు, జంతు ప్రదర్శనశాలలు, కొండలు, కోనలు, అడవులు, జలపాతాలు, బీచ్‌లు, నదులు.. ఇలా సువిశాల భారతదేశంలో ఎన్నెన్నో అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఏదో మొక్కుబడిగా కాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని యాత్ర ప్రారంభిస్తే అనవసర హడావిడికి తావుండదు. మరుపురాని ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాల నుంచి మన తీర్థయాత్రను ప్రారంభిద్దాం.

చార్‌ధామ్‌: మన దేశంలోని గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలే చార్‌ధామ్‌గా జగత్‌ ప్రసిద్ధి. ఈ నాలుగు ఆలయాలను జీవితంలో ఒక్కసారైన సందర్శించాలని ప్రతీ ఒక్కరు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి.

కాశీ యాత్ర: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధాని. ఈ నగరం నడిబొడ్డున కొలువైన కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నీరాజనాలను అందుకుంటోంది. మహిమాన్వితమైనది కాబట్టే జీవితంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ.  


రామేశ్వరం: రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వినుతికెక్కింది. శ్రీ రామేశ్వరం పాంబన్‌కు ఈశాన్య భాగమందు, ధనుష్కోటికి ఆగ్నేయ భాగంలో ఉంది. విష్ణు ప్రియమైన రామేశ్వరం శంఖు ఆకారంలో కనబడుతుందంటారు. కాశీయాత్ర ఫలితము ధనుష్కోటి సేతులో స్నానం చేసి, రామనాధుని పూజించిన పూర్తి అవుతుందని చెబుతారు.

అమర్‌నాథ్‌ యాత్ర: మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు, లోతెంతో తెలియని లోయలు, మైనస్‌ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి, ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే ‘ఓం నమఃశివాయ.’ ఏడాదిలో 45 రోజుల పాటు కనిపించే మంచు లింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది.

కైలాస మానస సరోవరం: సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు అతిపవిత్రం.   శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాస మానస సరోవరం.  

విహార యాత్రలు
మున్నార్‌:  ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ కేరళ ప్రకృతి అందాల విందుకు నెలవు. ఇక్కడి మున్నార్‌ ప్రకృతి అందాల విందును కనులారా ఆరగించాలంటే కనీసం మూడురోజులు పడుతుంది. చూడముచ్చటైన వృక్షాల అందాలు, తేయాకు తోటల ఘుమఘుమలు, పన్నెండేళ్ళకోసారి పూచే కురింజి పువ్వు సోయగాలు, బోట్‌రైడింగ్‌ అనుభూతులు, చల్లని పిల్ల తిమ్మెరలు.. మెుత్తానికి వసంతంలో శిశిరంలా ఉంటుంది మున్నార్‌ విహారం.  

మనాలి: హిమలయపు అందాల నడుమ విరాజిల్లుతున్న ప్రాంతమే మనాలి. దీన్ని‘స్విడ్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా’ అంటారు. ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి మనాలీకి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి 3 కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉన్నాయి. చుట్టూ మంచులోయల మధ్య వేడి నీటి కొలనులు ఉండటం ఆశ్చర్యం. సిమ్లా పరిసరాల్లో కుఫ్రీ షార్ట్‌ ట్రిప్, లీజర్‌ వాక్, హిడింబా ఆలయం, టిబెటన్‌ మోనస్టరీ, సోలంగ్‌ లోయ చూడొచ్చు. నాగర్‌ ఫోర్ట్, రహాలా జలపాతాలు, బీస్‌ నదిలో సాహస క్రీడలు, రాఫ్టింగ్‌ కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయ్‌.

సిమ్లా: పెళ్లినాటి తొలిరోజులను ఆహ్లాదంగా గడిపేందుకు ఇదో చక్కని ప్రదేశం. సిమ్లా ఆపిల్‌ పండ్లకు ప్రసిద్ధి. ఎత్తయిన కొండలు, మల్లెపూల వానలా కురిసే మంచు, చల్లటి వాతావరణం కట్టిపడేస్తాయ్‌. వందల ఏళ్ల నాటి ఆలయాలు, చర్చిలు, బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ఎన్నో భవనాలు ఆకట్టుకుంటాయి. ఎటుచూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లుగా ఉండే ఫైన్, ఓక్‌ చెట్లు అడుగడుగునా ప్రత్యక్షమవుతాయి. స్నో స్కీయింగ్‌ ఇది స్వర్గధామమే.

ఊటి, కొడైకనాల్‌: తమిళనాడు మధ్య ప్రాంతంలో ఉన్న సుందరమైన పర్వతప్రాంతం ఊటి, కొడైకెనాల్‌. తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఘాట్‌రోడ్‌లో ప్రయాణించాల్సిందే. కొడై సరస్సు, సెయింట్‌ మేరీ చర్చ్, పంపార్‌ పాల్స్, గ్రీన్‌ వ్యాలీ, గుణ గుహ, పైన్‌ వృక్షాల వనం పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇందులో కొడై అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు.
అంతర్జాతీయ యాత్రలు

సింగపూర్‌: పచ్చదనానికి, పరిశుభ్రతకు మరో పేరు సింగపూర్‌. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఆ దేశ అందాలను వీక్షించేందుకు విచ్చేసే పర్యాటకుల సంఖ్య కోకొల్లలు. ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిపిన ఈ అరుదైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే సింగపూర్‌ వెళ్లి రావాల్సిందే.

మలేషియా: నీలిరంగు కప్పుకున్న సముద్రం తెల్లగా మెరిసిపోయే ఇసుక, ఆ పక్కనే పచ్చదనం పరుచుకున్న వృక్షసంపద, నీటి మీద తేలియాడే మరపడవలూ, తీరాన్ని తాకాలనే ఉత్సాహంతో ఉరకలు వేసే సముద్ర కెరటాలు... ఇలా మలేషియా అందాలన్నీ రంగుల హరివిల్లులై పర్యాటకుల మది దోచుకుంటుంటాయి. చిన్న చిన్న దీవులతో ఏర్పడ్డ సుందర ప్రదేశమే మలేషియా. దట్టమైన అరణ్యాలూ, ఎత్తయిన కొండలూ, తెల్లని బీచ్‌లతో చూడముచ్చటగా ఉంటుంది.  

థాయ్‌లాండ్‌: ఏటా లక్షలాదిమంది పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతం థాయ్‌లాండ్‌. బీచ్‌లో సేద తీరాలన్నా, స్పా, మసాజ్‌ సెంటర్లలో రిలాక్స్‌ అవాలన్నా థాయ్‌ ది బెస్ట్‌ ప్లేస్‌. డిసెంబర్, మార్చి మధ్య థాయ్‌లాండ్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కాకుండా హాఫ్‌ సీజన్‌లో ప్లాన్‌ చేసుకుంటే తక్కువ ఖర్చులో  టూర్‌ ప్రశాంతంగానూ పూర్తవుతుంది.

శ్రీలంక: పూల సుగంధ పరిమళాల గుబాళింపు, పక్షుల కిలకిలారావాలు, ఎటువైపు చూసినా కనువిందు చేసే పచ్చదనం, స్వచ్ఛమైన చల్లని పిల్లగాలులు, సముద్ర తీరం హŸయలు వీటన్నింటినీ స్వయంగా ఆస్వాదించాలంటే శ్రీలంకకు వెళ్లాల్సిందే. హైదరాబాదు నుంచి కొలంబోకు సరిగ్గా రెండు గంటల ప్రయాణం మాత్రమే. శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే కాబట్టి టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

హాంకాంగ్‌ మకావా:  హాలీడేస్‌లో ఎక్స్‌ట్రార్డినరీ అనుభూతి. సముద్ర గర్భ మార్గం, కొండల్ని తొలుస్తూ వేసిన అండర్‌పాస్‌లు, సుదూర ప్రాంతాలను కలిపే వేలాడే వంతెనలు.. భూతల స్వర్గాన్ని తలపించే హాంకాంగ్‌ చైనాకు ఆగ్నేయ తీరంలో ఉంటుంది. పలు చిన్న చిన్న ద్వీపాల సమూహమిది.  

నేపాల్‌: ఎవరెస్టు శిఖరం మీద ఎగురుతూ ధవళవర్ణంలో ధగధగలాడే హిమాలయ పర్వతశ్రేణుల సౌందర్యాన్నీ ఆ కొండల్లోంచి జాలువారి వయ్యారంగా మలుపులు తిరుగుతూ సాగే నదుల అందాలనూ... ఎంతసేపు చూసినా విసుగనిపించదు. అలాంటి అందాల నెలవు నేపాల్‌.

RVటూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఎక్స్‌పో
ఎప్పుడెప్పుడు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవాలకునే భక్తుల సౌలభ్యం కోసం / విహార పర్యాటక ఔత్సాహికుల కోసం ఖV టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఈ వేసవి సెలవులతో పాటు సంవత్సరం పొడవునా వచ్చే విశేష ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నేటి నుండి జనవరి 24 వరకు ట్రావెల్‌ ఎక్స్‌పో నిర్వహిస్తోంది. ఈ ఎక్స్‌పో లో 2018 ఫిబ్రవరి వరకు చేయబోయే ఆధ్యాత్మిక, వినోద, విహార లేదా అంతర్జాతీయ యాత్రలను అడ్వాన్స్‌గా కొంత మొత్తము ప్యాకేజీ అమౌంట్‌ను కట్టినట్లయితే భారీ డిస్కౌంట్‌ పొందే సదావకాశం కల్పిస్తోంది. నేరుగా హైదరాబాద్‌  కూకట్‌పల్లి లోని ఖVప్రధాన కార్యాలయాన్ని సందర్శించి గాని లేదా ఫోన్‌ ద్వారా కానీ వివరాలు పొందవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని ఆన్‌లైన్‌ ద్వారా  ప్రత్యేక తగ్గింపు ప్యాకేజీలను వినియోగించుకోవచ్చు.   

గమనిక: ఆర్‌వి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ వారి ట్రావెల్‌ ఎక్స్‌పోను సందర్శించండి. భారీ డిస్కౌంట్‌ పొందండి. ఈ అవకాశం 21, 22, 23, 24 తేదీలలో మాత్రమే.

ఆర్‌ వి టూర్స్‌ – ట్రావెల్స్‌
3వ అంతస్తు, భాగ్యనగర్‌ కాంప్లెక్స్, బి.జె.పి. ఆఫీస్‌ ఎదురుగా, మెట్రో పిల్లర్‌ నెం. 15, కూకట్‌పల్లి, హైదరాబాద్‌
ఆర్‌.వి.రమణ
ఆర్‌.వి.టూర్స్‌ – ట్రావెల్స్‌ అధినేత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement