pilgrimages
-
పుణ్యక్షేత్రాల ప్రయాగరాజ్
ప్రయాగరాజ్: మహా కుంభమేళాకు ఆతిథ్యమివ్వనున్న ప్రయాగరాజ్(Prayagraj) పుణ్యక్షేత్రాల నగరంగా కీర్తికెక్కింది. దాదాపు 1,400 సంవత్సరాలుగా చైనా ప్రజలకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. భారత సాంస్కృతిక వారసత్వం పట్ల చైనాకు ఆకర్షణ నాటినుంచే బలంగా ఉందని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏడవ శతాబ్దపు చైనీస్ యాత్రికుడు యాత్రికుడు జువాన్జాంగ్ తన రచనలలో పేర్కొన్న విషయాలను ప్రభుత్వం ప్రస్తావించింది. హర్షవర్ధనరాజు పరిపాలనలో... చరిత్రలోకి వెళ్తే.. హ్యూయెన్ త్సాంగ్ అని కూడా పిలుచుకునే జువాన్జాంగ్ 16 ఏళ్ల పాటు భారతదేశంలోని (India) వివిధ ప్రాంతాలపై అధ్యయనం చేశారు. అందులో భాగంగా ప్రయాగరాజ్నూ సందర్శించారు. క్రీ.శ. 644లో హర్షవర్ధన రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాన్ని ఆయన ప్రశంసించారు. ధాన్యం సమృద్ధిగా ఉందని చాటి చెప్పారు. అలాగే అనుకూలమైన వాతావరణం, ఆరోగ్యం, సమృద్ధిగా పండ్లు ఇచ్చే చెట్లు ఉన్న ప్రాంతంగా ప్రయాగ్‌రాజ్‌ను ఆయన అభివర్ణించారు. ప్రయాగరాజ్, దాని పరిసరాల్లోని ప్రజలు ఎంతో వినయంగా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని, అంకితభావంతో నేర్చుకుంటున్నారని తన రచనల్లో వర్ణించారు. అందుకే ప్రయాగరాజ్‌కు ‘తీర్థరాజ్’ (అన్ని పుణ్యక్షేత్రాల రాజు) బిరుదును వచ్చిందని వాస్తవాన్ని పురావస్తు సర్వేలు, అధ్యయనాలు మరింత బలపరుస్తున్నాయి. ఆసక్తికర వర్ణణలు.. ప్రయాగరాజ్ సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి జువాన్జాంగ్ ‘సి–యు–కి’పుస్తకంలో రాశారని పురావస్తుశాఖ పేర్కొంది. జువాన్జాంగ్ రచనలు పురాతన కాలంలో ప్రయాగరాజ్ గురించి ఆసక్తికరంగా వర్ణించాయి. ‘ప్రయాగ్‌రాజ్‌లో పెద్ద ఎత్తున మతపరమైన ఉత్సవాలు జరిగాయని, 5లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో ఎందరో మహారాజులు, పాలకులు పాల్గొన్నారు. ఈ గొప్ప రాజ్యం యొక్క భూభాగం సుమారు 1,000 మైళ్ళ వరకు విస్తరించి ఉంది.ప్రయాగ రాజ్ రెండు పవిత్ర నదులైన గంగా, యమునా మధ్య ఉంది.’అని జువాన్జాంగ్ పేర్కొన్నారు. నగరంలోని ప్రస్తుతం కోట లోపల పాతాళపురి ఆలయం గురించి కూడా రాశారు. ఇక్కడ ఒకే నాణే న్ని సమర్పించడం, వెయ్యి నాణేలను దానం చేయడంతో సమానమని ప్రజలు నమ్ముతున్నారని లిఖించారు. ప్రయాగరాజ్‌లో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసించే విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా– 2025 (Maha Kumbh Mela 2025) జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాలను పంచుకుంది. -
భారత్.. ఏ దేశానికీ ముప్పు కాదు
న్యూఢిల్లీ: భారత్ ఏ ఇతర దేశానికి, సమాజానికీ ఏనాడూ ముప్పుగా పరిణమించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మొత్తం ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్ అని తేల్చిచెప్పారు. సిక్కు గురువుల ఆలోచనలను మన దేశం అనుసరిస్తోందని తెలిపారు. తొమ్మిదో సిక్కు గురువు తేగ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎర్రకోట సమీపంలోని గురుద్వారా సిస్‌గంజ్ సాహిబ్ గురు తేగ్ బహదూర్ చిరస్మరణీయ త్యాగానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. మనదేశ గొప్ప సంస్కృతిని రక్షించేందుకు తేగ్ బహదూర్ చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పవిత్ర గురుద్వారా తెలియజేస్తోందన్నారు. అప్పట్లో దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లిందని, మతం పేరిట సామాన్య ప్రజలపై హింసాకాండ సాగించారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో గురు తేగ్ బహదూర్ రూపంలో దేశానికి ఒక ఆలంబన దొరికిందన్నారు. తేగ్ బహదూర్ స్మారక నాణేన్ని, తపాళా బిళ్లను మోదీ విడుదల చేశారు. దేశ ఐక్యత, సమగ్రతపై రాజీ వద్దు దేశ సమగ్రత, ఐక్యతల విషయంలో ఎటువంటి రాజీ ఉండరాదని ప్రధాని మోదీ అన్నారు. విధుల్లో భాగంగా తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికీ ‘నేషన్ ఫస్ట్–ఇండియా ఫస్ట్’ అనే వైఖరినే అనుసరించాలని సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రజానుకూల విధానాలకే తప్ప, రాజకీయాలకు తావుండరాదన్నదే తన అభిమతమన్నారు. గురువారం 15వ సివిల్ సర్వీసెస్ డే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లను ‘అమృత్ కాల్’గా అభివర్ణించారు. ‘ఈ 25 ఏళ్లను యూనిట్‌గా తీసుకుని, ఒక విజన్‌తో ముందుకు సాగాలి. దేశంలోని ప్రతి జిల్లా ఇదే ఆశయంతో ఉండాలి’అని ఆకాంక్షించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అనుసరిస్తూ మూడు లక్ష్యాలకు మనం కట్టుబడి ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ‘మొదటిది.. సామాన్య పౌరుడి జీవితాల్లో మార్పు తేవాలి. వారి జీవనం సులభతరం కావాలి. అదే సౌలభ్యాన్ని వారు అనుభవించాలి. రోజువారీ జీవితంలో ప్రభుత్వ సేవలను ఎటువంటి అడ్డంకులు లేకుండా వారు పొందగలగాలి. ఇదే మనందరి లక్ష్యం. దీనిని సాకారం చేయాలి. రెండోది..పెరుగుతున్న మన దేశం స్థాయిని దృష్టిలో ఉంచుకోవాలి. అదే స్థాయిలో మనం కార్యక్రమాలు చేపట్టాలి మూడోది.. ఈ వ్యవస్థలో మనం ఎక్కడున్నా దేశ సమైక్యత, సమగ్రతలే మన ప్రధాన బాధ్యతగా ఉండాలి. ఇందులో ఎలాంటి రాజీ ఉండరాదు. స్థానిక నిర్ణయాలకు సైతం ఇదే ప్రామాణికం కావాలి’ అని మోదీ సూచించారు. -
నాలోని ఆ తెరలు తొలగించవా స్వామీ !
క్రికెట్ బ్యాట్ తెస్తాన్రా, తెస్తాన్రా అని కొడుకుతో పదిరోజులుగా చెప్తున్న తండ్రి పదకొండోరోజున నిజంగానే తెచ్చినా...‘అరే! ఇవ్వాళకూడా మర్చిపోయాన్రా’ అంటే... కొడుకు ‘మీరెప్పడూ ఇలాగే అంటారు’ అని ఏడుపు మొదలెడతాడు. వెంటనే తండ్రి తాను దాచిన క్రికెట్ బ్యాట్ చూపితే అంత ఏడుపులోకూడా సంతోషంగా దాన్ని అందిపుచ్చుకుంటున్న కొడుకును చూసి తండ్రి మురిసి పోతాడు. అదో ఆనందం తండ్రికి. అలాగే కుమార్తె వివాహానంతరం ‘జగమేలే పరమాత్మా...’ అంటూ త్యాగయ్య ఆర్తితో పిలుస్తూంటే...‘‘ రహస్యంగా నీకు దర్శనమిస్తాననుకున్నావా త్యాగయ్యా! నీ ఆర్తి ఏమిటో లోకానికి తెలిసేటట్లు ఒకరోజు దర్శనం ఇస్తాను’ అని అనుకుని ఉంటారు. అందుకే...త్యాగయ్యగారి జీవితంలో ఒకసారి తీర్థయాత్రకు వెడుతూ తిరుమల వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పటికి వేళమించిపోయిందని తెరలు వేసేశాం అని చెప్పారు అక్కడి వారు. క్షోభించిన మనసుతో ‘తెరతీయగరాదా! లోని / తిరుపతి వేంకటరమణ మత్సరమను /తెరతీయగరాదా ! / పరమపురుష ధర్మాదిమోక్షముల పారదోలుచున్నది నాలోని /తెరతీయగరాదా! / త్యాగరాజనుత మదమత్సరమను తెరతీయగరాదా !’’ అని పరమ ఆర్తితో త్యాగయ్య కీర్తన అందుకుంటే... కదిలిపోయిన వేంకటాచలపతి తెరలు తొలగించుకుని అందరూ చూస్తుండగా దర్శనమిచ్చారు. మన ఆంధ్రదేశంలో త్యాగరాజుగారి భక్తిని నిరూపించిన కీర్తన అది. రెండవ వారు శ్యామశాస్తిగ్రారు. ఒకానొక కాలంలో కంచిలో స్వర్ణకామాక్షిని ప్రతిష్ఠించారు. ఆదిశంకరాచార్యులవారు శ్యామశాస్త్రి గారి పూర్వీకులలో ఒకరిని అక్కడ అర్చకులుగా నియమించారు. కొంతకాలం తరువాత శ్రీ కృష్ణ్ణదేవరాయలు సామ్రాజ్యం పతనమై బహమనీ సుల్తాన్లు విజృంభించిన తరువాత బంగారు కామాక్షికి ఇబ్బంది ఏర్పడుతుందని భావించి అర్చకస్వామి కుటుంబీకులు ఆ విగ్రహాన్ని తీసుకుని అరణ్యమార్గాలగుండా తిరిగి తిరిగి, అనుకోకుండా తిరువారూరు చేరుకున్నారు. త్యాగయ్య (ఆ పేరుతో వెలసిన పరమశివుడి) ఆలయంలోనే ఆ విగ్రహాన్ని కూడా పెట్టి పూజలు చేస్తున్నారు. విశ్వనాథశాస్త్రి దంపతులకు చైత్రమాసం కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున శ్యామశాస్త్రి గారు జన్మించారు. నామకరణం రోజున పెట్టిన పేరు వేంకట సుబ్రహ్మణ్యం. నీలమేఘశ్యాముడైన కృష్ణమూర్తిలా ఉన్నాడని తల్లి ‘శ్యామకృష్ణా! శ్యామకృష్ణా !’ అని పిలిచేది. అదే తరువాత శ్యామశాస్త్రి గా మారింది.శ్యామశాస్త్రి గారికి చిన్నతనం నుంచే అర్చకత్వంలోనూ, ఆ మంత్రాలలోనూ దానికి సంబంధించిన విషయాలలో తండ్రి తర్ఫీదు ఇచ్చాడు. మేనమామగారు మాత్రం సంగీతంలో కొంత ప్రవేశం ఉన్నవారు. ఆయన దగ్గర కొన్ని కృతులు నేర్చుకుని శ్యామశాస్త్రి గారు పాడుతుండేవారు. ఒకరోజున తండ్రిలేని సమయంలో రాగబద్ధంగా అమ్మవారి కీర్తనలు చాలా మధురంగా ఆలపిస్తూ పూజలు చేయడంలో నిమగ్నమైనారు. దర్శనానికి గుడికి వచ్చిన ధనిక భక్తుడొకరు అది చూసి మురిసిపోయి చాలా ఖరీదైన శాలువా ఒకటి బహూకరించారు. ఇది తెలిసి మేనమామగారికి ఆగ్రహం వచ్చి శ్యామశాస్త్రి గారు అభ్యసిస్తున్న సంగీత పుస్తకాలను చింపి అవతల పారేశారు.అయినా తల్లి కొడుకును ఓదార్చి సంగీతాభ్యాసం కొనసాగేలా సర్దుబాటు చేసింది.రామకృష్ణ స్వాములవారు త్యాగయ్యగారిని ఉద్ధరించినట్లుగానే సంగీత స్వాములవారు అనే ఒక విద్వాంసుడు చాతుర్మాస్య దీక్షకోసం తంజావూరు వచ్చి ఉన్నారు. అప్పటికి అక్కడ ఉన్న శ్యామశాస్త్రిగారికి స్వర్ణార్ణవాన్ని బహూకరించి సంగీతంలోనే అనేక రహస్యాలను బోధించారు. పోతూ పోతూ ఆయన పచ్చిమిరియం అప్పయ్య శాస్త్ర్రిగారనే మరో గురువుకు శామశాస్త్రి గారిని అప్పగించి వెళ్ళారు. -
ఆ వజ్రమూ రాయీ ఒకటే!
ఒక భార్య, భర్త ఇద్దరూ సంసారం పట్ల విరక్తి చెందారు. వారిద్దరూ కలిసి తీర్థయాత్రలకు బయలు దేరారు. ఒక తోవలో నడిచిపోతున్నారు. భర్త ముందు నడుస్తున్నాడు. భార్య వెనకగా వస్తోంది. అప్పుడు అతనికి నేలమీద ఒక వజ్రం కనిపించింది. తన భార్య దానిని చూస్తే దానిమీద ఆశపడి తన వైరాగ్యాన్ని పోగొట్టుకుంటుందేమోనని అతనికి అనుమానం కలిగింది. వెంటనే అతడు దానిని పూడ్చివేద్దామని గుంట తియ్యసాగాడు. ఇంతలో భార్య అక్కడికి వచ్చింది. ‘‘ఏమి చేస్తున్నారు?’’అని అడిగింది. భర్త సరైన సమాధానం చెప్పకుండా మాట దాటవేయడానికి ప్రయత్నించాడు. అయితే భార్య ఆ వజ్రాన్ని చూసి, అతని మనసులోని ఆలోచనను కనిపెట్టింది. ఆమె భర్తతో ‘‘మీకు ఆ వజ్రానికి, మట్టికీ ఇంకా తేడా కనిపిస్తున్నట్లయితే ఎందుకు సన్యసించారు?’’ అని అడిగింది. కొందరు తమలో ఉన్న బలహీనతలే ఇతరులకూ ఉంటాయనుకుంటారు. ముందు మన మనసు స్వచ్ఛంగా ఉంచుకుంటేనే ఇతరుల మనసులో మంచిని చూడగలం. -
7 జోన్లు.. 2 మల్టీ జోన్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాస్తవానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, వికారాబాద్ జోన్లను ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న మల్టీ జోన్లను రద్దు చేయాలని సిఫారసు చేసింది. కమిటీ సిద్ధం చేసిన ముసాయిదా ప్రతులను ప్రభుత్వం వారం రోజుల కిందట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అందించింది. ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ముసాయిదాకు భిన్నంగా జోన్లు, మల్టీ జోన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో మొత్తం ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు పచ్చజెండా ఊపారు. ఒక్కో జోన్లో నాలుగైదు కొత్త జిల్లాలుండేలా పునర్వ్యవస్థీకరించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు అజయ్ మిశ్రా, నర్సింగ్‌రావు, శివశంకర్, అధర్ సిన్హా, భూపాల్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీ ప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఆరూరి రమేశ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు సమావేశంలో పాల్గొన్నారు. జోన్లకు పుణ్యక్షేత్రాల పేర్లు కొత్తగా నిర్ణయించిన 7 జోన్లలో చార్మినార్ మినహా అన్నింటికీ పుణ్యక్షేత్రాల పేర్లను ఖరారు చేశారు. మొదటి జోన్‌కు కాళేశ్వరం, రెండో జోన్‌కు బాసర, మూడో జోన్‌కు రాజన్న, నాలుగో జోన్‌కు భద్రాద్రి, అయిదో జోన్‌కు యాదాద్రి, ఆరో జోన్‌కు చార్మినార్, ఏడో జోన్‌కు జోగుళాంబ అని పేరు పెట్టారు. ఒకటో మల్టీ జోన్లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లను నిర్ణయించారు. రెండో మల్టీ జోన్లో యాదాద్రి, జోగుళాంబ, చార్మినార్‌లకు చోటిచ్చారు. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ ఒకటో మల్టీ జోన్లో, దక్షిణ తెలంగాణ జిల్లాలన్నీ రెండో మల్టీ జోన్లో చేరినట్లయింది. రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలియజేయడంతోపాటు ఇతర అంశాలు చర్చించేందుకు శుక్రవారం టీజీవో భవన్లో సమావేశం జరగనుంది. ఉద్యోగుల సమావేశం తర్వాత వారిఅభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్ పంపుతారు. దీనిపై కేబినెట్ సమావేశం జరుగుతుంది. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదానికి నివేదిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి, రాష్ట్రంలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చేలా చూస్తానని సీఎం చెప్పారు. మల్టీ జోనల్ అంటే..? జోనల్ స్థాయి, రాష్ట్ర కేడర్‌కు మధ్యలో ఉండే పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా పరిగణిస్తారు. మల్టీ జోనల్ విధానం ఉమ్మడి రాష్ట్రంలోనూ అమల్లో ఉండేది. అప్పుడు కూడా ఆరు జోన్లతో పాటు రెండు మల్టీ జోన్లున్నాయి. తెలంగాణలోని 5, 6 జోన్లు, 4వ జోన్‌లోని రాయలసీమ కలిపి ఒక మల్టీజోన్, ఏపీలోని మిగతా మూడు జోన్లు కలిపి మరో మల్టీ జోన్‌గా ఉండేవి. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల వర్గీకరణ ఒక్కో శాఖలో ఒక్కో తీరుగా ఉంది. ఉదాహరణకు పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీవో పోస్టులు మల్టీ జోనల్ పరిధిలో ఉన్నాయి. డీఎల్పీవోలు జోనల్ పోస్టులుగా, ఆపై స్థాయిలో ఉండే డీపీవో పోస్టులు రాష్ట్ర కేడర్‌గా పరిగణిస్తున్నారు. ఇదే క్రమంలో సీడీపీవోలు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, డిప్యూటీ ఈవోలు, డ్రగ్స్ మైనింగ్ విభాగాల్లోని కొన్ని పోస్టులు మల్టీ జోనల్ కేడర్‌లో ఉన్నాయి. రాష్ట్ర కేడర్ పోస్టులు నేరుగా భర్తీ చేస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం పోటీ పడే అవకాశముంటుంది. అందుకే స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉండేదుకు వీలుగా మల్టీ జోన్లను కొనసాగించాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పలుమార్లు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం మల్టీ జోనల్ వ్యవస్థను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. శాఖల వారీగా పోస్టులను సైతం జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర కేడర్‌గా వర్గీకరిస్తేనే ఈ విధానంతో ప్రయోజనం ఉంటుందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించాయి. -
కిటకిటలాడుతున్న పుణ్యక్షేత్రాలు
హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణలోని పలు పుణ్యక్షేత్రాలు ప్రముఖులతో కిటకిటలాడుతున్నాయి. యాదాద్రి క్షేత్రంలో, పాత యాదగిరిగుట్టలో లక్ష్మీసమేతంగా నరసింహస్వామి ఉత్తర ద్వారంలో కొలువై ఉన్నారు. ఉదయం 6:45 నుంచి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి ఉత్తర ద్వారదర్శనం లభించింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, కలెక్టర్ శరత్‌లు దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామ చంద్రస్వామి క్షేత్రంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోనూ భక్తుల రద్దీ నెలకొంది. ఉత్తర ద్వారం ద్వారా హరిహరులను కలెక్టర్ కృష్ణభాస్కర్ దర్శించుకున్నారు. -
కూతుర్ని చంపి తీర్థయాత్రలకు వెళ్లాడు
రాంపూర్(ఉత్తరప్రదేశ్): రాష్ట్రంలో జరిగిన పరువు హత్య సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుమార్తెను చంపిన ఓ తండ్రి పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చాడు. రాంపూర్ ఎస్పీ కేకే చౌదురి తెలిపిన వివరాల ప్రకారం హసన్పూర్ గ్రామానికి చెందిన బాలిక(16) సగం కాలిన మృతదేహం మార్చి 16వ తేదీన స్థానికులు గుర్తించారు. దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తండ్రే ఈ దారుణానికి కారణమని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. సదరు బాలిక ఉత్తరాఖండ్‌లోని బంధువుల ఇంట్లో చదువుకునే సమయంలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసిన తండ్రి ఆమెను మందలించాడు. అయితే, ఆమె తీరు మారలేదు. దీంతో తండ్రి ఆమెను చంపాలని పథకం వేశాడు. ఈ మేరకు మార్చి 15వ తేదీన ఆమెను ఉరివేసి చంపాడు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆపై పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు జమ్మూలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చాడు. నిందితుడు నేరం అంగీకరించటంతో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. -
మదినిండుగ విహర పండగ
తీర్థ యాత్రలు / విహార యాత్రలు ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసమైన మార్పుకోసం విహార యాత్రలు చేస్తుంటాం. ఇంటిల్లిపాదితో కలిసి యాత్ర చేస్తే ఆ ఆనందమే వేరు. అయితే, ఏదైనా టూర్ వెళ్లాలి అని అనుకోగానే ఎక్కడికి, ఎలా? అనే అన్వేషణ మొదలవుతుంది. ఇలా ఆనందంగా వెళ్లిరావడానికి మన దేశంలో అనేక ప్రదేశాలున్నాయి. చరిత్ర, సంస్కృతి, మతాలను ప్రతిబింబించే ప్రదేశాలు కోకొల్లలు. ప్రకృతి అందాలు, జంతు ప్రదర్శనశాలలు, కొండలు, కోనలు, అడవులు, జలపాతాలు, బీచ్‌లు, నదులు.. ఇలా సువిశాల భారతదేశంలో ఎన్నెన్నో అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఏదో మొక్కుబడిగా కాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని యాత్ర ప్రారంభిస్తే అనవసర హడావిడికి తావుండదు. మరుపురాని ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాల నుంచి మన తీర్థయాత్రను ప్రారంభిద్దాం. చార్ధామ్: మన దేశంలోని గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలే చార్‌ధామ్‌గా జగత్ ప్రసిద్ధి. ఈ నాలుగు ఆలయాలను జీవితంలో ఒక్కసారైన సందర్శించాలని ప్రతీ ఒక్కరు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి. కాశీ యాత్ర: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధాని. ఈ నగరం నడిబొడ్డున కొలువైన కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నీరాజనాలను అందుకుంటోంది. మహిమాన్వితమైనది కాబట్టే జీవితంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ. రామేశ్వరం: రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వినుతికెక్కింది. శ్రీ రామేశ్వరం పాంబన్కు ఈశాన్య భాగమందు, ధనుష్కోటికి ఆగ్నేయ భాగంలో ఉంది. విష్ణు ప్రియమైన రామేశ్వరం శంఖు ఆకారంలో కనబడుతుందంటారు. కాశీయాత్ర ఫలితము ధనుష్కోటి సేతులో స్నానం చేసి, రామనాధుని పూజించిన పూర్తి అవుతుందని చెబుతారు. అమర్నాథ్ యాత్ర: మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు, లోతెంతో తెలియని లోయలు, మైనస్ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి, ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే ‘ఓం నమఃశివాయ.’ ఏడాదిలో 45 రోజుల పాటు కనిపించే మంచు లింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. కైలాస మానస సరోవరం: సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు అతిపవిత్రం. శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాస మానస సరోవరం. విహార యాత్రలు మున్నార్: ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళ ప్రకృతి అందాల విందుకు నెలవు. ఇక్కడి మున్నార్ ప్రకృతి అందాల విందును కనులారా ఆరగించాలంటే కనీసం మూడురోజులు పడుతుంది. చూడముచ్చటైన వృక్షాల అందాలు, తేయాకు తోటల ఘుమఘుమలు, పన్నెండేళ్ళకోసారి పూచే కురింజి పువ్వు సోయగాలు, బోట్‌రైడింగ్ అనుభూతులు, చల్లని పిల్ల తిమ్మెరలు.. మెుత్తానికి వసంతంలో శిశిరంలా ఉంటుంది మున్నార్ విహారం. మనాలి: హిమలయపు అందాల నడుమ విరాజిల్లుతున్న ప్రాంతమే మనాలి. దీన్ని‘స్విడ్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అంటారు. ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి మనాలీకి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి 3 కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉన్నాయి. చుట్టూ మంచులోయల మధ్య వేడి నీటి కొలనులు ఉండటం ఆశ్చర్యం. సిమ్లా పరిసరాల్లో కుఫ్రీ షార్ట్ ట్రిప్, లీజర్ వాక్, హిడింబా ఆలయం, టిబెటన్ మోనస్టరీ, సోలంగ్ లోయ చూడొచ్చు. నాగర్ ఫోర్ట్, రహాలా జలపాతాలు, బీస్ నదిలో సాహస క్రీడలు, రాఫ్టింగ్ కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయ్. సిమ్లా: పెళ్లినాటి తొలిరోజులను ఆహ్లాదంగా గడిపేందుకు ఇదో చక్కని ప్రదేశం. సిమ్లా ఆపిల్ పండ్లకు ప్రసిద్ధి. ఎత్తయిన కొండలు, మల్లెపూల వానలా కురిసే మంచు, చల్లటి వాతావరణం కట్టిపడేస్తాయ్. వందల ఏళ్ల నాటి ఆలయాలు, చర్చిలు, బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎన్నో భవనాలు ఆకట్టుకుంటాయి. ఎటుచూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లుగా ఉండే ఫైన్, ఓక్ చెట్లు అడుగడుగునా ప్రత్యక్షమవుతాయి. స్నో స్కీయింగ్ ఇది స్వర్గధామమే. ఊటి, కొడైకనాల్: తమిళనాడు మధ్య ప్రాంతంలో ఉన్న సుందరమైన పర్వతప్రాంతం ఊటి, కొడైకెనాల్. తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఘాట్రోడ్లో ప్రయాణించాల్సిందే. కొడై సరస్సు, సెయింట్ మేరీ చర్చ్, పంపార్ పాల్స్, గ్రీన్ వ్యాలీ, గుణ గుహ, పైన్ వృక్షాల వనం పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇందులో కొడై అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. అంతర్జాతీయ యాత్రలు సింగపూర్: పచ్చదనానికి, పరిశుభ్రతకు మరో పేరు సింగపూర్. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఆ దేశ అందాలను వీక్షించేందుకు విచ్చేసే పర్యాటకుల సంఖ్య కోకొల్లలు. ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిపిన ఈ అరుదైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే సింగపూర్ వెళ్లి రావాల్సిందే. మలేషియా: నీలిరంగు కప్పుకున్న సముద్రం తెల్లగా మెరిసిపోయే ఇసుక, ఆ పక్కనే పచ్చదనం పరుచుకున్న వృక్షసంపద, నీటి మీద తేలియాడే మరపడవలూ, తీరాన్ని తాకాలనే ఉత్సాహంతో ఉరకలు వేసే సముద్ర కెరటాలు... ఇలా మలేషియా అందాలన్నీ రంగుల హరివిల్లులై పర్యాటకుల మది దోచుకుంటుంటాయి. చిన్న చిన్న దీవులతో ఏర్పడ్డ సుందర ప్రదేశమే మలేషియా. దట్టమైన అరణ్యాలూ, ఎత్తయిన కొండలూ, తెల్లని బీచ్‌లతో చూడముచ్చటగా ఉంటుంది. థాయ్‌లాండ్: ఏటా లక్షలాదిమంది పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతం థాయ్‌లాండ్. బీచ్‌లో సేద తీరాలన్నా, స్పా, మసాజ్ సెంటర్లలో రిలాక్స్ అవాలన్నా థాయ్ ది బెస్ట్ ప్లేస్. డిసెంబర్, మార్చి మధ్య థాయ్‌లాండ్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కాకుండా హాఫ్ సీజన్లో ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చులో టూర్ ప్రశాంతంగానూ పూర్తవుతుంది. శ్రీలంక: పూల సుగంధ పరిమళాల గుబాళింపు, పక్షుల కిలకిలారావాలు, ఎటువైపు చూసినా కనువిందు చేసే పచ్చదనం, స్వచ్ఛమైన చల్లని పిల్లగాలులు, సముద్ర తీరం హŸయలు వీటన్నింటినీ స్వయంగా ఆస్వాదించాలంటే శ్రీలంకకు వెళ్లాల్సిందే. హైదరాబాదు నుంచి కొలంబోకు సరిగ్గా రెండు గంటల ప్రయాణం మాత్రమే. శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే కాబట్టి టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. హాంకాంగ్ మకావా: హాలీడేస్‌లో ఎక్స్ట్రార్డినరీ అనుభూతి. సముద్ర గర్భ మార్గం, కొండల్ని తొలుస్తూ వేసిన అండర్‌పాస్‌లు, సుదూర ప్రాంతాలను కలిపే వేలాడే వంతెనలు.. భూతల స్వర్గాన్ని తలపించే హాంకాంగ్ చైనాకు ఆగ్నేయ తీరంలో ఉంటుంది. పలు చిన్న చిన్న ద్వీపాల సమూహమిది. నేపాల్: ఎవరెస్టు శిఖరం మీద ఎగురుతూ ధవళవర్ణంలో ధగధగలాడే హిమాలయ పర్వతశ్రేణుల సౌందర్యాన్నీ ఆ కొండల్లోంచి జాలువారి వయ్యారంగా మలుపులు తిరుగుతూ సాగే నదుల అందాలనూ... ఎంతసేపు చూసినా విసుగనిపించదు. అలాంటి అందాల నెలవు నేపాల్. RVటూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పో ఎప్పుడెప్పుడు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవాలకునే భక్తుల సౌలభ్యం కోసం / విహార పర్యాటక ఔత్సాహికుల కోసం ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ వేసవి సెలవులతో పాటు సంవత్సరం పొడవునా వచ్చే విశేష ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నేటి నుండి జనవరి 24 వరకు ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తోంది. ఈ ఎక్స్పో లో 2018 ఫిబ్రవరి వరకు చేయబోయే ఆధ్యాత్మిక, వినోద, విహార లేదా అంతర్జాతీయ యాత్రలను అడ్వాన్స్‌గా కొంత మొత్తము ప్యాకేజీ అమౌంట్‌ను కట్టినట్లయితే భారీ డిస్కౌంట్ పొందే సదావకాశం కల్పిస్తోంది. నేరుగా హైదరాబాద్ కూకట్పల్లి లోని ఖVప్రధాన కార్యాలయాన్ని సందర్శించి గాని లేదా ఫోన్ ద్వారా కానీ వివరాలు పొందవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక తగ్గింపు ప్యాకేజీలను వినియోగించుకోవచ్చు. గమనిక: ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ట్రావెల్ ఎక్స్పోను సందర్శించండి. భారీ డిస్కౌంట్ పొందండి. ఈ అవకాశం 21, 22, 23, 24 తేదీలలో మాత్రమే. ఆర్ వి టూర్స్ – ట్రావెల్స్ 3వ అంతస్తు, భాగ్యనగర్ కాంప్లెక్స్, బి.జె.పి. ఆఫీస్ ఎదురుగా, మెట్రో పిల్లర్ నెం. 15, కూకట్పల్లి, హైదరాబాద్ ఆర్.వి.రమణ ఆర్.వి.టూర్స్ – ట్రావెల్స్ అధినేత -
నేపాల్ సరిహద్దులో చిక్కుకున్నతెలుగువారు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 28 మంది తీర్థయాత్రలకు వెళ్లి నేపాల్ సరిహద్దులో చిక్కుకున్నారు. ఏలూరుకు చెందిన 28 మంది ఈ నెల17వ తేదీన నేపాల్, మేఘాలయ, ముక్తినాథ్ తదితర ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లారు. అయితే నేపాల్ సరిహద్దులో టూరిస్ట్ సంబంధించిన పత్రాలు లేవన్న కారణంగా అక్కడి సరిహద్దు భద్రతాదళం వారిని అడ్డగించారు. భాష రాని కారణంగా వారు నానా ఇబ్బందులు పడుతున్నారని ఢిల్లీలోని ఒక మిత్రుని ద్వారా సమాచారం అందించారు. దాంతో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని కాపాడి సురక్షితంగా స్వస్థలాలు చేర్చాలని వారు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. -
షిరిడి వెళ్లొచ్చే సరికి ఊడ్చుకెళ్లారు
ఇంటికి తాళం వేసి తీర్థ యాత్రలకు వెళ్లిన వ్యక్తి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కె.పెంటపాడు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్లారు. బుధవారం రాత్రి ఆయన ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులతో పాటు రూ. 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందకున్న పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.