ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 28 మంది తీర్థయాత్రలకు వెళ్లి నేపాల్ సరిహద్దులో చిక్కుకున్నారు. ఏలూరుకు చెందిన 28 మంది ఈ నెల17వ తేదీన నేపాల్, మేఘాలయ, ముక్తినాథ్ తదితర ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లారు. అయితే నేపాల్ సరిహద్దులో టూరిస్ట్ సంబంధించిన పత్రాలు లేవన్న కారణంగా అక్కడి సరిహద్దు భద్రతాదళం వారిని అడ్డగించారు. భాష రాని కారణంగా వారు నానా ఇబ్బందులు పడుతున్నారని ఢిల్లీలోని ఒక మిత్రుని ద్వారా సమాచారం అందించారు. దాంతో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని కాపాడి సురక్షితంగా స్వస్థలాలు చేర్చాలని వారు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.
నేపాల్ సరిహద్దులో చిక్కుకున్నతెలుగువారు
Published Mon, May 30 2016 3:34 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement