పట్నా: భారత్‌లోని కీలక ప్రాంతాలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన పొలిటికల్ మ్యాప్‌కు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలున్నాయి. అయితే ఈ దుశ్చర్యను భారత్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చింది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. అయినప్పటికీ నేపాల్ తన వక్రబుద్ధి పోనిచ్చుకోలేదు. తాజాగా బిహార్‌లోని కొంత ప్రాంతాన్ని నేపాల్ భూభాగంగా తెలుపుతూ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. బిహార్ జల వనరుల శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడింది. (స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు)
బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా లాలా బేకీ నదిపై ఆనకట్ట పనులు చేపట్టడానికి వెళ్లిన భారతీయులను నేపాల్ అధికారులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతం నేపాల్ భూభాగానికి చెందినదంటూ వారిని అక్కడి నుంచి పంపించివేశారు. కాగా ఆ ఆనకట్ట కొద్ది సంవత్సరాల క్రితమే నిర్మితమైందని, కేవలం మరమ్మత్తులు వేయడానికి వెళ్లితే అడ్డుకున్నారని బీహార్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆ ప్రాంతం నేపాల్‌కు చెందినది అని తెలియజేయడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. (నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత)
Comments
Please login to add a commentAdd a comment