ఇంటికి తాళం వేసి తీర్థ యాత్రలకు వెళ్లిన వ్యక్తి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు.
ఇంటికి తాళం వేసి తీర్థ యాత్రలకు వెళ్లిన వ్యక్తి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కె.పెంటపాడు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్లారు. బుధవారం రాత్రి ఆయన ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులతో పాటు రూ. 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందకున్న పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.