Shekhar
-
అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నాన్న ఎక్కడికి వెళ్లాడమ్మా? ఎప్పుడు వస్తాడమ్మా? చెప్పమ్మా?’ అంటూ చిన్నారులు తల్లడిల్లిపోతుండగా.. భర్త ఏమయ్యాడో.. ఎక్కడ ఉన్నాడో.. పిల్లలకు ఏం జవాబు చెప్పాలో తెలియని స్థితిలో విజయవాడ ఊరి్మళానగర్‌కు చెందిన పాయల నందిని ఆందోళన చెందుతోంది. వరద వచ్చినప్పటి నుంచి భర్త ఆచూకీ తెలియక కన్నీరుమున్నీరవుతోంది. ఊర్మిళానగర్‌లోని రెడ్డి కాలనీకి చెందిన పాయల శేఖర్, నందిని దంపతులకు పిల్లలు మధుప్రియ(4), చైత్రిక (2) ఉన్నారు. శేఖర్ తాపీమేస్త్రీగా పనిచేస్తుంటాడు. ఆదివారం ఉదయం బుడమేరు వరద పెరుగుతుందని తెలియడంతో శేఖర్ తన భార్య, ఇద్దరు పిల్లలను సమీపంలోని తన చెల్లెలి ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు.తన వద్ద పనిచేసే వారి సాయంతో ఇంట్లోని వస్తువులను బయటకు చేర్చాడు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో వెంటనే భవానీపురం పోలీస్ కాలనీలో తాను పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజాము వరకు అక్కడే ఉన్నాడు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో చెల్లెలికి ఫోన్ చేసి.. ‘వరద ఎక్కువగా ఉంది. నాకు కొంచెం భయంగా ఉంది. వరద తగ్గాక వస్తా’ అని చెప్పాడు. చెల్లెలి భర్తకు ఫోన్ చేసి.. తన కాలికి గాజు పెంకులు గుచ్చుకున్నాయని వాపోయాడు.ఆ తర్వాత శేఖర్ ఫోన్ స్విచాఫ్ అయ్యింది. అప్పటి నుంచి శేఖర్ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య నందిని, పిల్లలు రోదిస్తున్నారు. ‘వారం రోజులు గడిచిపోయింది. నగరంలోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. ప్రభుత్వాసుపత్రి మార్చురీకి రోజూ వెళ్తున్నాం. ఎక్కడ గుర్తు తెలియని శవం ఉందని చెబితే అక్కడి వెళ్లి చూసి వస్తున్నాం. మా అన్న అసలు ఉన్నాడో.. లేడో అని ఆందోళనగా ఉంది’ అంటూ శేఖర్ చెల్లెలు భారతి కన్నీరుమున్నీరయ్యింది. -
నటుడిగా అలరించి హీరో అవుతాను
‘‘నేను హీరో కావాలనుకుంటే కాలేను. ఓ మంచి నటుడిగా ప్రేక్షకులను అలరిస్తే, వారి నమ్మకాన్ని గెల్చుకుంటే అప్పుడు హీరో అవుతాను. మా అమ్మగారు (సునీత) స్టార్ సింగర్. ఆమె స్థాయిని ఇండస్ట్రీలో కొనసాగించాలనే విషయాన్ని నేను ఒత్తిడిగా ఫీల్ కావడం లేదు. నన్ను నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా, ఓ బాధ్యతగా అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో నా గురించి స్టార్ కిడ్ అనే మాట వినిపించినప్పటికీ నా నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుని, సక్సెస్ కావాల్సిన బాధ్యత నాపైనే ఉంటుంది’’ అని ఆకాశ్ అన్నారు. ఆకాశ్, భావన జంటగా గంగనమోని శేఖర్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ ఫిల్మ్ ‘సర్కారు నౌకరి’. దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆకాశ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా 1990 నేపథ్యంలో సాగుతుంది. ఆ సమయంలో దేశంలో ఎయిడ్స్ అనే ఓ మహమ్మారి వచ్చింది. ముఖ్యంగా గ్రామాలు చాలా ప్రభావితం అయ్యాయి. ఈ వ్యాధి నివారణ, చికిత్సల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ప్రభుత్వోద్యోగులు. అలా ఓ గ్రామంలో వారు చేసిన ప్రయత్నాలను ఓ వ్యక్తి చేసినట్లుగా, వన్ మ్యాన్ షోలా ఈ సినిమాను తీశాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వోద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేది ‘సర్కారు నౌకరి’ సినిమా కథాంశం. వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. వినోదంతో పాటు ఓ చిన్నపాటి సందేశం కూడా ఉంది. నేను గిటారిస్ట్‌ని కూడా. భవిష్యత్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొని, సినిమా పాటలను ఎలా కం΄ోజ్ చేస్తారనే విషయాలపై అవగాహన తెచ్చుకోవాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు. -
‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి..
అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో భూ వివాదం భగ్గుమంది. రెండెకరాల భూమి గట్టు పంచాయితీ సోదరుల మధ్య చిచ్చురేపడంతో ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మానాయికుంటకు చెందిన మార్త బుచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు వీరయ్య, సైదులు కుమారులు. గ్రామ శివారులో తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని సోదరులిద్దరూ చెరో ఎకరం పంచుకుని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది. అరకతో అచ్చుతోలుతుండగా.. వీరయ్య తన కుమారుడు ప్రభాస్‌తో కలసి బుధవారం ఉద యం పొలంలో అరకతో అచ్చుతోలుతున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు సైదులు, తన కు మారుడు శేఖర్‌తో కలసి భూమి వ ద్దకు వెళ్లి వీరయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నలుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా సైదులు కుమారుడు శేఖర్ గొడ్డలితో పెదనాన్న కుమారుడు ప్రభాస్‌పై దాడి చేశాడు. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో సైదులు ఎడమచెయ్యి తెగిపోవడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు దాడిని అడ్డుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’.. ఫస్ట్‌లుక్
‘‘భయంకరమైన కోవిడ్–19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకువెళ్లినా నేను ప్రేమించేవాళ్లు, నా అభిమానుల ప్రార్థనలే నా ఈ పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించేలా చేశాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్లయిన మీకు రుణపడి ఉంటాను’’ అన్నారు రాజశేఖర్. గురువారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’ చిత్రాన్ని ప్రకటించి, ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. లలిత్ దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ‘‘రాజశేఖర్ గారి 91వ చిత్రమిది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి రచయిత: లక్ష్మీ భూపాల్, కెమెరా: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, కళ: దత్తాత్రేయ. -
ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ
(మల్లు విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి): కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో 38 పరిశోధన సంస్థలు ఉన్నాయి. వాటిలో 4,500 మంది శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి సీఎస్ఐఆర్ పనిచేస్తోంది. పర్యావరణం మొదలు ఆరోగ్యం వరకు.. పలు రంగాల్లో అవసరమైన పరిశోధన ఫలితాలను దేశానికి అందించడానికి నిరంతరం పనిచేస్తున్నామని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మాండే చెప్పారు. ‘పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్’ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ.. మందులు, టీకాలు కనిపెట్టడానికి జన్యు శ్రేణి మన దేశ ప్రజల్లో ఉన్న వైవిధ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. జినోమ్ సీక్వెన్స్ (జన్యు శ్రేణి) కూడా మన వాళ్లలో ఉన్నంత విభిన్నంగా మరెక్కడా ఉండదు. అందువల్లే మనదేశంలో అరుదైన జెనెటిక్ డిజార్డర్స్ (జన్యు సంబంధిత సమస్యలు) ఎక్కువ. వీటిని అధిగమించడానికి 1008 మంది జన్యు శ్రేణులను రూపొందించాం. మందులు, టీకాలు కనిపెట్టడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. మానవుల జన్యు బ్లూప్రింట్‌ను డీకోడ్ చేయడానికి జన్యు శ్రేణి పనికొస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ), సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్తంగా జన్యుశ్రేణి రూపకల్పన ప్రాజెక్టును చేపట్టాయి. అలాగే డెంటల్ ఇంప్లాంట్స్‌ను చౌకగా తయారుచేసే పరిజ్ఞానాన్ని రూపొందించాం. దీనివల్ల ఇప్పుడున్న ధరల్లో మూడో వంతుకే ఇంప్లాంట్స్ లభించనున్నాయి. స్పెంట్ వాష్‌ను శుద్ధి చేస్తే.. మద్యం తయారీ ప్లాంట్ల (డిస్టిలరీస్)లో వ్యర్థ జలాలను ‘స్పెంట్ వాష్’ అంటారు. దీన్ని శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటివరకు లేదు. ఒక లీటరు మద్యం తయారు చేస్తే 10–15 లీటర్ల వ్యర్థజలం (స్పెంట్ వాష్) వస్తుంది. మొలాసిస్ నుంచి మద్యం తయారుచేసే కర్మాగారాలు దేశంలో 300కు పైగా ఉన్నాయి. ఇవి ఏటా 250 కోట్ల లీటర్ల స్పెంట్ వాష్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని అంచనా. ఇవి స్పెంట్ వాష్, మిగతా వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు వదులుతున్నాయి. ఫలితంగా తీవ్ర దుర్గంధం వెలువడటంతోపాటు పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. స్పెంట్ వాష్‌లో కాలుష్యానికి కారణం.. పొటాష్. దీన్ని వేరు చేస్తే మిగతా వ్యర్థాలను తొలగించడం చాలా సులువు. పొటాష్‌ను వేరు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) అభివృద్ధి చేసింది. పొటాష్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. స్పెంట్ వాష్‌ను శుద్ధి చేస్తే.. రూ.700 కోట్ల విలువైన పొటాష్‌ను ఉత్పత్తి చేయొచ్చు. శుద్ధి ప్రక్రియలో శుద్ధ జలం కూడా వస్తుంది. ఆ నీటిని డిస్టిలరీస్ వాడుకోవచ్చు. అయితే.. స్పెంట్ వాష్ శుద్ధి ప్లాంట్ ఏర్పాటు మరీ చౌక కాదు. 2.5 ఏళ్లలో పొటాష్ ఉత్పత్తి ద్వారా పెట్టుబడి వచ్చేస్తుంది. తర్వాత నుంచి లాభమే. వ్యర్థాల రీయూజ్‌కు పరిశోధనలు వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల తీవ్ర కాలుష్య సమస్యలు వస్తున్నాయి. వ్యర్థాలను తిరిగి ఉపయోగించడానికి అనువైన పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించే దిశగా పరిశోధనలు చేస్తున్నాం. రైతులు ఆ వ్యర్థాలను సులువుగా ‘రీయూజ్’ చేసే పరిజ్ఞానాన్ని వచ్చే సీజన్‌కు సీఎస్ఐఆర్ అందిస్తుంది. అల్జీమర్స్ వ్యాధికి మందు అల్జీమర్స్ వ్యాధికి కుంకుమ పువ్వు నుంచి మందు తయారు చేశాం. క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రత్యామ్నాయ వనరుల నుంచీ బయోఫ్యూయల్ తయారీ.. దేశానికి ఇంధన భద్రతను అందించే శక్తి బయో ఫ్యూయల్‌కు ఉంది. కానుగ నుంచే ఇప్పటివరకు బయోఫ్యూయల్ తయారు చేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల నుంచి కూడా తయారు చేయొచ్చు. సీఎస్ఐఆర్ రూపొందించిన బయో ఫ్యూయల్‌తో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి విమానం నడిపాం. వాణిజ్యపరంగా బయోఫ్యూయల్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఇలా చేస్తే.. ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ ప్రయోగం కూడా విజయవంతమైంది. ఇటు ప్లాస్టిక్ సమస్యను, అటు ఇంధన కొరతను అధిగమించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేస్తే ప్లాస్టిక్ సమస్యను అధిగమించవచ్చు. ‘మేకిన్ ఇండియా’కు సహకారం మేకిన్ ఇండియా కార్యక్రమానికి సీఎస్ఐఆర్ తన వంతు సహకారమందిస్తోంది. వివిధ రంగాల్లో చేస్తున్న పరిశోధన ఫలితాలను పరీక్షించడానికి ఇటీవల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందించడానికి ఇది దోహదం చేస్తుంది. 19 సీట్ల విమానం సిద్ధమైంది.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, నేషనల్ ఏరోనాటిక్స్‌తో కలిసి తేలికపాటి విమానాల తయారీ మీద పరిశోధనలు చేస్తున్నాం. 19 సీట్ల ‘సరస్’ విమానం సిద్ధమైంది. దీన్ని పరీక్షిస్తున్నాం. 70 సీట్ల విమానం డిజైన్ ఆమోదం పొందింది. ఈ పరిశోధనలు పూర్తయితే.. దేశంలో చిన్న విమానాశ్రయాలకు కూడా విమానాలు తిరిగే అవకాశం ఉంటుంది. ‘విజిబిలిటీ’ తక్కువగా ఉన్నప్పుడు విమానాలు దిగడం (ల్యాండింగ్) పెద్ద సమస్య. దీన్ని అధిగమించడానికి హైలెవల్ సెన్సార్స్ ఉన్న ‘దృష్టి’ని రూపొందించాం. ప్రస్తుతం 50 ‘దృష్టి’ వ్యవస్థలను దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో వాడుతున్నారు. ఈ టెక్నాలజీని రెండు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చాం. ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు కూడా ఇవ్వబోతున్నాం. -
ఎత్తుకు పైఎత్తు
అర్ధరాత్రి కావస్తున్నా కూతురు సునీత ఇంటికి రాకపోవడంతో డాక్టర్ శేఖర్ ఆందోళన చెందాడు. పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో రాత్రి పది గంటలకే శేఖర్ తన నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికొచ్చేశాడు. కానీ తొమ్మిదిన్నరకే రావాల్సిన సునీత ఇంతవరకు రాలేదు. ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ అని వస్తోంది. సునీత తన ఫోన్‌ని ఎప్పుడూ స్విచాఫ్ చెయ్యదు. నగరంలో ఒక బ్యూటీ పార్లర్ నడిపే సునీత రోజూ తొమ్మిదిన్నరకల్లా ఇంటికి చేరుకుంటుంది. కానీ ఈ రోజు అర్ధరాత్రి కావస్తున్నా రాలేదు. శేఖర్ బ్యూటీ పార్లర్లో పనిచేసే వారికి కూడా ఫోన్లు చేశాడు. ఎప్పటిలాగే రాత్రి తొమ్మిదికి పార్లర్ మూసేశాక సునీత తన కారులో ఇంటికి వెళ్లిపోయిందని వారు చెప్పారు. కొంపదీసి సునీత కారు ప్రమాదానికి గురైందా అనే అనుమానంతో పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చెయ్యబోయాడు. అప్పుడే శేఖర్ సెల్ మోగింది. స్క్రీన్‌పై సునీత నంబర్ కనిపించగానే ఆత్రంగా ‘‘ఏమ్మా! ఎక్కడున్నావ్?’’ అని అడిగాడు. అవతల నుంచి సునీతకు బదులు ఇంకెవరో మాట్లాడారు.‘‘డాక్టర్ శేఖర్! మీ కూతురు ప్రస్తుతం మా బందీగా ఉంది. ఆమె ప్రాణాలతో దక్కాలంటే మీరు మేం చెప్పినట్లు చెయ్యాలి’’ అన్నాడు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కటువుగా.‘‘ఎవరు మీరు? మీకేం కావాలి? నా కూతుర్ని క్షేమంగా విడిచిపెట్టండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను’’ ఆందోళనగా అన్నాడు.‘‘మాకు డబ్బు అక్కర్లేదు. నువ్వు మాకొక చిన్న పని చేస్తే చాలు. మావాడికి భుజంలో బుల్లెట్ దిగింది. బుల్లెట్ బయటకు తీసి కట్టు కట్టాలి. ఆ పని ఇప్పుడే చెయ్యాలి. నీ వంటి సర్జన్కి ఇదొక పెద్ద పని కాదు. సర్జరీకి కావలసిన పరికరాలు తీసుకొని నువ్వు ఇప్పుడే కారులో నేరుగా గాంధీనగర్ వచ్చెయ్. ఆలోగా మేం నీకు మళ్లీ ఫోన్ చేస్తాం. ఈ విషయం పోలీసులకు చెప్పవంటే నీ కూతురు శవం కూడా నీకు దొరకదు’’ అంటూ ఫోన్ కట్ చేశాడా వ్యక్తి.డాక్టర్ శేఖర్ ఇంటి పక్కనే ఉన్న తన నర్సింగ్‌హోమ్ లోంచి సర్జరీకి కావలసిన పరికరాలు, మత్తుమందు, బ్యాండేజీ సామగ్రిని ఒక బ్యాగులో వేసుకుని కారులో బయల్దేరాడు. అతను గాంధీనగర్‌లోకి ప్రవేశించగానే ఫోన్ మోగింది. కిడ్నాపర్ మాట్లాడాడు. ‘నీ కారును రేమండ్ షోరూమ్ ముందు పార్క్ చేసి, దానికి ఎదురుగా ఉన్న సందులోకి నడుచుకుంటూ రా’’ అని ఆదేశించాడు.శేఖర్ అతను చెప్పినట్టే చేశాడు. ఫోన్లో సూచనల ద్వారా కిడ్నాపర్ శేఖర్ని నాలుగైదు సందులు తిప్పి, చివరకు నిర్మానుష్యంగా ఉన్న ఒక చీకటి ప్రదేశంలో ఆగమన్నాడు. అక్కడొక కారు నిలిపి ఉంది. కారు పక్కనే ఒక ముసుగు వ్యక్తి శేఖర్ చేతిలోని బ్యాగుతో పాటు అతని సెల్‌ఫోన్ కూడా తీసుకున్నాడు. సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి, బ్యాగును కారులో పెట్టాడు. తర్వాత శేఖర్ కళ్లకు గంతలు కట్టి కారు వెనుక సీట్లో కూర్చోబెట్టాడు. తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు వేగంగా ముందుకు ఉరికింది. పావుగంట ప్రయాణం తర్వాత ఒక చోట ఆగింది. ముసుగు వ్యక్తి శేఖర్ చెయ్యి పట్టుకొని కొంత దూరం తీసుకెళ్లాడు. గమ్యం చేరాక శేఖర్ కళ్లకు కట్టిన గంతలను తీసేశాడు. తానొక గదిలో ఉన్నానని గ్రహించాడు శేఖర్. గదిలోని మంచం మీద భుజానికి తూటా దెబ్బ తగిలిన వ్యక్తి ఉన్నాడు. అతని పక్కనే మరో వ్యక్తి ఉన్నాడు. వారిద్దరి ముఖాలకు కూడా ముసుగులు ఉన్నాయి. గాయపడ్డ వ్యక్తి బాధకు విలవిల్లాడుతున్నాడు. డాక్టర్ శేఖర్ వెంటనే పని మొదలుపెట్టాడు. గాయపడ్డ వ్యక్తికి మత్తుమందు ఇచ్చి అతని భుజంలో దిగిన తూటాను చాకచక్యంగా బయటకు తీశాడు. తర్వాత గాయానికి మందు రాసి, కుట్టు కుట్టి కట్టు కట్టాడు. తర్వాత పేపర్ మీద కొన్ని మందులు రాసిచ్చాడు. ‘‘తూటా చాలా లోపలకు దిగబడింది. పైగా చాలాసేపు లోపలే ఉండిపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. వెంటనే ఈ మాత్రలు వాడండి. వాడకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువై ప్రాణం మీదకు వస్తుంది. అందువల్ల నిర్లక్ష్యం చెయ్యవద్దు’’ అని ఆ ముసుగు వ్యక్తులతో చెప్పాడు.తర్వాత కిడ్నాపర్లు శేఖర్ని గాంధీనగర్ వరకు కళ్లకు గంతలతో తీసుకెళ్లారు. అక్కడ అతన్ని దించి, సెల్‌ఫోన్ ఇచ్చి వెళ్లిపోయారు. శేఖర్ కారులో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి వేకువ జాము నాలుగు గంటలైంది. తెలతెలవారుతుండగా సునీత ఇంటికి వచ్చింది. తనను ఎవరో దుండగులు కిడ్నాప్ చేసి, కళ్లకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లారని, రాత్రంతా ఒక గదిలో బంధించి కొద్దిసేపటి కిందటే విడిచిపెట్టారని చెప్పింది. శేఖర్ రాత్రి జరిగినదంతా కూతురికి చెప్పాడు.సునీత క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది గనుక ఇప్పుడు కిడ్నాపర్ల గురించి పోలీసులకు చెప్పడం ధర్మం అనుకున్నాడు శేఖర్. వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్‌కి ఫోన్ చేసి, జరిగినదంతా వివరంగా చెప్పాడు. అప్పుడు విజయ్ ఆ కిడ్నాపర్లు ఎవరో శేఖర్‌కి చెప్పాడు. ‘‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఈ దుర్మార్గులే నిన్న సాయంత్రం హైవేలో ఒక వజ్రాల వ్యాపారి కారును అటకాయించి, కోటి రూపాయల విలువైన వజ్రాలు దోచుకెళ్లారు. ఆ వ్యాపారి ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో దుండగుల్లో ఒకడు గాయపడ్డాడు. దుండగులు ఆ వజ్రాల వ్యాపారిని చంపి, తమ సహచరుణ్ణి కారులో ఎక్కించుకుని పరారయ్యారని మాకు తెలిసింది. వారు గాయపడ్డ తమ వ్యక్తిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళితే పట్టుబడిపోతామనే భయంతో మీ కూతుర్ని కిడ్నాప్ చేసి, మీ ద్వారా అతనికి చికిత్స చేయించారని ఇప్పుడర్థమవుతోంది నాకు. నిన్న రాత్రి కిడ్నాపర్లు మిమ్మల్ని కారులో తీసుకెళ్లిన రూటును మీరు చెప్పగలిగితే మేం వారి స్థావరాన్ని కనుక్కొని వారిని అరెస్టు చేస్తాం’’ అన్నాడు విజయ్.‘‘సారీ ఇన్స్పెక్టర్. ఆ సమయంలో నా కళ్లకు గంతలు కట్టడం వల్ల నేనేమీ చూడలేకపోయాను. అయితే, వారి ఆచూకీ తెలుసుకోవడానికి నేనొక ట్రిక్కు ప్రయోగించాను. పేషెంటుకి ఇన్ఫెక్షన్ తగ్గడానికి నేను రాసిచ్చిన మాత్రలు నెహ్రూ రోడ్డులోని అపోలో ఫార్మసీ మెడికల్ షాపులో మాత్రమే దొరుకుతాయి. నగరంలో ఇంకెక్కడా ఆ మందుల స్టాక్ లేదు. ఒక డాక్టర్‌గా నాకీ విషయం బాగా తెలుసు. ఆ మెడికల్ షాపు రోజూ ఉదయం తొమ్మిది గంటల తర్వాత తెరుస్తారు. మీరు ఆ అంగడి వద్ద మాటు వేసి, ఆ మందుల చీటీ తెచ్చిన వ్యక్తిని పట్టుకుంటే చాలు మిగిలిన వారు కూడా దొరికిపోతారు’’ ధీమాగా చెప్పాడు శేఖర్.‘‘థాంక్యూ డాక్టర్. మా పోలీసుల బుర్ర కన్నా మీ బుర్రే తెలివైనది. ఆ మందుల పేర్లు చెప్పండి చాలు. ఆ దుర్మార్గుల్ని ఇట్టే పట్టుకుంటాను.’’ హుషారుగా అన్నాడు విజయ్ రాసుకున్నాడు.తర్వాత విజయ్ అపోలో ఫార్మసీ షాపు తెరవగానే షాపు ఓనరుతో మాట్లాడి తన సిబ్బందితో కలసి మఫ్టీలో షాపు బయట మాటు వేశాడు. ఊహించినట్టే కాసేపట్లో ఒక కిడ్నాపర్ శేఖర్ రాసిచ్చిన మందుల చీటీతో అంగడికి వచ్చాడు. షాపు ఓనర్ సైగ చెయ్యగానే విజయ్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. తర్వాత అతని ద్వారా అతని సహచరులను కూడా అరెస్టు చేసి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు. - డి.మహబూబ్ బాషా -
ప్రముఖ సినీ ఎడిటర్ కన్నుమూత
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ ఎడిటర్ శేఖర్ (81) గురువారం ఉదయం తమిళనాడు తిరుచ్చి సమీపంలోని తెన్నూర్లో కన్నుమూశారు. దక్షిణాది భాషల్లో 50 ఏళ్లలో 200కు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన శేఖర్.. దర్శకులు ఫాజిల్, సిద్ధిక్‌లకు ఆస్థాన ఎడిటర్‌గా పేరొందారు. దక్షిణాదిలో తొలి సినిమాస్కోప్ (తస్సోలి అంబు) చిత్రానికి, తొలి 70ఎంఎం (పడైయోట్టం) చిత్రానికి, అదే విధంగా తొలి భారతీయ (మైడియర్ కుట్టిసాత్తాన్) 3డీ చిత్రానికి పనిచేసిన ఎడిటర్‌గా శేఖర్ ఖ్యాతి గడించారు. వరుషం 16 చిత్రానికి గానూ శేఖర్ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎడిటర్ అవార్డును, ‘0 మొదల్ 1 వరై’ అనే మలయాళ చిత్రానికి కేరళ రాష్ట్రం నుంచి ఉత్తమ ఎడిటర్ అవార్డు అందుకున్నారు. ఈయన చివరి తమిళ చిత్రం సాదుమిరండా. సినిమా రంగం నుంచి తప్పుకున్న తర్వాత ఆయన తన స్వగ్రామంలో స్థిరపడ్డారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన శేఖర్ చికిత్స పొందుతూ గురువారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య సుందరి, కుమార్తెలు దీపలక్ష్మి, తిలకవతి, నిత్యా ఉన్నారు. -
టీఏ శేఖర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఐపీఎల్ టీమ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ డైరెక్టర్ టీఏ శేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మాజీ పేసర్ అయిన శేఖర్ 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుంచి ఢిల్లీ ఫ్రాంచైజీకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల శేఖర్ పదవికి రాజీనామా చేసినట్లు జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ దువా తెలిపారు. ‘మేం శేఖర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. ఢిల్లీ ఫ్రాంచైజీకి ఆయన అందించిన సేవలు అమూల్యమైనవి. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టం’ అని హేమంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ జట్టు హెడ్ కోచ్ ప్యాడీ ఆప్టన్, టెక్నికల్ డైరెక్టర్ జుబిన్ భరూచా కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. అసిస్టెంట్ కోచ్ ఎస్. శ్రీరామ్, ప్రవీణ్ ఆమ్రే మాత్రం జట్టుతో కొనసాగనున్నారు. గతంలో ఢిల్లీ జట్టుకు భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ మెంటర్‌గా వ్యవహరించారు. అండర్ 19 జట్టుకు కోచ్‌గా ఉంటూ.. ఫ్రాంఛైజీకి సేవలందించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని ఆయన ఇటీవలే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. -
వేధింపులే కారణమా..?
సంస్థాన్ నారాయణపురం: ఆ విద్యార్థి చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవాడు..సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి అనారోగ్యం బారిన పడ్డాడు. రెండు రోజుల క్రితమే కాలేజీకి వచ్చి పరీక్ష కూడా రాశాడు. తోటి విద్యార్థులు వేధించారో. కాలేజీలో ఇమడలేకనో తెలియదు కానీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సర్వేల్ గురుకుల విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, విద్యార్థులు, గ్రామాస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహడ్ గ్రామానికి చెందిన సల్వోజు మధునాచారి, సుజాతల కుమారుడు శేఖర్(17) సర్వేల్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి పండగ సెలవులకు వెళ్లి అనారోగ్యం బారిన పడడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. గత శనివారం కళాశాలకు ఉదయం వచ్చి పరీక్ష రాశాడు. కళాశాలకు వచ్చినప్పటికీ శేఖర్‌కు ఆడ్మిట్ పాస్‌ను అందజేయలేదు. సోమవారం తెల్లవారుజామున శేఖర్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లారెడ్డిగూడెం వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాడు. అక్కడే రైతుల గుడిసెల్లో దాచుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీప రైతులు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే శేఖర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తండ్రికి ఫోన్ చేసి.. సోమవారం ఉదయం 5గంటలకు శేఖర్ తండ్రికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. తండ్రి నేను వస్తున్నాను, అంతపని చేయకు అని చెప్పి సర్వేల్‌కు బయలుదేరాడు. ఇదే విషయం తండ్రి కళాశాలకు సమాచారం ఇచ్చాడు. అధ్యాపకులు, తోటి విద్యార్థులు శేఖర్‌ను వెతకడం మొదలు పెట్టారు. అప్పటికే కళాశాల నుంచి శేఖర్ నడుచుకుంటూ వెళ్లిపోవడంతో వారికి కనిపించలేదు. 5 నుంచి 8 గంటల వరకు తండ్రికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం అక్కడ విద్యార్థి మరణించి ఉండటాన్ని గమనించి గ్రామాస్తుల, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీస్‌లు, కళాశాల ప్రిన్సిపాల్ రాఘవరావు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ మల్లేశ్వరి కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. కారణాలపై పోలీసుల అన్వేషణ శేఖర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. తోటి విద్యార్థుల వేధించారా..?, గురుకులంలో ఇమడలేక మనస్తాపం చెందాడా, ఇంకా ఎమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ చదవలేనని చెప్పాడు తోటి విద్యార్థుల వేధింపులు ఎక్కువయ్యాయని, నేను ఇక్కడ చదవలేనని చెప్పాడని శేఖర్ తల్లితండ్రి మధనాచారి, సూజాత తెలిపారు. సర్ది చెప్పి పంపించామని, ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అయినా విద్యార్థుల వేధింపులు ఆగలేదని ఆరోపించారు. ఉదయం ఫోన్ చేసినప్పుడు తండ్రి నేను వస్తున్నానని, ఇంటికి తీసుకెళ్తానని, మళ్లీ పరీక్షలు రాసేటప్పుడే కళాశాలకు వెళ్లు అని చెప్పానని తెలిపారు.విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నా ప్రిన్సిపాల్, అధ్యాపకులు పట్టించుకోనందు వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమ కుమారుడు బాగా చదివే వాడని, ఎవరితోనూ గొడవలు, వాగ్వాదానికి దిగిన సందర్భాలు లేవన్నారు. మృతుడి బంధువుల ఆందోళన విద్యార్థుల వేధింపులు, కళాశాల నిర్లక్ష్యం వల్ల శేఖర్(17) మృతి చెందాడని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం రాత్రి మృతుడు బంధువులు అందోళనకు దిగారు. గురుకుల పాఠశాల ఏజీవో టీఎస్ ప్రసాద్ అక్కడకు చేరుకుని వారికి నచ్చచెప్పాడు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంపై ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మార్బుల్ పాలిష్ మిషన్ నడిపే ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో శేఖర్(18) అనే యువకుడు మార్బుల్ పాలిష్ చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం మిషన్ నడుపుతున్న శేఖర్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. -
పిడుగుపడి ఇద్దరు మత్స్యకారుల మృతి
నంద్యాల పట్టణ శివారులోని చిన్న చెరువు వద్ద మత్స్యకారులపై గురువారం పిడుగుపడింది. ఈ ఘటనలో మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన పుల్లయ్య(25), నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన శేఖర్(30) అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
షిరిడి వెళ్లొచ్చే సరికి ఊడ్చుకెళ్లారు
ఇంటికి తాళం వేసి తీర్థ యాత్రలకు వెళ్లిన వ్యక్తి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కె.పెంటపాడు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్లారు. బుధవారం రాత్రి ఆయన ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులతో పాటు రూ. 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందకున్న పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎదలో గానం... పెదవే మౌనం...
సినిమా వెనుక స్టోరీ - 30 ఇంకా పూర్తిగా తెల్లారలేదు. వెలుతురు గుమ్మంలోకి రావడానికి కొత్త పెళ్లికూతుర్లా సిగ్గుపడుతోంది. అలాంటి టైమ్‌లో నిద్ర లేస్తాడు శేఖర్. గ్రామఫోన్ ఆన్ చేస్తాడు. ‘మనసున మల్లెల మాలలూగెనే’ అంటూ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ సాంగ్ అలలు మొదలవుతాయి. చేతిలో పొగలు కక్కుతూ కమ్మని ఫిల్టర్ కాఫీ. గుమ్మం దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ ప్రకృతి తొలి పరిమళాన్ని ఆస్వాదించడం ఎంత బాగుంటుంది? ఇవన్నీ అమెరికా వెళ్తే దొరకవ్. అమెరికా ఫ్లయిట్లో కూర్చున్నా డన్నమాటే గానీ శేఖర్ మనసంతా ఇండియా మీదే ఉంది. అది కూడా హైదరాబాద్ మీద. ముఖ్యంగా పద్మా రావునగర్‌లోని తమ ఇంటి మీద! డిగ్రీ చదివిన ప్రతివాడి గోల్ అమెరికానే. శేఖర్‌కి ఇంట్రస్ట్ లేదు. కానీ గుంపుతో గోవింద కొట్టక తప్పలేదు. అమెరికా జీవితం గొప్పగా అనిపించలేదు శేఖర్‌కి. ఏదో అసంతృప్తి. జాబ్‌లో చేరాక మనసు పంపే సిగ్నల్స్ సారాంశం తెలిసొచ్చింది. ఇలా కాదు. క్రియేటివ్‌గా ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకు సినిమా ఫీల్డ్ కరెక్ట్. శేఖర్ డిసైడైపోయాడు. జాబ్‌కి రిజైన్ చేసేసి, హావర్డ్ యూని వర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్‌లో జాయినై పోయాడు. థీసిస్‌కి ఓ స్క్రిప్టు రెడీ చేయాలి. అమెరికాలో అమ్మాయిలు చాలా స్వేచ్ఛగా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. దేనికీ చలించరు. అలాంటి స్వభావంతో ఓ హీరోయిన్ కేరెక్టర్ సృష్టిస్తే? సృష్టించాడు. స్క్రిప్టు రెడీ. ఫిల్మ్ మేకింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేతికొచ్చింది. ఇక హైదరాబాద్ వెళ్లడానికి పెట్టే బేడా సర్దుకోవాల్సిందే! హైదరాబాద్ రాగానే సిటీ కార్పొరేషన్ బ్యాంక్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా జాబ్ సంపాదించాడు శేఖర్. 20 వేల జీతం. సెలైంట్‌గా సినిమా ట్రయల్స్ మొదలెట్టాడు. అప్పుడు కృష్ణవంశీ ‘సింధూరం’ తీస్తున్నాడు. అతని దగ్గరకెళ్లి అసిస్టెంట్‌గా పెట్టుకోమని అడిగాడు. ఇలాంటి ఆబ్లిగేషన్లు కృష్ణవంశీకి లెక్కలేనన్ని. అందుకే శేఖర్‌కి పని కాలేదు. కానీ అవకాశం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని తనకి తెలుసు. వచ్చేసింది. శేఖర్ అక్కయ్య గైనకాలజిస్ట్. ఆ రోజు ఆమె దగ్గరకెళ్లాడు. అదే టైమ్‌కి ఓ అమ్మాయి అబార్షన్ చేయించుకోడాని కొచ్చింది. తను త్వరలో యూఎస్ వెళ్తోంది. అక్కడే పిల్లల్ని కంటే పౌరసత్వం వస్తుంది కదా! అందుకే అబార్షన్. అమె రికా ఎన్ని జీవితాల్ని ఇలా ప్రభావితం చేస్తుందో కదా అనిపించింది. ఆ యాంగిల్లో కథ రాయడం మొదలు పెట్టాడు. దీంతో సినిమా తీయాలి. అన్నయ్య ఎలానూ బ్యాక్‌బోన్‌గా ఉంటాడు. ఇక ఫ్రెండ్స్ హెల్ప్ తీసు కోవాలి. ఎవరికి తోచింది వాళ్లు ఇచ్చారు. మొత్తం 18 లక్షలు పోగయ్యింది. బ్యానర్ పేరు ‘అమిగోస్’. అంటే స్పానిష్ భాషలో ‘ఫ్రెండ్స్’ అని అర్థం. 18 రోజులలో ‘డాలర్ డ్రీమ్స్’ సినిమా పూర్తి అయిపో యింది. కానీ దాన్నెలా మార్కెట్ చేయాలో, ఎలా రిలీజ్ చేయాలో అర్థం కాలేదు. ఏవేవో తంటాలు పడ్డాడు. చివరకు రిలీజైంది. చూసింది తక్కువమందే. వాళ్లందరూ బావుందన్నారు. కానీ బిగ్ లాస్. ఒకటే రిలీఫ్. బెస్ట్ డెబ్యూ డెరైక్టర్‌గా నేషనల్ అవార్డు. ఇండస్ట్రీలో చిన్న గుర్తింపు. ‘డాలర్ డ్రీమ్స్’కొచ్చిన లాస్ కవర్ చేసుకోవడానికి మూడేళ్లు పట్టింది శేఖర్‌కి. ఆ పడవ ఒడ్డుకి చేరుకుందనిపించగానే మళ్లీ ప్రయాణానికి సిద్ధమైపోయాడు. థీసిస్ స్క్రిప్టు బయటకు తీసి ఫిల్మ్‌నగర్ బయలుదేరాడు. పాతిక ముప్ఫై మందికి స్క్రిప్టు వినిపించాడు. ‘‘గ్రామ్‌ఫోన్ తిరుగు తోంది. ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాట వస్తోంది. ఒక అందమైన అమ్మాయి, బయట వాన’’ అని కథ చెప్పడం మొద లెట్టగానే ప్రొడ్యూసర్లు ఇబ్బందిగా ఫీలయ్యేవాళ్లు. ఇదంతా క్లోజ్‌ఫ్రెండ్ అనీష్ కురువిల్లా అబ్జర్వ్ చేసి ‘ఆ గ్రామ్‌ఫోన్ విషయం ఆపేయరా బాబూ’ అన్నాడు. ‘పోనీ స్క్రిప్టు ఇస్తాను. చదువుకోండి’ అంటే ఒక్క పేజీ చదివే తీరికా ఓపికా ఏ నిర్మాత దగ్గరా కనబడలేదు. పెద్ద పెద్ద వాళ్లందర్నీ కలిశాడు. నో యూజ్. ఇక సొంతగా ప్రొడ్యూస్ చేసుకోవాల్సిందే. బడ్జెట్ లెక్కవేస్తే 80 లక్షలు తేలింది. ఫ్రెండ్సంతా హెల్ప్ చేసినా, అంత మొత్తం అంటే కష్టం. అంతలో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి తెలిసింది. వాళ్లకు సబ్జెక్ట్ నచ్చితే పెట్టుబడి పెడతారు. వాళ్లకు ప్రపోజల్ పంపించాడు. 40 లక్షలు పెట్టడానికి ఎన్.ఎఫ్.డి.సి. రెడీ! ఈ కథ రాసుకుంటున్నప్పుడే శేఖర్ మైండ్‌లో పవన్‌కల్యాణ్ ఉన్నాడు. శేఖర్ ట్రై చేశాడు. వర్కవుట్ కాలేదు. అదే టైమ్‌లో రాజాని చూశాడు. ఓ చినదాన, విజయం, అప్పుడప్పుడు, కల, అర్జున్ సినిమాలు చేశాడప్పటికి. టైటిల్ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ల నాన్న పేరు కూడా ఆనందే. మిగతా క్యారెక్టర్స్ కూడా సెట్ అయ్యాయి. కానీ హీరోయిన్ రూప దొరక లేదు. సినిమా అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఎవరైనా పాపులర్ ఫిగరైతే బాగుంటుంది. అసిన్, సదా... చాలామందిని ట్రై చేశాడు. ఇక కొత్తవాళ్లే బెటర్. టీవీలో ‘ఆయుష్’ షాంపూ యాడ్ వస్తోంది. దాన్లో ఓ కోడలు అత్తగారు మార్చుకోమన్నవన్నీ మార్చుకుం టుంది, ఒక్క షాంపూ తప్ప. ఆ కోడలి గార్జియస్ లుక్, యాక్షన్ అన్నీ చూస్తే రూపలా కనబడింది. వెంటనే ఎంక్వైరీ చేశాడు శేఖర్. ఆమె పేరు కమలినీ ముఖర్జీ. బెంగాలీ అమ్మాయి. బాంబేలో థియేటర్ ఆర్ట్స్ చేసి, మోడలింగ్ చేస్తోంది. ‘ఫిర్ మిలేంగే’ అనే హిందీ సినిమాలో కూడా చేస్తోంది. ఆమెకి శేఖర్ నుంచి కాల్ వెళ్లింది. ఆమెకేమో సౌత్ సినిమాల మీద ఇంట్రస్ట్ లేదు. ఒకేసారి హిందీ, తెలుగుల్లో చేస్తామని చెబితే ఒప్పుకుంది. శేఖర్ స్క్రిప్టు ఇచ్చేసి వెళ్లిపోయాడు. రాత్రంతా చదివి రూప క్యారెక్టర్‌కి ఫ్లాటైపోయింది. మ్యూజిక్ డెరైక్టర్‌గా కె.ఎం.రాధా కృష్ణన్ సెలెక్ట్ అయ్యాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ నాలుగు గోడల మధ్య కాకుండా నెక్లెస్ రోడ్డులోనూ యూని వర్సిటీ క్యాంపస్‌లోనూ తిరుగుతూ చేశారు. శేఖర్‌కు వేటూరి లిరిక్స్ అంటే ప్రాణం. అనీ ఆయనతోనే రాయించు కున్నాడు. ఇలాంటి సినిమాలకు అను భవం ఉన్న కెమెరామ్యాన్ కావాలి. విజయ్. సి.కుమార్ దొరికాడు. అమ్మోరు, అంకుశం, ఆగ్రహం లాంటి సినిమాలకు పనిచేశాడు. శేఖర్ ‘నాకు వెన్నెల రాత్రి కావాలి’, ‘మంచు బిందువులు కావాలి’ అని అడుగుతుంటే, విజయ్ ఆ విజువల్స్ అన్నీ కెమెరాతో ఒడిసిపట్టి ఇచ్చాడు. ఎక్కువ శాతం షూటింగ్ శేఖర్ సొంత కాలనీలోనే. శేఖర్ అతి శ్రద్ధ వల్లో, క్వాలిటీ కోసం అతి తపన వల్లో బడ్జెట్ అంతై ఇంతింతై రెండున్నర కోట్లు తేలింది. శేఖర్‌కి తన ప్రొడక్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్. కానీ బయ్యర్సే శేఖర్ గాలి తీయడం మొదలు పెట్టారు. హీరోయిజం లేదు... పెద్ద కామెడీ లేదు... హీరోకి బాత్రూమ్ లేకపోవడ మేంటి... ఏముందని దీనికింత ఖర్చు పెట్టావు... ఇలా బాణాలు సంధించేసరికి శేఖర్‌కి ‘సినిమా అంత అసహ్యంగా ఉందా?’ అనే డౌట్ వచ్చింది. ఫ్రెండ్ అనీష్ మాత్రం భుజం తట్టాడు. ప్రసాద్ ల్యాబ్స్ అధినేత ఎ.రమేశ్ ప్రసాద్ కూడా ‘ఈ సినిమాకు డబ్బులు రావేమో’ అని డౌట్ వ్యక్త పరిచారు. నిండా మునిగాక చలేముం టుంది! మొండిగానే ముందుకెళ్తున్నాడు. రకరకాల మార్కెటింగ్ వ్యూహాలు ఆలో చిస్తున్నాడు. ‘మంచి కాఫీ లాంటి సినిమా’ అనే క్యాప్షన్ తగిలించాడు. ‘బ్రూ’ కంపెనీతో టై అప్ అయ్యాడు. ఓన్ రిలీజ్‌కే సిద్ధమయ్యాడు. అది కూడా తన ఫేవరేట్ హీరో చిరంజీవి సినిమా మీద పోటీ. ‘శంకర్‌దాదా ఎంబీబీయస్’ 2004 అక్టోబర్ 15న రిలీజ్. అదే రోజు ‘ఆనంద్’ రిలీజ్ చేయాలని శేఖర్ ప్లాన్. జనరల్‌గా టాప్‌స్టార్స్ సినిమాల మీద ఎవ్వరూ పోటీకి దిగరు. కానీ శేఖర్ దిగాడు. అదే కలిసొచ్చింది కూడా. మార్కెట్లో శేఖర్ డేరింగ్ గురించి డిస్కషన్. ఆడియన్స్‌లో కూడా క్యూరియాసిటీ. ఐదంటే ఐదు ప్రింట్లతో హైదరాబాద్, వరంగల్, విజయ వాడ, విశాఖపట్నాల్లో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌పై శేఖర్‌కి నో హోప్. త్రీ వీక్స్ ఆడితే చాలు అనే ఫీలింగ్. కానీ సినిమా చూసిన వాళ్లందరికీ మంచి కాఫీ తాగిన ఫీలింగ్. ఆ పరిమళం అలా అలా పాకుతూ 23 ప్రింట్ల దాకా ఎగిసింది. ఈ ‘ఆనంద’ ప్రవాహంలో ప్రేక్షకుడి మనసు కాగితపు పడవలాగా ప్రయాణించేసింది. విమర్శకులు గొప్ప గొప్ప సమీక్షలు రాశారు. ‘‘నిద్రపోతున్న పసిపాప దగ్గరుండే నిశ్శబ్దం... గోరింటాకు పండక పోతే వచ్చే బాధ... రాత్రంతా మొక్క ముందు కాపలా కాసినా మొగ్గ పువ్వు ఎప్పుడవుతుందో కనిపెట్టలేని మిస్టరీ... ఈ ‘ఆనంద్’ సినిమా’’ అంటూ వచ్చిన సమీక్షతో శేఖర్‌కి తానెంత గొప్ప సినిమా తీశాడో అర్థమైపోయింది. సినిమాలో అన్నీ నేచురల్ డైలాగ్స్. తెలుగు, ఇంగ్లిష్, హిందీ మిక్సింగ్ ఫ్లేవర్ నచ్చేసింది. ఆర్టిస్టులూ దాదాపు కొత్తవాళ్లే. వాళ్ల బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీల్లో న్యూ ఎట్రాక్షన్. రాజా, కమలినీలు అచ్చం ఆనంద్, రూపల్లాగానే బిహేవ్ చేశారు. కమలినీకి సింగర్ సునీత డబ్బింగ్ భలే హెల్ప్ అయ్యింది. ఆరు పాటలూ శ్రోతల్ని కొత్త రాగాల్లో తేలియాడించాయి. హిట్ టాక్ రావడంతో బయ్యర్లూ వచ్చారు. హైదరాబాద్ ఉంచేసుకుని మిగతాదంతా అమ్మేశాడు శేఖర్. హైదరాబాద్‌లో 130 రోజులు ఆడింది. అదే శేఖర్‌కు మిగిలింది. 2005 జనవరి 28న హండ్రెడ్ డేస్ ఫంక్షన్. చీఫ్ గెస్ట్ దాసరి నారాయణరావు. అప్పుడాయన కేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి. ఆయన ప్రసంగిస్తూ... ‘‘రియల్లీ మైండ్ బ్లోయింగ్. ఈ మధ్యకాలంలో నేను చూసిన వాటిల్లో గొప్ప ఫిల్మ్ ఇది. న్యూ జనరేషన్‌కి గైడ్ లాంటిది’’ అని ప్రశంసించారు. ‘‘బాగా చేశావ్ శేఖర్’’ అని బాపు నుంచి ప్రశంస. శేఖర్‌కి ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందం. శేఖర్ వాళ్ల నాన్న ఒకటే మాటన్నారు. ‘‘పేరూ డబ్బూ వచ్చి నందుకు కాదు... నువ్వు అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉంది.’’ శేఖర్ లాంటి కొడుక్కి ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది! వెరీ ఇంట్రస్టింగ్ ‘వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా’ పాటకు ముందు కమలినీ ముఖర్జీని ఇంటి ముందు డ్రాప్ చేసే ఆటోడ్రైవర్‌గా శేఖర్ కమ్ముల క్షణంసేపు కనిపిస్తారు. - పులగం చిన్నారాయణ -
ఇద్దరు కుమారులు సహా తల్లి ఆత్మహత్య
జీవితం విరక్తి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులు సహా బావిలో దూకి తనువు చాలించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలం నాగులపాడు గ్రామంలో జరిగింది. గ్రామ హరిజనవాడకు చెందిన కట్కం ప్రమీల(28), బుధవారం రాత్రి కుమారులు శేఖర్(11), సుశీల్‌కుమార్(8)తో సహా వెళ్లి సమీపంలోని బావిలో దూకేసింది. బావిలో తేలియాడుతున్న శవాలను గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. మతిస్థిమితం లేకనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమించకపోతే చంపేస్తా....
బాలికకు యువకుడి హెచ్చరిక నిందితుడి అరెస్టు బంజారాహిల్స్: ‘‘నన్ను ప్రేమించు...లేకపోతే చంపేస్తా’ అంటూ తొమ్మిదో తరగతి విద్యార్థినిని ఓ యువకుడు వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీ సుల కథనం ప్రకారం.. ఇందిరానగర్ నివాసి వల్లాల శేఖర్(19) తండ్రితో కలిసి స్థానికంగా స్క్రాప్ దుకా ణం నిర్వహిస్తున్నాడు. ఇదే బస్తీకి చెందిన విద్యార్థిని(14) జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది. ఆమెను శేఖర్ కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. వారికంటే ముందుగానే వి ద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి చేరుకుం టుంది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన శేఖర్ ఒకరోజు బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమె ఫొటోలు తీశాడు. ప్రేమించకపోతే ఆ ఫొటోలు ఫేస్బుక్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతడి వేధింపు లు తాళలేక కొద్ది రోజులుగా కుమిలిపోతున్న బాలిక ఎట్టకేలకు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు శుక్రవారం కుమార్తెతో బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేయించ గా.. నిందితుడు శేఖర్‌ను అరెస్టు చేశారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
బాబాయి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెదిన సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలం జీవన్గీ గ్రామంలో గురువారం సాయంత్రం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంజిలమ్మ కుమారుడు శేఖర్(19) ఈ నెల 9న బాబాయి ఇంటికి వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతున్నారు. కాగా.. గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని కాగ్నా నది ఒడ్డున యువకుడి మృతదేహం గుర్తిచడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయనే లేకపోతే ఏమయ్యేదో...
ముంబై: కారుతో సహా నీటిలో మునిగిపోతున్న ఓ వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడాడు ముంబైకు సమీపంలోని ఓ దాబా యజమాని. ఈ మధ్యనే వివాహం చేసుకున్న ముంబైకి చెందిన కార్ల వ్యాపారి శేఖర్ తన భార్యను కలవడానికి గుజరాత్ వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. పక్కనే ఉన్న ఆకాష్ దాబా యజమాని అతణ్ని రక్షించాడు. లేదంటే ఒక నవవధువు తన భర్తను కోల్పోయి ఉండేది వివరాల్లోకి వెళితే. శేఖర్ (35) తన భార్యను కలవడానికి గుజరాత్ బయలుదేరాడు. అతను నడుపుతున్న కారు టైర్ అకస్మాత్తుగా పేలడంతో వాహనం అదుపు తప్పింది. బ్రిడ్జిపై నుంచి సుమారు 25 అడుగుల లోతున్న కాలవలోకి పడిపోయింది. చుట్టూ జనం పోగయ్యారు. మునిగిపోతున్న కారును జనం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ సాహసం చేయడానికి ముందుకు రాలేదు. కానీ దాబా యజమాని మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకేశాడు. శేఖర్‌ను కొన ఊపిరితో బయటకు లాక్కొచ్చాడు. వెంటనే జనం అతన్ని స్థానిక ఆసుప్రతిలో చేర్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న శేఖర్ బంధువులు..వెన్నెముక విరిగి, రెండు కాళ్లలో చలనంలేని స్థితి, మెదడులో రక్తస్రావం లాంటితీవ్ర గాయాలతో ఉన్న శేఖర్ ను మెరుగైన చికిత్స కోసం ముంబైలోని కెమ్ ఆసుపత్రికి తరలించారు. మెదడులో రక్తస్రావాన్ని ఆపగలిగామని, ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు తెలిపారు. అతను సీటు బెల్టు పెట్టుకొని ఉండకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని కెమ్ డీన్ అవినాష్ సుపె తెలిపారు. ప్రస్తుతం శేఖర్ స్పృహలోనే ఉన్నాడని, ప్రాణాలకు ప్రమాదమేమీ లేదన్నారు. అయితే తన భర్త రాక కోసం ఎదురు చూస్తున్న తాను ప్రమాద వార్త విని చాలా భయపడ్డానని , దాబా యజమాని కాపాడి ఉండకపోతే తన భర్త బతికే ఉండేవాడు కాదని బాధితుని భార్య ప్రియ అంటోంది. ఆయనకు జన్మజన్మలకు ఋణపడి ఉంటామని తెలిపింది. ఆయన అంత సాహసం చేసి ఉండక పోతే ఏమయ్యేదో అంటూ దాబా యజమానికి బంధువులు ధన్యవాదాలు తెలిపారు. -
పదహారేళ్లకు...
దుబాయికి వెళ్లి ఆచూకీ లేకుండా పోయి నగరంలో ప్రత్యక్షం కుటుంబ సభ్యులకు అప్పగించిన ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్: ఉపాధి కోసం దుబాయికి వెళ్లిన యువకుడు పదహారేళ్ల తరువాత అనుకోకుండా కుటుంబ సభ్యులను కలిసిన ఉదంతం ఇది. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం జాగిరి కొండాపూర్ గ్రామానికి దండనేని నర్సయ్య, లింగమ్మ దంపతుల కుమారుడు శేఖర్ (44). అతడడికి భార్య నీల, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1999లో బతుకుతెరువు నిమిత్తం దుబాయికి వెళ్లిన శేఖర్ అక్కడ హెల్పర్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే ఆ తరువాత ఆరు నెలలు గడిచిందో లేదో...అతడి నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు దుబాయిలో తెలిసిన వారిని వాకబు చేసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో వారు అతనిపై ఆశ వదిలేసుకున్నారు. ఇదిలా ఉండగా అతని భార్య నీల తన పుట్టింటికి వెళ్లి కూలి చేసుకుని జీవనం సాగిస్తూ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. ఊరివాడి కంటపడి.... ఇదిలా ఉండగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ యార్డులో పని చేస్తున్న అదేగ్రామానికి చెందిన పులి రమేష్ అనే వ్యక్తికి అల్ఫా హోటల్ వద్ద భిక్షాటన చేస్తున్న శేఖర్ కనిపించడంతో అతను ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన పరిస్థితిని వివరించాడు అవిటితనం కారణంగానే.... అప్పులు చేసి దుబాయి వెళ్లిన తనకు అక్కడికి వెళ్లిన ఆరోనెలలోనే ఒక వ్యక్తి అకారణంగా కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డానన్నాడు. అక్కడి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నా అతను తన పలుకుబడి ఉపయోగించి పెద్దల సహకారంతో రాజీ పేరుతో మోసం చేశాడని, గాయం కూడా మానకముందే పదివేలు చేతిలో పెట్టి హైదరాబాద్ విమానం ఎక్కించాడన్నారు. అసలే పేదరికం, ఇద్దరు కుమార్తెలు ఉన్న తనకు అవిటితనంతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించలేదని, దీంతో ఎవరికంట పడకుండా సికింద్రాబాద్, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ అశ్వినీకుమార్ సమాచారం అందించడంతో బుధవారం సాయంత్రం నగరానికి చేరుకున్న శేఖర్ భార్య నీల, తండ్రి నర్సయ్య కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. శేఖర్ ను గుర్తించి అప్పగించిన పులి రమేష్, ఆర్పీఎఫ్ పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్యాయత్నం
వాల్మీకిపురం: వాల్మీకిపురం మండలంలో శుక్రవారం ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని సాకిరేవుపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన డి.శేఖర్ (35) కొన్ని సంవత్సరాలుగా కలికిరి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా భార్య భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన శేఖర్ శుక్రవారం ఉదయం తన పిల్లలు లక్ష్మి (10), ప్రదీప్ (8), ప్రణీత (7)లను వడ్డిపల్లెలోని తన వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. విషం కలిపిన సీతలపానీయం వారికి తాపి, తానూ తాగేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి కుదుటపడినట్లు వైద్యులు తెలిపారు. -
కూలీని కబళించిన ఇసుకాసురులు
రాత్రికి రాత్రే చెరువులో ఇసుక కోసం తవ్వకాలు ఇసుక దిబ్బలు పడి కూలీ మృతి ఇసుక వ్యాపారి దురాశ కూలీని బలిగొంది. రాత్రివేళ చెరువులో ఇసుక తవ్వడానికి వెళ్లిన వ్యక్తి మృతి చెంద డంతో అతని భార్యాబిడ్డలు దిక్కులేని వారయ్యారు. కుప్పం: గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే చెరువులోని ఇసుకను తరలించేందుకు ప్రయత్నించిన వ్యాపారి దురాశకు ఓ కూలీ బలైపోయూడు. వుండలంలోని పెదబంగారు నత్త చెరువులో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దబంగారు నత్తం గ్రావూనికి చెందిన రూపేష్ పగటి పూట ఇసుక తవ్వితే అధికారులు పట్టుకుంటారని భావించి బుధవారం రాత్రి చెరువులో ఇసుక తీతకు గ్రావుంలో కూలీలను పిలిచాడు. అదే గ్రావూనికి చెందిన శేఖర్ (30) కూలీ పనికి వెళ్లాడు. అర్ధరాత్రి ఇసుక తవ్వుతుండగా వుట్టి దిబ్బలు శేఖర్ మీద పడ్డాయి. అక్కడిక్కడే శేఖర్ ఇసుకలో కూరుకుపోయి మృతి చెందాడు. మట్టి దిబ్బల్లో చిక్కుకున్న డ్రైవర్ ప్రాణాపాయు స్థితి నుంచి తప్పించుకున్నాడు. వ్యాపారి రూపేష్ పోలీసులకు లొంగిపోయూడు. గురువారం ఉదయుం తహశీల్దార్ అబ్దుల్‌మునాఫ్ ఆధ్వర్యంలో మట్టి దిబ్బల కింద ఉన్న శేఖర్ వుృతదేహాన్ని వెలికితీశారు. కుప్పం పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక టిప్పర్లు పట్టివేత
వేల్పూర్ : వేల్పూర్ మండలం అక్లూర్ వాగు వద్దకు ఇసుక అక్రమ రవాణాకు వచ్చిన ఐదు టిప్పర్లను తహశీల్దార్ శేఖర్, ఎస్సై కృష్ణ గురువారం వేకువ జామున పట్టుకున్నారు. అక్లూర్ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గ్రామానికి చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ వాగు వద్ద రెవెన్యూ సిబ్బందిని రాత్రిపూట కాపలాగా ఉంచారు. ఎప్పటిలాగే అర్ధరాత్రి ఇసుక టిప్పర్లు రావడంతో రెవెన్యూ సిబ్బంది తహశీల్దార్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఎస్సైని తీసుకొని వాగువద్దకు చేరుకున్నారు. టిప్పర్లు వాగు వద్దకు చేరగానే పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఆలయానికి నిధుల కోసం గ్రామస్తులు ఇసుక అక్రమ రవాణాకు రాత్రిపూట అనుమతించినట్లు సమాచారం. సుమారు రూ. 3.50 లక్షలకు ఐదు టిప్పర్లకు అనుమతించినట్లు తెలిసింది. అక్లూర్ నుంచి పచ్చలనడ్కుడ, జాన్కంపేట్ గ్రామాల మీదుగా ఆర్మూర్ పట్టణానికి దగ్గరగా దారి ఉండడంతో వ్యాపారులు అర్ధరాత్రి పూట తమ పనిని సునాయసంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన టిప్పర్లకు ఒక్కోదానికి తహశీల్దార్ రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు. అనుమతి పేరిట అక్రమ రవాణా! మండలంలోని కుకునూర్ వాగు నుంచి అభివృద్ధి పనులకు ఇసుక సరఫరాకు ఇస్తున్న అనుమతితో అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న రూ. 125 కోట్ల తాగునీటి సరఫరా పథకానికి, నిర్మల్ ప్రాంతంలో జరుగుతున్న ప్రాణహిత చేవెళ్ల పథకం పనులకు అధికారులు అనుమతులిచ్చారు. వారంలో ఐదు రోజుల పాటు రెండు పథకాలకు కుకునూర్ నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. వేబిల్లుతో ఇక్కడి నుంచి వెళ్లిన ఇసుక నిజంగా పనులు జరుగుతున్న చోటుకు చేరుతుందా? లేదా ! అనేది అనుమానాస్పదంగా మారింది. ఇసుక తీసుకెళ్లిన లారీ తిరిగి వేబిల్లులు మాత్రం సక్రమంగా తెచ్చి అధికారులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. కానీ చివరి వరకు చేరినట్లు నమ్మడమే తప్ప ఎవరూ చూసిన దాఖలాలు కన్పించడ ంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదు రోజుల క్రితం కుకునూర్ నుంచి ఆర్మూర్‌కు సరఫరా చేసేందుకు ఇచ్చిన అనుమతితో బయల్దేరిన టిప్పరు మండలంలోని పడగల్ మీదుగా వెళుతుండగా, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు హన్మంత్‌రావు అడ్డుకొని వీఆర్వోలకు పట్టించారు. దీంతో అనుమతితో వెళ్లిన ఇసుక సక్రమంగా చేరడం లేదని స్పష్టమవుతోంది. అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతుండగా, వ్యాపారులు తమ అక్రమ వ్యాపారాన్ని సక్రమంగా వెలగబెట్టుకుంటున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. -
మధ్యతరగతి కుర్రాడి ప్రేమకథ
ఆ యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఓ యువతి వస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘నేనూ... నా ప్రేమకథ’. వర్ధన్ దర్శకత్వంలో దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్, శాస్త మీడియాపై వర్మ, పనుకు రమేష్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్, సుష్మా హీరో, హీరోయిన్లు. వింగ్ కమాండర్ కేఎన్ రావు సమర్పకుడు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమకథ ఉంటుంది. కొందరు పెళ్లికి ముందు ప్రేమించుకుంటారు. పెళ్లి తర్వాత ప్రేమ రుచిని ఆస్వాదిస్తారు కొంతమంది. మాది పెళ్లికి ముందు జరిగే ప్రేమకథ. ప్రేమికుల ముచ్చట్లు, కోపతాపాలతో సినిమా సాగుతుంది. తమ మధ్య ఏర్పడిన మనస్పర్థలను హీరో, హీరోయిన్ ఎలా పరిష్కరించుకున్నారనేది ప్రధానాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్., కెమెరా: నగేష్ ఆచార్య. -
ప్రేమ పులకింతలు...
ప్రేమజల్లులో తడిసి ముద్దవ్వని వాడంటూ ఉండడు. అది పెళ్లికి ముందు అయినా సరే... తర్వాతైనా సరే. ప్రేమజల్లులో మాత్రం తడవడం తథ్యం. అలా ప్రేమ పలకరింపుతో పులకరించిన ఓ మధ్యతరగతి కుర్రాడి కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘నేనూ.. నా ప్రేమకథ’. శేఖర్, సుష్మా జంటగా నటిస్తున్నారు. వర్ధన్ దర్శకుడు. వర్మ, పనుకు రమేశ్‌బాబు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే మధ్య తరగతి కుర్రాడి ప్రేమకథ ఇది. కోపతాపాలు, ప్రేమ ముచ్చట్లతో సహజం, స్వచ్ఛంగా ఈ కథ సాగుతుంది. యువతరాన్ని ఆకట్టుకునే అంశాలన్నీ ఇందులో ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘ప్రేమలో వచ్చే పొరపొచ్చాలను హీరోహీరోయిన్లు ఎలా అధిగమించారు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. మన పొరుగునే జరుగుతున్న కథలా అత్యంత సహజంగా ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు. హైదరాబాద్, గోవా, బ్యాంకాక్, శ్రీలంకల్లో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డీటీఎస్ వర్క్ జరుగుతోంది. మే తొలివారంలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: నగేశ్ ఆచార్య, సంగీతం: చిన్ని చరణ్, మిథున్ ఎం.ఎస్, సమర్పణ: వింగ్ కమాండర్ కె.ఎస్.రావు, నిర్మాణం: దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్, శాస్తా మీడియా. -
పోలీసులను ఆశ్రయించిన నవదంపతులు
కొల్చారం, న్యూస్‌లైన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట రక్షణ కల్పించాలని మంగళవారం కొల్చారం పోలీసులను ఆశ్రయించారు. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం...కొల్చారం గ్రామానికి చెందిన బోరంపేట దుర్గయ్య కుమారుడు శేఖర్, చిన్నఘణాపూర్ గ్రామానికి చెందిన శేరిపల్లి కమలమ్మ కూతురు మాధవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురికీ బం ధుత్వం ఉన్నప్పటికీ వీరి వివాహానికి శేఖర్ తల్లి అభ్యం తరం తెలిపింది. దీంతో శేఖర్, మాధవిలు అక్టోబర్ 29వ తేదీన ఏడుపాయల దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. తిరిగి సోమవారం ఇంటికి రాగా, దంపతులను శేఖర్ తల్లి వెళ్లగొట్టింది. దీంతో నవదంపతులు కొల్చారం పోలీసులను ఆశ్రయించడంతో స్పందించిన ఎస్ఐ ఇరుకుటుం బాలవారినీ పిలిపించి నచ్చజెప్పేందుకు ప్రయత్నించా రు. అయితే శేఖర్ తల్లి ఒప్పుకోకపోవడంతో మేజర్లయిన వీరికి చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తామని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు శేఖర్, మాధవిల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.