సినీ ఎడిటర్ శేఖర్
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ ఎడిటర్ శేఖర్ (81) గురువారం ఉదయం తమిళనాడు తిరుచ్చి సమీపంలోని తెన్నూర్‌లో కన్నుమూశారు. దక్షిణాది భాషల్లో 50 ఏళ్లలో 200కు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన శేఖర్.. దర్శకులు ఫాజిల్, సిద్ధిక్‌లకు ఆస్థాన ఎడిటర్‌గా పేరొందారు. దక్షిణాదిలో తొలి సినిమాస్కోప్ (తస్సోలి అంబు) చిత్రానికి, తొలి 70ఎంఎం (పడైయోట్టం) చిత్రానికి, అదే విధంగా తొలి భారతీయ (మైడియర్ కుట్టిసాత్తాన్) 3డీ చిత్రానికి పనిచేసిన ఎడిటర్‌గా శేఖర్ ఖ్యాతి గడించారు.
వరుషం 16 చిత్రానికి గానూ శేఖర్ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎడిటర్ అవార్డును, ‘0 మొదల్ 1 వరై’ అనే మలయాళ చిత్రానికి కేరళ రాష్ట్రం నుంచి ఉత్తమ ఎడిటర్ అవార్డు అందుకున్నారు. ఈయన చివరి తమిళ చిత్రం సాదుమిరండా. సినిమా రంగం నుంచి తప్పుకున్న తర్వాత ఆయన తన స్వగ్రామంలో స్థిరపడ్డారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన శేఖర్ చికిత్స పొందుతూ గురువారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య సుందరి, కుమార్తెలు దీపలక్ష్మి, తిలకవతి, నిత్యా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment