
న్యూఢిల్లీ: ఐపీఎల్ టీమ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ డైరెక్టర్ టీఏ శేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మాజీ పేసర్ అయిన శేఖర్ 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుంచి ఢిల్లీ ఫ్రాంచైజీకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల శేఖర్ పదవికి రాజీనామా చేసినట్లు జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ దువా తెలిపారు. ‘మేం శేఖర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. ఢిల్లీ ఫ్రాంచైజీకి ఆయన అందించిన సేవలు అమూల్యమైనవి. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టం’ అని హేమంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆ జట్టు హెడ్ కోచ్ ప్యాడీ ఆప్టన్, టెక్నికల్ డైరెక్టర్ జుబిన్ భరూచా కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. అసిస్టెంట్ కోచ్ ఎస్. శ్రీరామ్, ప్రవీణ్ ఆమ్రే మాత్రం జట్టుతో కొనసాగనున్నారు. గతంలో ఢిల్లీ జట్టుకు భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ మెంటర్‌గా వ్యవహరించారు. అండర్ 19 జట్టుకు కోచ్‌గా ఉంటూ.. ఫ్రాంఛైజీకి సేవలందించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని ఆయన ఇటీవలే ఆ పదవి నుంచి తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment