మధ్యతరగతి కుర్రాడి ప్రేమకథ | Middle-class boy love story Nenu Naa Prema Katha | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి కుర్రాడి ప్రేమకథ

Published Mon, May 26 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

మధ్యతరగతి కుర్రాడి ప్రేమకథ

మధ్యతరగతి కుర్రాడి ప్రేమకథ

ఆ యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఓ యువతి వస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘నేనూ... నా ప్రేమకథ’. వర్ధన్ దర్శకత్వంలో దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శాస్త మీడియాపై వర్మ, పనుకు రమేష్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్, సుష్మా హీరో, హీరోయిన్లు. వింగ్ కమాండర్ కేఎన్ రావు సమర్పకుడు.
 
 నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమకథ ఉంటుంది. కొందరు పెళ్లికి ముందు ప్రేమించుకుంటారు. పెళ్లి తర్వాత ప్రేమ రుచిని ఆస్వాదిస్తారు కొంతమంది. మాది పెళ్లికి ముందు జరిగే ప్రేమకథ. ప్రేమికుల ముచ్చట్లు, కోపతాపాలతో సినిమా సాగుతుంది. తమ మధ్య ఏర్పడిన మనస్పర్థలను హీరో, హీరోయిన్ ఎలా పరిష్కరించుకున్నారనేది ప్రధానాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్., కెమెరా: నగేష్ ఆచార్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement