rajasekhar shekar movie shekhar first look released - Sakshi
Sakshi News home page

రాజశేఖర్‌ హీరోగా ‘శేఖర్‌’.. ఫస్ట్‌లుక్

Published Fri, Feb 5 2021 5:55 AM | Last Updated on Fri, Feb 5 2021 9:32 AM

Rajasekhar SHEKAR Movie First Look Released - Sakshi

‘‘భయంకరమైన కోవిడ్‌–19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకువెళ్లినా నేను ప్రేమించేవాళ్లు, నా అభిమానుల  ప్రార్థనలే నా ఈ పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభించేలా చేశాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్లయిన మీకు రుణపడి ఉంటాను’’ అన్నారు రాజశేఖర్‌. గురువారం ఆయన పుట్టినరోజు.

ఈ సందర్భంగా రాజశేఖర్‌ హీరోగా ‘శేఖర్‌’ చిత్రాన్ని ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. లలిత్‌ దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఎమ్‌.ఎల్‌.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మిస్తున్నారు. ‘‘రాజశేఖర్‌ గారి 91వ చిత్రమిది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి రచయిత: లక్ష్మీ భూపాల్, కెమెరా: మల్లికార్జున్‌ నరగని, సంగీతం: అనూప్‌ రూబెన్స్, కళ: దత్తాత్రేయ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement