నంద్యాల పట్టణ శివారులోని చిన్న చెరువు వద్ద మత్స్యకారులపై గురువారం పిడుగుపడింది.
నంద్యాల పట్టణ శివారులోని చిన్న చెరువు వద్ద మత్స్యకారులపై గురువారం పిడుగుపడింది. ఈ ఘటనలో మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన పుల్లయ్య(25), నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన శేఖర్(30) అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.