కూలీని కబళించిన ఇసుకాసురులు
రాత్రికి రాత్రే చెరువులో ఇసుక కోసం తవ్వకాలు
ఇసుక దిబ్బలు పడి కూలీ మృతి
ఇసుక వ్యాపారి దురాశ కూలీని బలిగొంది. రాత్రివేళ చెరువులో ఇసుక తవ్వడానికి వెళ్లిన వ్యక్తి మృతి చెంద డంతో అతని భార్యాబిడ్డలు దిక్కులేని వారయ్యారు.
కుప్పం: గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే చెరువులోని ఇసుకను తరలించేందుకు ప్రయత్నించిన వ్యాపారి దురాశకు ఓ కూలీ బలైపోయూడు. వుండలంలోని పెదబంగారు నత్త చెరువులో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దబంగారు నత్తం గ్రావూనికి చెందిన రూపేష్ పగటి పూట ఇసుక తవ్వితే అధికారులు పట్టుకుంటారని భావించి బుధవారం రాత్రి చెరువులో ఇసుక తీతకు గ్రావుంలో కూలీలను పిలిచాడు. అదే గ్రావూనికి చెందిన శేఖర్ (30) కూలీ పనికి వెళ్లాడు. అర్ధరాత్రి ఇసుక తవ్వుతుండగా వుట్టి దిబ్బలు శేఖర్ మీద పడ్డాయి. అక్కడిక్కడే శేఖర్ ఇసుకలో కూరుకుపోయి మృతి చెందాడు.
మట్టి దిబ్బల్లో చిక్కుకున్న డ్రైవర్ ప్రాణాపాయు స్థితి నుంచి తప్పించుకున్నాడు. వ్యాపారి రూపేష్ పోలీసులకు లొంగిపోయూడు. గురువారం ఉదయుం తహశీల్దార్ అబ్దుల్‌మునాఫ్ ఆధ్వర్యంలో మట్టి దిబ్బల కింద ఉన్న శేఖర్ వుృతదేహాన్ని వెలికితీశారు. కుప్పం పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.