హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణలోని పలు పుణ్యక్షేత్రాలు ప్రముఖులతో కిటకిటలాడుతున్నాయి. యాదాద్రి క్షేత్రంలో, పాత యాదగిరిగుట్టలో లక్ష్మీసమేతంగా నరసింహస్వామి ఉత్తర ద్వారంలో కొలువై ఉన్నారు. ఉదయం 6:45 నుంచి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి ఉత్తర ద్వారదర్శనం లభించింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, కలెక్టర్ శరత్‌లు దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామ చంద్రస్వామి క్షేత్రంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోనూ భక్తుల రద్దీ నెలకొంది. ఉత్తర ద్వారం ద్వారా హరిహరులను కలెక్టర్ కృష్ణభాస్కర్ దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment