అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త. ప్రబుత్వం తాజాగా అమర్‌నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు.
అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది.
పలు భద్రాతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది 2024 అమర్‌నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 02:19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రకు వెళుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment