మధురవాడ (భీమిలి): ఆయన రాజకీయ నాయకుడే కాదు. ఓ గొప్ప ఆధ్యాత్మిక వాది. అనుకున్నదే తడువుగా పదేళ్లలో తీర్థయాత్రలు చుట్టివచ్చాడు. హిమాలయాల్లో జిరో డిగ్రీల ఉండే డార్జిలింగ్ నుంచి సముద్ర మట్టానికి 20 వేలు కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని చూశారు. ఆయనే జీవీఎంసీ 7వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు.
దర్శించుకున్న క్షేత్రాలు
2008లో చార్‌దామ్ యాత్ర చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పుణ్య క్షేత్రాలను పర్యటించాలని ఆలోచన వచ్చిందని శ్రీనివాసరావు చెప్పారు. 2018 నాటికి భార్యతో కలిసి అన్ని పుణ్యక్షేత్రాలను చూసివచ్చా. జ్యోతిర్లింగాలు, హిమాలయాలు, జ్వాలాముఖి, భూటాన్, గుజరాత్ ఇలా ముఖ్య ప్రాంతాలు అన్నీ చుట్టి వచ్చా..
పంచకైలాసాలు
హిమాలయాల్లోని మాసన సరోవరం, ఓంకార్ పర్వతం, ఆది కైలాష్, మణికంఠ కైలాసం, కిన్నెర కైలాసాన్ని దర్శించుకున్నా.. శక్తి పీఠాలు 18 ఉంటే 14 సందర్శించాను. గంగోత్రి, యమునోత్రి, కేధార్‌నాథ్, బద్రీనాథ్, చార్‌దామ్ యాత్రలు పూర్తి చేశా.. షిరిడి, తిరుపతి, కాశీ యాత్రలు ఏడాది ఒకటి రెండు సార్లు వెళతామని చెప్పారు.
మానస సరోవరంలో 48 కిలో మీటర్ల నడక
భార్యతో కలసి మానస సరోవరం యాత్రకు వెళ్లా. మార్గ మధ్యలో గైడ్‌తో పాటు వెళుతున్న క్రమంలో గుర్రం నన్ను కిందకు పడేసింది. నా భార్యను గుర్రంపై ఎక్కించి నేను ఆ గమ్యాన్ని చేరుకోవడానికి 48 కిలోమీటర్లు రెండు రోజులు పాటు నడవాల్సి వచ్చింది. ఇదే కాదు హిమాలయాలు, దేవ భూమి ఉత్తరాఖండ్‌లో ఉన్న యాత్రలు అన్నీ చేయడం దైవం కల్పించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని శ్రీనివాసరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment